బిగ్‌బాస్ 10: భర్తని మించి నీతూ అతి.. ఈవారం నామినేషన్లలో ఎవరెవరు? | Bigg Boss 10 Telugu Day 64 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Day 64: రచ్చ లేపిన నామినేషన్స్.. నీతూ మాస్టర్ ఓవరాక్షన్

Nov 10 2026 10:43 AM | Updated on Nov 10 2026 10:46 AM

Bigg Boss 10 Telugu Day 64 Highlights

సోమవారం వచ్చిందంటే బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హడావుడి గట్టిగా ఉంటుంది. ఈసారి అంతకుమించి అన్నట్లుగానే సాగింది. గతంలో ఈ షోలో పాల్గొన్న నటరాజ్ మాస్టర్ ఎంతలా అరిచి రచ్చ చేశాడో తెలిసే ఉంటుంది. ఇ‍ప్పుడు ఈయన్ని మించిపోయేలా భార్య నీతూ అతి చేసినట్లు అనిపించింది. ఇంతకీ 64వ రోజైన సోమవారం(నవంబర్ 09) తెలుగు 10వ సీజన్‌లో అసలేం జరిగింది? ఎవరెవరు నామినేట్ అయ్యారు?

(ఇదీ చదవండి: వచ్చే నెలలో సినిమా రిలీజ్.. ఇంతలోనే విషాదం)

బిగ్‌బాస్ అందరికి తలా ఒకరిని నామినేట్ చేసే అవకాశమిచ్చాడు. ఎవరిని నామినేట్ చేస్తారో కారణాలు చెప్పి ఒక బంతికి వాళ్ల ఫోటో అతికించి దాన్ని డోర్ బయటకు వెళ్లేలా తన్నాలని చెప్పాడు. తొలుత అమన్.. శివ్‌ని నామినేట్ చేశాడు. ముకేశ్.. సుధీర్‌ని నామినేట్ చేశాడు. మేం లేకపోతే నువ్వు కెప్టెన్ కాదు కదా కంటెండర్ కూడా అయ్యేవాడివి కాదని దారుణంగా మాట్లాడాడు. నువ్వు నమ్మక ద్రోహి, అనవసరంగా నామినేషన్ నుంచి నిన్ను సేవ్ చేశానని అన్నాడు. మధ్యలో దేబ్జానీ పేరు తీసుకురావడంతో సుధీర్ సీరియస్ అయ్యాడు.

శ్వేత, నీతూని నామినేట్ చేసింది. మీకు సపోర్ట్ చేయకపోతే పెద్ద బొక్క పెడతారు. త్రిగుణ్‌కి భజన చేస్తున్నావని నన్ను అన్నారు. కానీ ఆట, సహనం మీకు లేవని చెప్పి నామినేట్ చేసింది. అయితే ఈ క్రమంలోనే ఊరికే గట్టిగట్టిగా అరుస్తూ నీతూ అపరిచితురాలిలా ప్రవర్తించింది. శివ్, ముకేశ్‌ని నామినేట్ చేశాడు. దేబ్జానీ వెనక పడుతున్నానని తన క్యారెక్టర్ నెగిటివ్ చేసినదాని గురించి మాట్లాడాడు. ఎక్కువ నోరు జారతారు. మబ్బుల్లో ఉన్నారు మీరు మబ్బేష్ అని అన్నాడు. వర్షిణి వల్ల ముకేశ్ గేమ్ పోతుందని ఝాన్సీ తనతో చెప్పినట్లు సుధీర్ బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: మూడో భార్య నుంచీ విడాకులు తీసుకున్న పవన్ కల్యాణ్)

రామకృష్ణ, సుధీర్‌ని నామినేట్ చేశాడు. నరేశ్, నీతూని నామినేట్ చేశాడు. మీ వల్ల నా గేమ్ డిస్టర్బ్ అయింది. సన్ డే ఫన్ డే కానీ నిన్న మాట్లాడిన మాటలు ఇక్కడిదాకా తీసుకొస్తున్నారని కారణాలు చెప్పాడు. అయితే అవతలివాళ్లు ఏం మాట్లాడుతున్నారో వినకుండా నీతూ అతి చేసింది. దేబ్జానీ కూడా నీతూనే నామినేట్ చేసింది. సుధీర్, ముకేశ్‌ని నామినేట్ చేశాడు. నచ్చితే ఒలకా ఉంటారు. లేకపోతే లేదు. ముకేశ్ గుండు సున్నా అని కారణాలు చెప్పాడు. నీతూ, త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. ఇష్టమొచ్చినట్టు మాటలు మాట్లాడతారని కారణాలు చెప్పింది. మధ్యలో వంశీ మాట్లాడటానికి ప్రయత్నించడంతో అతడి మీద కూడా ఫైర్ అయింది. రాంప్రసాద్, వర్షిణిని నామినేట్ చేశాడు.

త్రిగుణ్, నీతూని నామినేట్ చేశాడు. దీంతో గొడవ పెట్టుకున్న ఈమె.. తనే అరిచి తనే ఏడ్చింది. ఎమోషనల్ అయినట్టు నటించేసింది. వర్షిణి, సుధీర్‌ని నామినేట్ చేసింది. కెప్టెన్ వంశీ కూడా నీతూనే నామినేట్ చేశాడు. చివరలో వచ్చిన బిగ్‌బాస్.. మీ నామినేషన్స్ పక్కన పెట్టి నేను అందరినీ నామినేట్ చేస్తున్నానని షాకిచ్చాడు. కెప్టెన్ వంశీ మినహా అందరూ ఈవారం నామినేషన్స్‌లో ఉన్నట్లు చెప్పాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: అందుకే ఆ రోజు మౌనంగా ఉన్నాను.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement