ఓటీటీలో కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన మూవీ అందుబాటులోకి వస్తోంది. ప్రేమ, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన తమిళ సినిమా ‘అన్బిల్ అవన్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది.
సోనీ లివ్‌లో
అశోక్ సెల్వన్, ప్రీతి ముఖుందన్ జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 20 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది. కాగా ఈ మూవీ థియేటర్లలో అక్టోబర్ 2న విడుదలైంది.
కథ విషయానికొస్తే..
సూర్య (అశోక్ సెల్వన్), ఇయల్ (ప్రీతి ముఖుందన్) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. తన భార్య కోరికను నెరవేర్చేందుకు ఓ హిల్ స్టేషన్‌లో అందమైన ఇంటిని కొనుగోలు చేస్తాడు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనేదే సినిమా కథ.
(ఇదీ చదవండి: ఫ్రెండ్ కొడుకు అని చేస్తే సినిమా ఆడేది కాదు: నాగార్జున)



