
గత నెలలో థియేటర్లలో రిలీజైన '8 వసంతాలు' సినిమా.. కొందరికి నచ్చింది, ఇంకొందరికి నచ్చలేదు. ప్రేమకథ బాగుంది, డైలాగ్స్ సూపర్ అని కొందరు అంటుంటే.. మరికొందరేమో సీరియల్‌లా ఉందని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కనబెడితే డైలాగ్స్, వాటిలోని సాహిత్యం చాలామందిని ఆకట్టుకున్నాయి. కొందరు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జ్యూక్ బాక్స్ వీడియోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కన్నప్ప'.. డేట్ ఫిక్సయిందా?)
థియేటర్లలో అంతంత మాత్రంగానే ఆడిన ఈ సినిమా నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. తర్వాత ట్రెండింగ్‌లోకి కూడా వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రాన్ని బాగానే చూస్తున్నారు. కొందరు విజువల్స్, డైలాగ్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఇదే చిత్రంలోని 'అందం అంటే గుణం', 'సుఖాలే కాదు కలలు కూడా పంచుకోవాలి' ,'ఎవరి తలరాతలు వాళ్లే రాసుకోవాలి', 'ఎవరి తుపానులు వాళ్లకుంటాయి లోపల'.. ఇలా పలు సంభాషణలు అచ్చ తెలుగులో ఉంటూ మనసుని దోచేస్తున్నాయి. ఇలా దాదాపు 12 డైలాగ్స్‌ని ఆడియో రూపంలో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వినేయండి.
'8 వసంతాలు' విషయానికొస్తే.. శుద్ధి అయోధ్య(అనంతిక) మార్షల్ ఆర్ట్స్, కరాటే నేర్చుకుంటూ ఉంటుంది. తండ్రి దూరమైన బాధల్లోంచి రాసిన పుసక్తంతో గొప్ప రచయిత అవుతుంది. నదిలా ప్రవహిస్తున్న ఈమె జీవితంలోకి వరుణ్ (హను రెడ్డి) వస్తాడు. అప్పటివరకు తన ప్రపంచంలో తాను బతుకుతున్న శుద్దిని ప్రేమలోకి దించుతాడు. కొన్నాళ్ల తర్వాత తన స్వార్థం చూసుకుని శుద్ధిని నడిరోడ్డున వదిలేసి వెళ్లిపోతాడు. అప్పుడు ఈమె ఏం చేసింది? శుద్ధి జీవితంలో సంజయ్ (రవి దుగ్గిరాల) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: వరలక్ష‍్మికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)