
ఓటీటీలోకి కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అయితే ఇతర భాషా చిత్రాలతో పోలిస్తే తెలుగు మూవీస్‌ని చూసేందుకు మన ప్రేక్షకులు కాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రతివారం రెండు మూడుకు మించి వచ్చేస్తుంటాయి. అలా వీకెండ్ టైమ్ పాస్ చేసేస్తుంటారు. ఈ వారం కూడా తెలుగు సినిమాలు చాలానే వచ్చాయి.
(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి హిట్ సినిమా.. ఇదేం విడ్డూరం)
కుబేర, భైరవం మాత్రమే ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజైన వాటిలో కొత్త సినిమాలు. వీటితో పాటు 'గార్డ్' అనే తెలుగు మూవీ కూడా సైలెంట్‌గా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు ఐదు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉంటే దీనిపై లుక్కేయొచ్చు.
'గార్డ్' విషయానికొస్తే.. షూటింగ్ అంతా ఫారిన్‌లోనే తీశారు. సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే హీరో. ఓ అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ఓ సందర్భంలో నిషేధిత ల్యాబ్‌లోకి అడుగుపెట్టి ఓ అమ్మాయిని రక్షిస్తాడు. అప్పటినుంచి వింత వింత సంఘటనలన్నీ జరుగుతుంటాయి. ఓ అమ్మాయి దెయ్యం రూపంలో కనిపిస్తూ అందరికీ భయపెడుతూ ఉంటుంది. మరి చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రైమ్ డ్రామా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)