రీసెంట్‌గానే 'రామాయణ'లో సీతగా ఆకట్టుకున్న సాయి పల్లవి.. మరో వారం రోజుల్లో 'ఓం'లో ఐపీఎస్ అధికారిణిగా కనిపించనుంది. ప్రస్తుత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. 'ఓం' కోసం తొలిసారి పోలీస్ పాత్ర చేసింది. ఇప్పటికే ఈమె పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియో రిలీజ్ కాగా మంచి స్పందన వచ్చింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన 21 సినిమాలు)
ధనుష్ హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించాడు. శ్రీ లీల మరో హీరోయిన్. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. కాగా ఇందులో సాయిపల్లవి చేసిన పోలీస్ అధికారిణి పాత్రని కేరళా ఏఎస్‌పీ మెరిన్ జోసెఫ్ స్ఫూర్తిగా తెరకెక్కించామని దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి చెప్పాడు. పాత్రలో నటించడానికి ముందు సాయిపల్లవి.. మెరిన్‌ని కలిసి పలు సూచనలు తీసుకున్నట్లు వెల్లడించాడు. సాయిపల్లవి చాలా బాగా నటించారని, 'ఓం'లో ఈమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొన్నాడు.
(ఇదీ చదవండి: మహేశ్ బాబు ఫ్యామిలీలోనూ పెళ్లి సందడి)


