కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్కాలర్’. తంలో ఎన్నో సందేశాత్మక బాలల చిత్రాలను నిర్మించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు .
ఈ సందర్భంగా దర్శక నిర్మాత డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ... సమాజంలో యువతను పెడదోవ పట్టిస్తూ నిలువెల్ల ముంచేస్తున్న డ్రగ్స్, గంజాయి అనే మహమ్మారి బారిన పడకుండా యువతను ఎలా రక్షించాలి, వాటి ప్రభావం నుంచి వారిని ఎలా వెనక్కి తీసుకురావాలనే ప్రధానాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఒక కుర్రాడు డ్రగ్స్‌కు బానిసలైన వారిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఒక డ్రగ్ కనిపెట్టి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఆ డ్రగ్ మాఫియా అతని కుటుంబాన్ని, చెల్లెలిని అంతం చేస్తే... ఆ డ్రగ్ మాఫియాను ఒక స్పిరిచ్యువల్ బ్యాక్‌డ్రాప్‌లో దేశం నివ్వెరపోయే రీతిలో హీరో ఎలా అంతం చేస్తాడనే ఉత్కంఠభరితమైన కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని వెల్లడించారు.
త్వరలోనే సినిమా షూటింగ్ విశేషాలను తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. చిల్డ్రన్స్ డే సందర్బంగా ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాల బాల బాలికలకు, ఇతర స్కూళ్లలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు మెమెంటో గోల్డ్ మెడల్ ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమానికి బి.జి.ఆర్ మైనింగ్ డైరెక్టర్ శ్రీ బాలకోటి రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా... జూబ్లీహిల్స్ క్లబ్ ప్రెసిడెంట్ చక్రవర్తి రెడ్డి , రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ పెంచల్ రెడ్డి విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.


