అనిరుధ్- కావ్య రిసెప్షన్‌.. ధోనితో విజయ్-రష్మిక ముచ్చ‍ట్లు..! | vijay and rashmika special appearance at anirudh and kavya reception | Sakshi
Sakshi News home page

Vijay-Rashmika: అనిరుధ్- కావ్య రిసెప్షన్‌.. స్పెషల్ అట్రాక్షన్‌గా విరోష్ జంట

Nov 23 2026 1:46 PM | Updated on Nov 23 2026 1:46 PM

vijay and rashmika special appearance at anirudh and kavya reception

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ రిసెప్షన్‌ వేడుకలో టాలీవుడ్ జంట సందడి చేశారు. ఈ ఏడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన విరోష్ జంట తళుక్కున మెరిసింది. ఈ సందర్భంగా నూతన వధూవరులను విజయ్ దేవరకొండ- రష్మిక ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ రిసెప్షన్‌లో విజయ్- రష్మిక స్పెషల్ ‍అట్రాక్షన్‌గా నిలిచారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌లో రష్మిక దంపతులతో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ముచ్చటించారు. ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 

కాగా.. ఇటీవలే విజయ్-రష్మిక జంటగా నటించిన రణబాలి థియేటర్లలో రిలీజైంది. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్  వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం రష్మిక మైసా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమాలోని ఓసేయ్ రాములమ్మ సాంగ్ రిలీజ్ చేయగా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ‍అయితే ఈనెల 27న రిలీజ్‌ కావాల్సిన మైసాను వాయిదా వేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement