మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చిన దుల్కర్ సల్మాన్.. తర్వాత హీరోగా అద్భుతమైన సినిమాలు చేశాడు. ప్రస్తుతం సొంత భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీలో నటిస్తూ రియల్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇతడు హీరోగా చేసిన 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దుల్కర్‌కి ఈ మూవీ ఎందుకంత ముఖ్యం?
(ఇదీ చదవండి: బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్)
పది-పన్నెండేళ్ల ముందు వరకు మలయాళంలో మాత్రమే సినిమాలు చేసిన దుల్కర్.. తర్వాత ఇతర భాషల్లోనూ నటించాడు. 'మహానటి'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శివాజీ గణేశన్‌గా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తర్వాత సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో హీరోగా టాలీవుడ్‌లో హ్యాట్రిక్ కొట్టాడు. రెండేళ్ల తర్వాత దుల్కర్ చేసిన స్ట్రెయిట్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. వ్యోమగామి కావాలనుకునే ఓ పల్లెటూరి అమ్మాయి కథతో ఈ సినిమా తీశారు. ఈమెకు సహాయపడే పాత్రలో దుల్కర్ కనిపించనున్నాడు.

'ఆకాశంలో ఒక తార' ట్రైలర్ బాగుంది. సినిమా చూడాలనే ఆసక్తి చాలామందికి కలుగుతుంది. అయితే ఈ మూవీపై దుల్కర్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సొంతభాషలో గత కొన్నేళ్లలో సరైన హిట్స్.. దుల్కర్‌కి పడలేదు. తెలుగులో మాత్రం చేసినవన్నీ సక్సెస్ అయ్యాయి. ఇది కూడా సక్సెస్ అయితే మాత్రం తెలుగులో మరిన్ని ఆఫర్స్ రావడం గ్యారంటీ. చూస్తుంటే రాబోయే రోజుల్లో దుల్కర్‌కి టాలీవుడ్ రెండో ఇల్లు అయిపోతుందేమో అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే)


