పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ | Actress Preetika Rao Marriage Latest News | Sakshi
Sakshi News home page

Preetika Rao: పెళ్లాడిన హీరోయిన్.. భర్త ముఖాన్ని దాచిపెట్టింది

Nov 14 2026 3:21 PM | Updated on Nov 14 2026 3:21 PM

Actress Preetika Rao Marriage Latest News

మహేశ్ బాబు 'అతిథి' సినిమాలో హీరోయిన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న అమృతరావ్ ప్రస్తుతం కెరీర్, ఫ్యామిలీ లైఫ్‌తో బిజీగా ఉంది. ఈమె సోదరి ప్రీతిక రావ్ కూడా హీరోయినే. గతంలో తెలుగులో 'ప్రియుడు' అనే సినిమా చేసింది. ఈమెనే ఇప్పుడు పెళ్లి చేసుకుంది. బెంగళూరులో తమిళ-బ్రహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఈ శుభాకార్యం జరిగింది. వివాహ ఫొటోలు పోస్ట్ చేసిన ప్రీతిక.. భర్త ముఖాన్ని మాత్రం దాచిపెట్టేసింది.

(ఇదీ చదవండి: చాహల్ మాజీ భార్య తెలుగు సినిమా.. ఎట్టకేలకు రిలీజ్)

'గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ, నా తల్లిదండ్రులు, సోదరి అమృత, బంధువులు, స్నేహితుల ఆశీస్సులతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రాంగణంలో నా పెళ్లి వైభవంగా జరిగింది. స్వయంగా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ జీ వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించడం నా జీవితంలో ప్రత్యేకమైన, మరపురాని ఘట్టం. సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టిన నాకు.. ఆ కుటుంబ సంస్కృతి, నా మంగళూరు మూలాలు, కర్ణాటక సంప్రదాయాలని పోలినట్లు అనిపించాయి. వివాహం అనేది వ్యక్తిగతమైన, పవిత్రమైన అనుభూతి. అలాంటి మధురమైన క్షణాలను అందరితో పంచుకోవడం నాకు ఇష్టం లేదు' అని ప్రీతిక రావు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతానికైతే నటనకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసిన ప్రీతిక.. ప్రస్తుతం పాడ్ కాస్ట్ వీడియోలు చేస్తోంది. 201-17 మధ్య తమిళ, కన్నడ, తెలుగు, హిందలో తలో సినిమా చేసింది. ఇవి కాకుండా మూడు సీరియల్స్, రెండు ఆల్బమ్ సాంగ్స్‌లోనూ నటించింది.

(ఇదీ చదవండి: సేవ్ వైజాగ్.. తెలుగు హీరోయిన్ పోస్ట్ వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement