breaking news
Kannappa Movie
-
కన్నప్ప సినిమా.. చీటింగ్ చేసిన అక్షయ్ కుమార్?!
మంచు విష్ణు కన్నప్ప సినిమా (Kannappa Movie)లో నార్త్ నుంచి సౌత్ వరకు పెద్ద పెద్ద స్టార్స్ భాగమయ్యారు. ప్రభాస్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్.. ఇలా పలువురు కన్నప్ప చిత్రంలో నటించారు. అక్షయ్‌కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా యాక్ట్ చేశారు. మొదట ఈ మూవీ చేసేందుకు అక్షయ్ అసలు ఒప్పుకోనేలేదు. రెండుసార్లు రిజెక్ట్ చేశాడు. అయినా విష్ణు పట్టు వదలకుండా ప్రయత్నించి ఆయన్ను ఎలాగోలా ఒప్పించాడు. డైలాగ్స్ చెప్పేందుకు అక్షయ్ కుమార్ తిప్పలుఅలా అక్షయ్ కుమార్ వెండితెరపై మహాశివుడిగా కనిపించాడు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది, కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు. తాజాగా ఈ సినిమాలోని ఓ క్లిప్ నెట్టింట విపరీతంగా వైరలవుతోంది. అందులో అక్షయ్ కుమార్ డైలాగులు నేర్చుకుని సొంతంగా చెప్పినట్లు కనిపించడం లేదు. టెలిప్రాంప్టర్ను చూస్తూ అక్కడ రాసున్న డైలాగ్స్ చదువుతున్నట్లుగా ఉంది. అది అతడి కళ్లు తిప్పడం చూస్తేనే అర్థమైపోతుంది.ఇది చీటింగ్ కాదా?ఇది చూసిన నెటిజన్లు అక్షయ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇప్పటికీ డైలాగ్స్ గర్తుపెట్టుకుని చెప్పలేడా? ఎందుకిలా సగం సగం యాక్టింగ్ చేయడం? శివుడి వేషం కట్టుకుని చిన్న డైలాగ్స్ కూడా చెప్పడం రాకపోతే ఎలా? ఇది జనాల్ని చీటింగ్ చేయడమే అవుతుంది అని కామెంట్లు చేస్తున్నారు. అయితే సదరు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కాగా అక్షయ్ కుమార్.. ఇలా ప్రాంప్టర్ చూసుకుంటూ డైలాగ్స్ చెప్పడం కొత్తేమీ కాదు. సర్ఫిరా సినిమాలోనూ ఓ సీన్లో ఇలాగే డైలాగ్స్ చూసుకుంటూ చదివాడు. అక్షయ్ ప్రస్తుతం జాలీ ఎల్ఎల్బీ 3, వెల్కమ్ టు ద జంగిల్ సినిమాలు చేస్తున్నాడు.చదవండి: ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్ వీడియో వైరల్.. ఇంత పని చేస్తారనుకోలేదు -
శివభక్తుడు 'కన్నప్ప'ది ఏ ఊరో తెలుసా..?
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా విడుదల తర్వాత నేటి యువత అందరూ ఆయన స్వగ్రామం గురించి ఆరా తీస్తున్నారు. పరమశివుడికి అత్యంత గొప్ప భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయిన కన్నప్ప మన తెలుగు గడ్డపై జన్మించినట్లు ఆధారాలు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాజంపేటకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊటుకూరు అనే గ్రామమే కన్నప్ప స్వస్థలమని చెబుతారు. ఈ ఊరిలోనే స్వామి వారి విగ్రహానికి కన్నప్ప ప్రత్యేక పూజలు చేశారని, ఆయన ఇక్కడే నివాసం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో నిజం అని నిర్ధారించుకున్నారు. అక్కడ కన్నప్ప ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే భక్త కన్నప్ప విగ్రహంతో పాటు అన్నమాచార్యుల విగ్రహం కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. అది కన్నప్ప స్వగ్రామమే కాకుండా అన్నమయ్య అమ్మమ్మ ఊరు కూడా అదేనని చెబుతారు.కన్నప్ప పేరు వినగానే ప్రతి భక్తుడికి గుర్తుకు వచ్చే అంశం తాను ఆరాధించే దైవానికి లోకాన్ని చూసే కళ్లనే తృణప్రాయంగా సమర్పించుకున్న భక్తి గాధ వినిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటుకూరును పూర్వం ఉడుప్వూరు అని పిలిచేవారని శాసనాల్లో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన శేక్కిలారుముని రాసిన శివ భక్తుల చరిత్రలో కన్నప్ప ఊరి గురించి పేర్కొన్నారు. కన్నప్ప జన్మ స్థలం ఊటుకూరుగా వారు పేర్కొన్నారు. చాలామంది పరిశోధనలు చేసిన తర్వాత కన్నప్పది ఊటుకూరే అని నిర్ధారించారు. ఆయన 3102 BCE కాలానికి చెందిన వ్యక్తిగా వారు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం మంచు విష్ణు కూడా తన యూనిట్‌తో ఈ గ్రామంలో ఉన్న కన్నప్ప ఆలయాన్ని సందర్శించారు. -
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. కానీ, అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ ఎందుకు రాలేదో కూడా మీడియాతో తెలిపారు. ఈ కథకు ఇన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని కూడా తమ్మారెడ్డి చెప్పారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయితే, పదిరోజుల్లో కేవలం రూ. 50 కోట్ల మార్క్‌ను కూడా కన్నప్ప అందుకోలేకపోయింది. దీంతో నిర్మాతగా ఉన్న మొహన్ బాబుకు భారీ నష్టాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది.కన్నప్ప సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇలా మాట్లాడారు.' కన్నప్ప సినిమా చూశాను. చాలా బాగుంది. కానీ, సినిమా తెరకెక్కించే విషయంలో పాన్ ఇండియా రేంజ్ గురించి మాత్రమే ఆలోచించారు. అయితే, భక్తికి తగ్గ రేంజ్లో జాగ్రత్తలు తీసుకోలేదు. భక్తి అనే కాన్సప్ట్‌ను ప్రధానంగా తీసుకుని కన్నప్పను నిర్మించింటే బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉండేది. సినిమాలో శివుడు (అక్షయ్ కుమార్), పార్వతి (కాజల్ అగర్వాల్)ని చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. వారిద్దరు తప్పా మిగిలిన పాత్రలు అన్నీ బాగున్నాయి. కన్నప్ప సినిమా చూస్తున్నంత సేపు 'అన్నమయ్య' కాన్సప్ట్ గుర్తుకు వస్తుంది. ఔట్ డేటెడ్ కాన్సప్ట్‌ను తీసుకున్నారని అనిపించింది. ఏదేమైనా విష్ణును అభినందించాలి. కన్నప్ప విషయంలో బాగా కష్టపడ్డాడు. కానీ, అందుకు తగిన ఫలితం మాత్రం దక్కలేదు. సినిమాపై కొందరు భారీగా ట్రోల్ చేశారు. కానీ, బ్యాడ్ రిపోర్ట్ రాలేదు. సినిమా ఒక్కసారి అయినా చూడాల్సిందే అనే రివ్యూలు వచ్చాయి.' అని ఆయన అన్నారు. -
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
నెగెటివ్ ట్రోలింగ్‌ని, ఫేక్ రివ్యూస్‌ని అరికట్డడంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం అంటున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. కన్నప్ప సినిమా విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడేదని అభినందించాడు. ఇకపై మేము కూడా అదే ఫాలో అవుతామని చెప్పారు.మంచు విష్ణు తీసుకున్న నిర్ణయం ఏంటి?మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం కన్నప్ప జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్‌కి రెండు రోజుల ముందే మంచు విష్ణు ఓ హెచ్చరికను జారీ చేశారు. కన్నప్ప సినిమాని టార్గెట్‌గా చేసుకొని కావాలని ఎవరైన నెగెటివ్‌గా పోస్టులు పెట్టిన, వ్యక్తిగత హననానికి పాల్పడినా.. ఉద్దశ్యపూర్వకంగా విమర్శలు చేస్తూ పరువుకు భంగం కలిగిస్తే కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పబ్లిక్ కాషన్ నోటీస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది మంచి ఫలితాన్నే ఇచ్చింది. రిలీజ్ తర్వాత ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్ పెద్దగా జరగలేదు. ట్వీటర్లో సినిమాపై, మంచు ఫ్యామిలీపై నెగెటివ్ పోస్ట్‌లు పెట్టలేదు. సినిమాకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయి.అదే ఫాలో అవుతాం : దిల్ రాజుసినిమాను కాపాడాడానికి ఎవరు ఏ మంచి చేసినా.. మేమంతా అది ఫాలో అవుతామని అన్నారు దిల్ రాజు. ఆయన నిర్మించిన తాజా చిత్రం తమ్ముడు జులై 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటిస్తూ.. నెగెటిట్ ట్రోలింగ్‌పై స్పందించారు. ‘కన్నప్ప చిత్రబృందం మంచి నిర్ణయం తీసుకుంది. రిలీజ్‌కు ముందే అలా ఒక హెచ్చరిక జారీచేస్తే.. ఫేక్ రివ్యూస్, నెగెటివ్ ట్రోలింగ్, పైరసీ తగ్గిపోతుంది. అలా అని రివ్యూస్‌ని ఆపడం మా ఉద్దేశం కాదు. రివ్యూస్ రాయండి. కానీ రాసే ముందు ఒక్కసారి ఆలోచించండి. సినిమాపై కావాలని నెగెటివ్‌గా రాస్తే.. ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. హీరోలు, దర్శకులు ఈ సినిమా కాకపోతే మరో సినిమాతో హిట్ కొడతారు. కానీ నిర్మాత అయితే ఆ సినిమాకు డబ్బులు పోగొట్టుకోవాల్సిందే కదా? అది దృష్టిలో పెట్టుకొని జన్యూన్‌గా రివ్యూస్ ఇవ్వండి. దయచేసి హెల్ప్ చేయకపోయినా పర్లేదు ..డ్యామేజ్ మాత్రం చేయెద్దు’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశాడు. -
తెలుగు డైరెక్టర్లు ఎవరూ నాతో సినిమా చేయరు.. అందుకే!: విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Vishnu Manchu)కు హిట్టు పడి చాలా ఏళ్లే అయింది. ఆయన చివరగా జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈసారి రొటీన్ సినిమాలు కాదని తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను పట్టాలెక్కించాడు. దీనికోసం ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే కన్నప్ప షూటింగ్ మొదలుపెట్టాడు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ వంటి బడా తారలు కీలక పాత్రలు పోషించారు. కన్నప్పపై ట్రోలింగ్మహాభారత్, రామాయణ్ సీరియల్స్ తెరకెక్కించిన హిందీ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. దీంతో సినిమా సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విష్ణు.. కన్నప్పపై జరిగిన ట్రోలింగ్ గురించి మాట్లాడాడు. కన్నప్ప సినిమా టీజర్ రిలీజైనప్పుడు ఉత్తి పుణ్యానికే నెగెటివిటీ ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో నాన్నగారి గురించి, నా గురించి ఏమీ లేకపోయినా నెగెటివ్ థంబ్‌నైల్స్ పెడితే వారికి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఆదాయం వస్తోంది. వీఎఫ్ఎక్స్ గుర్తించలేకపోయారుఅది ఎంత పెద్ద తప్పని వారు రియలైజ్ అవట్లేదు. లొకేషన్స్ బాలేవు, గ్రాఫిక్స్ బాగోలేవు అని నానామాటలు అన్నారు. చాలామందికి తెలియని విషయమేంటంటే నేను రిలీజ్ చేసిన మొదటి టీజర్లో చాలా తక్కువ వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. రెండో టీజర్లో మాత్రం 70% వీఎఫ్ఎక్స్ ఉన్నాయి. అదెవరూ గుర్తించలేకపోయారు. మోహన్‌లాల్‌గారి ఎపిసోడ్లో ఆ బాణాలు తప్ప అన్నీ ఒరిజినలే! రియల్ లొకేషన్లో షూట్ చేశాం అన్నాడు. నాతో ఎవరూ చేయరుతెలుగులో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నా, హిందీలో ముకేశ్ కుమార్‌నే ఎందుకు నమ్మారు? ఆయనకే ఎందుకు డైరెక్షన్ బాధ్యతలు ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. అందుకు విష్ణు స్పందిస్తూ.. నాతో తెలుగులో ఏ డైరెక్టర్ పని చేయరని నాకు తెలుసు. కన్నప్ప స్క్రిప్ట్ తీసుకెళ్తే ఎవరూ నాతో చేయరని అందరికీ తెలుసు. పైగా దీనికంటే ముందు నేను చేసిన రెండు,మూడు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందువల్ల ఇక్కడ ఎవరూ చేయరు. మహాభారతాన్ని (సీరియల్) అంత గొప్పగా తీసిన ముకేశ్ కన్నప్పను అంతే అద్భుతంగా తెరపై చూపించగలరని నమ్మాను అని చెప్పాడు. ముకేశ్ కుమార్ సింగ్‌కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా కావడం విశేషం!చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్ -
'కన్నప్ప'కు ఇలా జరగడం బాధేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప (Kannappa) సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా హిందీ వర్షన్లో 80 శాతం సీట్లు ఫిల్ అవుతున్నాయి. ఆపై తమిళనాడులో కూడా మంచి టాక్‌తో రన్ అవుతుంది. తెలుగులో కూడా మ్యాట్నీ, సాయంత్రం షోలు హౌస్‌ఫుల్ అయిపోతున్నాయి. అయితే, తాజాగా మంచు విష్ణు తాజాగా సోషల్‌మీడియాలో విజ్ఞప్తి చేస్తూ పోస్ట్ పెట్టారు. కన్నప్ప చిత్రం పైరసీకి గురవుతుందంటూ విష్ణు ఆవేదన చెందారు. ఎంతో కష్టపడి సినిమాను నిర్మించామని, ఎవరూ పైరసీని ప్రొత్సహించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.కన్నప్ప సినిమా పైరసీకి గురైందని నటుడు మంచు విష్ణు తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. ఇప్పటికే సుమారు 30వేలకు పైగానే అనధికారిక పైరసీ లింక్‌లను తమ టీమ్ తొలగించిందని ఆయన పేర్కొన్నారు. పైరసీ అంటే మరొకరి శ్రమను దోచుకోవడమే.. ఇలాంటి చర్య దొంగతనంతో సమానం అవుతుందన్నారు. ఈ విషయంలో చాలా బాధగా ఉందని విష్ణు ఆవేదన చెందారు. ' మన ఇంట్లో పిల్లలకు మనం దొంగతనం చేయమని మనం నేర్పించం. ఇలా ఒక సినిమాను పైరసీలో చూడడం కూడా దొంగతనంతో సమానమే అవుతుంది. దయచేసి ఇలాంటి వాటిని అరికట్టండి. మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి.' అంటూ విష్ణు కోరారు.కన్నప్ప సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 58 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ షో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీలో ప్రభాస్ పాత్రతో పాటు మంచు విష్ణు నటన అద్భుతంగా ఉందంటూ టాక్ బయటకు రావడంతో టికెట్లు బాగానే తెగుతున్నాయి. బుక్‌మైషోలో ప్రతిరోజు సుమారు ఒక లక్షకు పైగానే టికెట్లు సేల్ అవుతున్నాయి. -
'కన్నప్ప' తర్వాత మంచు విష్ణు సినిమా ఇదే.. దర్శకుడు ఎవరంటే..?
'కన్నప్ప' సినిమా విజయం తర్వాత మంచు విష్ణు జోరు పెంచుతున్నారు. త్వరలో ఆయన నటించనున్న కొత్త సినిమాపై వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్న దర్శకుడు ఎవరో కూడా సమాచారం బయటికి వచ్చింది. కన్నప్ప మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మ్యాట్నీ, సాయింత్రం షోలు హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఇదే జోష్‌తో ఆయన మరో సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. 'కన్నప్ప'కు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభుదేవా దర్శకత్వంలో మంచు విష్ణు తర్వాతి సినిమా ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వైరల్ అవుతుంది.'కన్నప్ప' హిట్ తర్వాత మంచు విష్ణు- ప్రభుదేవా కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రానుందని సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్టార్ కొరియోగ్రాఫర్‌గా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రభుదేవా ఇప్పటికే కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. గతంలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి వంటి సినిమాలతో దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, కన్నప్ప సినిమాకు కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన ప్రభుదేవా... మంచు విష్ణుతో మంచి స్నేహం ఏర్పడింది. దీంతో వారిద్దరూ కలిసి ఒక సినిమా చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం కమర్షియల్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ జానర్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు ఫ్యామిలీనే నిర్మించనుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఆ డైరెక్టర్ మాట వల్లే కన్నప్ప వాయిదా వేశా: మంచు విష్ణు
కన్నప్ప మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు హీరో మంచు విష్ణు. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో కన్నప్ప బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకు సక్సెస్ టాక్ రావడంతో మేకర్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప సక్సెస్ మీట్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు మంచు విష్ణు హాజరై మాట్లాడారు. కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా సంచలన డైరెక్టర్ ఆర్జీవీ వల్లే తాను మూవీని పోస్ట్‌పోన్ చేశానని వెల్లడించారు. దీనికి గల కారణాలను మీడియాతో పంచుకున్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నా జనరేషన్లో నేను నమ్మే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఇవాళ ఆయన నాకు ఓ మేసేజ్ పెట్టాడు. మార్చిలో నాన్నగారిని కలవడానికి వచ్చారు. ఆ రోజు ఇంట్లో కన్నప్ప సినిమా మేకింగ్ నాలుగు నిమిషాల వీడియోను ఆయనకు చూపించాను. మీ సినిమా మొత్తం గ్రాఫిక్స్ లేకుండా చూశాను సార్..ఎక్స్ట్రార్డినరీ అని వీవీఎస్ రవి అన్నారు. ఈ మాట విన్న రాంగోపాల్ వర్మ ఒక మాట అన్నారు. ఇంత జాగ్రత్త తీసుకున్న విష్ణు గ్రాఫిక్స్‌ను వదిలిపెడతాడా.. అవీ కూడా బ్రహ్మండగానే ఉంటాయి అన్నారు. అది విన్న తర్వాత భయపడి పోస్ట్‌పోన్ చేసేశా. ఈ రోజు కూడా టెక్నికల్‌గా మా డైరెక్టర్, ఎడిటర్, నేను చాలా సీక్వెన్స్‌లు వదిలిపెట్టేశాం. మేము అనుకున్నంతగా వీఎఫ్ఎక్స్ రాలేదు. ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం' అని వెల్లడించారు. #RamGopalVarma అన్న ఒక్క మాటకి ఏప్రిల్ నుంచి పోస్టుపోన్ చేశాను - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/yiMnZW5RdU— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. రెండో రోజు ఊహించని కలెక్షన్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు. -
కన్నప్ప సినిమా సక్సెస్‌మీట్ (ఫోటోలు)
-
కన్నప్పను అభినందిస్తుంటే ఆనందంగా ఉంది
‘‘నటుడిగా 50 ఏళ్ల ప్రయాణం నాది. అప్పట్నుంచి ఇప్పటివరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ‘కన్నప్ప’ సక్సెస్ తర్వాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. వారి ప్రేమకు నేను తిరిగి ఏమి ఇవ్వగలను... వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబు తెలిపారు. విష్ణు మంచు హీరోగా ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ కోసం యూనిట్ అంతాప్రాణం పెట్టి పని చేశాం. భగవంతుడి ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మాకు ఇంత హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘మాలాంటి నటీనటులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని చెప్పారు. ముఖేష్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘మోహన్‌బాబు, విష్ణుగార్లు పదేళ్లుగా ‘కన్నప్ప’ కోసం కష్టపడుతూ వచ్చారు. మా సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘కన్నప్ప’ చిత్రం ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ వినయ్ మహేశ్వరి, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశి, నటులు శివ బాలాజీ, కౌశల్, అర్పిత్ రంకా మాట్లాడారు. -
కన్నప్పపై 'ఆర్జీవీ' ట్వీట్.. మంచు విష్ణు రియాక్షన్
మంచు విష్ణు (Manchu Vishnu) నటించిన కన్నప్ప సినిమాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న కన్నప్ప చిత్రాన్ని తాజాగా చూసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయాన్ని వాట్సప్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే, ఇదే విషయాన్ని విష్ణు సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ పంపిన మెసేజ్‌ను కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు.కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవీ ఇలా మెసేజ్ చేశారు. 'మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్లే భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే, నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీని నాలుగుసార్లు చూశాను. కానీ, ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటి కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావ్ అని చెప్పడం కరెక్ట్. ఆలయంమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పడు నీ నటన అద్భుతం.. ఒక్కోసారి ఊపిరి తీసుకోనివ్వలేదే కూడా.. సినిమా క్లైమాక్స్‌లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన రెండు కళ్లను సమర్పించే సీన్లో నీ నటన గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది.నేనొక నాస్తికుడిని. ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ, నీ నటనతో నన్ను మార్చేశావ్.. వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పికటికీ మాస్టర్‌క్లాస్‌గా నిలుస్తోంది. సినిమా చివరి సీన్లో నీవు పలికించిన భావోద్వేగాలు పతాకస్థాయికి చేరుతాయి. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.' అని విష్ణుకు వాట్సాప్‌లో ఆర్జీవీ మెస్సేజ్ చేశారు. తన సినిమాపై ఆర్జీవీ చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా ఇలా రియాక్ట్ అయ్యారు. 'రామూ గారు.. మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకొంటున్నా. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్‌తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలామంది ఈ ప్రాజెక్ట్‌పై ద్వేషాన్నే చూపారు. కానీ, నమ్మకంతో ముందుకు వెళ్లాను.' అని ఆయన అన్నారు.This text message is like a dream come true for the actor in me. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/cB4CEjcmGo— Vishnu Manchu (@iVishnuManchu) June 28, 2025 -
అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్.. కన్నప్ప మూవీకి అదిరిపోయే రివ్యూ ఇచ్చిన మనోజ్
-
కోట్లు కొల్లగొడుతున్న కన్నప్ప.. డే1 కలెక్షన్స్ ఎంతంటే..?
-
మైథలాజి మూవీస్ కు కేరాఫ్ అడ్రస్ గా రెబల్
-
కన్నప్పలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. రచ్చ లేపిన ఫ్యాన్స్
కొందరు పెళ్లి పేరు ఎత్తితేనే పారిపోతుంటారు. అందులో డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ముందు వరుసలో ఉంటాడు. 45 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి ముచ్చటే లేదు. ఈ ఏడాదే ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పడుతుందంటూ ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపించినా అవన్నీ ఉట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి. డార్లింగ్ జీవితంలోకి రాబోయే అమ్మాయి ఎక్కడుందో? ఏంటో? లక్కీ గర్ల్ అని అభిమానులు సరదాగా అనుకుంటూ ఉంటారు. పెళ్లంటే ముఖం చాటేస్తున్న హీరోఅయితే ఎవరెన్ని అనుకున్నా.. వయసు మీద పడుతున్నా సరే.. ప్రభాస్ మాత్రం పెళ్లంటేనే నాలుగడుగులు వెనకడుగు వేస్తున్నాడు. వయసు దాటిపోతున్నా.. లెక్క చేయడం లేదు. రియల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైఫ్‌లో కూడా ఇదే జరిగింది. కన్నప్ప సినిమాలో రుద్ర పాత్రలో కనిపించాడు ప్రభాస్. ఓ సీన్లో తిన్నడు(విష్ణు).. రుద్ర(ప్రభాస్)ను నీకు పెళ్లయిందా? అని అడుగుతాడు. అందుకు రుద్ర.. నా పెళ్లి గురించి నీకెందుకులే.. అని కౌంటరిచ్చాడు. అప్పుడు విషయం అర్థమైన తిన్నడు.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్ విసురుతాడు. ఈ సంభాషణకు థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ప్రభాస్ అభిమానుల అరుపులతో థియేటర్ దద్దరిల్లిపోతోంది.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. విష్ణు ప్రధాన పాత్రలో నటించాడు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: రెండో బిడ్డ జననం.. ఫోటో షేర్ చేసిన ఇలియానా -
కన్నప్ప రిలీజ్.. మంచు లక్ష్మీ పోస్ట్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన కన్నప్ప ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో కన్నప్ప టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ చూసిన మంచు మనోజ్ తన రివ్యూ కూడా ఇచ్చేశారు. అన్న ఇంత బాగా చేస్తాడని ఊహించలేదని అన్నారు. అలాగే ప్రభాస్ నటనపై ప్రశంసలు కురిపించారు.అయితే తాజాగా మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న కూడా కన్నప్ప మూవీపై పోస్ట్ చేసింది. శివుని సేవ చేసినవాడికి లోకమంతా సహాయకరమే అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. ఈ సందర్భంగా కన్నప్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పిది. మీరంతా కన్నప్ప సినిమాను థియేటర్లకు వెళ్లి చూడాలంటూ అభిమానులను కోరింది. మంచు ఫ్యామిలీ వివాదం తర్వాత మొదటిసారి మంచు మనోజ్, మంచు లక్ష్మీప్రసన్న పాజిటివ్‌గా పోస్టులు చేయడంతో విష్ణు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ చిత్రానికి ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. -
'అప్పటిదాకా కన్నప్ప ఓటీటీకి రాదు..' మంచు విష్ణు క్లారిటీ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రపంచవ్యాప్తందా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే కన్నప్పకు ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రభాస్.. రుద్ర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే రిలీజ్ ముందు రోజు మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు కన్నప్ప గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ మూవీని ఓటీటీకి ఎప్పుడు తీసుకొస్తారని ప్రశ్నించగా.. ఆయన సమాధానామిచ్చారు. నా సినిమా 10 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుందని స్పష్టం చేశారు. రిలీజ్ విషయంలో నాపై ఒత్తిడి లేదని చెప్పారు. అందుకే కన్నప్పను పది వారాల తర్వాతే ఓటీటీకి తీసుకొస్తామని వెల్లడించారు. -
కన్నప్ప మూవీ రిలీజ్.. ఆనందంతో చొక్కా చింపుకున్న అభిమాని!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వచ్చిన చిత్రం కన్నప్ప అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. తొలి ఆట నుంచే ఈ మూవీకి పాజిటివ్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాపై మంచు మనోజ్ సైతం ప్రశంసలు కురిపించారు. ప్రభాస్ రోల్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్ల వద్ద అభిమానులు మంచు విష్ణు, ప్రభాస్ అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు.అయితే కన్నప్ప చూసిన ఓ అభిమాని థియేటర్ వద్ద తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు. థియేటర్‌కు వచ్చిన అభిమాని కన్నప్ప మూవీపై బ్లాక్‌బస్టర్ హిట్ అంటూ కేకలు వేశాడు. మంచు విష్ణును ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరి చెబుతున్నా.. పక్కా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా హిట్ అంటూ ఏకంగా తన షర్ట్‌నే చింపుకుని మరి కన్నప్పపై తన అభిమానం చాటుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు సైతం సూపర్ హిట్ అంటూ కామెంట్స్ చేశారు. -
కన్నప్పను కాపాడిన రుద్ర!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా చెప్పుకుంటున్న కన్నప్ప నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లోనే ఉంది. రుద్ర పాత్రలో ప్రభాస్(Prabhas) నటిస్తున్నాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమా ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అందరు అనుకున్నట్లుగా ఈ సినిమాను ప్రభాసే నిలబెట్టేవాడు.( చదవండి: కన్నప్ప మూవీ రివ్యూ) ఈ సినిమాలో ఆయన కనిపించేది 20 నిమిషాలే అయినా.. ఆ సన్నివేశాలే సినిమాలకు కీలకం. సెకండాఫ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. రుద్ర పాత్ర తెరపై కనిపించగానే థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్నట్లుగానే ఆయన ఎంట్రీ గ్రాండ్‌గా ఉంటుంది. ఇక ఆయన చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. తిన్నడుతో పాటు నెమలితో రుద్ర చేసే కామెడీ సంభాషణనలు ఆకట్టుకుంటాయి. రుద్ర పాత్రకు ప్రభాస్‌ని తప్ప వేరే హీరోని ఊహించుకోలేమని సినిమా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. . ఇక మోహన్ బాబు తనదైన డైలాగ్ డెలివరీతో మహాదేవ శాస్త్రిగా అద్భుత నటన కనబరిచాడు. హీరోయిన్ ప్రీతి ముకుందన్ చక్కగా చేసింది. మంచు విష్ణు కూడా తన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో విష్ణు నటన అందరినీ ఆకట్టుకుంటుంది. -
‘కన్నప్ప’ మూవీ రివ్యూ
టైటిల్ : కన్నప్పనటీనటులు: విష్ణు మంచు, మోహన్ బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులునిర్మాణ సంస్థ: ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనిర్మాత: మోహన్ బాబుకథ:పరుచూరి గోపాల కృష్ణ,ఈశ్వర్ రెడ్డి, జి. నాగేశ్వర రెడ్డితోట ప్రసాద్దర్శకత్వం: ముకేశ్ కుమార్ సింగ్సంగీతం : స్టీఫెన్ దేవస్సీసినిమాటోగ్రఫీ: షెల్డన్ చౌఎడిటర్: ఆంథోనీవిడుదల తేది: జూన్ 27, 2025కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆయన ప్రధాన పాత్ర పోషించడంతో పాటు కథకుడిగా, నిర్మాతగాను వ్యవహరించాడు. మంచు ఫ్యామిలికి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించాయి. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర నటులు కీలక పాత్రలు పోషించడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక టీజర్, ట్రైలర్ వచ్చాక ఈ సినిమాపై ఉన్న నెగెటివిటీ తగ్గిపోయింది. ప్రమోషన్స్ గట్టిగా చేయడంతో హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం(Kannappa Movie Review).కథేంటంటే..తిన్నడు(మంచు విష్ణు) పరమ నాస్తికుడు. అతని తండ్రి నాథ నాథుడు(శరత్ కుమార్) మాటే ఆయనకు వేదం. గూడెం ప్రజలకే ఏ కష్టం వచ్చినా ముందుంటాడు. పక్క గూడానికి చెందిన యువరాణి నెమలి(ప్రీతీ ముకుందన్)తో ప్రేమలో పడతాడు. ఓసారి గూడెంలో ఉన్న వాయు లింగం కోసం వచ్చిన కాల ముఖుడు (అర్పిత్ రాంకా) సైన్యంతో తిన్నడు యుద్ధం చేస్తాడు. ఈ విషయం కాల ముఖుడికి తెలిసి.. గూడెంపై దండయాత్రకు బయలుదేరుతాడు. అదే సమయంలో ఓ కారణంగా తిన్నడు గూడాన్ని వీడాల్సి వస్తుంది. నెమలితో కలిసి అడవికి వెళ్తాడు. శివుడి పరమభక్తురాలైన నెమలి.. దేవుడినే నమ్మని తిన్నడు కలిసి జీవితం ఎలా సాగించాడు? వీరి జీవితంలోకి రుద్ర(ప్రభాస్) ఎందుకు వచ్చాడు? శివరాత్రి రోజు ఏం జరిగింది? వాయు లింగం కోసం కాల ముఖుడు ఎందుకు వెతుకుతున్నాడు? పరమ నాస్తికుడైన తిన్నడు చివరకు శివుడు పరమ భక్తుడు కన్నప్పగా ఎలా మారాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కన్నప్ప కథ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పరమ నాస్తికుడైన తిన్నడు పరమ భక్తుడిగా ఎలా మారాడు అనేది 50 ఏళ్ల క్రితమే కృష్ణం రాజు ‘భక్త కన్నప్ప’ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. అదే కథతో ఇప్పుడు మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఓ భక్తి కథకు కావాల్సినంత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ ను నేటి తరానికి నచ్చేలా ‘కన్నప్ప’ కథను చెప్పాలనుకున్నారు. ఈ విషయంలో మంచు విష్ణుని అభినందించాల్సిందే. అయితే టెక్నికల్‌గా సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. సీజీ వర్క్ పేలవంగా ఉంది. వార్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఎమోషన్ని తెరపై బాగా పండించి ఆ లోపాలను కాస్త కప్పిపుచ్చారు. భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగా హ్యాండిల్ చేశాడు. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు సినిమా చాలా ఎమోషనల్‌గా సాగుతూ.. శివ భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. శివుడు గొప్పతనాన్ని పాట రూపంలో చెబుతూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆ తర్వాత తిన్నడు ఎందుకు నాస్తికుడిగా మారాల్సి వచ్చిందో అర్థవంతంగా చూపించారు. మంచు విష్ణు ఎంట్రీ కథనం ఆసక్తి పెరుగుతుంది. యువరాణి నెమలితో ప్రేమలో పడడం.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకుంటాయి. పాటల పేరుతో భక్తి చిత్రంలోనూ శృంగార రసాన్ని బాగానే పండించారు. కొన్ని చోట్ల ఆ శృంగార రసం మితిమీరిపోయింది కూడా. ఇక మోహన్ బాబు ఎంట్రీ, మోహన్ లాల్ ఎంట్రీ సీన్స్ అదిరిపోతాయి. అయితే ఫస్టాఫ్‌లో వచ్చే యుద్ద సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఓవరాల్‌గా ఫస్టాఫ్ పర్లేదులే అన్నట్లుగా సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం పరుగులు పెడుతుంది. ముఖ్యంగా రుద్రగా ప్రభాస్ ఎంట్రి ఇచ్చిన తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ప్రభాస్ కనిపించేది 20 నిమిషాలే అయినా.. ప్రేక్షకులు అలా చూస్తూ ఉండిపోతారు. క్లైమాక్స్‌లో విష్ణు నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తులకు చివరి 40 నిమిషాలు అయితే విపరీతంగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. తిన్నడు అలియాస్ కన్నప్పగా మంచు విష్ణు బాగా నటించాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో విష్ణు నటన అదిరిపోతుంది. ఆయన కెరీర్లో బెస్ట్ ఫెర్పార్మెన్స్‌గా కన్నప్ప నిలిచిపోతుంది. గూడెపు యువరాణి, శివుడి పరమ భక్తురాలు నెమలిగా ప్రీతి ముకుందన్ మంచి నటనతో ఆకట్టుకుంది. తెరపై కావాల్సినంత అందాలను ప్రదర్శిస్తూనే.. నటన పరంగాను మంచి మార్కులే సంపాదించుకుంది. విష్ణు, ప్రీతీల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక రుద్రగా ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడు. తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా.. అవే సినిమాకు కీలకంగా మారుతాయి. తిన్నడు, నెమలితో పాటు మహాదేవ శాస్త్రీ పాత్రలకు రుద్రకు మధ్య వచ్చే సీన్స్ అదిరిపోతాయి. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తాయి. ఇక శివుడికి తనకంటే గొప్ప భక్తుడు లేడని భావించే మహాదేవ శాస్త్రీగా మోహన్‌బాబు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగు డెలివరీ ఆ పాత్రకు హుందాతనం తెచ్చింది. మోహన్‌లాల్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. ఆ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. శివుడి పాత్రలో అక్షయ్ కుమార్, పార్వతీదేవి పాత్రలో కాజల్ ఒదిగిపోయారు. ఇక తిన్నడు తండ్రిగా శరత్‌కుమార్ నటన బాగుంది. కానీ, ఓన్ వాయిస్‌తో చెప్పిన డబ్బింగ్ బాగోలేదు. చిన్నప్పటి తిన్నడుగా నటించిన అవ్రామ్.. నటన పరంగా ఓకే కానీ డబ్బింగ్ దారుణంగా ఉంది. తెలుగు పదాలు సరిగా పలకలేకపోయాడు. బ్రహానందం, మధుబాల, శివబాలాజీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా సినిమా బాగుంది. స్టీఫెన్ దేవస్సీ పాటలు పర్వాలేదు కానీ నేపథ్య సంగీతమే అంతగా బాగోలేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేసేలా బీజీఎం ఉంది. షెల్డన్ చౌ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. న్యూజిలాండ్ అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Kannappa: అన్న ఇంత బాగా చేస్తాడని కలలో కూడా ఊహించలేదు.. మనోజ్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన లభిస్తోంది. శుక్రవారం (జూన్ 27న) కన్నప్ప చిత్రాన్ని విష్ణు సోదరుడు, హీరో మంచు మనోజ్ ప్రసాద్ ఐమాక్స్‌లో వీక్షించాడు. ఈ సందర్భంగా అతడు సినిమా బాగుందని మెచ్చుకున్నాడు. మనోజ్ మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను. చాలా చాలా బాగుంది. ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్తుంది. క్లైమాక్స్‌లో (విష్ణు) ఇంత గొప్ప పర్ఫామెన్స్ ఇస్తారని కలలో కూడా అనుకోలేదు. వెయ్యి రెట్లు బాగుందిఅందరూ చాలా అద్భుతంగా చేశారు. నేను అనుకున్నదానికంటే వెయ్యి రెట్లు బాగుంది. చిత్రయూనిట్ కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని, మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నాను. సినిమా ప్రారంభంలో ఐదు నిమిషాలు మిస్సయ్యాను. దానికోసం కన్నప్ప సినిమాను మరోసారి చూస్తాను అని మనోజ్ చెప్పుకొచ్చాడు.ప్రత్యేకంగా చెప్పాలా?కానీ అన్న పేరును మాత్రం ప్రస్తావించలేదు. మరో వీడియోలో మాత్రం 'చివరి 20 నిమిషాలైతే అదిరిపోయింది. అన్న (విష్ణు) కూడా ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు. నాన్న (మోహన్‌బాబు) యాక్టింగ్ గరించి ప్రత్యేకంగా చెప్పాలా? అదరగొట్టాడు. సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నాడు. కన్నప్పకన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మహాభారతం సీరియల్ ఫేం ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించాడు. మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్‌లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో షూటింగ్ ప్రారంభించారు. దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ నిర్మితమైంది. ప్రభాస్, మోహన్‌లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఈ సినిమా చేశారు.చదవండి: సినిమాటోగ్రాఫర్ రసూల్ భార్య ఎవరో తెలుసా? ఆ టాలీవుడ్ నటి -
Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ ట్విటర్ రివ్యూ
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa ) ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆయన లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాన్, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జూన్ 27) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కన్నప్ప కథేంటి? ఎలా ఉంది? ప్రభాస్ ఈ సినిమాకు ఎంత వరకు ప్లస్ అయ్యాడు? తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.కన్నప్ప చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా చాలా బాగుందని కొంతమంది, యావరేజ్‌గా ఉందని మరికొంతమంది ట్వీట్ చేశారు. మంచు విష్ణు నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన కెరీర్లోనే ఇది బెస్ట్ ఫెర్పార్మెన్స్ అని కామెంట్ చేస్తున్నారు. #KannappaReview ✅🔥Vishnu Manchu delivers his career-best performance 👑Prabhas cameo = Goosebumps overload 💥Mohanlal’s character is a big surprise 👀BGM & elevations are top-class 💯Climax is pure emotion – will leave you in tears 😢BLOCKBUSTER LOADING 📿✨ 3.5/5 pic.twitter.com/NhfoLlh9an— POWER Talkies (@PowerTalkies1) June 26, 2025 మంచు విష్ణు కెరీర్లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ క్యామియో రోల్ గూస్బంప్స్ తెప్పిస్తాయి. మోహన్ లాల్ క్యారెక్టర్ బిగ్ సర్ప్రైజ్, నేపథ్య సంగీతం, ఎలివేషన్స్ టాప్ క్లాస్‌గా ఉన్నాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్ బయటకు వస్తారంటూ ఓ నెటిజన్ ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. Prabhas kosam cinema ki vellipovachuPrabhas scenes chala baagunnayi His cameo is worth the ticket price🙏🏽🙏🏽🙏🏽#Kannappa #Prabhas #KannappaMovie #KannappaOnJune27th— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ కోసమే ఈ సినిమాకు వెళ్లిపోవచ్చు. ప్రభాస్ సీన్స్ చాలా బాగున్నాయి. మనం కొన్న టికెట్‌కు ప్రభాస్ అతిథి పాత్ర న్యాయం చేస్తుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.#Kannappa is an Mythology drama that bores from start to finish due to its outdated and bland screenplay. The storyline idea may have been emotional on paper. However, it feels lifeless and somewhat silly when translated on screen. Rating: 2/5 #Kannappa#Prabhas #Prabhas— AbhishekSharma Sena (@KapuIndrasen) June 27, 2025 కన్నప్ప బోర్‌గా సాగే ఓ మైథాలజీ డ్రామా. స్క్రీన్‌ప్లే చప్పగా ఉండడంతో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు బోరింగ్‌గా సాగుతుంది. ఈ స్టోరీ లైప్ పేపర్‌పై రాసుకున్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించొచ్చు కానీ తెరపై చూస్తే మాత్రం నిర్జీవంగా, కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి అంటూ ఓ నెటిజన్ కేవలం 2 రేటింగ్ మాత్రమే ఇచ్చాడు.#Kannappa #KannappaMovieIf same cameo of Rudra was offered to any contemporary stars they would have said no because of risk and insecurity#Prabhas gambles pay off in hugeThen Baahubali now the list ever goes onHe is the choosen one of all the stars and he's the super star pic.twitter.com/YCHHckCoB1— IndianCinemaLover (@Vishwa0911) June 27, 2025 ప్రభాస్ పోషించిన రుద్ర పాత్రను ఈ రోజుల్లో ఏదైనా యంగ్ హీరోకు ఆఫర్ చేస్తే రిస్క్ ఎందుకని సున్నితంగా తప్పుకునే వారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ రిస్క్ చేశాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు ప్రాణం పోసింది. బాహుబలి తర్వాత ఆయన మరో మంచి పాత్రని ఎంచుకున్నాడు. అందుకే ప్రభాస్ సూపర్‌స్టార్ అయ్యాడంటూ ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.#KannappaReview Rating: ⭐️⭐️½ #VishnuManchu gives a heartfelt performance, #AkshayKumar brings divine intensity as Lord Shiva,But the film suffers from a slow pace, flat BGM & a dull and disengaged cameo by #Prabhas that adds no real value.Review 👇https://t.co/YOC4dI82lU— CineMarvel🇮🇳 (@cinemarvelindia) June 27, 2025Mahashivratri Episode starring Prabhas worked very big time🛐🔥🔥🔥🔥🔥Adhi Biggest plus point ani mention chestunaru andharu🥵🔥🔥 And vishnu last 20 mins ichi padesadu anta🔥🔥#KannappaReview pic.twitter.com/b45nW48OH1— Legend Prabhas 🇮🇳 (@CanadaPrabhasFN) June 27, 2025 -
న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు.. మంచు విష్ణు రియాక్షన్ వైరల్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.న్యూజిలాండ్‌లో మీరు 7000 ఎకరాలు కొన్నారా? సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిపై మీరేమంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి మంచు విష్ణు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నీకు ఓ వంద ఎకరాలు రాసిస్తా నువ్వు కూడా వచ్చేయ్ అంటూ మీడియా ప్రతినిధికి నవ్వుతూ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇటీవల 7 వేల ఎకరాలు కొనుగోలు చేశారని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. దీనిపై టాలీవుడ్ నటుడు బ్రహ్మజీ కూడా క్లారిటీ ఇచ్చారు. కాగా..భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా బాలనటులుగా నటించారు.న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నారా? Vishnu Manchu Reaction 🤣 pic.twitter.com/EfEJ1BugO6— Rajesh Manne (@rajeshmanne1) June 26, 2025 -
‘కన్నప్ప’ నిర్మాణ సంస్థ వార్నింగ్.. అలా చేయడం వల్లేనన్న విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నప్ప ప్రమోషన్లలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు కన్నప్ప టీమ్. ఈ సందర్భంగా విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే ఇటీవల'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. తాజాగా ఈ విషయంపై ప్రెస్మీట్లో మంచు విష్ణు స్పందించారు.చెన్నైలో కన్నప్ప సినిమా చూసిన ఒకతను నన్ను కౌగిలించుకుని ఏడ్వడం మొదలెట్టారు.. చివరిగంట నా లైఫ్‌లో చూడలేదని చెప్పాడు. మహానటుడు రజినీకాంత్ సినిమా చూసిన చెప్పిన మాట నా లైఫ్‌లో మర్చిపోలేనని అన్నారు. అయితే కన్నప్ప చూసిన ఒకతను రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూ వచ్చిన మూడు గంటల్లో ట్విటర్లో దాదాపు 42 మంది రివ్యూలు రాసి 0.5 రేటింగ్ ఇచ్చారని తెలిపారు. అయితే కొందరు కన్నప్ప సినిమా చూడకుండానే ట్విటర్లో రివ్యూలు ఇచ్చారని అన్నారు. అందువల్లే ఇలాంటి వారిని అరికట్టడం కోసమే కాపీరైట్ స్ట్రైక్, లీగల్ ప్రొసీజర్ తప్ప ఎవర్నీ బెదిరించడం నా ఉద్దేశ్యం కాదని వెల్లడించారు. మీ వల్లే సినిమాలు వెళ్తాయని.. సినిమా చూస్తూ రివ్యూలు పెట్టడం పైరసీ చేయడంతో సమానమన్నారు. ట్విటర్, యూట్యూబ్‌లో సినిమా చూసేటప్పుడు పెట్టే వాళ్లను బ్లాక్ చేశామని తెలిపారు. అంతే తప్ప వార్నింగ్ ఇచ్చే సీన్ నాకు ఎక్కడిదంటూ నవ్వుతూ అన్నారు.కాగా.. ఈ చిత్రంలో 'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు. -
24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్.. మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్
మరికొన్న గంటల్లో(జూన్ 27) మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మంచు ఫ్యామిలీ, ముఖ్యంగా విష్ణు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్ (దాదాపు రూ. 250 కోట్లు) పెట్టి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అదే రేంజ్లో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు. దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై లాంటి నగరాల్లోనూ సినిమా ఈవెంట్స్ నిర్వహించారు. విష్ణు పడిన కష్టానికి ఫలితం తగ్గింది. ఈ సినిమాకు కావాల్సినంత రీచ్ అయితే వచ్చినట్లు ఉంది. అందుకే రిలీజ్‌కి ముందే భారీగా టికెట్స్ అమ్ముడు పోతున్నాయి. ఈ సినిమా టికెట్స్‌ని ఆన్లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. 24 గంటల్లోనే 1,15,000 టికెట్స్ సేల్ చేసి కన్నప్ప రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణునే సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు.‘24 గంటల్లో 1,15,000 టికెట్స్ సేల్ అయిపోయాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. సినిమా రిలీజ్‌కు ముందే ఇంత గొప్ప ప్రేమను పొందడం సంతోషంగా ఉంది. సినిమా పట్ల ప్రేమ చూపుతున్న ప్రతీ మూవీ లవర్‌కు థాంక్స్. ఇది సినిమా కాదు మహా శివుడి మహిమ.. కన్నప్పకు అంకితం’ అంటూ విష్ణు ట్వీట్ చేశాడు. కన్నప్ప విషయానికొస్తే.. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.115,000 tickets sold in just 24 hours.My heart is racing! 🙏🏽To witness this kind of pre-release love and anticipation is truly humbling.I’m deeply grateful to every movie lover for the unwavering support.This is not just a film, This is all glory to Lord Shiva and #Kannappa…— Vishnu Manchu (@iVishnuManchu) June 26, 2025 -
కన్నప్ప తీసింది వాళ్ల కోసమే.. కక్కుర్తి పడి కాదు: మంచు విష్ణు
సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంచు విష్ణు స్పందించారు. కన్నప్ప మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. తన సినిమాను ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని.. వాళ్లను ఇబ్బందిపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే టికెట్ రేట్లు పెంచలేదని అన్నారు. తెలంగాణలో టికెట్లకు ఎలాంటి పెంపు లేదని తెలిపారు. ఏపీలో కూడా కేవలం కొన్ని సెంటర్లలో మాత్రమే పెంపు ఉంటుదని మంచు విష్ణు వెల్లడించారు.అమెరికాలో సైతం కన్నప్ప ప్రీమియర్ షోలకు కేవలం 16 డాలర్లుగా మాత్రమే నిర్ణయించామని మంచు విష్ణు వెల్లడించారు. ఆ తర్వాత పెద్దవారికి 14 డాలర్లు, పిల్లలకు 12 డాలర్లుగా టికెట్ ధరలు ఉన్నాయని తెలిపారు. ఏ రోజు అయితే పాప్‌కార్న్, కోక్ ధరలు తగ్గిస్తారో ఆ రోజు నుంచి నేను మల్టీప్లెక్స్‌లో టికెట్స్ పెంచడానికి ఆలోచిస్తానని అన్నారు. అంతే తప్పా నా కక్కుర్తి కోసం టికెట్ రేట్స్ పెంచడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను పిల్లలు ఎక్కువగా చూడాలన్నదే తన కోరిక అని తెలిపారు. నా చిన్నప్పుడు రామాయణ, మహభారతం గురించి నేను టీవీల్లో చూసేవాడిని.. మన చరిత్ర, దేవుళ్ల గురించి సినిమాలు, కామిక్ బుక్ కల్చర్ ద్వారే తనకు తెలిసిందన్నారు. పిల్లలకు కూడా ఈ సినిమా నచ్చాలనే ఉద్దేశంతోనే కథను తీశామని విష్ణు స్పష్టం చేశారు.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. -
కన్నప్ప కోసం వెయిటింగ్.. వారి కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్!
కన్నప్ప టీమ్‌కు మంచు మనోజ్ ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలయ్యే కన్నప్ప సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు పోస్ట్ చేశారు. ఈ సినిమా కోసం నాన్న, ఆయన టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో కష్టపడ్డారని రాసుకొచ్చారు. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను థియేటర్లో చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ట్విటర్ ద్వారా మనోజ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.మంచు మనోజ్ తన ట్వీట్లో రాస్తూ..' కన్నప్ప చిత్రానికి, టీమ్‌కు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కోసం నాన్నతో పాటు ఆయన బృందం ఎంతో శ్రమించారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అలాగే మా లిటిల్ ఛాంపియన్స్ అరియానా, వివియానా, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. తనికెళ్ల భరణిగారి జీవితకాల కల జీవం పోసుకుని.. ఈ శుక్రవారమే కన్నప్ప విడుదలవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రభాస్, మోహన్‌లాల్ , అక్షయ్‌కుమార్, ప్రభుదేవాతో పాటు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వీరు సినిమా కోసం చేసిన చూపించిన ప్రేమ, నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. మంచు మనోజ్ ఇటీవలే భైరవం మూవీతో అభిమానులను అలరించారు. అయితే ఈ ట్వీట్లో ఎక్కడూ కూడా తన సోదరుడు మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. All the best to Team #Kannappa!My Dad and his team have poured years of effort and love into this film. I’m praying it roars to blockbuster success.Can’t wait to see my little champs Ari, Vivi, and Avram make memories on the big screen.So happy that #TanikellaBharani garu's… pic.twitter.com/CLg6wpinVx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 26, 2025 -
పదేళ్ల ప్రయాణం.. ‘కన్నప్ప’ గురించి 10 ఆసక్తికర విషయాలు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో(జూన్ 27) ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 2014లో ఈ చిత్రానికి బీజం పడితే.. పదేళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిత్రానికి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ మొదలు.. ప్రతి ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించి సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చారు. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పది ఆసక్తికర విషయాలు మీకోసం..1) ఈ సినిమాను తొలుత సీనియర్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి తీయాలని భావించాడు. తక్కువ బడ్జెట్లో రా అండ్ రస్టిక్ జానర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నాడట. కానీ ఆ స్క్రిప్ట్ మంచు విష్ణు దగ్గరకు వెళ్లాక.. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో తీయాలని భావించారట.2) 2014లో భరణి దగ్గర విష్ణు ఈ సినిమా కథ హక్కులను తీసుకున్నాడు. కొంతమంది దిగ్గజ రచయితలతో కలిసి స్క్రిప్ట్‌ని డెవలప్ చేసుకున్నారు. లొకేషన్స్ కోసం 2018లో విష్ణు పోలాండ్‌కి వెళ్లినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం రూపొందించారు.3) ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2023 సెప్టెంబర్‌లో ప్రారంభం అయింది. ఎక్కువ భాగం న్యూజిలాండ్‌లోనే చిత్రీకరించారు. 2023 నవంబర్‌లో ఈ సినిమా టైటిల్‌ని అధికారికంగా ప్రకటించారు.4) ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేం ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.5) 2024 మహాశివరాత్రి సందర్భంగా మంచు విష్ణు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అలాగే మోహన్ బాబు బర్త్‌డే సందర్బంగా 2024 మార్చి 19న కన్నప్ప కామిక్ బుక్‌ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ప్రతి సోమవారం ఒక అప్డేట్ ఇస్తూ సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.6) గతేడాది మే నెలలో జరిగిన కేన్స్ ఫెస్ట్వల్లో ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 14న ట్రైలర్‌ని విడుదల చేశారు.7) మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు ఈ చిత్రంలో నటించారు. కన్నప్పగా విష్ణు, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు, చిన్నప్పటి తిన్నడుగా విష్ణు కొడుకు అవ్రామ్ నటించారు. అలాగే విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో నటించడంతో పాటు ‘శ్రీకాళహస్తి గాథ’ పాటను ఆలరించారు.8) ఇటీవల కాలంలో ఎక్కువమంది స్టార్స్ కలిసి నటించిన చిత్రం కన్నప్ప అనే చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్‌తో పాటు శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో నటించారు. బ్రహ్మానందం, సప్తగిరి, రఘుబాబు, శివ బాలాజీ, కౌశల్ కీలక పాత్రలు పోషించారు.9) ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తూ 12 కట్స్ చెప్పిందట. దీంతో 195 నిమిషాల నిడివితో రూపొందిన చిత్రం.. చివరకు 182 (3:02 గంటలు)నిడివితో విడుదల కాబోతుంది.10) ఈ సినిమాకు దాదాపు రూ.200-250 కోట్ల వరకు ఖర్చు చేశారట. ప్రభాస్, మోహన్‌లాల్ ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఐదు వేల స్క్రీన్లలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. -
పురివిప్పిన ‘నెమలి' అందం.. కన్నప్ప బ్యూటీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే (ఫోటోలు)
-
కన్నప్పలో సైడ్‌కి నిలబడే పాత్ర.. మోహన్‌బాబు అడిగితే..
‘‘కన్నప్ప’ చిత్రంలో మహదేవశాస్త్రి (మోహన్‌బాబు పాత్ర) కొడుకుగా యాక్ట్ చేయమని మోహన్‌బాబుగారు అన్నప్పుడు ఆలోచించాను. మరీ సైడ్‌కి అలా నిలబడే పాత్ర ఎలా చేయాలని విష్ణుని అడిగితే, ‘నీ ఇష్టం’ అన్నారు. మా ఆవిడ మధుమిత కూడా అలానే అన్నారు. ఫైనల్‌గా ఒప్పుకున్నాను. అయితే ఈ చిత్రంలో ఆ పాత్ర చేసి ఉండకపోతే నేను చాలా మిస్ అయ్యేవాణ్ని. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పదనం అర్థమైంది’’ అని శివ బాలాజీ అన్నారు. విష్ణు మంచు హీరోగా ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కన్నప్ప’. మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్రంలో నటించిన శివ బాలాజీ మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యత కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, ఓ గొప్ప చిత్రం, పాన్ ఇండియన్ సినిమాలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాను. ఈ చిత్రంలో ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. ఇక నేను చేసిన ‘రెక్కీ’ సినిమాకి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘రెక్కీ 2’ త్వరలోనే రానుంది. ప్రస్తుతం ‘సిందూరం’ అనే చిత్రం చేశాను. అలాగే మోహన్‌బాబుగారి ప్రొడక్షన్లో నేను హీరోగా ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.చదవండి: నేను చెప్పానా.. జనాల్ని ఎలా ఫూల్స్ చేశారో చూశారా?: సింగర్ -
మంచు విష్ణు కన్నప్ప.. ఏపీలో టికెట్ ధరల పెంపు
ఏపీలో కన్నప్ప సినిమా టికెట్ రేట్లు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. రిలీజ్ రోజు నుంచి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు జారీ చేసింది. అయితే కేవలం హయ్యర్ క్లాస్ టికెట్ రేట్లు మాత్రమే పెంచుకునేందుకు సడలింపు ఇచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. టికెట్ రేటుకు అదనంగా రూ.50 పెంచుకునేందుకు ఉత్తర్వులిచ్చింది. తెలుగు ఫిల్మ్ చాంబర్ ద్వారా టికెట్ ధరల పెంపు కోసం ఏపీ గవర్నమెంట్‌కు మంచు విష్ణు దరఖాస్తు చేసుకోవడంతో టికెట్ పెంపునకు అనుమతిచ్చింది.బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
కన్నప్ప రిలీజ్.. శ్రీశైల ఆలయంలో మంచు విష్ణు పూజలు
కన్నప్ప విడుదలకు ముందు మంచు విష్ణు శ్రీశైల ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరెకెక్కించిన కన్నప్ప జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు.తన ఆధ్యాత్మిక ప్రయాణంలోని మధుర క్షణాలను మంచు విష్ణు గుర్తు చేసుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించినట్లు తెలిపారు. పన్నెండు జ్యోతిర్లింగాలు. ఒక ప్రయాణం. శాశ్వత శాంతి. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ శైలం మల్లికార్జున స్వామి ఆలయంలో పవిత్ర దర్శనం ఇప్పుడే పూర్తి చేసుకున్నానంటూ ఫోటోలను షేర్ చేశారు.ఈ సందర్శనతో పన్నెండు జ్యోతిర్లింగ ఆలయాలకు నా ప్రయాణం ముగింపునకు చేరుకుంది.. నా హృదయం నిండిపోయిందని.. నా ఆత్మ ధన్యమైనట్లు అనిపిస్తుందని రాసుకొచ్చారు. ప్రస్తుత జీవితం సానుకూలత, కృతజ్ఞత, శాంతి తప్ప మరేమీ లేదని పోస్ట్ చేశారు. నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం.. ఈ రోజు నేను మోస్తున్న స్ఫూర్తిని ప్రతిబింబించే కథ.. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కన్నప్ప కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. . హర హర మహాదేవ్ అంటూ పోస్ట్ చేశారు. Twelve Jyotirlingas. One journey. Eternal peace.Just completed the sacred darshan at Sri Sailam Mallikarjuna Swamy Temple — one of the twelve revered Jyotirlingas of Lord Shiva.With this visit, my journey to all twelve Jyotirlinga temples comes to a divine close.My heart is… pic.twitter.com/COYa872JrG— Vishnu Manchu (@iVishnuManchu) June 25, 2025 -
కన్నప్పకు చిక్కులు! మంచు విష్ణు ఆఫీస్‌లో జీఎస్టీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కన్నప్ప చిత్రయూనిట్‌కు భారీ షాక్ తగిలింది. సినిమా రిలీజ్‌కు రెండు రోజుల ముందు జీఎస్టీ అధికారులు సోదాలకు దిగారు. మంచు విష్ణు (Vishnu Manchu)తో పాటు పలువురి ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. కన్నప్ప బడ్జెట్‌ను విష్ణు ఎన్నడూ బయటపెట్టలేదు. ఓ ఇంటర్వ్యూలో రూ.100 కోట్లా? రూ.200 కోట్లా? అని అడిగినప్పుడు కూడా చెప్పేందుకు నిరాకరించాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు తన ఆఫీసుకు వస్తారని, ఎందుకీ గొడవ అని సమాధానం దాటవేశారు. చివరకు సినిమా రిలీజ్‌కు ముందే అధికారులు మంచు విష్ణు కార్యాలయంలో సోదాలకు దిగారు.చదవండి: వంద కోట్ల క్లబ్లో 'కుబేర' -
Chandreshwara: జూన్ 27న మరో మహాశివుని చిత్రం విడుదల
ఈ నెల 27న కన్నప్ప రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే రోజు మరో శివుడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మరో చిత్రం కూడా రిలీజ్ కానుంది. అదే ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వం వహించగా, సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై డాక్టర్ రవీంద్ర చారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. జూన్ 27న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. -
తను లేకపోతే ఫీలవుతుందని డైరెక్టర్ చెప్పారు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కన్నప్ప. ఇప్పటికే టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చేశాయి. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు.అంతేకాకుండా ఈ మూవీలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ కూడా నటించారు. ఇటీవల అతని షూటింగ్‌కు సంబంధించిన వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పటికే ఈ మూవీలో విష్ణు కుమార్తెలిద్దరు అరియానా- వివియానా సైతం ప్రత్యేక భక్తి పాటలో మెరిశారు. దీంతో ఈ మూవీలో మంచు విష్ణు ఫ్యామిలీ అంతా కనిపించనుంది. అయితే మంచు విష్ణుకు మరో కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మంచు విష్ణు ముగ్గురు పిల్లలు నటించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో తన చిన్న కుమార్తె గురించి మాట్లాడారు. తాను కూడా ఈ సినిమాలో ఉందని తెలిపారు. చిన్నపాపను కూడా ఓ సీన్లో పెట్టేశామని అన్నారు. అవ్రామ్ నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తాడని వివరించారు. నా చిన్న కూతురిని ఓ సీన్లో పెట్టమని డైరెక్టర్ సలహా ఇచ్చారు. లేకపోతే పెద్దయ్యాక తను ఫీలవుతుందని చెప్పారు. ఎక్కడైనా చిన్నపిల్లల సీన్లో ఛాన్స్ ఉంటే పెట్టేయండి అని చెప్పానని..తను డైలాగ్ కూడా చెప్పిందని మంచు విష్ణు తెలిపారు. దీంతో మొత్తంగా విష్ణు నలుగురు పిల్లలు కన్నప్పలో కనిపించనున్నారు. -
'కన్నప్ప' టీమ్ వార్నింగ్.. అలా చేస్తే గనుక
మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ప్రారంభమైనప్పుడు పెద్దగా అంచనాల్లేవు గానీ ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించడంతో కాస్త బజ్ ఏర్పడింది. తొలుత టీజర్ రిలీజైనప్పుడు విమర్శలు కాస్త గట్టిగానే వచ్చాయి కానీ తర్వాత తర్వాత పాటలు, ట్రైలర్ విడుదల చేసినప్పుడు నెగిటివిటీ కాస్త తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో టీమ్ ఓ నోట్ రిలీజ్ చేసింది.'కన్నప్ప' తీసిన నిర్మాణ సంస్థ చాలా పెద్ద నోట్ రిలీజ్ చేసింది గానీ సింపుల్‌గా చెప్పుకొంటే క్రిటిక్స్, యూట్యూబర్స్ ఎవరైనా సరే కావాలని సినిమాని టార్గెట్ చేసి, నెగిటివ్‌గా చెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీమ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో అస్సలు తగ్గేదే లే అన్నట్లు నోట్లో రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ప్రభాస్ కాదు.. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్?)చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు విజువల్స్, మంచు విష్ణు యాక్టింగ్‌పై ట్రోల్స్ గట్టిగానే వచ్చాయి. అప్పుడు పలువురు యూట్యూబర్స్ టీజర్‌పై తమ అభిప్రాయాలు చెబుతూ వీడియోస్ చేశారు. కానీ నిర్మాణ సంస్థ.. సదరు యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేయడం లాంటివి చేసిందని పలువురు బయటకొచ్చి మరీ చెప్పారు. తర్వాత అందరూ సైలెంట్ అయిపోయారు. మరి ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ నోట్ రిలీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.'కన్నప్ప'లో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్ర చేశాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, రుద్ర అనే పాత్రని ప్రభాస్ పోషించారు. పార్వతి దేవిగా కాజల్, శివభక్తుడిగా మోహన్ బాబు.. ఇలా స్టార్స్ పలు కీలక పాత్రలు చేశారు. వీళ్లతో పాటు బ్రహ్మానందం, మోహన్ లాల్ తదితర స్టార్స్ కూడా ఇందులో ఉన్నారు. మంచు విష్ణు ఇద్దరు కూతుళ్లు, కొడుకు కూడా ఇందులో బాలనటులుగా చేశారు. విష్ణు ఈ చిత్రంపై చాలా నమ్మకం, పెట్టుబడి పెట్టాడు. మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్) -
కన్నప్పలో ప్రభాస్ రోల్.. ఎంతసేపు కనిపిస్తారంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న కన్నప్ప రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి తెలుగు ఆడియన్స్‌కు కూడా బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పాత్రలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి కేవలం పది రోజులు మాత్రమే కాల్ షీట్స్ తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారని చెప్పారు. ఈ ముగ్గురి షూట్ కోసం సెట్ మొత్తం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తి చేశామని వెల్లడించారు.సెన్సార్ పూర్తితాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 182 నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్‌టైమ్ కాస్తా ఎక్కువగానే వచ్చింది. దాదాపు 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. ఈ మేరకు సీబీఎఫ్సీ నిబంధనల ప్రకారం చిత్రంలో మార్పులు చేశారు. -
ప్రభాస్ది పవర్ఫుల్ పాత్ర.. చివరి గంట అద్భుతం: దర్శకుడు ముకేష్
కన్నప్ప అనేది మైథలాజీ కాదు.. ఇది మన హిస్టరీ. ఓ ఘటన జరిగితే.. ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతుంటారు. కన్నప్ప అనే వాడు ఉండేవాడు. కానీ ఎవ్వరికీ సరిగ్గా తెలీదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు. ఇదంతా మన చరిత్ర. దాన్నే మా చిత్రంలో చూపించాం’ అన్నాడు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్. ఆయన దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ముఖేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..👉 నేను ఇంత వరకు బుల్లితెరపై చేసినవన్నీ హై బడ్జెట్ ప్రాజెక్టులే. ‘మహా భారతం’ సీరియల్‌ను రూ. 200 కోట్లతో తీశాం. నాకు సినిమాలేమీ కొత్త కాదు. ఇది వరకు అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఇంగ్లీష్ చిత్రాల్ని నిర్మించాను. నేను బుల్లితెరకు పని చేసినా, వెండితెరకు పని చేసినా ఒకే మైండ్ సెట్‌తో పని చేస్తాను.👉 ‘మహాభారతం’ సీరియల్ అన్ని ఎపిసోడ్స్‌కి నేను దర్శకత్వం వహించలేదు. మరి కొంత మంది దర్శకులు కూడా ఉన్నారు. విష్ణు టీం నుంచి నాకు ఓ సారి కాల్ వచ్చింది. నాతో పాటు ఇంకా కొంత మంది కూడా ఆ సీరియల్‌కు డైరెక్ట్ చేశారు అని చెప్పాను. ఆ తరువాత చాలా రోజుల వరకు కాల్స్ ఏమీ రాలేదు. అనూప్ సింగ్ ఠాకూర్ ఆచారి అమెరికా యాత్ర సినిమాను చేశారు. ఆ టైంలో నా గురించి అనూప్,విష్ణుకి చర్చ జరిగింది. అలా నన్ను మళ్లీ అప్రోచ్ అయ్యారు.👉 విష్ణు నన్ను హైదరాబాద్‌కు రమ్మన్నారు. ఇక్కడకు వచ్చినప్పుడు ఓ మూడు, నాలుగు గంటలు చర్చించుకున్నాం. అప్పటి వరకు నాకు కన్నప్ప గురించి అంత పెద్దగా తెలీదు. విష్ణు ఈ కథ గురించి చెప్పిన తరువాత చాలా రీసెర్చ్ చేశాను. మళ్లీ మోహన్ బాబు గారు మరోసారి పిలిచారు. మహాభారతం సీరియల్ గురించి నాతో గంట మాట్లాడారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి కూడా చర్చించుకున్నాం. అలా నన్ను ఈ చిత్రానికి ఫైనల్ చేశారు.👉 ‘కన్నప్ప’ కోసం ప్రతీ ఒక్కరూ అద్భుతంగా పని చేశారు. అందరూ ఎంతో అంకిత భావంతో సెట్స్ మీద వర్క్ చేశారు. వారి వల్లే నా పని చాలా ఈజీగా మారిపోయింది. అక్షయ్ , మోహన్‌లాల్, ప్రభాస్ , మోహన్ బాబు , విష్ణు , బ్రహ్మానందం ఇలా అందరితో పని చేయడం మరిచిపోలేని అనుభూతి. మోహన్ బాబు ఈ వయసులోనూ ఎంతో ప్యాషనేట్‌గా పని చేశారు. నిర్మాతగా ఒకలా ఉండేవారు.. నటించేటప్పుడు ఇంకోలా అనిపించేవారు.👉 ‘కన్నప్ప’ మీద ఇంత వరకు వచ్చిన చిత్రాలన్నీ చూశాను. కన్నడ, తెలుగు, హిందీలో వచ్చిన చిత్రాలన్నీ చూశాను. అన్నింటినీ గమనించాను. వారిలానే నేను కూడా న్యాయం చేయాలని అనుకున్నాను. విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. చివరి గంట అద్భుతంగా ఉంటుంది.👉 మా ఆర్ట్ డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారు. వెపన్స్, క్యాస్టూమ్స్ మీద చాలా పరిశోధనలు చేశాం. రెండో శతాబ్దం వాతావరణం తెరపైకి తీసుకు రావడానికి చాలా ప్రయత్నించాం. అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లి మూవీని షూటింగ్ చేశాం.👉 ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇందులో ఎవరి క్యారెక్టర్ కూడా అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు. అన్ని పాత్రలు ప్రేక్షకులపై కచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఎవ్వరి ఫ్యాన్స్ కూడా ఈ మూవీని చూసి నిరాశచెందరు. ఇప్పటి వరకు చాలా మందికి ఈ మూవీని చూపించాం. అందరూ అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు.👉 కన్నప్పపై ఇది వరకు వచ్చిన చిత్రాల్లో కూడా లిబర్టీ తీసుకున్నారు. ఇందులో కూడా కొంత వరకు ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఇంటర్ లింకింగ్‌గా చూపించాం. శ్రీకాళహస్తి అర్చకులకు ఈ మూవీని చూపించాం. ఈ చిత్రం పూర్తయిన తరువాత అద్భుతంగా ఉందని అర్చకులు మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని అడిగారు.👉 మహాభారతం సీరియల్ తీశాను. ఇప్పుడు సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. మహాభారతం అనేది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరైనా తీసుకోవచ్చు. రాజమౌళి గారు తీసుకోవచ్చు. ఆమిర్ ఖాన్ గారు తీసుకోవచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్. -
మంచు ఫ్యామిలీకి 7 వేల ఎకరాలు.. క్లారిటీ ఇచ్చిన బ్రహ్మాజీ
సెలెబ్రిటీలు ఏం మాట్లాడినా అది వార్త అవుతుంది. అందుకే వాళ్లు ఆచి తూచి మాట్లాడుతుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్లు జోక్ చేసినా..అది బెడిసి కొడుతుంది. వారి సరదా సంభాషణను వక్రీకరించి.. అదే నిజం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ విషయంలో అదే జరిగింది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సరదాగా చెప్పిన ఓ విషయాన్ని.. సోషల్ మీడియా మరోలా ప్రచారం చేసింది. చివరకు ఆ వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ(Brahmaji).. వివరణ ఇవ్వడంతో ఫేక్ ప్రచారానికి కాస్త బ్రేక్ పడింది. ఇంతకీ మంచు ఫ్యామిలీ చేసిన ఆ సరదా వీడియో ఏంటి? అసలు ఏం జరిగింది?700 ఎకరాలు మనదే..: మోహన్బాబుమంచు ఫ్యామిలీ ఇప్పుడు కన్నప్ప(Kannappa) ప్రమోషన్లో బిజీ అయిపోయింది. మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు కూడా ఈ సినిమా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా న్యూజిలాండ్‌లో కన్నప్ప టీం చిల్ అయిన వీడియోని నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో మోహన్ బాబు, విష్ణు సముద్రం పక్కన ఉన్న ఓ సువిశాలమైన మైదానంలో తిరుగుతూ.. ‘ఇదంతా నాదే.. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నాం. పక్కనే ఉన్న సముద్రం కూడా మంచు విష్ణుదే’ అని మోహన్ బాబు సరదాగా అంటాడు. మోహన్ బాబు కామెడీగా చేసిన ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. నిజంగానే మంచు ఫ్యామిలీ న్యూజిలాండ్‌లో స్థలాలు కొన్నారు అన్నట్లుగా ప్రచారం జరిగింది. దీంతో చివరకు వీడియో షేర్ చేసిన నటుడు బ్రహ్మాజీ దీనిపై వివరణ ఇచ్చాడు.అరే భాయ్.. అంత ఈజీనా?సరదాగా చేసిన వీడియోపై నెగెటివ్‌గా వార్తలు రావడంతో బ్రహ్మాజీ సంబంధించాడు. జోక్‌గా చేసిన వ్యాఖ్యలను కూడా ఇంత సీరియస్‌గా తీసుకుంటారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఫన్ కోసమే ఆ వీడియోని షేర్ చేశానని క్లారిటీ ఇచ్చాడు. ‘ సరదా కోసమే ఆ వీడియో చేశాం. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొన్నామని మోహన్ బాబు సరదాగా అన్నారు. అక్కడి పర్వతాలు కూడా కొన్నామని జోక్ చేశాడు. కానీ సడెన్‌గా నిజంగానే అక్కడ 7 వేల ఎకరాలు కొన్నారని వార్తలు రాశారు. అరే భాయ్.. న్యూజిలాండ్‌లో 7 వేల ఎకరాలు కొనడం అంత ఈజీనా? షూటింగ్ కోసం అక్కడి వెళ్లాం అంతే. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. . నాన్ సిటీజెన్స్లకు న్యూజిలాండ్‌లో స్థలాలు అమ్మరు. అక్కడి సిటిజన్స్‌కి మాత్రమే స్థలాలు కొనే హక్కు ఉంది. సరదా సంభాషణలను సీరియస్‌గా తీసుకోకండి. ఇప్పుడు నవ్వుకోండి. కానీ కామెడీని మరోలా మార్చి చెప్పకండి’ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. -
నాలోని దుష్టశక్తి పోవాలని నా భార్య అలా చేస్తుంది: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే తెగ ప్రమోషన్లు చేస్తున్న విష్ణు.. ఒకటి రెండు రోజుల్లో శ్రీకాళహస్తిలోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. దీనికి చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్‌ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు. తాజాగా ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ రంగన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.'లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సినిమా అంటే నాకు ఇష్టం. 'కన్నప్ప' కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలానే నేను హార్డ్ కోర్ హిందువుని.. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజూ బైబిల్ చదువుతుంది. అలానే రోజూ నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రిష ఇంట్లో దళపతి విజయ్.. ఆ రూమర్స్ నిజమేనా?) ఇప్పటివరకు వచ్చిన 'కన్నప్ప' సినిమాల్లో క్లైమాక్స్ ఒక్కటే అయినా.. అంతకు ముందు సన్నివేశాల్ని మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దాదాపు 50 ఏళ్ల తర్వాత, ప్రస్తుత జనరేషన్‌కి చూపించేందుకు తాను 'కన్నప్ప' తీశానని, శివుడి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని విష్ణు అన్నాడు.భారీ బడ్జెట్‌తో తీసిన 'కన్నప్ప'లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమాపై కూడా కాస్తోకూస్తో అంచనాలు ఉన్నాయి. గతవారం థియేటర్లలోకి వచ్చిన 'కుబేర' హిట్ కావడంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆ జోష్ని 'కన్నప్ప' కూడా కొనసాగిస్తుందా లేదా అనేది మరో మూడు నాలుగు రోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: మహేశ్‌బాబుతో పనిచేసేటప్పుడు గిల్టీగా ఫీలయ్యా: త్రిష) " I'm a HARDCORE HINDU and my wife is a Christian.She reads the Bible and puts it under my head in the bed, because she believes that the devil in me will leave."- #VishnuManchu | #Kannappa pic.twitter.com/nT3cPqKtSS— Movies4u Official (@Movies4u_Officl) June 23, 2025 -
ఫైనల్లీ కనిపించిన 'కన్నప్ప' డైరెక్టర్.. ఈయన ఎవరంటే?
మంచు ఫ్యామిలీ తీసిన 'కన్నప్ప'.. ఈ వీకెండ్ (జూన్ 27న) థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో కాస్త జోరు పెంచారు. తాజాగా శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. టీమ్ అంతా మూవీ కబుర్లు చెబుతూ సందడి చేశారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ చిత్ర దర్శకుడు కూడా కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. ఇంతకీ ఆయనెవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్‌బాబు)గత కొన్నాళ్ల నుంచి 'కన్నప్ప' ప్రమోషన్లు చేస్తున్నారు. చాలావరకు హీరో కమ్ నిర్మాత అయిన మంచు విష్ణునే కనిపిస్తున్నాడు. చిత్ర సంగతులన్నీ చెప్పాడు. ఇప్పటికీ ఏదో ఓ ఇంటర్వ్యూ ఇస్తూ మరిన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ దగ్గరుందంటే దర్శకుడు కూడా ప్రమోషన్లలో కనిపిస్తారు. 'కన్నప్ప' విషయంలో సదరు డైరెక్టర్ తప్పితే అందరూ కనిపిస్తూ వచ్చారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఈయన కనిపించారు.సడన్‌గా 'కన్నప్ప' దర్శకుడు ఎవరిని అడిగితే చాలామంది చెప్పలేరు. ఎందుకంటే తొలి నుంచి విష్ణు, ప్రభాస్ లేదంటే మోహన్ లాల్ పేర్లు మాత్రమే ప్రమోషన్లలో వినిపించాయి. కానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ముకేశ్ కుమార్ సింగ్ కూడా మామూలోడు ఏం కాదు. ఎందుకంటే 2012లో రామాయణ్, 2013-14లో మహాభారత్ సీరియల్స్‌లో కొన్ని ఎపిసోడ్స్‌కి దర్శకత్వం వహించారు. వీటితో పాటు తెనాలి రామ, మేరే సాయి తదితర భక్తిరస సీరియల్స్ తీసిన అనుభవం ఈయన సొంతం. 2008 నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాకపోతే ఎక్కువశాతం సీరియల్స్‌కి మాత్రమే దర్శకత్వం వహించడంతో సినిమా ప్రేక్షకులకు ఈయన గురించి పెద్దగా తెలియలేదు.(ఇదీ చదవండి: ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు)అలా పీరియాడికల్, భక్తి సీరియల్స్ తీసిన అనుభవం ఉండటంతోనే ముకేశ్ కుమార్ సింగ్‌కి.. 'కన్నప్ప' దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ట్రైలర్ చూస్తే ఆయన పనితనం బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. రిలీజ్ తర్వాత ఆయన వర్క్ ఏంటనేది పూర్తిగా తెలుస్తుంది. కాకపోతే ప్రమోషన్లలో ఆయనని ఎక్కువగా హైలైట్ చేయకపోవడానికి కూడా కారణమున్నట్లు కనిపిస్తుంది. స్వతహాగా ఆయనో హిందీ డైరెక్టర్. తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ. అందుకేనేమో మంచు విష్ణు.. ప్రమోషన్ల బాధ్యతని తన నెత్తిన వేసుకున్నాడు. దర్శకుడిని పెద్దగా కష్టపెట్టలేదనిపిస్తుంది.మంచు విష్ణు హీరో కమ్ నిర్మాతగా తీసిన 'కన్నప్ప'లో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, మధుబాల లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై తెలుగులో ఓ మాదిరి అంచనాలున్నాయి. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు: బ్రహ్మనందం) -
న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్‌బాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన బ్రహ్మానందం.. కన్నప్పను ఆదరించాలే తప్ప అల్లరి చేయొద్దని కోరాడు.జోక్ చేసిన మోహన్బాబుఇకపోతే కన్నప్ప షూటింగ్ అంతా న్యూజిలాండ్‌లోనే జరిగింది. ఆ సమయంలో చిత్రయూనిట్ సరదాగా తీసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మోహన్‌బాబు.. ఓ మైదానంలో నిల్చుని ఇదంతా నాది, విష్ణుదే.. అన్నాడు. వీడియో తీస్తున్న బ్రహ్మాజీ.. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లు వింటున్నారుగా.. మొత్తం బ్లాక్‌మనీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని సరదాగా అన్నాడు.7 వేల ఎకరాలు కొన్నాందాంతో మోహన్‌బాబు.. మా దగ్గర బ్లాక్‌మనీయే లేదు. న్యూజిలాండ్‌లోని వనాకాలో ఓ ఇల్లు, 7000 ఎకరాలు కొన్నాం. ఇదంతా మనదే అని జోక్ చేశాడు. ఇంతలో ప్రభుదేవా అక్కడికి రావడంతో ప్రభుదేవాతో కలిసి ఏడు వేల ఎకరాలు కొన్నట్లు మాట మార్చాడు. ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ జూన్ 27న విడుదల కానుంది. మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. Mohanbabu Mass 😂😂😂#JustforGags pic.twitter.com/Nbb2y053R6— V@ndeM@taR@m (@patriotatwork99) June 22, 2025 చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు -
ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని.. : మంచు విష్ణు
‘‘కన్నప్ప’ సినిమా ఆ భగవంతుని ఆశీస్సులు. మన చేతుల్లో ఏదీ ఉండదు అనడానికి ఉదాహరణే ఈ చిత్రం. రెండు సినిమాలు హిట్ అవగానే మనం గొప్పవాళ్లమని అనుకుంటాం. కానీ, మనం కేవలం వస్తువులమే. ఆ భగవంతుడు, తల్లిదండ్రుల ఆశీస్సులే ముందుకు నడిపిస్తాయి’’ అని మంచు మోహన్ బాబు అన్నారు. విష్ణు మంచు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్.. మంచు మోహన్‌బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్, మధుబాల తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది.శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మోహన్ బాబు మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’లో అందరూ హీరోలే. ఈ చిత్రంలో నటించిన నటీనటుల సహాయ, సహకారాలు మరువలేనివి. కన్నప్పగా తిన్నడు ఎలా మారాడు? పరమేశ్వరుడికి కళ్లు ఎలా ఇచ్చాడు? అన్నది ఈ చిత్రకథ. శ్రీ కాళహస్తీశ్వరుడి కరుణ, కటాక్షాలతో ‘కన్నప్ప’ సక్సెస్ అవ్వాలి. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మంచు విష్ణు(Manchu Vishnu) మాట్లాడుతూ– ‘‘ఇది నా సినిమా కాదు... కన్నప్ప సినిమా. ఎడిటింగ్‌లో సినిమా చూసిననప్పుడు.. ‘వావ్.. ఇంత పెద్ద సినిమానా? మేము చేయగలిగామా? నేను నటించానా?’ అనిపించింది. ఈ సినిమాలో చాలామంది హీరోలున్నారు. నటించినవారు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్... అందరూ హీరోలే. నేను పని చేసిన బెస్ట్ దర్శకుల్లో ముఖేష్ కుమార్‌గారు ఒకరు. శివుడి అనుగ్రహం వల్లే ఇంత పెద్ద సినిమా తీయగలిగానని శివ రాజ్‌కుమార్‌గారితో అన్నాను. ‘కన్నప్ప’ సినిమా చేయాల్సిన అవసరం ప్రభాస్‌కి లేదు. కానీ, నాన్నగారిపైన ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఒప్పుకున్నారు. కొంచెం డబ్బు, పేరు రాగానే మనుషులు మారిపోతుంటారు. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని పెద్ద నటుల్లో ప్రభాస్(Prabhas) ఒకరు... కానీ, మేమిద్దరం కలిసిన మొదటి రోజు నుంచీ ఈరోజు వరకు కూడా అలాగే ఉన్నాం. నా జీవితంలో ప్రభాస్ కృష్ణుడు అయితే... తన జీవితంలో నేను కర్ణుడిని. ఈ సినిమాకి ఏది సాధ్యమైంది అన్నా అది నా దేవుడైన నాన్నగారి వల్లే. ‘కన్నప్ప’ని ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘కన్నప్ప’ సినిమాని ఆదరించండి... అభిమానించండి... అల్లరి మాత్రం చేయకండి. ఎందుకంటే శివుడు ప్రతి ఇంటా, ప్రతి గుండెలోకి, ప్రతివాళ్ల మనసులోకి చేరాలి’’ అన్నారు.ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ– ‘‘మోహన్ బాబుగారు నన్ను నమ్మడం వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నాను. తెలుగు భాష కూడా తెలియని నన్ను నమ్మి, టాలీవుడ్‌కి తీసుకురావడం, గొప్ప ప్రాజెక్ట్ ఇవ్వడమంటే ఆయన ధైర్యం, నమ్మకమే. నేను పని చేసిన నటుల్లో విష్ణు మంచు మోస్ట్ ప్రిపేర్డ్ యాక్టర్. ప్రభాస్‌గారు మీకు రెబల్‌స్టార్. కానీ, నాకు తెలిసి ఆయన హంబుల్ స్టార్. సింపుల్‌గా ఉంటారు’’ అన్నారు. -
'మోహన్ బాబు ఇంటికొచ్చి ప్రాధేయపడ్డారు'.. బ్రహ్మనందం కామెంట్స్ వైరల్!
మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్‌తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.బ్రహ్మనందంను యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు ఈవెంట్లో నవ్వులు పూయించారు. ఒకవేళ మోహన్ బాబు గారి సినిమాల్లో మిమ్మల్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తే ఏ సినిమాను ఎంచుకుంటారు? అని ప్రశ్నించింది. అందులో మూడు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఒకటి అల్లుడుగారు, రెండోది పెదరాయుడు, మూడో ఆప్షన్‌గా అసెంబ్లీ రౌడీగా చెప్పింది.దీనికి బ్రహ్మనందం అసెంబ్లీ రౌడీ సినిమాను ఎంచుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో మొదట నన్నే అడిగారని అన్నారు. అయితే తాను రిజెక్ట్ చేశానని తెలిపారు. ఆ తర్వాత మోహన్ బాబు మా ఇంటికి ప్రాధేయపడితే ఏ చేస్తాం సుమ? అని సర్లే చేసుకోపో అని చెప్పానంటూ నవ్వులు పూయించారు. అయితే యమదొంగలో కూడా మిమ్మల్నే అడిగారంటా అని సుమ మరో ప్రశ్న వేసింది. యమదొంగలో మాత్రం నన్ను అడగలేదు.. అలాంటి పాత్రలకు ఆయనైతేనే కరెక్ట్‌గా సరిపోతాడు.. బయట సరిపోతాడు.. అలాగే స్క్రీన్ మీద కూడా ఆయనే సెట్ అవుతాడంటూ అందరినీ నవ్వించేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతేకాకుండా మోహన్ బాబులో మీకు నచ్చేది? నచ్చనిది ఏది? అంటూ సుమ అడిగింది. దీనికి మోహన్ బాబు అంటే నాకు అస్సలు నచ్చడంటూ సరదాగా మాట్లాడారు. ఓ మహ నటుడిని ఎవరు ఇష్టపడరమ్మా? అంటూ నవ్వుతూ మాట్లాడారు. -
'కన్నప్ప సినిమా ఆయన ఆలోచన కాదు'.. బ్రహ్మనందం ఆసక్తికర కామెంట్స్!
మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న మోస్ట్ అవైటేడ్ మూవీ 'కన్నప్ప'. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ప్రమోషన్స్‌తో బిజీగా మేకర్స్. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హాస్యనటుడు బ్రహ్మనందం ఆసక్తికర కామెంట్స్ చేశారు. మోహన్ బాబును ఉద్దేశించిన ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అసలు ఈ సినిమా ఆయన ఎందుకు తీశారా?అని ఒకసారి అనుకున్నానని తెలిపారు. డబ్బుల గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించే ఆయన ఇంత భారీ బడ్జెట్‌తో ఎలా ప్లాన్ చేశారా? అనిపించిందని అన్నారు.బ్రహ్మనందం మాట్లాడుతూ..' కన్నప్ప సినిమా మోహన్ బాబు ఎందుకు తీశారా అని ఒకసారి అనుకున్నా. ఎందుకంటే మోహన్ బాబు గురించి మీ అందరికీ తెలుసు. ఆయన ఐదు కోట్లో, పది కోట్లతోనూ సినిమా తీసి దాంతో ఓ పది, పదిహేను కోట్లు సంపాదించుకుని.. వాటితో మళ్లీ ఇంకో సినిమా తీసే వ్యక్తి. అలాంటి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తూ గౌరవించే వ్యక్తిగా నాకు తెలుసు. 200 కోట్ల రూపాయలు పెట్టి కన్నప్ప సినిమా ఎందుకు ప్లాన్ చేశాడని ఆలోచిస్తే.. ఈ ఆలోచన ఆయనది కాదు.. సకల సృష్టి కార్యుడైన ఆ పరమేశ్వరుని ఆలోచన అతనిలో సంక్రమించిదేమో అనిపించింది' అని అన్నారు. ఈ వేదికపై బ్రహ్మనందం.. ప్రభాస్ పేరు ప్రస్తావించగానే అభిమానులు పెద్దఎత్తున సందడి చేశారు. ప్రపంచమంతా గర్వించే నటుల్లో ప్రభాస్ ఒకరని అన్నారు. డబ్బు కోసమో.. ఏదో ఒక పాత్ర కోసమో ఆయన ఈ సినిమాని అంగీకరించలేదని తెలిపారు. ప్రభాస్ మానవతా విలువలు కలిగిన వ్యక్తి.. ఒక మంచి మనిషి.. ఎవరు చేయి చాచి ఏ సాయం అడిగినా కాదనడు ప్రభాస్.. మోహన్‌బాబుకు ఆయన సన్నిహితుడని పేర్కొన్నారు. ప్రభాస్ నటన చూడగానే ఇది కదా సినిమా.. ఇది కదా శివభక్తి అని అనిపించిందని బ్రహ్మానందం వెల్లడించారు. -
యంగ్ ‘తిన్నడు’గా అవ్రామ్.. కొడుకుపై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్!
‘కన్నప్ప’ (kannappa) చిత్రంలో మంచు ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు నటించాయి. మోహన్ బాబు, విష్ణు మంచుతో పాటు ఆయన కొడుకు అవ్రామ్, కుమార్తెలు అరియానా, వివియానా కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇలా మూడు తరాలు కలిసి నటించిన అతి కొద్ది ప్రముఖ చిత్రాల్లో ‘కన్నప్ప’ నిలిచింది. తాజాగా ఈ చిత్రం నుంచి అవ్రామ్ మేకింగ్ వీడియోని రీలీజ్ చేశారు.అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రంలో తిన్నడు చిన్నప్పటి పాత్రలో కనిపిస్తారు. ట్రైలర్లోనూ అవ్రామ్‌కు సంబంధించిన సీన్లు ఉన్నాయి. ఇక ఈ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని విష్ణు మంచు షేర్ చేస్తూ.. ‘కన్నప్ప’తో నా తనయుడు అవ్రామ్ తెరంగేట్రం చేస్తున్నారు. అవ్రామ్ సెట్లోకి అడుగు పెట్టడం, కెమెరా ఎదుట నిల్చోవడం, డైలాగ్స్ చెప్పడం.. ఇలా ప్రతీదీ నా జీవితంలో భావోద్వేగపూరితమైన క్షణాలు. ఓ తండ్రిగా, ఒకప్పుడు నేను కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు అడుగు పెట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నేను అనుభవిస్తున్న ఆనందానికి ఏదీ సాటి రాదు.. ఇది అవ్రామ్ తెరంగేట్రం మాత్రమే కాదు.. నా జీవితాంతం గుర్తుండిపోయే ఓ మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలే నా కుమారుడిపైనా చూపిస్తారని భావిస్తున్నాను. అవ్రామ్ ప్రయాణం ‘కన్నప్ప’తో మొదలైంది’ అని విష్ణు ట్వీట్ వేశారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాతగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రల్ని పోషించారు. జూన్ 27న కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది.My little Avram, makes his debut in Kannappa.Watching him walk onto the set, say his lines, and live this dream, has been one of the most emotional moments of my life.As a father, nothing compares to seeing your child shine under the same sky you once dreamed beneath.This… pic.twitter.com/b6HfJDQXDB— Vishnu Manchu (@iVishnuManchu) June 18, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. అతని ఎంట్రీ మరిచిపోలేని జ్ఞాపకం!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కన్నప్ప జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌లో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. తాజాగా మంచు విష్ణు తన కుమారుడి వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.తన కుమారుడు అవ్రామ్ కన్నప్ప మూవీతో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తను సెట్లోకి రావడం, మాటలు చెప్పడం, ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నటించడం నా జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాల్లో ఒకటని తెలిపారు. ఒక తండ్రిగా నేను ఒకప్పుడు కలలు కన్న అదే ఆకాశం కింద మన బిడ్డ ప్రకాశించడం చూస్తే అంతకు మించింది ఏదీ ఉండదు..ఇది కేవలం అరంగేట్రం కాదు. ఇది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. మీరు ఎల్లప్పుడూ నాకు ఇచ్చిన అదే ప్రేమ, ఆశీర్వాదాలతో మీరందరూ నా కుమారుడిపై కూడా చూపిస్తారని నేను ఆశిస్తున్నా.. అవ్రమ్ ప్రయాణం ప్రారంభం.. అది కన్నప్పతో మొదలు కావడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.కాగా.. కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించారు. ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలు నటించారు. వీరితో పాటు అర్పిత్ రాంకా, బ్రహ్మానందం, సప్తగిరి, ముఖేష్ రిషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరన్, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘు బాబు, శివ బాలాజీ కీలక పాత్రల్లో మెప్పించారు. కాగా.. ఈ సినిమాను ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించారు. అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
'ఆవేశం' కోసం ఆశపడ్డ మంచు విష్ణు.. కానీ
'కన్నప్ప' సినిమా ప్రమోషన్లలో బిజిబిజీగా ఉన్న మంచు విష్ణు.. మీడియాలో తెగ కనిపిస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా గురించి, తన గురించి చాలా విషయాలు చెబుతున్నాడు. మూవీ రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం కొచ్చిలో ఈవెంట్ చేశారు. మోహన్ లాల్ చేతుల మీదుగా 'కన్నప్ప' ట్రైలర్‌ని లాంచ్ చేశారు. తర్వాత అక్కడి మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మలయాళ చిత్రసీమ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు.'మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ సినిమాలను ఎప్పుడూ మిస్ అవ్వను. 'ట్రాన్స్' సినిమాలో ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ నాకు ఎంతగానే నచ్చేసింది. గతేడాది రిలీజై భారీ హిట్ కొట్టిన ఫహాద్ ఫాజిల్ 'ఆవేశం' కూడా చాలా బాగుంటుంది. దీన్ని తెలుగులోనే నేను రీమేక్ చేయాలనుకున్నా. కానీ అప్పటికే ఎవరో హక్కులు తీసేసుకోవడంతో ఇక సైలెంట్ అయిపోయాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఇతడు 'ఆవేశం' చేసుంటే ఎలా ఉండేదో?(ఇదీ చదవండి: సేతుపతి కోసం హిట్ బ్యూటీని పట్టేసిన పూరీ జగన్నాథ్)చాన్నాళ్లుగా సరైన సినిమాలు చేయక పూర్తిగా వెనకబడిపోయిన మంచు విష్ణు.. లాంగ్ గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మూవీ 'కన్నప్ప'. ఇందులో విష్ణు హీరోగా నటిస్తూనే, నిర్మాతగా భారీ బడ్జెట్ పెట్టాడు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితర స్టార్స్‌ని ఒప్పించి ఈ చిత్రంలో అతిథి పాత్రలు పోషించేలా చేశాడు. వీళ్లతో పాటు మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్.. ఇలా చాలామంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించారు. చూస్తుంటే విష్ణు 'కన్నప్ప' చాలా నమ్మకం పెట్టుకున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితం తీసుకొస్తుందో చూడాలి?'ఆవేశం' విషయానికొస్తే.. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఓ గ్యాంగ్‌స్టర్‌గా నటించాడు. డిఫరెంట్ ఎమోషన్స్‌తో సరికొత్తగా కనిపించి ఆకట్టుకున్నాడు. అమెజాన్ ప్రైమ్‌లో మలయాళ, తమిళ వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. లెక్క ప్రకారం తెలుగు కూడా ఉండాలి. కానీ రీమేక్ హక్కులు.. మన దగ్గర ఓ నిర్మాత తీసుకోవడంతో తెలుగు డబ్బింగ్ చేయలేదు. తెలుగులో ఈ సినిమాని బాలకృష్ణతో చేయాలని అనుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ ఇంతవరకు దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం) -
'కన్నప్ప' చూసిన రజినీకాంత్.. విష్ణుతో ఏం చెప్పారంటే?
