లగ్జరీ కారు కొన్న నయనతార.. ఫ్యామిలీతో పోజులు | Nayanthara buys A luxury car pics Goes Viral | Sakshi
Sakshi News home page

Nayanthara: లగ్జరీ కారు కొన్న నయనతార.. ఫ్యామిలీతో పోజులు

Nov 21 2026 7:07 AM | Updated on Nov 21 2026 7:07 AM

Nayanthara buys A luxury car pics Goes Viral

లేడీ సూపర్ స్టార్ నయనతార ఖరీదైన కారు కొనుగోలు చేసింది. కొత్త కారుతో తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. తన ఇద్దరు కుమారులు, భర్త విఘ్నేశ్ శివన్‌తో కలిసి తన కొత్త కారులో విహరించింది. ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

ఇక కెరీర్ విషయానికొస్తే నయనతార ఈ ఏడాది మనశంకరవరప్రసాద్‌గారు మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన హీరోయిన్‌గా మెప్పించింది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ ఏడాది టాక్సిక్, హాయ్ లాంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి చిల్ అవుతోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement