జపాన్‌లో ఉన్న విజయ్‌కు.. స్టార్‌ హీరో ప్రాంక్‌ కాల్‌! | Dulquer Salmaan Pranks Vijay Deverakonda Over a Phone Call | Sakshi
Sakshi News home page

Dulquer Salmaan: జపాన్‌లో ఉన్న విజయ్‌కు.. స్టార్‌ హీరో ప్రాంక్‌ కాల్‌

Nov 19 2026 7:34 AM | Updated on Nov 19 2026 7:35 AM

Dulquer Salmaan Pranks Vijay Deverakonda Over a Phone Call

దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవుతున్నారు. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుకకు అల్లు అర్జున్‌ హాజరుకావడంతో మూవీపై మరింత చర్చ మొదలైంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ సరదా కాల్‌ ఆసక్తికరంగా మారింది.

ఫోన్ రోడ్డుపై దొరికిందంటూ..
ఇంటర్వ్యూలో భాగంగా దుల్కర్ సల్మాన్‌తో ఓ ప్రాంక్ కాల్ చేయించారు. ప్రస్తుతం జపాన్‌లో ఎంజాయ్‌ చేస్తున్న హీరో విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి ఇచ్చి ఓ చిన్నారి మాట్లాడించారు. ‘ఈ ఫోన్ రోడ్డుపై దొరికింది. ఇందులో ఎమర్జెన్సీ నంబర్ డయల్ చేయగానే మీకు కాల్ వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారు?’ అని విజయ్‌ను ప్రశ్నించింది.

విజయ్  స్పందిస్తూ..
దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. ‘మీకు ఫోన్ ఎక్కడ దొరికింది?’ అని అడిగారు. అందుకు ఆ చిన్నారి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ స్కూల్ పక్కన అని సమాధానం ఇచ్చింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఓ వ్యక్తి మీ దగ్గరకు వచ్చి ఆ ఫోన్ తీసుకుంటారని చెప్పి కాల్ కట్ చేశారు. అనంతరం దుల్కర్ మరోసారి విజయ్‌కు ఫోన్ చేసి ఇదంతా ప్రాంక్ కాల్ అని వెల్లడించారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

(ఇదీ చదవండి: 'ఈఎన్‌ఈ రిపీట్‌’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement