breaking news
8 Vasantalu Movie
-
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. డైలాగ్స్ ఆడియో రిలీజ్
గత నెలలో థియేటర్లలో రిలీజైన '8 వసంతాలు' సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జ్యూక్ బాక్స్ వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. కొందరు విజువల్స్, డైలాగ్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇదే చిత్రంలోని 'అందం అంటే గుణం', 'సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి' ,'ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి', 'ఎవరి తుపానులు వాళ్లకుంటాయి లోపల'.. ఇలా పలు సంభాషణలు అచ్చ తెలుగులో ఉంటూ మనసుని దోచేస్తున్నాయి. ఇలా దాదాపు 12 డైలాగ్స్‌ని ఆడియో రూపంలో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి.'8 వసంతాలు' విషయానికొస్తే.. శుద్ధి అయోధ్య(అనంతిక) మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో గొప్ప రచయిత అవుతుంది. నదిలా ప్రవహిస్తున్న ఈమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. కొన్నాళ్ల తర్వాత తన స్వార్థం చూసుకుని శుద్ధిని నడిరోడ్డున వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె ఏం చేసింది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: వరలక్ష్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?) -
ఓటీటీలో 8 వసంతాలు.. థియేటర్లో ఇప్పటికీ ఉందంటే.. అదే కారణం: దర్శకుడు
ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రేమకథ చిత్రం '8 వసంతాలు'. గత నెలలో జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ సందడి చేస్తోంది. అయితే థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాని ఈ సినిమా మాత్రం ఓటీటీలో అదరగొడుతోంది. పలువురు ఓటీటీ సినీ ప్రియులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇదిలా ఉండగా.. 8 వసంతాల డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి ఇటీవలే ఎనిమిది వసంతాల మూవీ స్క్రిప్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఓటీటీలో వస్తున్న రెస్పాన్స్ చూసి కొందరు థియేటర్లలో ఈ సినిమాను మిస్సయ్యామని చాలామంది తనకు మేసేజ్‌లు చేస్తున్నారని దర్శకుడు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అయితే అందుకు చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. జూలై 11న ఓటీటీకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 8 వసంతాలు కూకట్‌పల్లిలోని పీవీఆర్ నెక్సస్ మాల్ థియేటర్లో అందుబాటులో ఉందని తెలిపారు. ఎవరైనా థియేటర్లో మిస్సయితే వెళ్లి చూడాలంటూ సలహా ఇచ్చారు.(ఇది చదవండి: ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్)అయితే ఇంటర్వ్యూల్లో నన్ను ఎవరైనా పొగిడినా, మా సినిమాకు మద్దతుగా మాట్లాడినా కొందరు నేను డబ్బులిచ్చారని అంటున్నారు. నెగెటివ్పై పెట్టిన శ్రద్ధ.. పాజిటివ్ వైపు పెడితే.. మీ జీవితంతో పాటు ప్రపంచం కూడా బాగుంటుందని దర్శకుడు అన్నారు. ఒక థియేటర్ ఓనర్ ఎవరో డబ్బులు ఇచ్చారని సినిమాను ఆడించడు.. అతనికి డబ్బులు వస్తున్నాయి కాబట్టే సినిమాను ఆడిస్తాడని తన పోస్ట్‌లో ప్రస్తావించారు. థియేటర్లే దొరకడం కష్టమైన ఈ రోజుల్లో పెద్ద సినిమాలు ఉన్నా.. నెగెటివిటీ ఉన్నా.. అన్నింటిని దాటుకుని మా సినిమా థియేటర్లో 27 రోజులు పూర్తి చేసుకుందంటే అందులో ఉన్న విషయం.. అది చేయగలుతున్న ఒంటరి పోరాటం.. మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ఫణీంద్ర నర్సెట్టి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. -
ఈ కళ అమ్మ కల
‘అమ్మాయే కదా ఏం చేస్తుందిలే... టచ్ చేసేద్దాం’ అనుకుంటే అనంతికా సనీల్‌కుమార్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆత్మవిశ్వాసానికి కేరాఫ్ అనంతిక’ అనొచ్చు. మనల్ని మనం రక్షించుకునే కళ తెలియాలంటోంది ఈ టీనేజ్ బ్యూటీ. అందుకే అనంతికా సనీల్‌కుమార్ ‘మార్షల్ ఆర్ట్స్’ నేర్చుకుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్, కేరళ ప్రాచీన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు నేర్చుకుంది. కథకళి, భరతనాట్యం, మోహినియాట్టమ్, కూచిపుడి కూడా నేర్చుకుంది. మరోవైపు సినిమాలంటే ఇష్టంతో హీరోయిన్గా కొనసాగుతోంది. ‘మ్యాడ్’, ఇంకా ఆ మధ్య విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రాలతో నటిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక అనంతికా సనీల్‌కుమార్ ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు...నా ఫ్యామిలీ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నప్పుడల్లా ‘ఓకే’ అనే సమాధానమే వచ్చింది. ఇక డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు క్లాసికల్ మాత్రమే కాదు... హిప్ హాప్ నేర్చుకోవాలన్నా అదే రియాక్షన్. అంత సపోర్టివ్. మా అమ్మ తన కలని నాలో చూసుకున్నారు. ఇప్పుడు నేను నేర్చుకున్నట్లుగా చిన్నప్పుడు ఆమె మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనుకున్నారు. అయితే అప్పుడు ఆమె పేరెంట్స్‌కి అంత స్థోమత లేకపోవడంతో రాజీ పడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కోరుకున్నట్లుగా అన్నీ నేర్చుకునే పరిస్థితి ఉంది. అన్నీ నేర్పించి, మా అమ్మ నాలో తనని చూసుకుంటున్నారు. యాక్చువల్‌గా ఫోర్త్ స్టాండర్డ్ వరకూ నేను టాపర్‌ని. ఆ తర్వాత ఆడుకోవడం, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ పట్ల ఇంట్రెస్ట్‌తో స్టడీస్ వైజ్ కొంచెం వీక్ అయ్యాను. ఎయిత్ స్టాండర్డ్ వరకూ ఇలానే. ఆ తర్వాత మళ్లీ గుడ్ స్టూడెంట్ అయ్యాను.క్రమశిక్షణకు కళకళ ఏదైనా సరే క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది. అసలు ఆర్టిస్ట్ (యాక్టింగ్) అంటేనే క్రమశిక్షణ ఉండాలి. మార్షల్ ఆర్ట్స్ వల్ల నా ఆలోచనా విధానం మారింది. ఏదైనా విషయం గురించి నిదానంగా ఆలోచించి, నిర్ణయాలు తీసుకుంటున్నాను. మార్షల్ ఆర్ట్స్ అంటే శరీరాన్ని మాత్రమే కాదు... మనసుని కూడా క్రమ పద్ధతిలో పెడుతుంది. అలాగే మార్షల్ ఆర్ట్స్ అంటే మీద పడి కొట్టడం కాదు... మనల్ని మనం రక్షించుకోవడం. ఈ ఆర్ట్ నేర్చుకున్న ఎవరైనా సరే ముందు చాలావరకు నియంత్రించడానికే ప్రయత్నిస్తారు... అయితే లిమిట్ దాటితే అప్పుడు కొడతాం.బ్యాడ్ టచ్... టీచ్ హిమ్నా చిన్నప్పుడు ఒక అబ్బాయితో చాలా గట్టిగా గొడవ జరిగింది. ఆ అబ్బాయి నన్ను ఏమీ అనలేదు. తను నా ఫ్రెండ్. పిల్లల గొడవలుంటాయి కదా... అలాంటిది. నేను తిరగబడి బాగా కొట్టాను. నన్ను కూడా బాగా కొట్టాడు (నవ్వుతూ). కిడ్స్ ఫైట్ అన్నమాట. ఆ తర్వాత నా టీనేజ్‌లో నేను నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక అబ్బాయి ‘బ్యాడ్ టచ్’ చేశాడు. అమ్మాయే కదా ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనదనే ధైర్యం వారికి ఉంటుంది. నేను అతన్ని నా మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్‌తో లాక్ చేశాను. బ్యాడ్ టచ్ చేస్తే టీచ్ చేయాల్సిందే. అమ్మాయిలు ఇలా చేస్తే ఓ ఎవేర్నెస్ వస్తుంది. అమ్మాయిలకు కూడా అన్నీ తెలుస్తున్నాయి... తిరగబడతారనే ఫీలింగ్ సొసైటీలో క్రియేట్ చేయగలిగితే దాడులు తగ్గుతాయని నా ఫీలింగ్.సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యంనాకు గాయాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే గాయాలు తగిలిన ప్రతిసారీ ‘మనం ఏదో చేస్తున్నాం’ అనే ఫీలింగ్ నాకు ఆనందాన్నిస్తుంటుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే క్రమంలో చాలాసార్లు తగిలాయి. ఇక కలరి అయినా, కరాటే అయినా ఏదైనా ఫస్ట్, సెకండ్ స్టేజ్ చాలా స్లోగా ఉంటుంది. త్వరగా నేర్చేసుకోవాలనే ఉత్సాహం ఉంటుంది కదా... అందుకని బోర్ ఫీలవుతాం. కొంతమంది అమ్మాయిలైతే ఒకటీ రెండు క్లాసులకు వచ్చి, మా వల్ల కాదని వెళ్లిపోయారు. కానీ నిదానం అవసరం. అయితే ఆ ఫస్ట్ స్టెప్ మనం ఓపికగా ఉంటే మన లాస్ట్ స్టెప్ బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కొందరైతే ఈ కష్టం మావల్ల కాదనుకున్నారు. కానీ, కొన్నేళ్లు కష్టపడి నేర్చుకున్న ఆర్ట్ మన జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... అమ్మాయిలు ఎవరి మీదా ఆధారపడకపోవడం అనేది ‘ఆర్థిక స్వాతంత్య్రం’ విషయంలో మాత్రమే కాదు... మన మీద జరిగే దాడుల విషయంలోనూ డిపెండ్ కాకూడదు. ‘సెల్ఫ్ డిఫెన్స్’ చాలా ఇంపార్టెంట్.రెస్ట్ నచ్చదునాకు ‘బ్లాక్ ఫ్లిప్’ అంటే ఇష్టం. ఒకసారి అది చేస్తున్నప్పుడు వెన్నెముకకి గాయం అయింది. అప్పుడు నేను ‘ప్లస్ వన్’ చదువుకుంటున్నాను. నా స్పైన్ బెండ్ అయింది. ఫలితంగా ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలనుకునేవారికి రెస్ట్ అంటే అస్సలు నచ్చదు. విశ్రాంతి ఏడాది పూర్తి కావొస్తున్న సమయంలో ‘8 వసంతాలు’ సినిమాకి అవకాశం వచ్చింది. ఎక్కువసేపు నిలబడినా, కూర్చున్నా బ్యాక్ పెయిన్ ఉంటుంది. అయినా ఆ సినిమా ఒప్పుకుని, చేశాను. ఇప్పటికీ కంటిన్యూస్‌గా నిలబడితే నొప్పిగానే ఉంటుంది. అది ఎప్పటికీ ఉన్నా పట్టించుకోకుండా పని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను (నవ్వుతూ).రియాక్ట్ అయ్యే బలంమార్షల్ ఆర్ట్స్ అంటే... ఒంటి చేత్తో రాళ్లని పగలగొట్టడం కాదు. మనల్ని మనం కాపాడుకోవడానికి వేళ్లు, గోళ్లు, చేతులు, కాళ్లు ఎలా ఉపయోగించుకోవాలో తెలిపేది... మన ఆత్మవిశ్వాసం పెంచే కళ. మనకు ఏం జరిగినా వేరేవాళ్ల మీద ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. అబ్బాయిలు శారీరకంగా బలంగా ఉంటారు కాబట్టి వాళ్లైతే ఈ ఆర్ట్ నేర్చుకోవచ్చని చాలామంది అనుకుంటారు. అయితే ఫిజికల్‌గా వీక్‌గా ఉన్నవాళ్లు నేర్చుకోవాలంటా. అమ్మాయిగా నాకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువే. కానీ ఇవి నేర్చుకోవడం వల్ల రియాక్ట్ అవ్వాల్సిన టైమ్‌లో రియాక్ట్ అయ్యేంత బలం దానంతట అది వచ్చేస్తుంది. డిఫెండ్ చేసుకోవడం మనకు తెలుసు అని లోపల ఉన్న ఆత్మవిశ్వాసం మనల్ని ఎదురు తిరిగేలా చేస్తుంది.సైలెంట్‌గా ఉండొద్దుఅమ్మాయిలకు స్వీయ రక్షణ తెలియాలి. ఆ మాటకొస్తే ఇప్పుడు అబ్బాయిలకూ కొన్ని ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. సో... ఎవరైనా సరే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసినవాళ్లల్లో అబ్బాయిలకు కూడా సమస్యలు వచ్చాయి. ఇక అమ్మాయిలకు ఎందుకు మరీ ముఖ్యం అంటే... వాళ్లకి ఎక్కువగా వేధింపులు ఎదురవుతుంటాయి. హఠాత్తుగా ఎవరైనా వచ్చి, తాకకూడని చోట తాకారనుకోండి ‘మనకి సెల్ఫ్ డిఫెన్స్ తెలిసి ఉంటే బాగుండేది’ అని అప్పుడు అనుకుంటాం. అది ప్రయోజనం లేదు. అదే ముందే నేర్చు కుంటే... ఆ టైమ్‌లో సైలెంట్‌గా ఉండకుండా బుద్ధి చెప్పగలుగుతాం.పాలిటిక్స్‌లోకి...నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. ఎందుకంటే జనాల్లో ఉండటం ఇష్టం. వారికి ఏదైనా సహాయం చేయాలని ఉంది.ప్రాపర్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు అవగాహన పెంచుకోవాలనుకుంటున్నాను. చట్టం గురించి తెలుసుకోవడం ముఖ్యం. అందుకే ‘లా’ చదువుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. భవిష్యత్తులో అమ్మాయిల కోసం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని ఉంది. కానీ దీనికి ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. కొంచెం టైమ్ పడుతుంది.– కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ మాత్రమే సాధించాను. వన్ నుంచి టెన్ వరకూ ఉన్నాయి. థర్డ్ కూడా సాధించాలని ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాను కాబట్టి టైమ్ దొరకడంలేదు. పదో స్టేజ్ వరకూ వెళ్లడానికి చాలా టైమ్ పడుతుంది. ఇక సినిమాల్లో నాకు పూర్తి స్థాయి మార్షల్ ఆర్ట్స్ చేసే పాత్ర వస్తే హ్యాపీగా చేసేస్తాను.– డి.జి. భవాని -
ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.కథ ఏంటి..?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ. -
సూర్య, దీపికా పదుకొణెలతో 8 వసంతాలు..: డైరెక్టర్
8 వసంతాలు (8 Vasantalu Movie).. ఇది ప్రేమ కథ కాదు, ప్రేమ కావ్యమని చెప్పొచ్చు. ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి దుగ్గిరాల, హనురెడ్డి, అనంతిక సనిల్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించారు. కవిత్వం, భావుకత పుష్కలంగా ఉన్న ఈ సినిమా చాలామందికి నచ్చేసింది. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు మొదట స్టార్ హీరోహీరోయిన్లను అనుకున్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సూర్య, దీపికతో..ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ.. 8 వసంతాలు మూవీ పెద్దవాళ్లతో చేద్దామనుకున్నాను. సూర్య, దీపికా పదుకొణెను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాను. అందుకే డైలాగులు అంత బలంగా ఉంటాయి. మైత్రీ మూవీ మేకర్స్ దగ్గరకు కథ తీసుకెళ్లినప్పుడు కొత్తవాళ్లతో అయితే ఇంకా బాగుండొచ్చు అన్నారు. పెద్దవాళ్లతో అంటే ఇబ్బందులు ఎదురవొచ్చేమో, కథ ఎక్కడైనా పాడవుతుందేమో.. ఒక్కసారి ఆలోచించు అన్నారు. అప్పుడు నేను ఆలోచించి కొత్తవాళ్లతో ముందుకు వెళ్లాను అని చెప్పుకొచ్చారు.చదవండి: సిగ్గు లేని మనిషి.. వెబ్ సిరీస్ కోసం కాంప్రమైజ్ అడిగాడు: నటి -
8 వసంతాలు సీన్స్‌పై తీవ్ర అభ్యంతరం.. స్పందించిన దర్శకుడు!
ఇటీవల విడుదలైన లేడీ ఓరియంటెడ్ చిత్రం 8 వసంతాలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ ప్రేమకథా చిత్రానికి ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి థియేటర్లలో ఆదరణ రావడంతో మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఈ మూవీలో రెండు సీన్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్రమైన కాశీలో ఫైట్ సీక్వెన్స్, రేప్ సీక్వెన్స్ తీయడానికి కబేళా కావాల్సి వచ్చిందా అని డైరెక్టర్‌ను ప్రశ్నించారు. అయితే ఈ సమావేశానికి దర్శకుడు హాజరు కాలేదు.ఈ ప్రశ్నకు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. బ్రాహ్మణ వర్గం పట్ల తనకు అమితమైన గౌరవముందని తెలిపారు. సనాతన ధర్మానికి, వేదాధ్యాయనానికి వారు అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉన్నారని.. వారి నాలుకపైనే సరస్వతి కొలువై ఉంటుందని దర్శకుడు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కేవలం ఒక వర్గంపైనే ముద్రవేస్తూ అత్యాచారం గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకు అర్థం కావడం లేదన్నారు.ఫణీంద్ర తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేరం చేసేవాళ్లు వారి విచక్షణా స్వభావంతోనే చేస్తారు.. కానీ వారి కులం, మతం ఆధారంగా చేయరు.. సామాజిక హోదాకు భిన్నంగా ప్రజలు ఉంటారని నేను చూపించే ప్రయత్నం చేశా. కేవలం ఒక వర్గాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేయలేదు. కబేళా అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ఎక్కడైనా ఉండొచ్చు. అందుకు తగినట్లుగానే పాత్రలను ఎంపిక చేసుకున్నా. మీరు ఇదే విషయంలో కులాన్ని తీసుకురావాలనుకుంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. రావణుడు ఎవరు? ఆయన ఒక బ్రాహ్మణుడి కుమారుడు. గొప్ప శివభక్తుడు. నుదుటిపై విభూతి , మెడలో రుద్రాక్షలు ధరిస్తాడు. ఆయనలో మారింది ఏంటి? ఉన్నత వర్గం నుంచి వచ్చి వేదాలు, పురాణ గ్రంథాలను చదివి చివరకు ఏం చేశాడు? మనిషి తన ప్రవర్తన, ఆలోచనా ధోరణి బట్టే నేరం చేస్తాడు. అంతేకానీ, అతని మతం, కులం అందుకు కారణం కాదు. అది మానవ నైజం. యద్భావం తద్భవతి. మీరు ఏం చూస్తారో అదే కనపడుతుంది. మీ దృష్టి కోణాన్ని మార్చుకోండి. దయ చేసి అనవసర విషయాలను ఈ సినిమాలో కలపకండి. వేదికపై పంతులు అనకుండా ఉండాల్సింది. మీరు దాన్ని సరిచేయటంలో తప్పులేదు. దాన్ని అక్కడితో వదిలేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే అది మా టీమ్ ఉద్దేశం కాదు. ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. -
ఓటీటీలో చూడండి.. స్టేజీపై నోరు జారి.. అంతలోనే సారీ!
ఎంత పెద్ద సినిమా అయినా సరే.. కథలో దమ్ముంటేనే జనాలు థియేటర్‌కు వస్తున్నారు. ఏమాత్రం నచ్చకపోయినా మాకు అక్కర్లేదు అంటూ ఆ దిక్కు కూడా చూడటం లేదు. ఇండియన్ 2, థగ్ లైఫ్ ఫెయిల్యూర్స్ అందుకు పెద్ద ఉదాహరణ.. ఇకపోతే లేటెస్ట్గా కుబేర, 8 వసంతాలు (8 Vasantalu Movie) చిత్రాలు రిలీజయ్యాయి. కుబేర బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. అటు 8 వసంతాలు మూవీకి కూడా కాస్త పాజిటివ్ టాక్ లభించినప్పటికీ కుబేర ముందు తేలిపోయింది.ఓటీటీలో బాగుంటుందిఇలాంటి సమయంలో ప్రేక్షకుల్ని తమ సినిమా వైపు ఎలా తిప్పుకోవాలా? అని చిత్రయూనిట్ ఆలోచించాలి! కానీ దర్శకుడు ఫణీంద్ర సక్సెస్ మీట్‌కు డుమ్మా కొట్టాడు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి మాత్రం ఎంచక్కా ఓటీటీలో చూసేయమని చెప్తున్నాడు. సక్సెస్ మీట్లో విశ్వనాథ్ మాట్లాడుతూ.. ఇది త్వరలోనే ఓటీటీలోకి వస్తుంది. అది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ కంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉండబోతుంది. ఇమేజ్ క్వాలిటీ ఇంకా మెరుగ్గా ఉంటుంది అంటూ తమ సినిమాను ఓటీటీలో చూడమని చెప్పకనే చెప్పాడు. అక్కడున్నవాళ్లు మధ్యలో కలుగజేసుకోవడంతో స్టేజీపైనే సారీ చెప్పాడు.సినిమా8 వసంతాలు చిత్రంలో మ్యాడ్ ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ కథానాయికగా నటించింది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, సమీరా కిశోర్, కన్నా పసునూరి కీలక పాత్రలు పోషించారు. జూన్ 20న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “#8Vasantalu Theatre లో Experience కంటే Netflix లో Experience బాగుంటుంది.”- Cinematographer Vishwanath pic.twitter.com/5LyQOphewO— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025చదవండి: థగ్ లైఫ్ డిజాస్టర్.. క్షమాపణలు మాత్రమే చెప్పగలను.. మణిరత్నం -
కొత్త సినిమాలు.. వచ్చేది ఆ ఓటీటీల్లోనే
ఈ వారం ఓటీటీల్లో దాదాపు 24 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. మరోవైపు థియేటర్లలోనూ మూడు కొత్త మూవీస్ వచ్చేశాయి. వీటిలో 'కుబేర'కి పాజిటివ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. బిచ్చగాడిగా ధనుష్ యాక్టింగ్ ఇరగదీశాడని అంటున్నారు. నాగార్జున, రష్మిక కూడా ఆకట్టుకున్నారని రివ్యూస్ వస్తున్నాయి. అయితే ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూసేవాళ్లు చూస్తారు. అలానే ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేవాళ్లు కూడా ఉంటారు.'కుబేర' ఓటీటీ డీల్ విషయానికొస్తే.. రిలీజ్‌కి ముందు డిజిటల్ హక్కులు అమ్మేశారు. లెక్క ప్రకారం నిర్మాతలు.. జూలైలో వద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ సంస్థ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ చేయాలని చెప్పాడు. దీంతో నిర్మాతలు తలొగ్గారు. అయితే ఓటీటీ ఒప్పందం మాత్రం నాలుగు వారాలకే చేసుకున్నట్లు తెలుస్తుంది. అంటే జూలై 3వ వారంలో అలా స్ట్రీమింగ్ కావొచ్చేమో?(ఇదీ చదవండి: Kuberaa Review: ‘కుబేర’ మూవీ రివ్యూ)'8 వసంతాలు' విషయానికొస్తే.. ఓ చక్కటి ప్రేమకథా చిత్రం. బాగుందనే టాక్ వస్తుంది. అదే టైంలో స్టోరీ చాలా నెమ్మదిగా సాగేలా ఉందని అంటున్నారు. హీరోయిన్గా అనంతిక యాక్టింగ్ ఇచ్చిపడేసిందని రివ్యూలు వచ్చాయి. కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా చూద్దామనుకుంటే దీన్ని ప్రయత్నించొచ్చు. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో సినిమాలన్నీ నాలుగు వారాలకే వచ్చేస్తున్నాయి. ఇది కూడా అలానే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి.ఈ రెండింటితో పాటు హిందీ సినిమా ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' కూడా థియేటర్లలో రిలీజైంది. దీని బుకింగ్స్ చాలా డల్‌గా ఉన్నాయి. పాజిటివ్ టాక్ అయితే వచ్చింది గానీ బాక్సాఫీస్ దగ్గర ఎంతమేర నిలబడుతుందో చూడాలి? ఎందుకంటే ఆమిర్ గత చిత్రాలు దారుణంగా ఫెయిలయ్యాయి. అలానే ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని ఏ ఓటీటీ సంస్థకు కూడా అమ్మలేదు. 8 వారాల తర్వాత యూట్యూబ్‌లో పే పర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్.(ఇదీ చదవండి: '8 వసంతాలు' సినిమా రివ్యూ) -
'8 వసంతాలు' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రేమకథలకు కొదవలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలా వచ్చిన చిత్రం '8 వసంతాలు'. గతంలో 'మధురం' అనే షార్ట్ ఫిల్మ్‌తో ఆకట్టుకున్న దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనంతిక సనీల్ కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రేమకథా సినిమా అనగానే.. హా ఏముంది అబ్బాయి-అమ్మాయి ప్రేమించుకుంటారు. కుదిరితే ఒక్కటవుతారు లేదంటే విడిపోతారు. ఇందులో పెద్ద చెప్పుకోవడానికి ఏముందిలే అనుకుంటాం. కానీ ప్రేమకథని ఎంత అందంగా, ఎంత హృద్యంగా చెప్పొచ్చో కొందరు దర్శకులు నిరూపించారు. అలా 'అందాల రాక్షసి', 'సీతారామం' లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వాటితో సరిసమానంగా నిలిచే చిత్రం ఈ '8 వసంతాలు'.సినిమా టైటిల్స్ పడుతున్న టైంలోనే మొత్తం కథని రివర్స్‌లో చూపించేస్తారు. అలా ఊటీలో ఓ కరాటే ఇన్స్టిట్యూట్లో కథ మొదలవుతుంది. తనని ఓడిస్తే ఐపాడ్ గిఫ్ట్‌గా ఇస్తానని హీరో వరుణ్ ఛాలెంజ్ చేస్తాడు. అక్కడున్న వాళ్లందరూ అతడి చేతిలో ఓడిపోతారు. కానీ శుద్ధి అతడిని ఓడిస్తుంది. అహాన్ని నేలకు దించుతుంది. ఆ క్షణం వరుణ్.. శుద్ధితో ప్రేమలో పడిపోతాడు. తర్వాత ఆమె వెంటపడటం, ప్రేమలో పడేసేందుకు చేసే ప్రయత్నాలు ఆహ్లాదంగా ఉంటాయి. అంతా సవ్యంగానే ఉంది కదా అనుకునే టైంలో వరుణ్ తన స్వార్థం చూసుకుంటాడు. శుద్ధిని దూరం పెడతాడు. దీంతో ఆమె వచ్చి వరుణ్ ముందు నిలబడుతుంది. వీళ్లిద్దరి మధ్య సాగే సంభాషణ విజిల్స్ వేయిస్తుంది. అలా అదిరిపోయే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌కి వచ్చేసరికి శుద్ధికి కరాటే నేర్పిన గురువు చనిపోవడం, ఆయన అస్థికల్ని గంగలో కలపడం ఇలా సాగుతుంది. కొన్నాళ్ల తర్వాత శుద్ధి జీవితంలోకి సంజయ్ వస్తాడు. ఈమెలానే అతడు కూడా ఓ రచయిత. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారా? ఇంతకీ సంజయ్ గతమేంటి? చివరలో శుద్ధితో సంజయ్ ఒక్కటయ్యాడా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.'8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. మధ్యమధ్యలో బలమైన సన్నివేశాలు, మనసుని తాకే డైలాగ్స్ వస్తుంటాయి. తొలి భాగంలో మహిళల గుణం గురించి హీరోయిన్ చెప్పే ఓ సీన్ భలే ఉంటుంది. ఇంటర్వెల్‌కి ముందు శుద్ధి-వరుణ్ మధ్య సంభాషణ వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది కానీ క్లైమాక్స్‌కి వచ్చేసరికి సంజయ్ పాత్ర ఎంత బలమైనదో అర్థమవుతుంది. ఎందుకంటే క్లైమాక్స్‌కి కాసేపు ముందు వచ్చే ఈ పాత్రకు పెద్దగా సీన్స్ ఉండవు. కానీ క్లైమాక్స్‌లో ఇతడి పాత్రని తొలి సీన్ నుంచి లింక్ చేసిన విధానం.. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. అలానే '8 వసంతాలు' అనే టైటిల్ ఎందుకు పెట్టారో కూడా చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. సినిమాలో ఎన్ని పాత్రలున్నా సరే హీరోయిన్ పాత్ర మాత్రం గుర్తుండిపోతుంది. డైలాగ్స్ అయితే భావుకత, కవితలు అంటే ఇష్టపడేవారితో పాటు సగటు ప్రేక్షకుడికి కూడా నచ్చేస్తాయి.ఎవరెలా చేశారు?శుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక జీవించేసింది. 17 ఏళ్ల అమ్మాయిగా, 25 ఏళ్ల మహిళగా వేరియేషన్స్ చూపించింది. వరుణ్‌గా చేసిన హనురెడ్డి.. ఎన్నారై కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సెకండాఫ్‌లో వచ్చే సంజయ్ పాత్రధారి రవి దుగ్గిరాల ఇదివరకే 'మధురం'లో నటించాడు. ఇందులో అతడి పాత్ర ఉన్నది కాసేపు అయినా డిజైన్ చేసిన విధానం బాగుంది. మిగిలిన పాత్రధారులు కూడా ఎవరికి వాళ్లు పూర్తిగా న్యాయం చేశారు.టెక్నికల్‌గా చూసుకుంటే సినిమాలో డైలాగ్స్ మెయిన్ హైలైట్. ప్రతి 10-15 నిమిషాలకు ఒకటి వస్తుంటుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్. ఊటీ, కశ్మీర్, కాశీ అందాల్ని బాగా చూపించారు. ఇక డైరెక్షన్ విషయానికొస్తే.. ఇదివరకే మధురం షార్ట్ ఫిల్మ్, మను సినిమాతో తానెంటో నిరూపించుకున్న ఫణీంద్ర నర్సెట్టి.. ఇప్పుడు '8 వసంతాలు' సినిమాతో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.స్వచ్ఛమైన ప్రేమకథని వినసొంపైన సంగీతంతో మనసుని తాకే సంభాషణలతో తీసిన ఓ మంచి సినిమా చూడాలనుకుంటే '8 వసంతాలు' అస్సలు మిస్ కావొద్దు. కుటుంబంతో కలిసి నిరభ్యంతరంగా చూడొచ్చు.- చందు డొంకాన -
ఇండియా మొత్తం వెతికితే అనంతిక దొరికింది: నిర్మాత రవిశంకర్
‘‘క్లాసికల్ డ్యాన్స్, మార్సల్ ఆర్ట్స్ రెండూ వచ్చిన అమ్మాయి కావాలని ఇండియా మొత్తం వెతికితే ఒక్క అమ్మాయి దొరికింది... తనే అనంతిక. ‘8 వసంతాలు’ సినిమా కోసం తను చాలా కష్టపడింది’’ అని నిర్మాత వై. రవిశంకర్ తెలిపారు. అనంతికా సనీల్‌కుమార్ లీడ్ రోల్లో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘8 వసంతాలు’. హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఒక అమ్మాయి ఎనిమిదేళ్ల ప్రయాణమే ‘8 వసంతాలు’. ఈ సినిమాకి అనంతిక, ఫణి బిగ్గెస్ట్ పిల్లర్స్. విజువల్‌గా అదిరిపోయింది. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం’’ అన్నారు. నవీన్ యెర్నేని మాట్లాడుతూ– ‘‘చాలా వైవిధ్యమైన చిత్రమిది. ఈ సినిమా కోసం పని చేసిన కొత్తవాళ్లందరి కోసమైనా ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అని తెలిపారు. ‘‘నవీన్‌గారు, రవిగారు చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని కాదు... మంచి సినిమానా? కాదా? అనేది చూస్తారు. మా ‘8 వసంతాలు’ మంచి చిత్రం’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘శుద్ధి అయోధ్య లాంటి బలమైన పాత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అనంతిక చె΄్పారు. -
8 వసంతాల హీరోయిన్.. 19 ఏళ్లకే ఇంత టాలెంట్ ఏంది బ్రో!
అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం '8 వసంతాలు'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ అనంతిక టాలెంట్‌ను నెటిజన్స్ షాకవుతున్నారు. కేవలం 19 ఏళ్లకే ఇంత ప్రతిభ ఎలా సాధించారంటూ చర్చించుకుంటున్నారు. అనంతిక కేవలం నటన మాత్రమే కాదు.. ఆమెలో మల్టీ టాలెంటెడ్ అని వేదికపైనే నిరూపించుకుంది. అనంతిక క్లాసికల్ డ్యాన్సర్‌తో పాటు కరాటేలో బ్లాక్ బెల్ట్, కలరిపయట్టు విద్యలో నైపుణ్యం, కత్తిసాము, చెండా వాయించడం(పెర్కషన్) లాంటి విద్యల్లో నైపుణ్యాలు సాధించింది. అంటే ఆమె కేవలం నటిగా మాత్రమే కాకుండా ఇన్ని రకాల నైపుణ్యాలు ఉన్నాయా? అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. తాజా ఈవెంట్లో అనంతికి చేసిన స్టంట్స్ చూస్తే ఆమె టాలెంట్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది.ఆమె వయస్సు కేవలం 19 సంవత్సరాలు కాగా.. తన టాలెంట్‌లో టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేరళకు చెందిన అనంతిక లా విద్యార్థిని కూడా. కాగా.. ఈ చిత్రంలో అనంతిక సనీల్కుమార్తో పాటు రవితేజ దుగ్గిరాల, హను రెడ్డి, కన్న పసునూరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ జూన్ 20న థియేటర్లలో సందడి చేయనుంది.Ananthika Sanilkumar, a 19-year-old from Kerala, is a trained classical dancer, black belt in karate, and skilled in Kalaripayattu, sword fighting, and Chenda. She’s also a law student balancing her diverse talents. 🫡#AnanthikaSanilkumar #8Vasantalu #mythrimoviemakers pic.twitter.com/5K3WkEdQV1— cinemala baba (@Cinemalababa) June 17, 2025 -
టాలీవుడ్లో 19 ఏళ్ల హీరోయిన్.. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?
సాధారణంగా హీరోయిన్లు అనగానే చాలామందికి ఓ అభిప్రాయం ఉంటుంది. గ్లామర్ చూపించో లేదంటే యాక్టింగ్ చేసో ఛాన్సులు కొట్టేస్తుంటారు అని అనుకుంటారు. అయితే వీళ్లలో కొందరు మాత్రం మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఒకరిలోనే చాలా టాలెంట్స్ అనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే 'మ్యాడ్'లో ఓ హీరోయిన్గా చేసిన అనంతిక అనే అమ్మాయి కోసం.రీసెంట్‌గానే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె పూర్తి పేరు అనంతిక సనీల్ కుమార్. 19 ఏళ్ల ఈ కేరళ కుట్టి.. 2015 నుంచి సినిమాలు చేస్తోంది. తొలుత మిలీ, లాల్ సలామ్, రైడ్ అనే తమిళ సినిమాలు చేసింది గానీ పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసి హిట్ కొట్టిన తర్వాత దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. 'రాజమండ్రి రోజ్ మిల్క్' అనే మరో తెలుగు మూవీలో లీడ్ రోల్ అవకాశమొచ్చింది. కాకపోతే ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. అయితేనేం తెలుగులో బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీసిన '8 వసంతాలు' సినిమాలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'విరాటపాలెం')జూన్ 20న '8 వసంతాలు' సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతిక తన టాలెంట్స్ అన్నీ బయటపెట్టింది. ఇన్ని రోజులు ఈమె ప్రతిభావంతురాలు అనే టాక్ ఉంది గానీ ఇప్పుడు దాన్ని రియాలిటీలో చూపించింది. దీంతో ఈమె గురించి ఇప్పుడు టాలీవుడ్లో మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం లా(న్యాయవాది) కోర్స్ చేస్తున్న అనంతిక.. క్లాసికల్ డ్సాన్స్ చేస్తుంది. కరాటేలో ఈమెకు బ్లాక్ బెల్ట్ ఉంది. కేరళకు చెందిన కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా వచ్చు. కత్తి ఫైటింగ్‌లోనూ ఈమె సిద్ధహస్తురాలే. అలానే కేరళ సంప్రదాయంలో ఒకటైన చెండా (డ్రమ్స్) కూడా బాగానే వాయిస్తుంది. ఇలా అనంతిక ఇన్నింట్లో ప్రతిభావంతురాలు అని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 19 ఏళ్లకే ఇలా ఉందంటే.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని నేర్చుకుంటుందో?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)#AnanthikaSanilkumar:• A trained classical dancer 💃• Black belt in Karate 🥋• Skilled in Kalaripayattu 🥷• Skilled in sword fighting 🗡️• Plays the Chenda (percussion) 🥁• An actor 👩🎤• A law student 👩🎓And she’s just 19 years old! 🫡 pic.twitter.com/crowkzdA6X— Movies4u Official (@Movies4u_Officl) June 17, 2025 -
‘8 వసంతాలు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ శక్తి సినిమాకే ఉంది: ఫణీంద్ర నర్సెట్టి
‘‘సాహిత్యం, కవిత్వం, భాష విలువలు గతంతో పోలిస్తే ప్రస్తుతం తగ్గిపోతున్నాయి. భాషని బతికించే శక్తి సినిమాకే ఉంది. మా ‘8 వసంతాలు’ చూసిన తర్వాత ఎవరో ఒకరు ఆ భాషపై ఇష్టాన్ని పెంచుకోవచ్చు. మా చిత్రం ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది అభినందిస్తూ నాకు సందేశాలు పంపుతుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి. ‘మ్యాడ్’ మూవీ ఫేమ్ అనంతికా సనీల్‌కుమార్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘8 వసంతాలు’.హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా పసునూరి, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫణీంద్ర నర్సెట్టి మాట్లాడుతూ– ‘‘మను’ సినిమా తర్వాత ఆరేళ్లు గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో కొన్ని కథలపై వర్క్ చేశాను. అయితే ‘8 వసంతాలు’ కోసం స్త్రీ కోణంలోకి వెళ్లి ఆ సున్నితత్వాన్ని పట్టుకోవడానికి, కథ రాయడం కంటే స్త్రీ దృక్కోణాన్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్కువ టైమ్ పట్టింది.బలమైన స్త్రీ పాత్రలే స్ఫూర్తిగా నా కథలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తన గౌరవాన్ని కోల్పోకుండా ఉండే అమ్మాయి ప్రయాణమే ‘8 వసంతాలు’. నేను రాసుకున్న శుద్ధీ అయోధ్య పాత్రకు అనంతిక కరెక్టుగా సరిపోయారు. నటిగానే కాదు... తనకి మార్షల్ ఆర్ట్స్‌తో పాటు దాదాపు 13 కళల్లో ప్రవేశం ఉంది. పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా ‘మను’ చేశాను. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రోడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌లో ‘8 వసంతాలు’ చేశాను. నాకు ఈ రెండు అనుభవాలూ ఉన్నాయి. ఈ సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని, తర్వాత ఎలాంటి కథలు చేయాలో నిర్ణయించుకుంటాను’’ అని చెప్పారు. -
ఇంటిమేట్ సీన్స్ అంటే కష్టంగా ఉంది కానీ.. : హీరోయిన్
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల దగ్గరైన మలయాళ నటి అనంతిక. మ్యాడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ నటి.. తొలి సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇప్పుడు 8 వసంతాలు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 20న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన అనంతిక.. సినిమాల్లోని ఇంటిమేట్ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కథ డిమాండ్ చేస్తే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి తను కూడా రెడీ అని చెప్పింది. ‘ఇప్పటి వరకు ఇంటిమేట్ సీన్స్ చేయలేదు. అలాంటి సన్నివేశాల్లో నటించడం కష్టంగా అనిపిస్తుంది. అలా అని నేను అలాంటి పాత్రను చేయనని చెప్పట్లేదు. నిజంగా కథ డిమాండ్ చేస్తే.. ఇంటిమేట్ సీన్స్ చేయడానికి నాకేమి ఇబ్బంది లేదు. అయితే అప్పుడు కూడా కొంత లిమిటేషన్ ఉంటుంది’ అని చెప్పింది.ఇక తన లక్ష్యాలను గురించి చెబుతూ.. తనకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తే లేదని చెప్పింది. ‘చిన్నప్పటి నుంచే నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. దాంతో పాటు కరాటే కూడా నేర్చుకున్నాను. అయితే ఇవ్వన్ని సినిమాల్లోకి రావాలని నేర్చుకోలేదు. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. కోవిడ్ టైంలో ఖాలీగా ఉండడంతో ఓ మలయాళ సినిమాలోకి డ్యాన్సర్‌గా వెళ్లాను. అక్కడ డీఓపీ నన్ను చూసి హీరోయిన్గా ట్రై చెయ్యొచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అప్పటి నుంచే సినిమాలకు ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశా. మంచి సందేశం ఇచ్చే చిత్రాలను చేయాలనుకున్నాను. నా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను మాత్రమే ఎంచుకుంటున్నాను. అయితే నటిగా కొనసాగాలని నాకు లేదు. కొన్నేళ్ల తర్వాత అయినా నేను రాజకీయాల్లో వెళ్తా. దాని కోసమే నేను ‘లా’ చదువుతున్నాను. 35-40 ఏళ్ల వయసు వచ్చాక రాజకీయాల్లోకి వెళ్తా’ అని అనంతిక చెప్పుకొచ్చింది. -
ప్రేమ కవిత్వంలో '8 వసంతాలు'.. టీజర్ విడుదల
అందమైన ప్రేమకథతో వస్తున్న చిత్రం '8 వసంతాలు'.. తాజాగా ఈ మూవీ నుంచి రెండో టీజర్‌ను విడుదల చేశారు. మ్యాడ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 20న ఈ చిత్రం విడుదల కానుంది.