బిగ్‌బాస్ 10: అమ్మ వచ్చింది.. హౌస్ ఎమోషనల్ అయింది | Bigg Boss 10 Telugu Day 67 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Day 67: త్రిగుణ్‌ని తెగ పొగిడేసిన దేబ్జానీ పేరెంట్స్

Nov 13 2026 10:35 AM | Updated on Nov 13 2026 10:43 AM

Bigg Boss 10 Telugu Day 67 Highlights

ప్రస్తుతం హౌస్‌లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో అంతటా ఎమోషనల్ వాతావారణం కనిపిస్తోంది. బిగ్‌బాస్ 10వ సీజన్‌లో 67వ రోజైన గురువారం(నవంబర్ 12) దేబ్జానీ, రాంప్రసాద్, సుధీర్ కుటుంబ సభ్యులు ఇంట్లోకి వచ్చారు. ఇంతకీ ఈ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? దేబ్జానీ తల్లిదండ్రులు, త్రిగుణ్ గురించి ఏం చెప్పారనేది చూద్దాం.

(ఇదీ చదవండి: మహేశ్ బాబు ఫ్యామిలీలోనూ పెళ్లి సందడి)

ఓవైపు స్కూల్ టాస్క్ నడుస్తుండగా మరోవైపు స్టీమర్ విషయంలో త్రిగుణ్, ముకేశ్ గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు అరుచుకున్నప్పటికీ చివరకు దాన్ని వదిలేశారు. మరోవైపు స్కూల్ ప్రిన్సిపాల్‌గా నరేశ్ మంచి కామెడీతో అదరగొట్టేశాడు. ఈ టాస్క్ జరుగుతుండగానే రాంప్రసాద్ తల్లి.. హౌసులోకి వచ్చి కిచెన్‌లో కాఫీ చేసుకుని వచ్చి రాంప్రసాద్ ని సర్‌ప్రైజ్ చేశారు. అందరూ నిన్ను కన్నింగ్ అంటున్నారు కానీ అందరూ కన్నింగే. ఏం భయపడకుండా మాట్లాడేయ్. ఎవరి గురించి ఆలోచించకు అని చెప్పారు. తర్వాత రాంప్రసాద్ కూతురు వచ్చింది.

కాసేపటి తర్వాత బిగ్‌బాస్ గార్డెన్‌లో ఉన్న ఇంటి సభ్యుల మీదకి రాకెట్లు విసురుతారు. అందరూ రాకెట్లు తీసుకుంటూ ఉండగా.. దేబ్జానీ తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. త్రిగుణ్‌ ఆట చాలా బాగుంది వెరైటీగా ఉందని చెప్పారు. రాంప్రసాద్, నరేశ్, దేబ్జానీలని కలిసే ఉండమన్నారు. తర్వాత దేబ్జానీతో కోపం తగ్గించుకో.. గ్రూప్స్‌తో కలిసి ఆడు..త్రిగుణ్‌తో ఇంకా క్లోజ్‌గా ఉండు అని చెప్పారు. అందరూ కలిసి ఆడండి.. టాస్క్‌లు టాస్క్‌ల వరకే ఉండాలి.. అందరూ కలిసి ఉండాలని మంచి మాటలు చెప్పారు. దేబ్జానీ తండ్రి మాట్లాడుతూ.. త్రిగుణ్ అంటే త్రిమూర్తి. అందర్నీ కంట్రోల్ చేస్తాడు. నేను అందరి ఆట చూస్తున్నా. నీ ఆట మాత్రం వేరేగా ఉంది అని పొగిడేశాడు.  బెంగాలీలో మీ కూతురిని ప్రేమిస్తున్నానని నరేశ్ చెప్పగా.. ఇతనే మీ అల్లుడు అని దేబ్జానీ తన తల్లిదండ్రులకు చెప్పి మామయ్య అని సరదాగా పిలిపించింది. దేబ్జానీ తల్లి వెళ్తున్నప్పుడు వర్షిణి ఏడుస్తుంటే ఏడ్వొద్దు అని దేబ్జానీ తల్లి ఓదార్చింది.

బిగ్‌బాస్.. ఇంటి సభ్యుల కోసం బగారా- చికెన్ పంపించి రుచి చూసి గెస్ చేయండని చెప్పగా.. సుధీర్ తిని తన ఇంటి వంటలా ఉందని గుర్తుపట్టేశాడు. నీతూ మాస్టర్ మా ఇంటి నుంచి వచ్చిందని అంది. కెమెరా ముందుకొచ్చిన సుధీర్.. మా అమ్మ వంట అని నేను నమ్ముతున్నా.. ఇది మా అమ్మని గుర్తు చేసిందని చెప్పాడు. కాసేపటికి సుధీర్‌ కోసం తన తల్లి రమాదేవి వచ్చారు. సుధీర్ కాలు చూసి.. చాలా బాధలు పడిపోయావ్ నాయనా అని ఏడ్చేశారు. ముకేశ్‌ని పట్టుకొని నీ సీరియల్‌ని బాగా చూసేదాన్ని నాయనా అని అన్నారు. త్రిగుణ్ చేతిలో చేయి పెట్టి నా కొడుకుని చూసుకో నాయనా అని చెప్పారు. త్రిగుణ్‌తో ఉండు నాయనా, ముకేశ్ వాళ్ల మీద ఏమైనా ఉంటే డైరెక్ట్‌గా చెప్పు అని అన్నారు. త్రిగుణ్‌తో మాట్లాడిన సుధీర్ తల్లి.. మొన్న అతనితో మాట్లాడటం చూశావ్ అక్కడ కరిగిపోయా నాన్న నా కొడుకుని మీ చేతిలో పెట్టాను చూసుకో అని చెప్పారు. సుధీర్ తల్లి బయటకు వెళ్లిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: కేరళ మహిళా పోలీస్ స్పూర్తితో సాయిపల్లవి పాత్ర)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement