రీసెంట్ టైమ్స్‌లో కథలో ఏమాత్రం స్కోప్ ఉన్నా సీక్వెల్‌ను ప్రకటించేస్తున్నారు మేకర్స్. అయితే ప్రకటించిన ఆ సీక్వెల్ సినిమాలు సెట్స్‌కు ఎప్పుడు వెళ్తాయి? అసలు వెళ్తాయా? లేదా? అన్న అంశాలు వివిధ కారణాలపై ఆధారపడి ఉంటాయి. కానీ వచ్చే ఏడాది రిలీజ్ కావడానికి ఇప్పటికే తెలుగులో పలు సీక్వెల్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఒకట్రెండు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి. ఈ సీక్వెల్ ట్రెండ్‌పై ఓ లుక్ వేయండి.
ముందు కల్కి... నెక్ట్స్ సలార్
హీరో ప్రభాస్ చేతిలో ప్రజెంట్ రెండు సీక్వెల్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి ‘కల్కి 2898 ఏడీ 2’. మరొకటి ‘సలార్ 2’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రూపొందిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎండింగ్‌లోనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, ‘కల్కి 2’అనే టైటిల్‌తో రూపొందిస్తామనీ ఆల్రెడీ ప్రకటించారు మేకర్స్.
ఇదీ చదవండి: వారణాసి.. ఏదో ఒకటి తేల్చాల్సిందే
ఈ సీక్వెల్ చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. దీపికా పదుకోన్ తప్ప ఈ సినిమా ఇతర ప్రధాన తారాగణం అయిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కొన్ని కారణాల వల్ల దీపికా పదుకోన్ ‘కల్కి 2’ సినిమాలో నటించడం లేదని ఈ చిత్రనిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతినిధులు ఆల్రెడీ ప్రకటించారు. ఆ తర్వాత ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకోన్ పోషించిన సుమతి పాత్రను ‘కల్కి 2’లో సాయి పల్లవి చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది చివరికల్లా ‘కల్కి 2’ చిత్రీకరణను పూర్తి చేసి, 2028 ఏడాది ఆరంభంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది యూనిట్ ప్లాన్ అని తెలిసింది. ఈ దిశగా చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్ సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
అప్పుడు సలార్ స్టార్ట్
‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే ‘సలార్ 2’ చిత్రంపై ఫోకస్ పెట్టనున్నారు ప్రభాస్. దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్రాంచైజీ ‘సలార్’. ఈ ఫ్రాంచైజీలోని తొలి భాగం ‘సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్’ 2023లో విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సలార్’ ఫ్రాంచైజీలోని రెండో భాగం ‘సలార్: శౌర్యంగాపర్వం’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి: తీగ కాదు అమ్మాయి నడుమా.. 23 ఏళ్ల తర్వాత బయటపడ్డ ‘బాయ్స్’ మూవీ సీక్రెట్
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ కానుంది. ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ‘సలార్ 2’ చిత్రీకరణను ప్రారంభిస్తారు ప్రశాంత్ నీల్. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ‘సలార్ 2’ చిత్రీకరణను వచ్చే ఏడాది ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు ప్రశాంత్ నీల్. అక్టోబరు 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా షూట్‌ను వచ్చే ఏడాది ్ర΄ారంభిస్తానని ప్రశాంత్ నీల్ ఓ వీడియోలో పేర్కొనడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ సీక్వెల్ సినిమాల సంగతి ఇలా ఉంచితే... ప్రభాస్ ప్రస్తుతం ‘ఫౌజీ, స్పిరిట్’ చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘ఫౌజీ’ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుండగా, ‘స్పిరిట్’ వచ్చే ఏడాది అక్టోబరు 29న రిలీజ్ కానుంది.
ఓజీ 2
పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ 2025లో విడుదలైంది. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు. ‘ఓజీ’ సినిమా సీక్వెల్‌ను ఆల్రెడీ మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. త్వరలోనే ‘ఓజీ 2’ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ రానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం నాని హీరోగా సుజిత్ డైరెక్షన్‌లో ‘బ్లడీ రొమియో’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయిన తర్వాత, ‘ఓజీ 2’ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని ఊహించవచ్చు. వచ్చే ఏడాది ప్రారంభంలో ‘ఓజీ 2’ షూటింగ్ ఉండొచ్చని, అదే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నది టాలీవుడ్ భోగట్టా. అయితే ఈ అంశాల గురించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉన్నాయి. కాస్త అటూ ఇటూగా సమయం పట్టినా ‘ఓజీ 2’ మాత్రం సెట్స్‌కు వెళ్లడం ఖాయం అనేలా చిత్ర యూనిట్ చేస్తున్న సన్నాహాలు స్పష్టం చేస్తున్నాయి.
జై హనుమాన్
‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హనుమాన్’ సినిమా 2024 సంక్రాంతికి విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ సినిమా రానుంది. అయితే మెయిన్ లీడ్ రోల్‌లో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కనిపిస్తారు. రానా, హీరోయిన్ మమితా బైజు ఇతర ప్రధాన ΄పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. ఒక కీలక పాత్రలో తేజ సజ్జా నటిస్తారట. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ ఆల్రెడీ ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ‘జై హనుమాన్’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
జీ 2 రెడీ
అడివి శేష్ హీరోగా నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘గూఢచారి’. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018లో రిలీజై, సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జీ 2’ చిత్రం వస్తోంది. ‘గూఢచారి’లో హీరోగా నటించిన అడివి శేష్ ‘జీ 2’లోనూ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు మాత్రం మారారు. ఈ సీక్వెల్‌కి ఎస్. వినయ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని గత ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. 2027 ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తుండగా, వామికా గబ్బి, బనితా సంధు, మధు శాలిని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్నేహితుడు సినిమా తీయాలంటే..!
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేశ్ కాకుమాను, సుశాంత్ రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా 2018లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇటీవల ఈ సినిమా మళ్లీ విడుదల కాగా, యూత్ ఆడియన్స్‌నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఈ వారంలో ‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమా రిలీజ్ అవుతోంది ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రానికి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్‌నే సీక్వెల్‌కి దర్శకత్వం వహించారు. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. అనీష్ ఆంబ్రోస్‌తో పాటు శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. సందీప్ నాగిరెడ్డి, సృజన్ యర్రబోలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది. కొన్నేళ్ల తర్వాత స్నేహితులు మళ్లీ కలవడం, వీరిలో ఒకరు దర్శకుడిగా సినిమా తీయాలనుకోవడం ఈ క్రమంలో చోటు చేసుకునే ఆసక్తికరమైన పరిణామాల నేపథ్యంలో ‘ఈఎన్‌ఈ రిపీట్’ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సర్వైవల్ జానర్ కూడా మిక్స్ అయ్యిందని ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
నెక్ట్స్ లెవల్!
యువ హీరో తేజ సజ్జా రెండు సీక్వెల్స్‌ను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘జాంబీ రెడ్డి’. ఐదేళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టు 23న తేజ సజ్జా బర్త్ డే. ఈ సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ సీక్వెల్ ‘జాంబీ రెడ్డి: నెక్ట్స్ లెవల్’ సినిమాను ప్రకటించారు మేకర్స్. కానీ ‘జాంబీ రెడ్డి’ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ‘జాంబీ రెడ్డి 2’కు దర్శకత్వం వహించడం లేదు. ‘ది ఫ్యామిలీమేన్, రానా నాయుడు’ వెబ్ సిరీస్‌లకు పని చేసిన సుపర్ణ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కానీ ఈ మూవీకి ప్రశాంత్ వర్మ సూపర్ విజన్ ఉంటుంది. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. షనయా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఉపేంద్ర ఓ లీడ్ రోల్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకణ జరుగుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. హారర్, యాక్షన్, జాంబీలు, ఫ్యాక్షనిజం వంటి అంశాల నేపథ్యంలో ‘జాంబీ రెడ్డి’ సినిమాను తీస్తున్నారు మేకర్స్. ఈ సంగతి ఇలా ఉంచితే... తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ సినిమా ‘మిరాయ్’. గత ఏడాది సెప్టెంబరులో రిలీజైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించింది. ఇప్పటికే ‘మిరాయ్’ సినిమాకు సీక్వెల్‌గా ‘మిరాయ్ 2’ను ప్రకటించారు మేకర్స్. కానీ ఈ మూవీ రెగ్యులర్ షూట్ ్ర΄ారంభం కావడానికి కొంత టైమ్ పట్టేలా ఉంది. ఈలోపు ‘జాంబీ రెడ్డి 2’ని పూర్తి చేస్తారు తేజ. అలాగే డిసెంబరులో పెళ్లి చేసుకోనున్నారు. ఇలా తేజ తన కెరీర్, వ్యక్తిగతంగా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తున్నారు.
విరావి ఆగమనం
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ క్రియేట్ చేసిన ‘పొలిమేర’ ఫ్రాంచైజీకి హారర్ జానర్‌ను ఇష్టపడే ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘పొలిమేర’ (మా ఊరి పొలిమేర) సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, మంచి వ్యూయర్ షిప్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘పొలిమేర 2’ చిత్రం థియేటర్స్‌లో విడుదలై, హిట్ మూవీగా నిలిచింది. దీంతో ‘పొలిమేర 3’ సినిమాను షురూ చేశారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్. వంశీ నందిపాటి, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి రెండు భాగాల్లో నటించిన ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, రాకేందు మౌళి, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను ‘పొలిమేర 3’లోనూ కనిపిస్తారు. అయితే కొత్తగా యాక్షన్ కింగ్ అర్జున్ ఈ ఫ్రాంచైజీలో భాగమయ్యారు. ‘పొలిమేర 3’ చిత్రంలో విరావి అనే ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు అర్జున్. ‘పొలిమేర 3’ చిత్రం 2027లో రిలీజ్ కానుంది.
మ్యాడ్ జూనియర్స్
కల్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాల ఫ్రాంచైజీగా ‘మ్యాడ్’ రూ΄÷ందుతోంది. ఈ ‘మ్యాడ్’ సిరీస్ నుంచి ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యాడ్’, ‘మ్యాడ్ 2’ చిత్రాలు విజయాలు సాధించాయి. ఈ రెండు సినిమాల్లోనూ నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ చేయగా, నాగవంశీ, నాగసౌజన్య నిర్మించారు. ఈ ‘మ్యాడ్’ సిరీస్ నుంచి ‘మ్యాడ్ 3’ కూడా రాబోతోందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అంతేకాదు... ‘మ్యాడ్ 3’ సినిమాకు ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే మూడో భాగంలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్ చేయరని, వీరి స్థానాల్లో యంగ్ యాక్టర్స్ నటిస్తారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ‘మ్యాడ్ 3’లో ‘కోర్టు’, ‘తెల్లకాగితం’ సినిమాల ఫేమ్ హర్‡్ష రోషన్, ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ జయకృష్ణ వంటి వారు నటిస్తారట. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవే కాదు... మరికొన్ని చిత్రాలకు సీక్వెల్స్ చేసేందుకు కొందరు దర్శక–నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఒకసారి ఒక సినిమా సీక్వెల్‌ను ప్రకటించినప్పుడు, ఆ సినిమా సీక్వెల్ మళ్లీ సెట్స్‌పైకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది. పైన పేర్కొన్న సీక్వెల్ చిత్రాల విషయంలోనూ ఇదే జరిగింది. ప్రస్తుతానికైతే చాలా సినిమాల సీక్వెల్స్ అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. వెంకటేశ్ ‘ఎఫ్ 3’, రవితేజ ‘క్రాక్ 2’, ఎన్టీఆర్ ‘దేవర 2’, అల్లు అర్జున్ ‘పుష్ప 3’, ‘ఆర్య 3’, కల్యాణ్ రామ్ ‘బింబిసార 2’, యశ్ ‘కేజీఎఫ్ 3’ వంటి చిత్రాల అనౌన్స్‌మెంట్స్ ఆల్రెడీ వచ్చింది. అయితే ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్‌కు వెళ్తాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.


