రాజమౌళి సినిమా అంటే కచ్చితంగా చెప్పిన తేదీకి అయితే రిలీజ్ కాదు. ఇదేదో మేం చెబుతున్న మాట కాదు. ఆయన అభిమానులే స్వయంగా ఈ కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు మహేశ్ 'వారణాసి' విషయంలోనూ అలాంటివే వినిపిస్తున్నాయి. కానీ మూవీ టీమ్, తేదీ గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు. మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ 'వారణాసి' విషయంలో అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: బండ్ల గణేశ్‌కి ఏడాది జైలు శిక్ష వేసిన కోర్ట్)
'వారణాసి' అయితే షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాన్నాళ్ క్రితమే ప్రకటించారు. అందుకు తగ్గట్లే కొన్ని థియేటర్లలో గ్లింప్స్‌ని ప్లే చేస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న 'వారణాసి' అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. 'షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ అవుతోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. డబ్బింగ్ స్టార్ట్ చేయాలి. ఇది అప్‌డేట్ అనుకుంటే ఇదే అది. కానీ బ్లాస్ కోసం ఇంకొన్నిరోజులు ఎదురుచూడాలి' అని ఓ నెటిజన్‌కి బదులిచ్చారు.
అసలు విషయానికొస్తే ఏప్రిల్ 07న 'వారణాసి' రిలీజ్ కావట్లేదని.. బదులుగా 'మగధీర' వచ్చిన జూలై 31 లేదా మహేశ్ పుట్టినరోజైన ఆగస్టు 09న విడుదల తేదీ ఆప్షన్ చూస్తున్నారని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఆలస్యమయ్యేలా ఉండటమే దీనికి కారణాలు అని సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
అయితే ఈ రూమర్స్ నిజమా కాదా అనేది దర్శకుడు రాజమౌళి ఏదో ఒకటి తేల్చేవరకు వినిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ వాయిదా పడింది అంటే చెప్పేస్తే అందుకు తగ్గట్లు అభిమానులు ప్రిపేర్ అవుతారు. ఆ తేదీకి రావట్లేదంటే వేరే ఏ పెద్ద సినిమాలైనా ఆ డేట్‌కి రిలీజ్ ప్లాన్ చేసుకుంటాయి. మరి నెట్టింట వినిపిస్తున్న రూమర్స్‌ని రాజమౌళి అండ్ టీమ్ అబద్ధమని తేలుస్తారా? లేదంటే వాయిదా వేస్తారా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో తెలుగు కామెడీ సినిమా)


