యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. త్వరలోనే ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. ‘ఇది నవ్వుల విందు కాబోతోంది’ అనే అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఎన్టీఆర్ సంకేతాలు ఇచ్చినట్లయింది. ‘నవ్వుల విందు’ అంటూ చేసిన వ్యాఖ్యతో ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్ అయి ఉండొచ్చనే చర్చ మొదలైంది. అయితే సినిమా కథ, నిర్మాణ సంస్థ, షూటింగ్ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
త్రివిక్రమ్ సినిమా సంగతేంటి?
ఎన్టీఆర్ చేతిలో ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు గతంలోనే వెల్లడించారు. డ్రాగన్ మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాల్సింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌తో డ్రాగన్ తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
ప్లాన్ మారిందా?
త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమాపై ఇటీవల రకరకాల రూమర్స్ బయటకు వచ్చాయి. ఈ ప్రాజెక్టు అగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. అయితే నిన్ననే నిర్మాత నాగవంశీ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ - త్రివిక్రమ్‌తో పాటు నిర్మాతలు రాధాకృష్ణ, కల్యాణ్‌రామ్ కలిసి ఉన్న ఓ ఫొటోని ఎక్స్‌లో షేర్ చేసి ప్రాజెక్టు ఆగిపోలేదన్న విషయాన్ని సృష్టం చేశారు. ఇప్పుడేమో సడెన్‌గా ఎన్టీఆర్.. అనిల్ రావిపూడితో సినిమాను ప్రకటించాడు. డ్రాగన్ తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి త్రివిక్రమ్‌తో సినిమా సంగతి ఏంటనేది తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.


