breaking news
Ek Din Movie
-
అందుకే ‘ఏక్ దిన్’లో నటించా : సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు
సాయి పల్లవి తొలిసారి నటించిన బాలీవుడ్ మూవీ ‘ఏక్ దిన్’ మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ మూవీ కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమాలో తన పాత్రకు తగిన న్యాయం చేయలేదని సాయి పల్లవి ముందే చెప్పేసిందట. అంతేకాదు ఈ సినిమా ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందో కూడా ఓ ఇంటర్వ్యూలో వివరించింది.‘ఏక్ దిన్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. చిత్రబృందం నాకు స్టోరి చెప్పేందుకు వచ్చినసమయంలో నేను చాలా ఎమోషనల్ సినిమాల్లో నటిస్తున్నాను. దాని వల్ల నేను ఒత్తిడిగి గురయ్యాను. అందుకే మనసుకు హాయిగా అనిపించే పాత్ర చేయాలనుకున్నాను. అప్పుడే ఏక్ దిన్ కథ నా దగ్గరకు వచ్చింది. వినగానే హాలీవుడ్ క్లాసిక్ ‘బిఫోర్ సన్‌రైజ్’ మూవీ గుర్తుకు వచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. ప్రీమియర్స్ షో చూసిన తర్వాత నా నటన నచ్చలేదు. ఆ పాత్రకు నేను న్యాయం చేయలేకపోయాను అనిపించింది. ఇదే విషయాన్ని ఆమిర్ ఖాన్‌తో చెప్పా. ‘ఈ పాత్రకు నన్ను కాకుండా మరొకరిని ఎంపిక చేసి ఉంటే బాగుండేదేమో. చురుగ్గా, హుషారుగా ఉండే కొత్త అమ్మాయిని ఎంపిక చేసి ఉండాల్సింది. వాళ్లు ఈ పాత్రకు బాగా న్యాయం చేసేవాళ్లు’ అని ఆయనతో చెప్పా’ అని సాయి పల్లవి అన్నారు. పక్కనే ఉన్న జునైద్ మాత్రం..ఈ పాత్రకు సాయి పల్లవి సరైన ఎంపిక అని, అద్భుతంగా నటించిందని చెప్పారు. -
మొన్న పూజ హెగ్డే.. నేడు సాయి పల్లవి.. ఎందుకిలా?
దక్షిణాది వెండితెరపై వెలిగిపోతున్న తారలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నారు. తాజాగా సాయి పల్లవి నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడంలో సౌత్ భామలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది.టాలీవుడ్, కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు.. బాలీవుడ్లో మాత్రం అడుగు పెట్టగానే తడబడుతున్నారు. కోట్లాది మంది అభిమానం, అద్భుతమైన నటన ఉన్నప్పటికీ, అక్కడ సక్సెస్ రేటు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.తనదైన నటనతో నేచురల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. హిందీ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించినా, ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్లో శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది.కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు, గతంలో అనేకమంది సౌత్ స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో ఇబ్బందులు పడ్డారు. సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేశ్ కూడా 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పూజా హెగ్డే , తమన్నాలు గ్లామర్ పరంగా అక్కడ మార్కులు కొట్టేసినా, భారీ విజయాలు మాత్రం వీరికి దక్కలేదు. ఇక దక్షిణాదిలో చాలా ఏళ్లుగా స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న త్రిష, నయనతారలు కూడా బాలీవుడ్లో రాణించలేకపోయారు. 'ఖట్టా మీఠా' అనే మూవీతో త్రిష బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత త్రిషలో అక్కడ పెద్ద అవకాశాలేవి రాలేదు. నయనతార తొలి హిందీ సినిమా ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయింది. అయితే సౌత్ తారలు అందరూ విఫలమవుతున్నారని చెప్పలేం. తాప్సీ పన్ను సౌత్‌లో కంటే బాలీవుడ్లోనే ఎక్కువ స్థిరపడింది. అలాగే రష్మిక మందన్నా కూడా ‘యానిమల్’ సినిమాతో అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసి, మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటోంది. -
అయ్యో పాపం.. సాయి పల్లవి.. మొదటి అడుగే ఇలా అయ్యిందేంటి?
-
సాయిపల్లవి సినిమాని పట్టించుకోవట్లేదు.. దారుణమైన కలెక్షన్స్!
సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఫెయిలైనా సరే ఈమె యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు ఈమె చేసిన చిత్రాలు ఫెయిలైనా సరే కాస్తంత డబ్బులు రాబట్టాయి. కానీ హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' మాత్రం తొలిరోజే దారుణమైన కలెక్షన్స్‌తో ఈమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం? ఈ మూవీ సంగతేంటి?(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ప్రీమియర్స్ వేయగా.. సినిమా చూస్తూ ఆమిర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. అయినా సరే ఈ మూవీని జనాలు పట్టించుకోవట్లేదు. చెప్పాలంటే రిలీజ్‌కి ముందే బజ్ లేదు. పెద్దగా బుకింగ్స్ కూడా జరగలేదు. సరే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుంటే హిట్ అవ్వొచ్చని అనుకున్నారు. కానీ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ బాగానే చేసిందని అంటున్నారు గానీ మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు. చాలామంది మిడ్ రేంజ్ హీరోల కంటే సాయిపల్లవికి బాగానే గుర్తింపు ఉంది. ఇది కూడా 'ఏక్ దిన్' విషయంలో పనిచేసినట్లు లేదు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరుతో తీసుకొచ్చారు గానీ ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలీదు. షోలు కూడా పదికి మించి లేవంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.థాయ్ సినిమా 'వన్ డే' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్ నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు రూ.కోటి అటుఇటుగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ పాజిటివ్‌గా లేదు, కలెక్షన్సే పెద్దగా రావట్లేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే సాయిపల్లవికి బాలీవుడ్లో ఫస్ట్ స్ట్రోక్ తగిలినట్లే కనిపిస్తుంది. వీకెండ్ పూర్తయితే అప్పుడు వచ్చే వసూళ్ల బట్టి ఫలితంపై క్లారిటీ వచ్చేస్తుంది.(ఇదీ చదవండి: అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్) -
సాయి పల్లవి హిందీ సినిమా.. ట్రైలర్ రిలీజ్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి బాలీవుడ్లో ఎంట్రీ సినిమా ఏక్ దిన్ (ఒక రోజు).. తాజాగా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. ఇందులో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 1న తెలుగులో కూడా విడుదల కానుంది. ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. సాయి పల్లవి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతిగా కనిపించనుంది. అయితే, ప్రేమించిన అమెతో ఒక్కరోజు అయిన సంతోషంగా సమయం గడపాలని హీరో జునైద్ అనుకుంటాడు. సాయి పల్లవి హిందీలో నటిస్తున్న మొదటి సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో తన పాత్రకే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నట్లు తెలుస్తోంది. -
సాయిపల్లవి సినిమా.. క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్ ఖాన్
సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.పట్టు కోల్పోలేదుతాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్‌కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్‌గా చెప్తానన్నాను.మేము ఒప్పుకోలేదుఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్‌లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్‌లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్‌కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్‌కు పంపించేస్తాను అన్నాడు.క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్‌పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్‌ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం -
సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. Sometimes, One Day is enough. ❤️Oka Roju Trailer Out Now!Watch #OkaRoju only in theatres on 1st May 2026.#JunaidKhan #SaiPallavi pic.twitter.com/PVOBLDDRot— Aamir Khan Productions (@AKPPL_Official) March 24, 2026 -
సాయి పల్లవి మొదటి సినిమా.. అందుకేనా టెన్షన్..!
ఎవరికైనా తొలి చిత్రం రిజల్ట్స్ కోసం ఆసక్తి ఉంటుంది. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన నటీనటులకు కూడా తమ కొత్త సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో అన్న టెన్షన్ ఉంటుంది. నటి సాయిపల్లవి కూడా ఇప్పుడు అలాంటి టెన్షన్లోనే ఉన్నట్లు సమాచారం. ఏమిటీ తొలి చిత్రం అని ఆశ్యర్యంగా ఉందా? డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన తమిళనాడు, నీలగిరి ప్రాంతానికి చెందిన భామ సాయిపల్లవి.నటనపై ఆసక్తితో నాట్యాన్ని కూడా నేర్చుకున్న ఈమె మొదట్లో కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. అలా మలయాళంలో నటించిన ప్రేమలు చిత్రం సాయిపల్లవి దశను మార్చేసింది. ఆ చిత్ర విజయం ఈ అమ్మడిని దక్షిణాది చిత్రపరిశ్రమలో పాపులర్ చేసింది. అలా తెలుగులో నటించిన పలు చిత్రాలు హిట్ అవ్వడం, తమిళంలోనూ అవకాశాలు రావడంతో స్టార్ హీరోయిన్ అయ్యారు.ఇటీవల సాయిపల్లవి తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఇందులో సాయిపల్లవి నటన పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌కు జంటగా నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ విషయాన్ని పక్కన పెడితే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న సాయిపల్లవి ఏక్దిన్ అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. దీని తరువాత రామాయణం ఇతిహాసంతో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. ఏక్ దిన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే నెలలో తెరపైకి రానుంది. ఇది థాయ్‌లాండ్ భాషలో రూపొందిన ఒన్ డే చిత్రానికి రీమేక్ అని తెలిసింది. ఇందులో అమీర్‌ఖాన్ వారసుడు జునైద్‌ఖాన్ హీరోగా నటించారు.జునైద్ ఖాన్ ఈయన ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ.. అవీ పెద్దగా ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో ఏక్దిన్ నటి సాయిపల్లవికి.. నటుడు జునైద్ఖాన్లకు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలవనుంది. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ఫలితాలపై నటి సాయిపల్లవి చాలా ఆతృతగా ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర ఫలితం తన కెరీర్‌పై చాలా ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. -
Ek Din: సాయి పల్లవి తొలి హిందీ మూవీ ట్రైలర్ వచ్చేసింది
సాయి పల్లవి నటించిన తొలి హిందీ సినిమా ‘ఏక్ దిన్’. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీట్రైలర్‌ని బుధవారం (మార్చి 11) విడుదల చేశారు. ఒక ఇంటర్నేషన్ టూర్లో ఇద్దరు సహోద్యోగుల మధ్య కలిగిన ఒక రోజు పరిచయం, వారి జీవితాలను ఎలా మార్చిందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో రోహన్ పాత్రలోజునైద్ ఖాన్, మీరా పాత్రలో సాయిపల్లవి నటించారు. మీరాను ఇష్టపడే రోహన్ తన ప్రేమను వ్యక్తపరచడానికి మాత్రం భయపడుతూ ఉంటాడు. అయితే కనీసం ఒక రోజు అయినా ఆమెతో కలిసి ప్రయాణం చేయాలని అతడు కలలు కంటాడు. ఆ కల నిజమైందా? అనే ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా కథ ముందుకు సాగుతుంది. సరదాగా మొదలైన ట్రైలర్ తర్వాత ఎమోషనల్‌గా సాగింది. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.


