
మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన లేటెస్ట్ సినిమా 'కన్నప్ప'. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. అదే ఊపులో థియేటర్లలోకి రాగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వీకెండ్ అయ్యేసరికే సైలెంట్ అయిపోయింది. ఇదంతా జరిగి దాదాపు నెల కావొస్తుంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఎప్పుడు రావొచ్చు?
'కన్నప్ప'లో విష్ణు హీరోగా కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితర ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్ కాస్టింగ్ చాలామంది నటించిన ఈ సినిమాని 'భక్త కన్నప్ప' స్టోరీతోనే తీశారు. కాకపోతే కమర్షియల్ అంశాలు, యాక్షన్ కాస్త జోడించారు. ఇవన్నీ కాదు ప్రభాస్ ఇందులో అతిథి పాత్ర చేయడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఆసక్తి చూపించారు.
(ఇదీ చదవండి: వరలక్ష‍్మి శరత్ కుమార్‌కు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన భర్త.. రేటు ఎంతంటే?)
ఇలా ఓ మాదిరి అంచనాలతో గత నెల 27న 'కన్నప్ప' థియేటర్లలో రిలీజైంది. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు వార్తలు రాగా.. కేవలం రూ.40-50 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్లు టాక్. ఇకపోతే రిలీజ్‌కి ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు.. ఓటీటీ హక్కుల్ని అమ్మలేదని చెప్పాడు. కానీ ఇప్పుడేమో మూవీ డిజిటల్ రైట్స్‌ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని, ఈ వీకెండ్‌లో అంటే జూలై 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారని అంటున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాల్సి ఉంది.
'కన్నప్ప' విషయానికొస్తే.. గూడెంలో పుట్టి పెరిగిన తిన్నడు(విష్ణు).. చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల నాస్తికుడిగా మారిపోతాడు. చుట్టుపక్కలా గూడేల్లో ఏ ఆపద వచ్చిన ముందుంటాడు. అలాంటి కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి బహిష్కరణకు గురవుతాడు. ప్రేయసి నెమలి(ప్రీతి ముకుందన్) కూడా ఇతడి వెంట నడుస్తుంది. అలా నాస్తికుడిగా వెళ్లిన తిన్నడు.. గొప్ప శివ భక్తుడిగా ఎలా మారాడు? ఇంతకీ రుద్ర ఎవరు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)