సాయిపల్లవి సినిమాని పట్టించుకోవట్లేదు.. దారుణమైన కలెక్షన్స్! | Sai Pallavi Ek Din Movie Collection And Result | Sakshi
Sakshi News home page

Ek Din Sai Pallavi: ఆమిర్ ఖాన్ ప్రశంసలు, కన్నీళ్లు పనిచేయలేదు!

May 2 2026 9:47 PM | Updated on May 2 2026 9:47 PM

Sai Pallavi Ek Din Movie Collection And Result

సాయిపల్లవి పేరు చెప్పగానే తెలుగులో చాలామంది ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఆయా సినిమాలు ఫెయిలైనా సరే ఈమె యాక్టింగ్ మాత్రం అదరగొట్టేస్తుంది. ఇప్పటివరకు ఈమె చేసిన చిత్రాలు ఫెయిలైనా సరే కాస్తంత డబ్బులు రాబట్టాయి. కానీ హిందీలో చేసిన తొలి చిత్రం 'ఏక్ దిన్' మాత్రం తొలిరోజే దారుణమైన కలెక్షన్స్‌తో ఈమెకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇంతకీ  ఏంటి విషయం? ఈ మూవీ సంగతేంటి?

(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ఇది. సాయిపల్లవి హీరోయిన్. కొన్నిరోజుల క్రితం ప్రీమియర్స్ వేయగా.. సినిమా చూస్తూ ఆమిర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత సాయిపల్లవిని ప్రశంసలతో ముంచెత్తాడు. అయినా సరే ఈ మూవీని జనాలు పట్టించుకోవట్లేదు. చెప్పాలంటే రిలీజ్‌కి ముందే బజ్ లేదు. పెద్దగా బుకింగ్స్ కూడా జరగలేదు. సరే థియేటర్లలోకి వచ్చిన తర్వాత బాగుంటే హిట్ అవ్వొచ్చని అనుకున్నారు. కానీ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు.

సినిమాలో సాయిపల్లవి యాక్టింగ్ బాగానే చేసిందని అంటున్నారు గానీ మిగతా విషయాల గురించి పెద్దగా మాట్లాడట్లేదు. చాలామంది మిడ్ రేంజ్ హీరోల కంటే సాయిపల్లవికి బాగానే గుర్తింపు ఉంది. ఇది కూడా 'ఏక్ దిన్' విషయంలో పనిచేసినట్లు లేదు. తెలుగులోనూ 'ఒక రోజు' పేరుతో తీసుకొచ్చారు గానీ ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలీదు. షోలు కూడా పదికి మించి లేవంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

థాయ్ సినిమా 'వన్ డే' రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్ నిర్మించగా సునీల్ పాండే దర్శకత్వం వహించారు. కలెక్షన్స్ విషయానికొస్తే తొలిరోజు రూ.కోటి అటుఇటుగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. టాక్ పాజిటివ్‌గా లేదు, కలెక్షన్సే పెద్దగా రావట్లేదు. ఈ అంశాలన్నీ చూస్తుంటే సాయిపల్లవికి బాలీవుడ్‌లో ఫస్ట్ స్ట్రోక్ తగిలినట్లే కనిపిస్తుంది. వీకెండ్ పూర్తయితే అప్పుడు వచ్చే వసూళ్ల బట్టి ఫలితంపై క్లారిటీ వచ్చేస్తుంది.

(ఇదీ చదవండి: అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement