ప్రస్తుతం బిగ్‌బాస్ హౌసులో ఫ్యామిలీ వీక్ సాగుతోంది. ఇప్పటికే పలువురి కుటుంబ సభ్యులు రాగా శుక్రవారం ఎపిసోడ్‌లో త్రిగుణ్, నీతూ ఫ్యామిలీస్ వచ్చాయి. ఇంతకీ 10వ సీజన్‌లో 68వ రోజైన శుక్రవారం (నవంబర్ 13) ఏం జరిగింది? కొత్త కెప్టెన్ అయ్యేందుకు బిగ్‌బాస్ ఎలాంటి టాస్క్ పెట్టాడనేది చూద్దాం.
(ఇదీ చదవండి: అదో పీడకల.. దేవుడి దయ వల్ల నేను బతికాను: కాజల్ అగర్వాల్)
శుక్రవారం ఎపిసోడ్‌లో భాగంగా త్రిగుణ్ భార్య, కూతురు లోపలికి వచ్చారు. నువ్వు ఎలాగైనా ట్రోఫీ ఇంటికి తీసుకురావాలని త్రిగుణ్ భార్య ఎమోషనల్ అయింది. వర్షిణి వల్ల చాలా హర్ట్ అయ్యానని భార్యతో త్రిగుణ్ చెప్పాడు. కాసేపు పాపతో అందరూ ఆడుకున్న తర్వాత వాళ్లిద్దరూ బయటకు వెళ్లిపోయారు. తర్వాత నీతూ మాస్టర్ భర్త నటరాజ్ మాస్టర్, ఆమె కూతురు వచ్చారు. నువ్వు లోపల ఆడు, నేను బయట ఆడతాను. నువ్వు కంగారు పడకని భార్యకు నటరాజ్ ధైర్యం చెప్పాడు. నువ్వు హౌస్‌లో ఏం జరిగినా అసలు ఏడవకు అని చెప్పాడు. అయితే హౌసులోకి వచ్చిన నటరాజ్ ఇదంతా గేమ్ అని మర్చిపోయి కాసేపు ఓవరాక్షన్ చేశాడు.
స్కూల్ టాస్క్‌లో అందరూ బాగా ఆడినందుకు కెప్టెన్సీ కంటెండర్స్‌గా అందరికీ అవకాశమిస్తున్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు. అలా కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. నంబర్స్ వేసి ఉన్న షీట్స్ కొన్ని పెట్టారు. బిగ్‌బాస్ ఒక నంబర్ చెప్పగానే కంటెస్టెంట్స్ దాని మీద నిలబడాలి. ఎవరు నిలబడకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చివరకు మిగిలిన నలుగురు తర్వాతి లెవల్‌కి వెళ్తారని అన్నాడు.
తొలుత ఒక నంబర్ చెప్పగా ఆ షీట్ మీద అందరూ ఇరుక్కొని నిలబడ్డారు. ఎవరు లేరో చెప్పమని బిగ్‌బాస్ అడగ్గా.. అందరూ గొడవపడ్డారు. చివరకు సుధీర్ ఔట్ అయ్యాడు. తర్వాత వర్షిణి, రాంప్రసాద్, నీతూ, దేబ్జానీ, శ్వేత, ముకేశ్ ఔట్ అయ్యారు. స్థానం కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ త్రిగుణ్-శివ్ కూడూ ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. షీట్స్ మీద నిలబడటానికి ఒకరినొకరు తోసుకొని, కొట్టుకొని ఓ యుద్ధమే చేశారు. చివరగా మిగిలిన వంశీ, నరేశ్, అమన్, రామకృష్ణ తర్వాత దశకు వెళ్లారు. శనివారం నాడు కెప్టెన్సీ గేమ్ కొనసాగనుంది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: సేతుపతికి భార్యగా.. కవల పిల్లలకు తల్లిగా)


