
పుట్టినరోజు, పెళ్లిరోజు లాంటివి వస్తే సెలబ్రిటీలు ఇంట్లో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. కుదిరితే విదేశాలకు వెళ్లిపోతుంటారు. లేదంటే ఖరీదైన బహుమతులతో ఒకరిని ఒకరు సర్‌ప్రైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రముఖ నటి వరలక్ష‍్మి శరత్ కుమార్‌కు కూడా తన భర్త కళ్లు చెదిరే గిఫ్ట్ ఇచ్చాడు. ఈ కారు రేటు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావడం ఖాయం. ఇంతకీ ఏంటి సంగతి?
ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష‍్మి. తండ్రిలానే నటిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా చేసింది గానీ పెద్దగా కలిసి రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్‌గా మారిపోయింది. అప్పటినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తెలుగులోనూ గత కొన్నేళ్లలో నాంది, క్రాక్, వీరసింహారెడ్డి, హనుమాన్ తదితర చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. విలనీ తరహా పాత్రలతో మెప్పిస్తోంది.
(ఇదీ చదవండి: కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్)

వ్యక్తిగత జీవితానికొస్తే కొన్నేళ్ల ముందు వరకు హీరో విశాల్‌తో ఈమె డేటింగ్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమేనని ఎవరికి వాళ్లు క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇక పెళ్లి చేసుకుంటాదా లేదా అని అందరూ అనుకున్నారు. అయితే అందరికీ షాకిస్తూ గతేడాది ఈమె పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందిన గ్యాలరీస్ట్ నికోలాయ్ సచ్‌దేవ్‍తో కొత్త జీవితం ప్రారంభించింది.

తాజాగా ఈ జంట తొలి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వరలక్ష‍్మీ చెన్నైలో ఉండగా, నికోలాయ్ ముంబైలో ఉన్నాడు. పెళ్లయి ఏడాది పూర్తయిన తర్వాత ఈమెకు నికోలాయ్.. ఖరీదైన పోర్సే కారుని బహుమతిగా ఇచ్చాడు. పోర్సే 718 బాక్స్‌టర్ మోడల్ గులాబీ రంగు కారులో వరలక్ష‍్మి డ్రైవింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మన దేశంలో ఈ కారు ధర ఏకంగా రూ.1.60 కోట్లు వరకు ఉంది. దీంతో కోటిన్నర విలువైన కారు గిఫ్టా అని అవాక్కవుతున్నారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)