డింపుల్‌కు పెళ్లయిపోయిందా.. హీరోయిన్ ఆన్సర్‌ ఇదే..! | Dimple Hayathi responds On Marriage comment by netizen | Sakshi
Sakshi News home page

Dimple Hayathi: డింపుల్‌కు పెళ్లయిపోయిందా.. ఆమె సమాధానం ఇదే..!

Nov 24 2026 7:13 AM | Updated on Nov 24 2026 7:13 AM

Dimple Hayathi responds On Marriage comment by netizen

యంగ్ హీరో శర్వానంద్ నటించిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ భోగి. ఈ సినిమకు సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో హీరోయిన్ డింపుల్ హయాతి ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది. ఈవెంట్‌లో అందరి కళ్లు తనవైపు తిప్పుకునేలా చేసింది. అంతేకాకుండా హీరో శర్వానంద్‌తో మరింత క్లోజ్‌గా కనిపించింది. డింపుల్‌ను అలా చూసిన ఓ నెటిజన్‌.. డింపుల్‌కు కూడా పెళ్లయిపోయిందా అంటూ కామెంట్ చేశాడు. 

d

దీనికి హీరోయిన్ డింపుల్ హయాతి కూడా స్పందించింది. ఐ యామ్ నాట్ మ్యారీడ్ అంటూ రిప్లై ఇచ్చింది.  తనకు ఇంకా పెళ్లి కాలేదంటూ డింపుల్‌ ఇచ్చిన ఫన్నీ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శర్వానంద్‌తో కాస్తా క్లోజ్‌గా ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయిందా అని అడుగుతారా అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి తాను సింగిల్‌ అని మాత్రం డింపుల్ క్లారిటీ ఇచ్చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement