ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల కూతురు అల్లు అర్హకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నా జీవితంలో ఆనందానికి బర్త్ డే విషెస్ అంటూ స్పెషల్ పిక్ షేర్ చేశారు. ఇందులో తన కూతురికి ముద్దుపెడుతూ సెల్ఫీ తీసుతుంటా కనిపించారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు సైతం అర్హకు ప్రత్యేక శుభాకాంక్షలు చెబుతున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ సైతం అర్హకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక ఫోటోను షేర్ చేసింది.
ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాని ఈ మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Happy birthday to the Joy of My Life 💖 #AlluArha https://t.co/BxhNOS9WYC
— Allu Arjun (@alluarjun) November 21, 2026


