సౌత్ స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఏక్ దిన్ (ఒక రోజు) సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహించిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణ పురోహిత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
పట్టు కోల్పోలేదు
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు ఆమిర్ బంధువు, దర్శకనిర్మాత మన్సూర్ ఖాన్. ఆయన మాట్లాడుతూ.. 'ఈరోజుల్లో నేను పెద్దగా సినిమాలు చూడటం లేదు. కానీ నాలో కళాత్మక దృక్పథం మాత్రం చెక్కు చెదరలేదు. కొన్ని సన్నివేశాలను మరీ ఓవర్‌గా చూపించడం కంటే కాస్త సున్నితంగా డీల్ చేయడమే మంచిదని భావిస్తాను. అలా కథపై నాకింకా మంచి పట్టుంది. అందుకే ఏదైనా అవసరమైతే సాయం చేస్తానని చిత్రయూనిట్‌కు మాటిచ్చాను. కథలో ఏదైనా మార్పు చేయాలి అనిపిస్తే ఓపెన్‌గా చెప్తానన్నాను.
మేము ఒప్పుకోలేదు
ఉదాహరణకు.. ఏక్ దిన్ మూవీ చివర్లోని ఓ పాటను జపాన్‌లో చిత్రీకరించాం. ఆ పాట షూటింగ్ క్లిప్స్ చూసిన ఆమిర్.. అమ్మాయి ఈపాటికే ఓ పాటలో ఏడ్చేసింది. ఇప్పుడు మళ్లీ ఈ సాంగ్‌లో ఏడవడం దేనికన్నాడు. అబ్బాయితో ప్రేమలో పడటం గురించి ఒక పాట పాడితే బాగుంటుందన్నాడు. అయితే దర్శకుడు ఏం ఆలోచిస్తున్నాడో నాకు బాగా తెలుసు, కాబట్టి డైరెక్టర్‌కే సపోర్ట్ చేశాను. అప్పుడు ఆమిర్ సరదాగా.. ఏదైనా తేడా జరిగిందంటే మిమ్మల్ని జపాన్‌కు పంపించేస్తాను అన్నాడు.
క్లైమాక్స్ మార్చేసిన ఆమిర్
తర్వాత పూర్తి సాంగ్ చూసినప్పుడు మాత్రం మేము చేసింది సరైనదేనని మాతో ఏకీభవించాడు. అలాగే క్లైమాక్స్ సీన్‌పైనా కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. దాన్ని కాస్త మార్చి రాశాడు. అది చూశాక ఆమిర్ చెప్పేది కరెక్టే అనిపించి మేము అదే ఫాలో అయిపోయాం. ఇలా సినిమా కోసం అందరి కలిసి పని చేశాం' అని తెలిపాడు. ఏక్ దిన్ మూవీ మే 1న విడుదల కానుంది. ఇకపోతే మన్సూర్ ఖాన్ గతంలో ఆమిర్‌ఖాన్ హీరోగా 'ఖయామత్ సే ఖయామత్ టక్', 'జో జీతా వొహి సికందర్' సినిమాలు తెరకెక్కించాడు. మన్సూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి.
చదవండి: నీకోసం పిలిచా, అరిచా, ఏడ్చా.. అయినా నువ్వు రాలేదు: నటుడి భావోద్వేగం


