విశ్వక్ సేన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన తాజా చిత్రం '#కల్ట్'. అక్టోబర్ 30న థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజే డిజాస్టర్ టాక్ సంపాదించుకుంది. ఓటీటీలో వచ్చిన స్క్వీడ్ గేమ్ ను గుర్తు చేసేలా ఉందంటూ పలు వెబ్ సైట్లు తమ రివ్యూలో పేర్కొన్నాయి.దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. విడుదలైన 20 రోజులకే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కి వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో ఈ సినిమా మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
కల్ట్ కథేంటంటే..
గోవాలో హోంమంత్రి కొడుకు ఎల్విన్(తారక్ పొన్నప్ప) తన బర్త్‌డే పార్టీ కోసం #కల్ట్ అనే పబ్‌ని బుక్ చేసుకుంటాడు. ఈ పార్టీకి హైదరాబాద్‌కి చెందిన ముగ్గురు కుర్రాళ్లు వెళ్తారు. కొంతసేపటి వరకు బాగానే ఉంటుంది గానీ తర్వాత పరిస్థితులు దారుణంగా తయారవుతాయి. లోపల స్క్రీన్‌పై కనిపించే ఓ బొమ్మ.. కొన్ని గేమ్స్ పెట్టి, ఓడిపోయిన వాళ్లని నిర్ధ్యాక్షిణంగా చంపడం మొదలుపెడుతుంది. ఇంతకీ వీళ్లని చంపుతుందెవరు? ఇదే పబ్‌లో డీఎస్పీ సంకల్ప్ నాయక్ (విశ్వక్ సేన్) ఎందుకున్నాడు? ఇతడు బతికి బయటపడ్డాడా లేదా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఇదీ చదవండి: ‘ఆదర్శ కుటుంబం రిలీజ్ అయ్యాక షాక్ అయ్యా’


