
తమిళంలో ఘన విజయం సాధించిన 'డీఎన్‌ఏ' సినిమా తెలుగులో 'మై బేబీ' పేరుతో విడుదల అయింది. ఒక్క యాక్సిడెంట్ కోట్ల మాఫియాకు ఎలా దారి తీసిందో ఈ సినిమాలో చూపించిన తీరు చాలా బాగుంది. ఆపై తెలుగులో థియేటర్లలోకి వచ్చిన ఒక్క రోజులోనే ఓటీటీలోకి వచ్చిన మూవీ కావడంతో భారీగా క్రేజ్ సొంతం చేసుకుంది. జులై 18 థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం జులై 19న జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో అందుబాటులో ఉంది. అధర్వ మురళి, నిమిషా సజయన్ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెరకెక్కించాడు. సోషల్‌మీడియాలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే..
పుట్టిన బిడ్డ పురిటిలోనే చేతులు మారిపోతున్న సంఘటనలు నేటి సమాజంలో ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. ఇదే పాయింట్‌తో 'డీఎన్‌ఏ' కథను ప్రేక్షకులకు చెప్పడంలో దర్శకుడు నీల్సన్ వెంకటేశన్ విజయం సాధించారు. చెన్నై వీధుల్లో ఆనంద్ (అథర్వ) తాగేసి రోడ్లపై తిరుగుతుంటాడు. తను ప్రేయించిన అమ్మాయి శరణ్య (మానస చౌదరి) దూరం కావడంతో కుంగిపోయి ఉంటాడు. ఇదే వివషయంలో తండ్రీకొడుకుల మధ్య రోజూ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే, పెళ్లి చేస్తే జీవితంలో సెట్ అవుతాడని భావిస్తారు. ఈ క్రమంలో దివ్య (నిమిషా సజయన్)తో పెళ్లి చేస్తారు. ఆమె మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా కూడా ఆమెతో పెళ్లికి ఆనంద్ ఒప్పుకుంటాడు.

ఆనంద్ అలా మారిపోవడం పట్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పెళ్లి చేస్తే దారిన పడతాడు అనే ఉద్దేశంతో, దివ్య (నిమిషా సజయన్) సంబంధాన్ని సెట్ చేస్తారు. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా, ఆమెతో పెళ్లికి ఆనంద్ అంగీకరిస్తాడు. వారి పెళ్లి జరిగిపోతుంది. కొంత కాలానికి దివ్య గర్భవతి అవుతుంది. ప్రముఖ ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే, బాబును ఇంక్యుబేటర్‌లో పెట్టాలని వైద్యులు తీసుకెళ్తారు. మళ్లీ కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డను దివ్య చేతుల్లో పెట్టగానే, అది తన బిడ్డ కాదని దివ్య గొడవ చేస్తుంది. ఆమె మానసిక సమస్యతో ఇబ్బంది పడుతుంది కాబట్టి అలా చెబుతుందని అందరూ అనుకుంటారు. ఆమె మాటలు ఎవరు నమ్మరు.
అయితే, దివ్య మాటలకు ఆనంద్ చుట్టూ గందరగోళం నెలకొంటుంది. దివ్య బాధను చూడలేక మరో ఆసుపత్రిలో బాబుకు డీఎన్‌ఏ టెస్ట్ చేపిస్తాడు. అక్కడ ఆ బిడ్డ కాదని తెలుస్తోంది. తమ బాబును ఎవరో కిడ్నాప్ చేశారని ఆనంద్ గుర్తిస్తాడు. అయితే, మరో బిడ్డను తమకు వదిలేసి ఎందుకు వెళ్లారని ఆనంద్‌కు అర్థం కాదు. దివ్య బిడ్డను ఎవరు తీసుకెళ్లారు..? పోలీసులతో కలిసి ఆనంద్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాడు..? తన బిడ్డను ఎలా పట్టుకున్నాడు..? వేరే బిడ్డను తమకు ఎందుకు ఇచ్చారు..? తెలియాలంటే
ఎలా ఉందంటే..
ఇదొక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, వాటికి భిన్నంగా డీఎన్‌ఏ కథను దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ చెప్పాడు. సినిమా ప్రారంభంలో ఆనంద్ జీవితాన్ని పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడినప్పటికీ తన బిడ్డ మాయం అయిన క్షణం నుంచి కథలో స్పీడ్ పెరుగుతుంది. మద్యానికి బానిస అయిన తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్‌కు ఆనంద్ వెళ్తాడు. అక్కడ అతనిలో వచ్చిన మార్పు వల్లనే మానసిక సమస్యతో బాధ పడుతున్న దివ్యను పెళ్లి చేసుకుంటాడు. ఆ సీన్లు మన అందరికీ కనెక్ట్ అవుతాయి.
కథ ప్రారంభంలో ఆనంద్ బ్రేకప్ బాధలు, అమ్మాయి పెళ్లి కష్టాలు వంటి సీన్లు కొత్తగా ఏమీ అనిపించవు. అయితే, ఎస్సై చిన్నస్వామి సాయంతో తన బిడ్డ కోసం ఇన్వెస్టిగేషన్‌ను మొదలు పెడతాడు ఆనంద్.. ఈ క్రమంలో ఆస్పత్రిలో పుట్టిన బిడ్డలను ఎలా కిడ్నాప్ చేస్తారు..? వారు ఏడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..? వంటి సీన్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇదే సమయంలో మూఢ విశ్వసాలతో పుట్టిన బిడ్డలను నరబలి ఇచ్చే ఆచారాలను కూడా దర్శకుడు చూపాడు. సినిమా క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంటుంది. ఇన్వ సినిమాలను ఇష్టపడే వారికి ఇదొక గొప్ప అనుభూతిని ఇస్తుంది.
ఎవరెలా చేశారంటే..
డీఎన్‌ఏ చిత్రంలో ఆనంద్‌గా అధర్వ మెప్పించాడు. దివ్య పాత్రలో నిమిష సజయన్ అద్భుతంగా నటించింది. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లలో అధర్వ మెప్పిస్తే.. బిడ్డను కోల్పోయిన తల్లిగా నిమిష నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. పార్తీబన్ సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, స్క్రీన్ ప్లేకు తగ్గట్లుగా ఉంటుంది. అయితే, ఫస్టాఫ్ లెంగ్త్ తగ్గిస్తే బావుండేది. ఇందులోని పాటలు బాగా మైనస్గా నిలుస్తాయి. సినిమా బాగా ఆసక్తిగా ఉన్నప్పుడు సడెన్గా వచ్చే పాటలతో చిరాకు తెప్పిస్తాయి. తమిళ్లో సుమారు నెల కిందట విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రం తెలుగులో 'మై బేబీ'గా విడుదలైంది. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను డీఎన్‌ఏ మెప్పిస్తుంది.