కామెడీ... హారర్‌ | Sumaya Reddy Dear Uma Poster released | Sakshi
Sakshi News home page

కామెడీ... హారర్‌

Nov 10 2026 4:38 AM | Updated on Nov 10 2026 4:38 AM

Sumaya Reddy Dear Uma Poster released

‘డియర్‌ ఉమ’ సినిమాతో నటిగా, నిర్మాతగా, రచయితగా టాలీవుడ్‌కి పరిచయమైన సుమయా రెడ్డి ద్వితీయ చిత్రానికి శ్రీకారం చుట్టారు. సుమ చిత్ర ఆర్ట్స్‌ సమర్పణలో సుమయా రెడ్డి ప్రధాన పాత్రలో నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. దీపావళి సందర్భంగా ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. సుమయా రెడ్డి చేతి నిండా డబ్బు, బంగారంతో కనిపిస్తున్నారు. ‘‘కామెడీ, హారర్‌ జానర్‌లో రూపొందనున్న చిత్రం ఇది. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో రాబోతోంది. త్వరలోనే ఈ మూవీ టైటిల్‌తో పాటు ఇతర వివరాలు ప్రకటించనున్నాం’’ అని సుమయా రెడ్డి పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement