టాలీవుడ్ టాప్ నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. గత 30 ఏళ్లుగా ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. అయితే ఇటీవల ఆయన నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. అలాగే పర భాష చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తే..అవి కూడా డిజాస్టర్‌గా నిలిచాయి. ముఖ్యంగా యశ్ హీరోగా నటించిన టాక్సిక్ చిత్రం తెలుగులో ఏమాత్రం ఆడలేదు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇక్కడ తొలిరోజే నెగెటివ్ టాక్ సంపాదించుకుంది.
ఫలితంగా దిల్ రాజుకు భారీ నష్టం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ టాక్సిక్ చిత్రంతోనూ తనకు లాభాలే వచ్చాయి అంటున్నాడు దిల్ రాజు. అంతేకాదు ఆ సినిమా రిలీజ్ సమయంలో కొంతమంది డబ్బులు ఇచ్చి మరీ తనపై ట్రోలింగ్ చేయించారని చెప్పారు.
(చదవండి: రామాయణం... సీన్ మాకు డబుల్ ఎనర్జీ ఇచ్చాయి : దిల్ రాజు)
తాజాగా ఎస్వీసీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ అయిన ‘రామాయణం’, ‘సీన్’ మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం దిల్ రాజు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా 'టాక్సిక్' మూవీ ఫెయిట్యూర్ గురించి దిల్ రాజు మాట్లాడాడు. సక్సెస్ వస్తే ఎనర్జీతో పాటుగా డబ్బు కూడా వస్తుంది. నేను లాస్ట్ టైమ్ 'టాక్సిక్' సినిమాని రిలీజ్ చేస్తే, మొత్తం నాకు ఏదో నష్టం వచ్చినట్టు పెయిడ్ ప్రమోషన్స్ జరిగాయి.
ఆ విషయం అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో కల్చర్ అలా తయారైంది. నేను 'టాక్సిక్' సినిమాని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశానో, 'రామాయణం' మూవీని కూడా అలానే డిస్ట్రిబ్యూట్ చేశాను. 'టాక్సిక్' వల్ల నష్టమేమీ లేదు. నిజానికి ఎంతో కొంత లాభం కూడా వచ్చింది. డిస్ట్రిబ్యూషన్ కమిషన్ వచ్చింది' అని దిల్ రాజు అన్నారు.


