Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది | Junaid Khan And Sai Pallavi Starrer Ek Din Movie Official Trailer Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

Mar 11 2026 4:15 PM | Updated on Mar 11 2026 4:25 PM

Sai Pallavi Ek Din Movie Trailer Out

సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్‌ దిన్‌’. ఆమిర్‌ ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్‌ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు.  ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో  సాయిపల్లవి నటించారు. 

మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్‌ తర్వాత ఎమోషనల్‌గా సాగింది. సునీల్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement