ఇంటిమేట్‌ సీన్స్‌ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్‌ | Ananthika Sanilkumar Interesting Comments On Her Career, Goals | Sakshi
Sakshi News home page

ఇంటిమేట్‌ సీన్స్‌ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్‌

Jun 14 2025 2:07 PM | Updated on Jun 14 2025 3:04 PM

Ananthika Sanilkumar Interesting Comments On Her Career, Goals

ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ నటి అనంతిక. మ్యాడ్‌ చిత్రం ద్వారా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్‌ నటి.. తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనంతిక.. సినిమాల్లోని ఇంటిమేట్‌ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కథ డిమాండ్‌ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తను కూడా రెడీ అని చెప్పింది. 

‘ఇప్పటి వరకు ఇంటిమేట్‌ సీన్స్‌ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపిస్తుంది. అలా అని నేను అలాంటి పాత్రను చేయనని చెప్పట్లేదు. నిజంగా కథ డిమాండ్‌ చేస్తే.. ఇంటిమేట్‌ సీన్స్‌ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. అయితే అప్పుడు కూడా కొంత లిమిటేషన్‌ ఉంటుంది’ అని చెప్పింది.

ఇక తన లక్ష్యాలను గురించి చెబుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తే లేదని చెప్పింది. ‘చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్‌ నేర్చుకున్నాను. దాంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వన్ని సినిమాల్లోకి రావాలని నేర్చుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కోవిడ్‌ టైంలో ఖాలీగా ఉండడంతో ఓ మలయాళ సినిమాలోకి డ్యాన్సర్‌గా వెళ్లాను. అక్కడ డీఓపీ నన్ను చూసి హీరోయిన్‌గా ట్రై చెయ్యొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. 

అప్పటి నుంచే సినిమాలకు ఆడిషన్స్‌ ఇవ్వడం స్టార్ట్‌ చేశా. మంచి సందేశం ఇచ్చే చిత్రాలను చేయాలనుకున్నాను. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అయితే నటిగా కొనసాగాలని నాకు లేదు. కొన్నేళ్ల తర్వాత అయినా నేను రాజకీయాల్లో వెళ్తా. దాని కోసమే నేను ‘లా’ చదువుతున్నాను. 35-40 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్తా’ అని అనంతిక చెప్పుకొచ్చింది. 

Advertisement
 
Advertisement
Advertisement