ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న : రష్మిక మందన్న | Rashmika Mandanna Post About Myssaa Goes Viral | Sakshi
Sakshi News home page

Mysaa Movie: ఆ సవాళ్లు ఓ ప్రత్యేకమైన అనుభవం: రష్మిక మందన్న

Nov 19 2026 9:10 AM | Updated on Nov 19 2026 9:15 AM

Rashmika Mandanna Post About Myssaa Goes Viral

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన రష్మిక.. ఈ సినిమాలో మాత్రం పూర్తి భిన్నమైన అవతారంలో అలరించనుంది. రావీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె గోండ్ తెగకు చెందిన యువతిగా కనిపించనుంది.

ప్రత్యేకమైన అనుభవం అంటూ..
తాజాగా ఈ సినిమా కోసం తాను చేసిన సన్నాహాల గురించి రష్మిక ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘మైసాగా మారే ప్రయాణం షూటింగ్ ప్రారంభానికి చాలా కాలం ముందే మొదలైంది. శిక్షణ, సన్నాహాలు, రోజూ ఎదురైన చిన్న చిన్న సవాళ్లు.. గతంలో ఎప్పుడూ చేయని పనులను చేసేందుకు నన్ను నేను ప్రోత్సహించుకోవడం.. ఇదొక ప్రత్యేకమైన అనుభవం’ అంటూ తన అనుభవాన్ని వివరించింది. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియోలో స్టంట్, కంబాట్ శిక్షణకు సంబంధించిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.

మైసా విషయానికి వస్తే..
ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రాహుల్ రవీంద్రన్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సాయిపురెడ్డి, వీరసాయి గోప యున్‌ఫార్ములా ఫిలింస్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా నవంబర్ 27న  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

(ఇదీ చదవండి: జపాన్‌లో ఉన్న విజయ్‌కు.. స్టార్‌ హీరో ప్రాంక్‌ కాల్‌!)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement