అమిత్ షాని కలిసిన రిషభ్ శెట్టి.. సినిమాల గురించి డిస్కషన్ | Rishab Shetty Met Amit Shah Real Reason Inside | Sakshi
Sakshi News home page

Rishab Shetty: ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఇదొకటి.. పోస్ట్ వైరల్

May 2 2026 9:05 PM | Updated on May 2 2026 9:05 PM

Rishab Shetty Met Amit Shah Real Reason Inside

'కాంతార' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషభ్ శెట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలిశాడు. ఆయనతో జరిగిన భేటీ.. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాల్లో ఒకటని రాసుకొచ్చాడు. ఈ మేరకు తామిద్దరి మధ్య సినిమాల గురించి చర్చ జరిగినట్లు చెబుతూ రెండు ఫొటోలని రిషభ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ యానిమేషన్ మూవీ.. తెలుగు రివ్యూ)

'కాంతార, కాంతర ఛాప్టర్ 1 సినిమాల గురించి అమితా షా మాట్లాడుతూ వాటిని ప్రశంసించడం గొప్ప అనుభూతి. నా తర్వాత చిత్రాల విశేషాలని కూడా ఆయనతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మన చరిత్ర, సంస్కృతి, కళలు, సినిమా మేకింగ్ గురించి ఆయన మాట్లాడుతుంటే నాకెంతో ఆనందంగా అనిపించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.

రిషభ్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'జై హనుమాన్' సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు. అలానే శివాజీ జీవితం ఆధారంగా తీస్తున్న మరో పాన్ ఇండియా మూవీ, సితార సంస్థ నిర్మిస్తున్న మరో చిత్రం కూడా చేయాల్సి ఉంది. 'కాంతార' ఫ్రాంచైజీలో మూడో భాగం అయితే ఇప్పట్లో రాకపోవచ్చనిపిస్తోంది.

(ఇదీ చదవండి: విడాకులవుతాయని కలలో కూడా ఊహించలేదు.. కానీ రెండో పెళ్లి: 'కార్తీకదీపం' నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement