12 ఏళ్ల గ్యాప్ అందుకే తీసుకున్నా | Nazriya Reacts Acting Gap About 12 Years | Sakshi
Sakshi News home page

Nazriya: సూర్య సరదాగా అన్నారు.. అందువల్లే చేయలేకపోయా

Nov 10 2026 8:40 AM | Updated on Nov 10 2026 8:40 AM

Nazriya Reacts Acting Gap About 12 Years

మలయాళ బ్యూటీ నజ్రియా బహుబాషా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా సూర్య 'సీన్'తో అద్భుతమైన సక్సెస్ అందుకుంది. హీరో, ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజి‌ల్‌ని పెళ్లి చేసుకున్న ఈమె.. మలయాళంలో ప్రముఖ కథానాయికగా రాణిస్తూనే తెలుగులో 'అంటే సుందరానికి'తో ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో అంతకు ముందే రాజా రాణి మూవీతో పరిచయం అయ్యి పలు చిత్రాల్లో నటించింది. ఈమె తమిళంలో చివరిగా తిరుమణం ఎనుమ్‌ నిఖ్కా చిత్రంలో చేసింది. ఇది 2014లో విడుదలైంది. ఆ తరువాత మళ్లీ తమిళ సినిమాల్లో కనిపించని ఈ భామ చాలా గ్యాప్‌ తీసుకుని 12 ఏళ్ల తర్వాత సూర్యకు జంటగా మెరిసింది.

(ఇదీ చదవండి: మహేశ్ 'వారణాసి' స్టోరీ.. ఒకవేళ ఇదే నిజమైతే?)

ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేసిన నజ్రియా.. మూడు, నాలుగుసార్లు తనని సంప్రదించిన తర్వాతే నటించడానికి అంగీకరించిందని సూర్య ఓ సందర్భంలో చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన నజ్రియా.. సూర్య సరదాగా అలా అన్నారు. నిజానికి కాల్‌ సీట్స్‌ సమస్య, కొన్ని పరిస్థితుల కారణంగా తమిళంలో నటించలేకపోయాను. అంతే కానీ సూర్యతో నటించడానికి నేను కావాలని ఎలా కాదగలను? గత 12 ఏళ్లుగా తమిళంలో నటించకపోవడానికి ప్రత్యేక కారణమేం లేదు. మంచి కథ, పాత్రలు దొరకకపోవడమే కారణమని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు కామెడీ-ఎమోషనల్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement