ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో రిలీజయ్యే మలయాళ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయా సినిమాల్ని నేరుగా మన దగ్గర స్ట్రీమింగ్ చేస్తుంటారు. గత కొన్నాళ్లలో చూసుకుంటే నాయట్టు, ఆఫీసర్ ఆన్ డ్యూటీ తదితర మూవీస్ ఇలానే ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీటి బాటలోనే మరో చిత్రం కూడా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)దిలీష్ పోతన్, రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రోంత్'. ఈ టైటిల్‌కి అర్థం 'రాత్రి గస్తీ'. పాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసులు.. ఒకేరోజు జరిగే సంఘటనల వల్ల ఎలా ప్రభావితమయ్యారు? వీళ్లు ఆ క్షణంలో తీసుకునే నిర్ణయాలు వీళ్ల జీవితాల్ని ఎలా తలకిందులు చేశాయనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోలీస్ వ్యవస్థ బ్యాక్ డ్రాప్‌తో తీసిన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.పాము తన గుడ్లని తానే తినేసినట్లు.. అనుకోని పరిస్థితి వస్తే తోటి పోలీసుల్ని, పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తారు అనేది ఇందులో చక్కగా చూపించారు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఉంటుంది. క్లైమాక్స్ అయితే అస్సలు ఊహించలేరు. అలా ఉంటుంది. గత నెల 13న థియేటర్లలో చిత్రం రిలీజ్ కాగా.. ఈ నెల 22 నుంచి అంటే వచ్చే మంగళవారం నుంచి హాట్‌స్టార్‌లో 'రోంత్' స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చూడొచ్చు.(ఇదీ చదవండి: టీజర్‌ని టార్గెట్ చేశారు.. 'విశ్వంభర' స్టోరీ ఇదే: వశిష్ట)