థియేటర్లలో భోగి సెలబ్రేషన్స్‌కి వేళయింది. ఈ నెల 27న ‘భోగి’ సినిమా రిలీజ్ కానుంది. శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయతి, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించారు.
ఈ మూవీని తొలుత ఈ నెల 12న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తేదీకి విడుదల కాలేదు. ఈ నెల 27న ‘భోగి’ని రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ గురువారం ప్రకటించింది. ‘‘పీరియాడిక్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో పాన్ ఇండియా మూవీగా రూపొందించిన చిత్రం ఇది. 1960లో ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిన ‘భోగి’ శర్వానంద్ కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది.


