పెళ్లికి మరో టాలీవుడ్ హీరో రెడీ.. ప్రియురాలితో ఎంగేజ్‌మెంట్ | Tollywood Hero Shiva Kandukuri engaged with His lover Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Shiva Kandukuri: ప్రియురాలితో నవాబ్ కేఫ్ హీరో ఎంగేజ్‌మెంట్.. పిక్స్ వైరల్

Nov 20 2026 12:15 PM | Updated on Nov 20 2026 12:15 PM

Tollywood Hero Shiva Kandukuri engaged with His lover Pics Goes Viral

ఈ ఏడాది టాలీవుడ్‌కు పెళ్లికల వచ్చేసింది. ఇప్పటికే యంగ్ హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్‌ చేసుకుని పెళ్లికి రెడీ అయిపోయారు. మరో టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ సైతం నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లిళ్ల హడావుడి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా మరో టాలీవుడ్ హీరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలితో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జీవితంలో అందమైన ప్రయాణం.. జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నట్లు తన కాబోయే శ్రీమతితో దిగిన ఫోటోలు పంచుకున్నారు. ఈ పిక్స్ చూస్తుంటే తాజాగా వీరిద్దరు ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా..  ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి తనయుడే శివ కందుకూరి. ఆయన హైదరాబాద్‌కే చెందిన శిశిర సింహను పెళ్లాడనున్నారు.  2020లో చూసి చూడంగానే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత గమనం, మనుచరిత్ర, మనమే, నవాబ్ కేఫ్, అనగనగా లాంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం టాల్కమ్ పౌడర్‌ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement