సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్ | Sai Pallavi and Junaid Khan Oka Roju Movie Official Telugu Trailer | Sakshi
Sakshi News home page

Oka Roju Movie: సాయి పల్లవి ఎంట్రీ మూవీ.. తెలుగు ట్రైలర్ రిలీజ్

Mar 24 2026 6:11 PM | Updated on Mar 24 2026 6:20 PM

Sai Pallavi and Junaid Khan Oka Roju Movie Official Telugu Trailer

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న లేటేస్ట్ మూవీ ఏక్ దిన్. ఈ చిత్రంలో అమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో ఒక రోజు పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 'నేను కోరుకున్నది నా కళ్లముందే ఉంది.. కొన్ని జీవితాలకు ఒక్క రోజే ఎక్కువ' అనే డైలాగ్స్‌ వింటుంటే పక్కా ప్రేమకథ అని అర్థమవుతోంది. ఈ సినిమాను మే 1న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement