
మరోవారం వచ్చేసింది. ఈ వీకెండ్ థియేటర్లలోకి 'హరిహర వీరమల్లు'తో పాటు 'మహావతార నరసింహా', 'ద ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్', 'సార్ మేడమ్' తదితర డబ్బింగ్ చిత్రాలు కూడా వస్తున్నాయి. వీటిలో పవన్ సినిమాపై చాలా తక్కువ హైప్ అయితే ఉంది. మిగతా వాటి గురించి జనాలకు పెద్దగా తెలియదు. మరోవైపు ఓటీటీల్లో మాత్రం 25కి పైగా కొత్త మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
(ఇదీ చదవండి: 'డీఎన్‌ఏ' మూవీ రివ్యూ.. మెప్పించేలా థ్రిల్లర్ క్రైమ్ స్టోరీ)
ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'షో టైమ్' (స్ట్రెయిట్ తెలుగు సినిమా), రోంత్ (డబ్బింగ్ మూవీ) మండల మర్డర్స్(హిందీ సిరీస్), ఎక్స్ & వై(కన్నడ చిత్రం) ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. వీకెండ్ వచ్చేసరికి ఏవైనా కొత్త చిత్రాలు సడన్ సర్‌ప్రైజ్ ఇస్తాయేమో చూడాలి? ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జూలై 21 నుంచి 27 వరకు)
హాట్‌స్టార్
ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) - జూలై 21
రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జూలై 22
వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
షర్జమీన్ (హిందీ మూవీ) - జూలై 25
అమెజాన్ ప్రైమ్
జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21
టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 23
హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) - జూలై 24
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 25
రంగీన్ (హిందీ సిరీస్) - జూలై 25
సన్ నెక్స్ట్
షో టైమ్ (తెలుగు మూవీ) - జూలై 25
ఎక్స్ & వై (కన్నడ చిత్రం) - జూలై 25
నెట్‌ఫ్లిక్స్
ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 21
ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 22
క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) - జూలై 24
హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24
మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) - జూలై 24
మండల మర్డర్స్ (హిందీ సిరీస్) - జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) - జూలై 25
జీ5
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) - జూలై 25
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) - జూలై 25
ద ప్లాట్ (కొరియన్ మూవీ) - జూలై 25
ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25
ఆపిల్ ప్లస్ టీవీ
అకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 23
ఎమ్ఎక్స్ ప్లేయర్
హంటర్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జూలై 24
(ఇదీ చదవండి: 5 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా)