విశాఖపట్నంలో పట్టణీకరణ పేరుతో కొండలను తవ్వుతుండటంపై టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆమె అభిప్రాయంపై కొందరు నెటిజన్లు విమర్శలు, ట్రోల్స్‌కు దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా చాందిని ఓ వీడియోను విడుదల చేస్తూ ట్రోలర్స్‌కు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: మూవీ చూశాక తిడుతున్నారు.. థమన్‌కి ఇదే నా రిక్వెస్ట్ : నాగార్జున)
‘ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉండాలి. మనకు బాధ కలిగించే విషయం ఏదైనా జరిగినప్పుడు మర్యాదపూర్వకంగా, గౌరవంగా మన ఆలోచనలను, భావోద్వేగాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలి. ఒక సాధారణ పౌరురాలిగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే దానికి రాజకీయ రంగు పులమడం సరికాదు.
గతంలో జరిగినా.. ప్రస్తుతం జరుగుతున్నా.. ఏ విషయంపైనైనా పౌరులుగా స్పందించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఒకరి అభిప్రాయాలను తమకు అనుకూలంగా మార్చుకుని, రాజకీయ అనుబంధాలు అంటగడుతూ విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
(ఇదీ చదవండి: వైజాగ్‌ని చూస్తే గుండె తరుక్కుపోతోంది: నటి చాందిని)
Being sensible is a sin in Telugu the states! Actress Chandini Chowdary is getting trolled for what? Just for speaking about the environment? Against the destruction of this beautiful city called Vizag in Andhra Pradesh? Is it a sin to talk about how many mountains are being razed and how the greenery of the city is being destroyed in the name of development. I agree 100 percent with her. Vizag is being destroyed & there should be a space for dissent in a Democratic country. A mistake is a mistake, irrespective of which political party is in power - especially when it comes to a very important issues like environment. There cannot be two ways about it.
— Revathi (@revathitweets) November 15, 2026


