టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమా ప్రకటించారు. ఆయన హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీకి ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని వీరా కొగటం దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ఈ మూవీకి దిల్ రాజు క్లాప్ కొట్టగా.. డైరెక్టర్ సుకుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సీన్‌కు బన్నీవాస్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ టైటిల్ రివీల్ పోస్టర్ చూస్తుంటే ఈ కథను మిస్టిరీయస్ థ్రిల్లర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్‌లో గుర్రం, కోడిపుంజు ఈకలు కనిపించడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
With All your Blessings - RECORD @SukumarWritings @VNE_Offl #TheeStoriies #RECORD https://t.co/eusTlco7Uk
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 23, 2026


