మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మరో మూవీకి రెడీ అయిపోయారు. ఈ ఏడాది పెద్దితో అలరించిన చెర్రీ.. సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం ఆర్సీ17 వర్కింగ్ టైటిల్‌తో తెరెకెక్కించనున్నారు. ఈ డిసెంబర్ నుంచే షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లనునున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సుకుమార్ మూవీ కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫామ్ అయ్యేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు రోజుల పాటు తన లుక్‌ను మార్చుకునేందుకు విరామం తీసుకున్నట్లు సమాచారం. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్ లోకేషన్‌లో రామ్ చరమ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌కు సిద్ధమవుతున్నారని టాక్. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనర్, చెఫ్‌లతో సహాయక సిబ్బంది రామ్ చరణ్‌తోనే ఉండనున్నారు.
ఈ మూవీ కోసం రామ్ చరణ్ పూర్తిస్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం పెద్ది సినిమాలోని లాంగ్ హెయిర్‌ను వదిలేసి లావుతగ్గడం మొదలెట్టారు. తాజాగా రామ్ చరణ్ ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mega Powerstar @AlwaysRamCharan is returning home for a three-day break from an undisclosed location, where he has been undergoing intensive preparations for Sukumar’s #RC17. With a dedicated team of trainers, chefs and support staff, #RamCharan is fully immersed in his preparations for the film. Something BIG is cooking for #RC17! 🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2026


