ప్రేమ.. హాస్యం  | Romanchakam Title Poster Released | Sakshi
Sakshi News home page

ప్రేమ.. హాస్యం 

May 30 2026 5:59 AM | Updated on May 30 2026 5:59 AM

Romanchakam Title Poster Released

సుమంత్‌ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్‌ జోడీగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా ‘రోమాంచకం’. ‘ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ’ అనేది ఉపశీర్షిక. నూతన దర్శకుడు వేణుగోపాల్‌ రెడ్డి దర్శకత్వంలో సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ పతాకంపై ప్రణయ్‌ రెడ్డి వంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘లవ్, ఫన్ , బ్యూటిఫుల్‌ ఎమోషన్ ్స ఉన్న ఒక ఫ్రెష్‌ ఎంటర్‌టైనర్‌గా రూ΄÷ందుతోన్న ‘రోమాంచకం’ ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఉపేంద్ర లిమయె, వెంకటేష్‌ కాకుమాను, నరేంద్ర రవి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వాసుకి వైభవ్‌ సంగీతం అందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement