సూపర్‌స్టార్ కృష్ణ.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విభిన్న కథలు, ప్రయోగాత్మక చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏడాదిలో అత్యధిక సినిమాల్లో నటించిన ఘనత ఇప్పటికీ ఆయన సొంతమే. నేడు (నవంబర్ 15) సూపర్‌స్టార్ కృష్ణ వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయనను గుర్తుచేసుకుంటున్నారు.
(ఇదీ చదవండి: మూవీ చూసి తిడుతున్నారు.. థమన్‌కి ఇదే నా రిక్వెస్ట్ : నాగార్జున)
ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను మహేశ్‌బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో మరోసారి కృష్ణగారి జ్ఞాపకాలు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో ఆయన బయోపిక్ ఎప్పుడు తెరకెక్కుతుందనే ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది.
నేను నటించలేను
కృష్ణగారి బయోపిక్ కోసం అభిమానులు ఎదరుచూస్తున్నారని ఓ జర్నలిస్ట్ గతంలో ఓ ఈవెంట్‌లో మహేశ్‌ను అడిగారు. దీనికి మహేశ్‌బాబు స్పందిస్తూ.. ‘నాన్నగారి బయోపిక్ వస్తుందంటే చూడటానికి సిద్ధంగా ఉన్నవారిలో నేనూ ఒకరిని. కానీ ఆయన బయోపిక్‌లో ఆయనలా నేను చేయలేను. ఎందుకంటే ఆయన నాకు దేవుడు. ఎవరైనా దర్శకుడు వచ్చి ఆయన జీవితంపై సినిమా తీస్తానంటే.. ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తా’ అని తెలిపారు. దీంతో మహేశ్ నిర్మాతగా ఆ బాధ్యత ఎప్పుడు తీసుకుంటారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ కంటెస్టెట్లపై హైపర్ ఆది రివ్యూ)


