బిగ్‌బాస్‌లో టాస్క్‌ల గోల.. హౌస్‌లో త్రిగుణ్ ఓవరాక్షన్..! | Bigg Boss Season 10 Telugu Latest Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss Season 10: బిగ్‌బాస్‌లో టాస్క్‌ల గోల.. హౌస్‌లో త్రిగుణ్ ఓవరాక్షన్..!

Nov 20 2026 7:15 AM | Updated on Nov 20 2026 7:15 AM

Bigg Boss Season 10 Telugu Latest Episode Highlights

ఈ వారం బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ వీక్‌లో కెప్టెన్‌గా ఉన్న నరేశ్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. నామినేషన్స్ ప్రక్రియ  ముగియగానే హౌస్‌లో టాస్క్‌ల గోల మొదలైంది. అలా ఈ వారానికి డిక్టేటర్స్ అనే పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వీక్‌లో ఇద్దరు డిక్టేటర్స్ ఉంటారని బిగ్‌బాస్ ప్రకటించారు. ఈ అవకాశాన్ని ముకేశ్, త్రిగుణ్‌కు ఇచ్చారు. 

అలా ఈ వారం జరిగే టాస్కుల్లో సత్తా చాటిన వారికి బిగ్‌బాస్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని అల్టిమేట్ పవర్ దక్కుతుందని ప్రకటించారు. ఈ శక్తిని సాధించినవారు టికెట్ టు ఫినాలేకు తొలి కంటెండర్‌గా నిలిచే అవకాశం ఉంటుందని తెలిపారు. దీంతో ఈ వారం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ గురువారం ఎపిసోడ్‌లో రెండు టీమ్‌ల మధ్య బుద్ధిశాలి, బలశాలి ‍అనే టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. కొన్ని ప్రశ్నలు ఇచ్చిన బిగ్‌బాస్.. వాటికి సరైన సమాధానం చెప్పినవారు  ఈ టాస్క్‌లో త్రిగుణ్ టీమ్ నుంచి దేబ్జానీ, ముకేశ్ టీమ్ నుంచి వర్షిణి పోటీపడ్డారు. ఆ తర్వాత మధ్యలోనే శివ, నరేశ్ రీప్లేస్ అయ్యి గేమ్ ఆడారు. అయితే ఈ టాస్క్‌లో చివరికీ త్రిగుణ్ టీమ్ విన్నర్‌గా నిలిచింది.  ఈ టాస్క్ గెలిచాక అమన్‌, త్రిగుణ్ ఏకంగా వరల్డ్ కప్ గెలిచినంత సంబురాలు చేసుకున్నారు. ఈ టాస్క్‌లో నెగ్గేందుకు త్రిగుణ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏదో ఒకటి చేసి తన టీమ్‌ను గెలిపించాడు. 

ఈ టాస్క్ జరుగుతున్న సమయంలో రెండు టీమ్స్‌ మధ్య గొడవ జరిగింది. డిక్టేటర్‌గా ఉన్న ముకేశ్, సంచాలక్‌గా ఉన్న వంశీ రెండు గ్రూపులకు సర్దిచెబుతూ వచ్చారు. అయినా కూడా త్రిగుణ్ కావాలనే గేమ్ మధ్యలో ఎంటరై హంగామా క్రియేట్ చేశాడు. దేబ్జానీకి తెలుగులో ఉన్న ప్రశ్నలు అర్థం కావడం లేదనే సాకుతో శివను రీప్లేస్ చేశాడు. అలా త్రిగుణ్ టీమ్‌ ఈ టాస్క్‌ను నెగ్గింది. ఈ టాస్క్ గెలిచాక అమన్, త్రిగుణ్ చేసిన ఓవరాక్షన్‌ మామూలుగా లేదు. ఈ టాస్క్ పూర్తవడంతో ఎపిసోడ్‌ ముగిసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement