మే 14న వీరభద్రుడు | poster for Suriya upcoming film Karuppu has been released | Sakshi
Sakshi News home page

మే 14న వీరభద్రుడు

Apr 4 2026 3:20 AM | Updated on Apr 4 2026 9:52 AM

poster for Suriya upcoming film Karuppu has been released

సూర్య హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం ‘కరుప్పు’. త్రిష హీరోయిన్‌గా నటించారు. ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ప్రకాశ్‌బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు నిర్మించిన ఈ చిత్రం మే 14న విడుదల కానుంది.

కాగా, ఈ సినిమాకు తెలుగులో ‘వీరభద్రుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా వెల్లడించి, ఈ సినిమా కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ  పోస్టర్‌లో కత్తి పట్టుకుని మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు సూర్య. ఈ సినిమాకు సంగీతం: సాయి అభ్యంకర్‌.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement