breaking news
Ananthika Sanilkumar
-
‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)
-
Romanchakam: రోమాంచకం మూవీ రివ్యూ
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన చిత్రం ‘రోమాంచకం’. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటించారు. ఈ మూవీని వేణు గోపాల్ రెడ్డి తెరకెక్కించారు. సెప్టెంబర్ 3న ఈ మూవీని విడుదల చేశారు. మరి ఈ సినిమాకి సంబంధించిన కథ ఎలా ఉంది? రివ్యూ ఏంటి? అన్నది ఓ సారి చూద్దాం. కథ ఏంటంటే?అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే ఓ కుర్రాడు బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అప్పులు చేసి స్టార్టప్ అని డబ్బులన్నీ వృథా చేస్తాడు. ‘రోమాంచకం’ అని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని కలిపే ఓ డేటింగ్ యాప్ క్రియేట్ చేయాలని చూస్తుంటాడు. అయితే టెస్టింగ్ క్రమంలో ఈ యాప్ ద్వారానే చెన్నైలో ఉండే మైథిలి (అనంతిక)తో పరిచయం పెంచుకుంటాడు. ఆమె కూడా అన్వేష్ ప్రేమలో పడిపోతుంది. మైథిలీ బర్త్ డే సందర్భంగా అన్వేష్ చెన్నైకి వెళ్లి సర్ ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటాడు. అలా అన్వేష్ చెన్నైకి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత అన్వేష్ ఫోన్ పోగొట్టుకుంటాడు. ఎలాగోలా మైథిలీకి ఫోన్ చేసి హోటల్‌కి రమ్మంటాడు. వస్తాను అని మైథిలీ చెబుతుంది. కానీ ఆ తర్వాత క్షణం నుంచి మైథిలీ ఫోన్ కలవదు. అన్వేష్ నంబర్ని అన్ని చోట్లా బ్లాక్ చేస్తుంది. మళ్లీ మూడు నెలల తర్వాత లైన్లోకి వస్తుంది. అసలు మైథిలీ ఎందుకు బ్లాక్ చేస్తుంది? మళ్లీ ఎందుకు లైన్లోకి వస్తుంది? అన్వేష్ కోసం ఆమె హైదరాబాద్‌కి ఎందుకు వస్తుంది? వచ్చాక ఏం జరుగుతుంది? ఆమె రాకతో అన్వేష్, అతని ఫ్రెండ్స్ ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటారు? అన్నది మిగతా కథ. ఎలా ఉందంటేజెన్ జీ మైండ్ సెట్‌ను బేస్ చేసుకుని కథను అల్లుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కథలో చాలా వరకు లాజిక్స్, ఎమోషన్స్ ఇలా ఏవీ కనిపించవు. ఇప్పుడు ఉన్న తరం కూడా ఇలానే ఆలోచిస్తుంటుంది. ఎందుకు అలా చేస్తున్నారు.. ఇలా ప్రవర్తిస్తుంటారు? అన్నది చెప్పడం కష్టం. ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ల పాత్రల్ని చూస్తే కూడా అలానే అనిపిస్తుంది. చాలా వరకు సిల్లీగా అనిపిస్తుంది. మరీ ఇలా ఉన్నారేంట్రా.. అని అనిపించొచ్చు. కథలో ఎక్కడా కూడా ఎమోషన్ అన్నది కనిపించదు. లాజిక్ అయితే భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా సరదా సరదాగా సాగుతుంది. హీరో, అతని గ్యాంగ్ చేసే కామెడీ బాగుంటుంది. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ కాస్త ఫ్రెష్‌గానే అనిపిస్తుంది. పాటలు, కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఫ్లోలో సాగుతుంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుందని అనుకుంటే.. పొరబాటే. అసలు సినిమాలో ఎక్కడా కూడా సీరియస్ నెస్ కనిపించదు. చాలా వరకు ఎమోషన్ మిస్ అవ్వడం మైనస్ అని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ కూడా ఫుల్ కామెడీగానే సాగుతుంది. లాజిక్స్, కథ గురించి ఆలోచించకుండా సరదాగా నవ్వుకోవడానికి వెళ్తే మాత్రం ఈ సినిమా కొంత వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా నటించారంటే?సుమంత్ ప్రభాస్ యాక్టింగ్, కనిపించే తీరు అంతా కూడా పక్కింటి అబ్బాయిలా ఉంటుంది. అనంతిక మాత్రం తెరపై అందంగా కనిపిస్తుంది. ఆమె పాత్ర నిడివి కూడా చాలా తక్కువే. అయినా కనిపించినంత వరకు ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ మాత్రం తమ కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కూడా నవ్విస్తుంది. మిగిలిన కారెక్టర్స్ అందరూ కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకుంటారు. సాంకేతికంగా ఎలా ఉందంటే..విజువల్స్ సహజంగా అనిపిస్తాయి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గానే కనిపిస్తుంది. పాటలు బాగుంటాయి. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఎడిటింగ్ బాగుంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉంటాయి. కథకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టుగా కనినిపిస్తుంది. జెన్ జీ ఆడియెన్స్‌ని టార్గెట్ చేసిన ఈ మూవీ కమర్షియల్‌గా ఏ రేంజ్ సక్సెస్‌ని సాధిస్తుందో చూడాలి. -
ప్రభాస్‌ని కలిశాక నా గతమంతా గుర్తొచ్చింది : సుమంత్ ప్రభాస్
సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రొమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు గోపాల్‌రెడ్డి దర్శకత్వం వహించారు. రేపు(సెప్టెంబర్ 3) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో సుమంత్ ప్రభాస్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ మా మూవీ కోసం ప్రభాస్ గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. నా గతం, నా జర్నీ అంతా ఒక్కసారిగా గుర్తుకువచ్చింది. ఆయనను కలిసే ముందు ఒక ఎక్స్ పెక్టేషన్ తో వెళ్లాం. ప్రభాస్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ఆయనలో కనిపించింది. మా కుటుంబంలో ఎవరికీ సినిమా నేపథ్యం లేదు. సినిమాల గురించి తెలియదు. దాంతో వాళ్లు నన్ను పెద్దగా సపోర్ట్ చేయలేదు. అందరితో బాగుండు, పాజిటివ్ గా ఆలోచించు అని మాత్రం చెప్పారు.→ తెలంగాణ నేపథ్యంతో మేమ్ ఫేమస్ అనే సినిమా చేశాను. ఇక్కడి ఆడియెన్స్ బాగా చూశారు. ఆంధ్ర నేపథ్యంతో గోదారిగట్టుపైన సినిమా చేశాను. ఆ సినిమాను ఏపీ వాళ్లు ఆదరించారు. ఈ రెండు చిత్రాలతో నటుడిగా వెర్సటాలిటీ చూపించే అవకాశం దక్కింది. రోమాంచకం సినిమా హైదరాబాద్ నేపథ్యంగా సాగుతుంది.→ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలని ప్రయత్నించే యువకుడిగా ఈ చిత్రంలో కనిపిస్తాడు. ఆ క్యారెక్టర్ క్యూట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటుంది. రియల్ లైఫ్ లో నేను ఎస్తై కావాలని మా నాన్నకు ఉండేది. డిగ్రీ చదువుతున్నప్పుడే మేమ్ ఫేమస్ మూవీలో అవకాశం వచ్చింది.→ రోమాంచకం సినిమా ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వరకు ఎవరైనా చూసి ఒకేలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో అయినా ఈ మూవీని చూడొచ్చు. నేను హీరోగా రెండు సినిమాలు చేసినా.. డైరెక్టర్ వేణుగోపాల్ ఆయనకు ఈ క్యారెక్టర్ కు ఎలా ఉండాలో అలా మార్చుకునేందుకు ఆర్నెళ్లు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు. ఈ క్యారెక్టర్ లో ఎలా నటించాలి అనేది నాకు ఐడియా ఉంది. కానీ వర్క్ షాప్స్ తో షార్ప్ అయ్యాను. వర్క్ షాప్స్ అంతా కంప్లీట్ అయ్యాక మొదటి నుంచి చివరి దాకా నా పర్ ఫార్మ్ చూసుకుంటే ఎంతో మార్పు కనిపించింది. కొన్నిసార్లు ఒకే సీన్ రెండు మూడు నెలలు ప్రాక్టీస్ చేసిన సందర్భాలున్నాయి.→ సందీప్ అన్న ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసి ఒక క్యూట్ స్టోరీ ఉంది నువ్వు విను అన్నారు. ఆయన చెప్పాడంటే తప్పకుండా బాగుంటుందని కథ విన్నాను. వేణు అన్న చెప్పిన నెరేషన్ రెండున్నర గంటలు ఎంజాయ్ చేశాను.సందీప్ అన్న, ప్రణయ్ అన్న బయటకు అలా కనిపిస్తారు కానీ వాళ్లు చాలా స్వీట్ పర్సన్స్. వాళ్లతో ట్రావెల్ అయిన వాళ్లకు తెలుస్తుంది.→ విజయ్ దేవరకొండ అన్న మా మూవీ ప్రీ రిలీజ్ కు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా గురించి బాగా మాట్లాడటం కూడా సంతోషాన్నిచ్చింది. విజయ్ అన్నను చూసి నేను చాలా ఇన్స్ పైర్ అవుతుంటాను. రోమాంచకం సినిమా ఫస్ట్ కాపీ చూసి సందీప్ అన్న బాగా పర్ ఫార్మ్ చేశావంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. రోమాంచకం టైటిల్ కొత్తగా ఉంది ఆడియెన్స్ కు కనెక్ట్ అవుతుందా అనిపించింది. కానీ ఇప్పుడు అదొక ఊతపదంలా మారిపోతోంది. సినిమా రిలీజ్ అయ్యాక చాలా మందికి ఈ పదం వాడుకలోకి వస్తుందని నమ్ముతున్నా.→ అనంతిక టాలెంటెడ్ యాక్ట్రెస్. ఆమెకు చాలా ఆర్ట్ ఫామ్స్ తెలుసు. ఏ విద్యనైనా తక్కువ టైమ్ లో నేర్చుకుంటుంది. ఆమెతో ఈ మూవీలో వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. తనకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకొస్తుంది. మా సినిమా ఆద్యంతం రోమాంచకం ఫీల్ ను ప్రేక్షకులకు కలిగిస్తుంటుంది. సినిమాలో ఫ్రెష్ నెస్ చూస్తారు. ప్రతి సీన్ మీకు నవ్వు తెప్పిస్తుంది. నాకు సినిమా చూసినంత సేపు మజా వచ్చింది. మా మూవీలో వాసుకి వైభవ్ మ్యూజిక్ ఇరగదీశాడు. రాధారమణ నా ఫేవరేట్ సాంగ్. ఇంకో లవ్ సాంగ్ ప్రభాస్ గారు రిలీజ్ చేశారు.→ హీరోగా అన్నిరకాల చిత్రాల్లో నటించాలని ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీస్ వస్తున్నాయి. హీరోగా పేరొచ్చాక యాక్షన్, కమర్షియల్ ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. నెక్ట్స్ ఏషియన్ బ్యానర్ లో రాజు వెడ్స్ రాంబాయి డైరెక్టర్ సాయిలు కంపాటితో ఒక మూవీ చేయబోతున్నా. ఈ నెలలోనే ఆ మూవీ స్టార్ట్ కానుంది. -
కొత్త సీన్లతో ‘అర్జున్ రెడ్డి’ మళ్లీ రిలీజ్ చేస్తాం: ప్రణయ్ రెడ్డి
‘‘ఇంజినీరింగ్ పూర్తి చేసి బయటకు వచ్చిన యువకుడు ఏం చేస్తాడు? అతని జీవితంలో ఏం జరిగింది? అతని ప్రేమకథ ఎలా సాగింది? వాళ్ల ఫ్రెండ్స్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్ ఏంటి? అనేది ‘రోమాంచకం’ సినిమాలో మంచి వినోదాత్మకంగా సాగుతుంది. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది. 2 గంటల 20 నిమిషాల టైమ్‌లో ఎక్కడా బోర్ కొట్టదు’’ అని నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రణయ్ రెడ్డి వంగా విలేకరులతో చెప్పిన విశేషాలు. (చదవండి: మూడు వారాల్లోపే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్)→ సినిమా నిర్మాణం సీరియస్‌గా చేయాలని టీమ్స్‌ను పెట్టుకుని చేసే మైండ్ సెట్లో మేం లేం. డైరెక్టర్ వేణుగోపాల్ మూడు నాలుగేళ్లుగా మాతో జర్నీ చేస్తున్నారు. ఆయన స్క్రిప్ట్ నెరేషన్ మమ్మల్ని ఆకట్టుకోవడంతో ‘రోమాంచకం’ తీశాం. → ఈ ప్రాజెక్ట్ ఓకే చేశాక సందీప్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. ఆయన ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మా మూవీ ఔట్పుట్ చూసి హ్యాపీగా ఫీలయ్యారు. సుమంత్, అనంతిక బాగా నటించారు. వాసుకి వైభవ్ అద్భుతమైన సంగీతం అందించారు. యూత్, ఫ్యామిలీ అందరూ కలిసి ఇబ్బంది లేకుండా మా మూవీ చూడొచ్చు. → అమెరికాలో సెన్సార్ అనేది ఇండస్ట్రీ వాళ్ల సారథ్యంలో నడుస్తుంది. ఇక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉంది. ప్రభుత్వ కోణంలో సెన్సార్ నిబంధనలు సరైనవే. ఆ రూల్స్ తెలిసుంటే ఫిల్మ్ మేకర్స్ ముందే జాగ్రత్తపడతారు. → ‘అర్జున్ రెడ్డి’ని మళ్లీ రిలీజ్ చేస్తాం... ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి కొన్ని సన్నివేశాలు యాడ్ చేసి, వచ్చే ఏడాది రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ప్రభాస్‌గారితో మేం చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. ‘స్పిరిట్’ మూవీ పూర్తయ్యాక సందీప్, నేను కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తాం. మంచి స్క్రిప్ట్స్ వస్తే తప్పకుండా చిన్న చిత్రాలు నిర్మిస్తాం. -
భావోద్వేగాలు బలంగా ఉంటాయి: అనంతిక సనిల్‌కుమార్
‘‘రోమాంచకం’ చిత్రంలో ప్రేమ, హాస్యం, ఉత్కంఠ... ఈ మూడు భావోద్వేగాలు బలంగా ఉంటాయి. ఈ మూడింటిలో నాకు ఉత్కంఠ బాగా నచ్చింది. ఈ ఉత్కంఠ కూడా ప్రేమవల్లే అవుతుంది. అది ఎలా జరిగింది? అనేది సినిమాలోనే చూడాలి. నేను గతంలో చేసిన పాత్రలకు భిన్నంగా ‘రోమాంచకం’లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాని మేము ఎంత సరదాగా, సంతోషంగా చేశామో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ అనంతిక సనిల్‌కుమార్ తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అనంతిక సనిల్‌కుమార్ మాట్లాడుతూ–‘‘8 వసంతాలు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నప్పటికీ ఎగై్జటింగ్‌గా అనిపించలేదు. ‘రోమాంచకం’ కథ విన్నాక చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో బబ్లీ గర్ల్, సరదాగా ఉండే తమిళ అమ్మాయిగా కనిపిస్తా. ఇది ప్రేమ కథా చిత్రమే అయినప్పటికీ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. సుమంత్ ప్రభాస్ పాత్ర ఈ మూవీలో చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్ కూడా ఆయనతో పోటీ పడేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ వేణుగోపాల్‌గారు. సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డిగార్లు నా పాత్ర చాలా బాగా వచ్చిందని అభినందించడం సంతోషం. అయితే ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాను. యాక్షన్, డ్యాన్స్ బేస్డ్ సినిమాలు వచ్చినా చేయడానికి సిద్ధమే. ప్రస్తుతం తమిళంలో ఓ చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో చర్చలు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు. -
రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు
-
రష్మిక కు బాగానే ఉంది ఇంట్లో ఎంజాయ్ చేస్తుంది
-
‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
రోమాంచకం చూస్తున్నప్పుడు నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా
‘‘రోమాంచకం’ కథ విన్నాను, ఫస్ట్ కట్ చూశాను. సినిమా కూడా చూశాను.. చాలా బాగుంది. ఈ కథ విన్నప్పుడు నేను ఎంతగా నవ్వుకున్నానో, సినిమా చూశాక అంతకంటే ఎక్కువ నవ్వాను. ఇది సూపర్ హిలేరియస్ మూవీ’’ అని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటించిన చిత్రం ‘రోమాంచకం’. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబరు 3న విడుదల కానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా సునీల్ నారంగ్ ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్నారు. ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ– ‘‘మా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లో నిర్మించిన చిత్రాలన్నిటికీ ‘ఎ’ సర్టిఫికెట్స్ వచ్చేవి. రాబోయో ‘స్పిరిట్’ మూవీకి కూడా ‘ఎ’ సర్టిఫికెట్ వస్తుంది. అయితే తొలిసారి మా బ్యానర్లో రూపొందిన ‘రోమాంచకం’ మూవీకి క్లీన్ ‘యు/ఏ’ సెన్సార్ సర్టిఫికెట్ వస్తోంది. ఈ సినిమాకు కుటుంబంతో పాటు రండి’’ అని కోరారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. ఇలా ఎవరితో చూసినా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంతేకానీ నిరుత్సాహపడరు’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ ఏంటో తెలియాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్‌కు రండి’’ అని అనంతిక సనిల్ కుమార్ పేర్కొన్నారు. ‘‘మా మూవీకి వర్క్ చేసిన యంగ్ టీమ్ కోసం ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రణయ్ రెడ్డి వంగా. ఈ వేడుకలో డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్, కెమెరామేన్ పవన్ పప్పుల, కాస్ట్యూమ్ డిజైనర్ కీర్తన, నటుడు వెంకటేష్ కాకుమాను మాట్లాడారు. -
'రోమాంచకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)
-
ఓటీటీలోకి తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగు రివ్యూ
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా మిగతా భాషల్లో ప్రేక్షకులని అలరించిన చిత్రాలు, డబ్బింగ్‌ల రూపంలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా గత వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ 'పరిమిళ అండ్ కో'. జీ5 ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)కథేంటి?మిడిల్ క్లాస్‌కి చెందిన పరిమిళ(జయరాం).. తన భార్య స్వరాజ్యం(ఊర్వశి), కూతుళ్లు పరాశక్తి, మధుమితతో కలిసి ఓ అద్దె ఇంట్లో బతికేస్తుంటాడు. ప్రశాంతంగా ఉన్న వీళ్ల జీవితంలోకి వర్గీస్ (శాండీ మాస్టర్) అనే లోకల్ రౌడీ ఎంట్రీ ఇస్తాడు. పరిమళ చిన్న కూతురు మధుమిత వెంటపడుతూ పెళ్లి చేసుకుంటానని ఇబ్బందిపెడుతుంటాడు. ఈ టార్చర్ భరించలేక అతడిని చంపేస్తే బాగుంటుందని కుటుంబమంతా ఓ రోజు అనుకుంటారు. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు తెల్లారేసరికి వర్గీస్ హత్యకు గురవుతాడు. ఇంతకీ ఇతడిని చంపిందెవరు? పరిమళ కుటుంబానికి ఈ హత్యకు సంబంధముందా? లేదా? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'దృశ్యం' వచ్చిన తర్వాత ఈ తరహా కాన్సెప్ట్‌లతో చాలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా అలాంటి ఓ మూవీనే. కాకపోతే అది సీరియస్, దీన్ని మాత్రం కామెడీగా తీశారు. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోకుండా ఓ హత్య కేసులో ఇరుక్కుంటే ఏమవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఈ చిత్రంలోనూ చూపించారు. ఇక ఎలా ఉందంటే ఓటీటీలో చూస్తున్నప్పుడు అయితే ఓకే ఓకే అనిపించింది.మొదలైన అరగంట పాటు సినిమా చకచకా వెళ్తుంది. తర్వాత హత్య ఎవరు చేశారు? అనే దగ్గర పరిమిళ కుటుంబంలోని ఒక్కొక్కరిపై అనుమానం వచ్చేలా సీన్స్ వస్తుంటాయి. వీళ్లతో పాటు పరిమళ తమ్ముడు, బావమరిదిపై కూడా అనుమానం వస్తుంది. ఒకానొక దశలో ఎవరో చంపారనేది పరిమిళ కుటుంబానికి తెలిసిపోతుంది. కానీ పోలీసులకు మాత్రం అంతుచిక్కదు. మరోవైపు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ఏడుకొండలు అనే సీఐ.. నిందితుడిని కనిపెట్టకుండా ఆలస్యం చేస్తుంటాడు. ఇలా ఎందుకు చేస్తున్నాడనే దానికి చివరలో వివరణ ఇస్తారు.సినిమాలో కామెడీ.. పార్ట్స్ పార్ట్స్‌గానే వర్కౌట్ అయింది. హత్య ఎవరు చేశారనే విషయంలో చాలామందిపై అనుమానం వచ్చేలా సీన్స్ చూపిస్తారు కానీ చివరలో అసలు వర్గీస్‌ని ఎవరు? ఎందుకు చంపారనేది ఊహించని ట్విస్టు రూపంలో బయటపెడతారు. అయితే అది మూవీలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది తప్పితే సహజంగా అనిపించదు. సెకండాఫ్‌లో స్టోరీ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపించడం ఓ మైనస్.నటన విషయానికొస్తే.. పరిమళ, స్వరాజ్యం అనే భార్యభర్తలుగా చేసిన జయరాం, ఊర్వశి తమ అనుభవం చూపించి నవ్వించారు. వీళ్ల కూతుళ్లుగా చేసిన సంజన, అనంతిక కూడా బాగానే చేశారు. పోలీస్ అధికారిగా మిస్కిన్, వర్గీస్ అనే రౌడీగా శాండీ మాస్టర్.. పరిమిళ పెద్ద కూతురి ప్రియుడిగా తెలుగు హీరో సంతోశ్ శోభన్ ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే.టెక్నికల్ అంశాలకొస్తే మ్యూజిక్ గుర్తుంచుకునేంత గొప్పగా ఏం లేదు. సినిమాటోగ్రఫీ కూడా పర్లేదు. దర్శకుడు పాండిరాజ్ ఓ పాయింట్ అనుకున్నారు కానీ దాన్ని తీసే క్రమంలో సాగదీసి వదిలారు. పేరుకే రెండున్న గంటల మూవీ గానీ మూడు గంటల నిడివిలా అనిపిస్తుంది. మీకు బాగా ఖాళీ ఉండి ఏదో టైమ్ పాస్ చేద్దామనుకుంటే ఈ చిత్రం చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలేం లేవు. కుటుంబంతోనూ వీక్షించొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: అనాథకి అద్భుత దీపం దొరికితే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెలుగు సినిమా) -
ప్రేమ.. హాస్యం
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జోడీగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘రోమాంచకం’. ‘ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ’ అనేది ఉపశీర్షిక. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘లవ్, ఫన్ , బ్యూటిఫుల్ ఎమోషన్ ్స ఉన్న ఒక ఫ్రెష్ ఎంటర్టైనర్గా రూ΄÷ందుతోన్న ‘రోమాంచకం’ ప్రేక్షకులను అలరిస్తుంది. త్వరలోనే ఈ సినిమా గురించి ఇతర వివరాలను వెల్లడిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నారు. -
శారీలో మెరిసిపోతున్న పాయల్ రాజ్‌పుత్.. జ్యోతి పూర్వాజ్ హాట్ లుక్స్..!
శారీలో మెరిసిపోతున్న మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్..ఎనిమిది వసంతాలు హీరోయిన్ అనంతిక లేటేస్ట్ పిక్స్..టాలీవుడ్ హీరోయిన్ లయ స్మైలీ లుక్స్..పింక్ శారీలో బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా అందాలు..బుల్లితెర బ్యూటీ జ్యోతి పూర్వాజ్ హాట్ పోజులు.. View this post on Instagram A post shared by @natasastankovic__ View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Laya Gorty (@layagorty) View this post on Instagram A post shared by Parineeti Chopra (@parineetichopra) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by JyotiPoorvaj (Jayashree Rai K K) (@jyotipoorvaj) -
'అనంతిక'కు సందీప్ రెడ్డి గోల్డెన్ ఛాన్స్
మ్యాడ్ సినిమాతో అనంతిక సనీల్ కుమార్ టాలీవుడ్లో పాపులర్ అయింది.. అయితే, 8 వసంతాలు సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఈ మూవీలో ఆమె నటించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది. 19 ఏళ్లకే కరాటే, కళరిపయట్టు, కత్తిసాము వంటి విద్యల్లో నైపుణ్యం పొందిన ఈ కేరళ బ్యూటీకి దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా మరో ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.సందీప్ రెడ్డి సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు అనంతిక సనీల్ కుమార్‌తో ఒక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారట.. అయితే, ఈ చిత్రానికి సందీప్ నిర్మాతగా మాత్రమే ఉండనున్నారు. ఈ సినిమాతో వేణు అనే కొత్త దర్శకుడుని ఆయన పరిచయం చేయనున్నారని సమాచారం. ఈ మూవీ తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక చక్కటి ప్రేమకథగా ఉండనుందని టాక్. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారట. ‘మేం ఫేమస్’ చిత్రంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. -
ఓనం పండుగ సెలబ్రేట్ చేసుకున్న 8 వసంతాలు హీరోయిన్.. (ఫోటోలు)
-
నిహారిక డిఫరెంట్ గెటప్.. ధనశ్రీ గ్లామర్
డిఫరెంట్ లుక్‌లో కనిపించిన నిహారికగ్లామర్తో మాయ చేస్తున్న ధనశ్రీ వర్మక్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీసులో అనంతికఎక్సర్సైజ్ చేస్తూ గ్లామర్‌తో మల్లికా షెరావత్నాభి అందాలతో రచ్చ లేపుతున్న రాశీ సింగ్ముద్దబంతి పూల మార్కెట్లో మానస వారణాసి View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Sapthami Gowda 🧿 (@sapthami_gowda) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Manasa Varanasi (@manasa5varanasi) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) -
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్
గత నెలలో థియేటర్లలో రిలీజైన '8 వసంతాలు' సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జ్యూక్ బాక్స్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. కొందరు విజువల్స్, డైలాగ్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇదే చిత్రంలోని 'అందం అంటే గుణం', 'సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి' ,'ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి', 'ఎవరి తుపానులు వాళ్లకుంటాయి లోపల'.. ఇలా పలు సంభాషణలు అచ్చ తెలుగులో ఉంటూ మనసుని దోచేస్తున్నాయి. ఇలా దాదాపు 12 డైలాగ్స్‌ని ఆడియో రూపంలో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి.'8 వసంతాలు' విషయానికొస్తే.. శుద్ధి అయోధ్య(అనంతిక) మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో గొప్ప రచయిత అవుతుంది. నదిలా ప్రవహిస్తున్న ఈమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. కొన్నాళ్ల తర్వాత తన స్వార్థం చూసుకుని శుద్ధిని నడిరోడ్డున వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె ఏం చేసింది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?) -
ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్‌గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్‌లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని -
ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.కథ ఏంటి..?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. -
'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్‌లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్‌గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్‌కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్‌లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్‌గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
ఇండియా మొత్తం వెతికితే అనంతిక దొరికింది: నిర్మాత రవిశంకర్
‘‘క్లాసికల్ డ్యాన్స్, మార్సల్ ఆర్ట్స్ రెండూ వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది... తనే అనంతిక. ‘8 వసంతాలు’ సినిమా కోసం తను చాలా కష్టపడింది’’ అని నిర్మాత వై. రవిశంకర్ తెలిపారు. అనంతికా సనీల్‌కుమార్ లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల ప్రయాణమే ‘8 వసంతాలు’. ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్. విజువల్‌గా అదిరిపోయింది. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘చాలా వైవిధ్యమైన చిత్రమిది. ఈ సినిమా కోసం పని చేసిన కొత్తవాళ్లందరి కోసమైనా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అని తెలిపారు. ‘‘నవీన్‌గారు, రవిగారు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాదు... మంచి సినిమానా? కాదా? అనేది చూస్తారు. మా ‘8 వసంతాలు’ మంచి చిత్రం’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘శుద్ధి అయోధ్య లాంటి బలమైన పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అనంతిక చె΄్పారు. -
8 వసంతాల హీరోయిన్.. 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ఏంది బ్రో!
అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అనంతిక టాలెంట్‌ను నెటిజన్స్ షాకవుతున్నారు. కేవలం 19 ఏళ్లకే ఇంత ప్రతిభ ఎలా సాధించారంటూ చర్చించుకుంటున్నారు. అనంతిక కేవలం నటన మాత్రమే కాదు.. ఆమెలో మల్టీ టాలెంటెడ్ అని వేదికపైనే నిరూపించుకుంది. అనంతిక క్లాసికల్ డ్యాన్సర్‌తో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్, కలరిపయట్టు విద్యలో నైపుణ్యం, కత్తిసాము, చెండా వాయించడం(పెర్కషన్) లాంటి విద్యల్లో నైపుణ్యాలు సాధించింది. అంటే ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా ఇన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయా? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా ఈవెంట్లో అనంతికి చేసిన స్టంట్స్ చూస్తే ఆమె టాలెంట్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు కాగా.. తన టాలెంట్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేరళకు చెందిన అనంతిక లా విద్యార్థిని కూడా. కాగా.. ఈ చిత్రంలో అనంతిక సనీల్కుమార్తో పాటు రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.Ananthika Sanilkumar, a 19-year-old from Kerala, is a trained classical dancer, black belt in karate, and skilled in Kalaripayattu, sword fighting, and Chenda. She’s also a law student balancing her diverse talents. 🫡#AnanthikaSanilkumar #8Vasantalu #mythrimoviemakers pic.twitter.com/5K3WkEdQV1— cinemala baba (@Cinemalababa) June 17, 2025 -
టాలీవుడ్లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
సాధారణంగా హీరోయిన్లు అనగానే చాలామందికి ఓ అభిప్రాయం ఉంటుంది. గ్లామర్ చూపించో లేదంటే యాక్టింగ్ చేసో ఛాన్సులు కొట్టేస్తుంటారు అని అనుకుంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రం మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఒకరిలోనే చాలా టాలెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే 'మ్యాడ్'లో ఓ హీరోయిన్గా చేసిన అనంతిక అనే అమ్మాయి కోసం.రీసెంట్‌గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె పూర్తి పేరు అనంతిక సనీల్ కుమార్. 19 ఏళ్ల ఈ కేరళ కుట్టి.. 2015 నుంచి సినిమాలు చేస్తోంది. తొలుత మిలీ, లాల్ సలామ్, రైడ్ అనే తమిళ సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసి హిట్ కొట్టిన తర్వాత దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మరో తెలుగు మూవీలో లీడ్ రోల్ అవకాశమొచ్చింది. కాకపోతే ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితేనేం తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసిన '8 వసంతాలు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')జూన్ 20న '8 వసంతాలు' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతిక తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఇన్ని రోజులు ఈమె ప్రతిభావంతురాలు అనే టాక్ ఉంది గానీ ఇప్పుడు దాన్ని రియాలిటీలో చూపించింది. దీంతో ఈమె గురించి ఇప్పుడు టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం లా(న్యాయవాది) కోర్స్ చేస్తున్న అనంతిక.. క్లాసికల్ డ్సాన్స్ చేస్తుంది. కరాటేలో ఈమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా వచ్చు. కత్తి ఫైటింగ్‌లోనూ ఈమె సిద్ధహస్తురాలే. అలానే కేరళ సంప్రదాయంలో ఒకటైన చెండా (డ్రమ్స్) కూడా బాగానే వాయిస్తుంది. ఇలా అనంతిక ఇన్నింట్లో ప్రతిభావంతురాలు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 19 ఏళ్లకే ఇలా ఉందంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని నేర్చుకుంటుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)#AnanthikaSanilkumar:• A trained classical dancer 💃• Black belt in Karate 🥋• Skilled in Kalaripayattu 🥷• Skilled in sword fighting 🗡️• Plays the Chenda (percussion) 🥁• An actor 👩🎤• A law student 👩🎓And she’s just 19 years old! 🫡 pic.twitter.com/crowkzdA6X— Movies4u Official (@Movies4u_Officl) June 17, 2025 -
‘8 వసంతాలు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
' ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు'.. ఆసక్తిగా 8 వసంతాలు ట్రైలర్
అనంతిక సానిల్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం '8 వసంతాలు'. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే ఒక అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'చూడమ్మా ఆడవాళ్లు నిప్పు పట్టకూడదు.. కర్మకాండలు, అంత్యక్రియలకు వాళ్లు పనికిరారు' అనే డైలాగ్‌తోనే ఈ సినిమా ట్రైలర్ మొదలైంది. ఈ చిత్రంలో రవితేజ దుగ్గిరాల, హనురెడ్డి, కన్న పసునూరి కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.8 years of a woman's joy, tears and lessons. Witness her journey on the big screens ✨#8VasantaluTrailer out now ❤🔥▶️ https://t.co/pafCjIEa2D#8Vasantalu grand release worldwide on June 20th.Directed by #PhanindraNarsettiProduced by @MythriOfficialStarring… pic.twitter.com/8C5x3Noi8V— Mythri Movie Makers (@MythriOfficial) June 15, 2025 -
ఇంటిమేట్ సీన్స్ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ నటి అనంతిక. మ్యాడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటి.. తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనంతిక.. సినిమాల్లోని ఇంటిమేట్ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తను కూడా రెడీ అని చెప్పింది. ‘ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపిస్తుంది. అలా అని నేను అలాంటి పాత్రను చేయనని చెప్పట్లేదు. నిజంగా కథ డిమాండ్ చేస్తే.. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. అయితే అప్పుడు కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది’ అని చెప్పింది.ఇక తన లక్ష్యాలను గురించి చెబుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తే లేదని చెప్పింది. ‘చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. దాంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వన్ని సినిమాల్లోకి రావాలని నేర్చుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో ఓ మలయాళ సినిమాలోకి డ్యాన్సర్‌గా వెళ్లాను. అక్కడ డీఓపీ నన్ను చూసి హీరోయిన్గా ట్రై చెయ్యొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచే సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశా. మంచి సందేశం ఇచ్చే చిత్రాలను చేయాలనుకున్నాను. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అయితే నటిగా కొనసాగాలని నాకు లేదు. కొన్నేళ్ల తర్వాత అయినా నేను రాజకీయాల్లో వెళ్తా. దాని కోసమే నేను ‘లా’ చదువుతున్నాను. 35-40 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్తా’ అని అనంతిక చెప్పుకొచ్చింది. -
ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్ విడుదల
అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్‌ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది. -
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) కొత్త సినిమా '8 వసంతాలు.' మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. మొదటి విడుదలైన గ్లింప్స్‌లో అద్భుతమైన లొకేషన్స్‌తో పాటు హీరోయిన్ ఎలివేషన్‌తో చూపిస్తే.. ఇప్పుడు టీజర్లో మంచి కంటెంట్ ఉన్న లైన్‌తో ఎమోషనల్‌గా చూపించారు ఈ చిత్రాన్ని ఫణింద్ర(Phanindra Narsetti) తెరకెక్కిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్)'8 వసంతాలు'(8 Vasantalu) చిత్రం మార్షల్ ఆర్ట్స్ ప్రధానంశంగా ఉండనుంది. అమ్మాయిలు ఈ పోటీకి పనికిరారు అనే వివక్షను తొలగించే బలమైన పాత్రలో అనంతిక నటించింది. టీజర్‌తోనే సినిమాపై మంచి అంచనాలను చిత్ర యూనిట్ కల్పించింది. మ్యాడ్ మూవీలో జెన్నీ పాత్రలో అనంతిక సనీల్‌కుమార్ అదరగొట్టింది. ఇప్పుడు ఆమె మ్యాడ్ సిక్వెల్లో కూడా నటిస్తుంది. ఈ మూవీతో ఆమె చాలామంది యూత్‌కు క్రష్‌గా మారిపోయింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ చిత్ర పరిశ్రమకు రాకముందిఅనంతిక సనీల్‌కుమార్ ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్. కేరళకు చెందిన ఈ ముద్దుగుమ్మ వివిధ రకాల కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు షేర్ చేస్తుండేది. అలా గుర్తింపు రావడంతో తెలుగులో మొదట రోజ్ మిల్క్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, మ్యాడ్ సినిమాతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. అనంతికకు కర్రసాముతో పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంది. ఆమెకు క్లాసికల్ డ్యాన్స్ కూడా వచ్చు. -
టాలీవుడ్ బ్యూటీ.. చీరలో టీనేజీ కేరళ కుట్టి అనంతిక (ఫొటోలు)