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. రెండు రోజుల క్రితం ట్రైలర్ రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొచ్చిలో ఆ ఈవెంట్ చేసి కొంతమేర మలయాళ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఇప్పుడు తమిళ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్‌తో విష్ణు ముందుకొచ్చాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్‌కి సినిమా చూపించారు. దీంతో ఆయన తన అభిప్రాయాన్ని విష్ణుతో చెప్పగా.. ఆ విషయాన్ని వీడియో, ట్వీట్ రూపంలో విష్ణు బయటపెట్టాడు.మంచు ఫ్యామిలీకి రజినీకాంత్ సన్నిహితంగా ఉంటారు. గతంలో మోహన్ బాబుతో కలిసి 'పెదరాయుడు' సినిమాలో రజినీ నటించారు. తాజాగా ఆదివారంతో ఆ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఆ చిత్ర సెలబ్రేషన్స్ చేసుకోవడంతో పాటు 'కన్నప్ప' సినిమాని కూడా అందరూ కలిసి వీక్షించారు. ఈ క్రమంలోనే రజినీకాంత్.. తనని హత్తుకుని మెచ్చుకున్నారని విష్ణు తెగ ఆనందపడిపోతున్నాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 22 సినిమాలు రిలీజ్)'రజినీకాంత్ అంకుల్ 'కన్నప్ప' సినిమా నిన్న రాత్రి చూశారు. పూర్తయిన తర్వాత నాకు గట్టిగా హగ్ ఇచ్చారు. మూవీ చాలా నచ్చిందని నాతో చెప్పారు. ఓ నటుడిగా ఈ హగ్ కోసం 22 ఏళ్లుగా ఎదురుచూశాను. దీంతో ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది' అని మంచు విష్ణు పోస్ట్ పెట్టాడు.'కన్నప్ప'లో విష్ణు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు అతిథి పాత్రలు పోషించారు. మోహన్ బాబు, కాజల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జూన్ 27న పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఏమొస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: 'రాజాసాబ్'లో మారిపోయిన తాత.. ప్రభాస్ కాదా?)Last night, @rajinikanth uncle watched #Kannappa. After the film, he gave me a tight hug. He told me that he loved #Kannappa. I’ve been waiting 22 years as an actor for that hug!!!Today, I feel encouraged. Humbled. Grateful. #Kannappa is coming on 27th June and I can’t wait… pic.twitter.com/HDYlLuDsdc— Vishnu Manchu (@iVishnuManchu) June 16, 2025 -
మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్
టాలీవుడ్ నుంచి త్వరలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప'. ఇదివరకే ప్రమోషన్స్ చేస్తున్నారు. శనివారం సాయంత్రం కొచ్చిలో.. నటుడు మోహన్ లాల్ చేతుల మీదగా ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇదే ఈవెంట్లో మోహన్ లాల్-మోహన్ బాబు మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అలానే మోహన్ బాబు ఓ పెద్ద కోరికని బయటపెట్టారు. ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ హారర్ సినిమా)'కన్నప్ప'లో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే తాజాగా కొచ్చిలో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే మోహన్ లాల్ మాట్లాడుతుండగా.. మీ సినిమాలో తాను విలన్ చేస్తానని మోహన్ బాబుతో అన్నాడు. బదులుగా మీ మూవీలో తాను విలన్‌గా మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. అలా అయితే తొలి సీన్లో మిమ్మల్ని కాల్చి పడేస్తానని మోహన్ లాల్ అనేసరికి స్టేజీపై ఉన్నవాళ్లంతా నవ్వుకున్నారు.మరోవైపు ఇదే వేడుకలో మాట్లాడిన మోహన్ బాబు.. కేరళలో 'తుడరుమ్' చిత్రాన్ని 'కన్నప్ప' అధిగమించాలని తాను కోరుకుంటున్నట్లు మోహన్ బాబు తన మనసులో మాట బయటపెట్టారు. ఆ మూవీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ 'కన్నప్ప'కు రావాలని తాను అనుకుంటున్నట్లు మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఏప్రిల్ చివర్లో రిలీజైన మోహన్ లాల్ 'తుడరుమ్'.. మలయాళంలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం కేరళలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి మోహన్ బాబు చాలా పెద్దగా ఆశపడుతున్నారు. చూద్దాం మరి ఆయన కోరిక నెరవేరుతుందో లేదో?(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ)#Mohanlal: You be the hero, I’ll play the villain in that film.#MohanBabu: No, I really want to act as a villain in your film, please...#Mohanlal: Then I’ll shoot and kill you in the first scene in that film!— #Kannappa Event | Kochi pic.twitter.com/8fGqUsXGUc— Whynot Cinemas (@whynotcinemass_) June 14, 2025 -
'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్ర ఈవెంట్ తాజాగా కొచ్చిలో నిర్వహించారు. అక్కడే మోహన్ లాల్ చేతుల మీదుగా ఇప్పుడు ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ప్రభాస్ స్క్రీన్ పెజెన్స్ కూడా అభిమానులకు నచ్చేలా ఉంది. గతంలో వచ్చిన కంటెంట్‌పై వచ్చింది. ట్రైలర్‌ని మాత్రం ట్రోలింగ్కి స్కోప్ లేకుండా బాగానే కట్ చేశారు. అలానే స్టోరీ ఏంటనేది కూడా చూచాయిగా చెప్పేశారు కూడా. సినిమా ఎలా ఉండబోతుందనేది కూడా ట్రైలర్‌తో శాంపిల్ చూపించేశారు.ఓ గూడెంలో నివసించే తిన్నడు (మంచు విష్ణు).. చిన్నప్పటి నుంచి దేవుడిని పెద్దగా నమ్మడు. పెద్దయిన తర్వాత కొన్ని సంఘటనల వల్ల గూడెం నుంచి ఇతడిని వెలివేస్తారు. అదే టైంలో నెమలి (ప్రీతి ముకుందన్)తో ప్రేమలో పడతాడు. తర్వాత శివుడు(అక్షయ్ కుమార్), రుద్ర(ప్రభాస్)ని భూమ్మీదకు పంపిస్తాడు. రుద్ర వల్ల తిన్నడు.. అతిపెద్ద శివభక్తుడు ఎలా అయ్యాడు? ఈ మొత్తం కథలో వాయు లింగం సంగతేంటి అనేదే స్టోరీలా అనిపిస్తుంది.(ఇదీ చదవండి: హైదరాబాద్ జట్టు ఓనర్‌తో అనిరుధ్ పెళ్లి?) -
నా గుండె పగిలింది.. మంచు విష్ణు కీలక నిర్ణయం
గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక టాలీవుడ్ హీరో మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ.. కన్నప్ప ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇండోర్‌లో ఈవెంట్.. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో రేపు(జూన్ 13) ఇండోర్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. దానికి సంబంధించిన పనులు కూడా చకచక జరిగిపోతున్నాయి. భారీ ఎత్తున జరిగే ఈ ఈవెంట్లోనే ట్రైలర్‌ని కూడా విడుదల చేయాలనుకున్నారు. కానీ హఠాత్తుగా జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈవెంట్‌ని క్యాన్సిల్ చేశారు.నా గుండె పగిలింది.. విమాన ప్రమాదంపై మంచు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘ప్రమాదం గురించి తెలియగానే నా గుండె పగిలిపోయింది. చాలా బాధగా ఉంది. కన్నప్ప ట్రైలర్ రిలీజ్‌ని ఒకరోజు వాయిదా వేస్తున్నాం. అలాగే ఇండోర్‌లో రేపు జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’అని మంచు విష్ణు ట్వీట్ చేశాడు. -
'కన్నప్ప' ట్రైలర్ అప్డేట్.. కాస్త త్వరగానే
రీసెంట్ టైంలో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ తెగ హడావుడి పడుతున్నాయి. ఒక డేట్ చెబుతున్నారు. తీరా చూస్తే ఆ తేదీ దగ్గరకొచ్చేసరికి వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్, సీన్స్ రీ షూట్ అని చెప్పి వాయిదా వేస్తున్నారు. ఈ విషయంలో 'కన్నప్ప' కూడా మినహాయింపు ఏం కాదు. కాకపోతే మిగతా చిత్రాలతో పోలిస్తే ప్రమోషన్ విషయంలో కాస్త దూకుడు చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ అప్డేట్ కూడా ఇచ్చేశారు.'కన్నప్ప' సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది? ఎంత బడ్జెట్ పెట్టారు? ఇలాంటి విషయాలేం పెద్దగా తెలీవు. కానీ మొదట టీజర్ వచ్చినప్పుడు చాలా ట్రోలింగ్ నడిచింది. తర్వాత మరో టీజర్ వచ్చినప్పుడు ట్రోలింగ్ కాస్త తగ్గింది. ప్రస్తుతం గత కొన్నాళ్ల నుంచి విష్ణు ఒక్కడే ప్రమోషన్ బాధ్యతలు చూసుకుంటున్నాడు. అక్కడా ఇక్కడా తిరుగుతూ సినిమాపై హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.(ఇదీ చదవండి: చెత్తకుప్పలో షూటింగ్.. రష్మిక అలా అనేది: ధనుష్)ఇప్పుడు మరో రెండు రోజుల్లో అంటే జూన్ 13న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. సరిగ్గా సినిమా రిలీజ్‌కి రెండు వారాల ముందు ట్రైలర్ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ బట్టి జనాలకు సినిమాపై అంచనా ఏర్పడుతుంది. మూవీ చూడాలా వద్దా అనేది వాళ్లు డిసైడ్ అవుతారు. ప్రమోషన్లలో విష్ణు మాటతీరు చూస్తుంటే.. చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి?మంచు విష్ణు హీరోగా నటించి నిర్మించిన ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్.. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది స్టార్స్ అతిథి పాత్రలు పోషించారు. టెక్నీషియన్స్ కూడా బాలీవుడ్‌కి చెందిన వాళ్లు పనిచేశారు. ఎప్పటినుంచో ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ చెబుతూ వస్తున్న విష్ణు.. ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) -
కన్నప్పలో ఆ పేర్లపై వివాదం.. స్పందించిన మంచు విష్ణు!
కన్నప్ప మూవీ వివాదంపై హీరో మంచు విష్ణు స్పందించారు. ఎవరిని కించపరిచేలా కన్నప్ప సినిమాను తీయలేదని అన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ.. ఆ పరమశివుడిని భక్తితో చూపించామని విష్ణు వెల్లడించారు. కాగా.. ఈ మూవీలోని పాత్రల పేర్లపై ఇటీవల బ్రాహ్మణ సంఘాల ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు స్పందించారు.అసలేంటి వివాదం..?ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది కన్నప్ప టీమ్. ఈ క్రమంలోనే ఇటీవల మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే గుంటూరు కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.'మంచు మోహన్‌బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటామని శ్రీధర్ హెచ్చరించారు. ఈ వివాదంపై బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ప్రకటన విడుదల చేశారు.కాగా.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ లాంటి అగ్రతారలు నటించారు. -
అందుకే నేను 'కన్నప్ప'లో నటించలేదు: మంచు లక్ష్మీ
మంచు అనే పేరు చెప్పగానే ప్రస్తుతానికి 'కన్నప్ప' సినిమా లేదంటే వాళ్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు గుర్తొస్తాయి. ఇప్పటికైతే ఏం జరగట్లేదు. మంచు విష్ణు.. తను హీరోగా నటించి భారీ బడ్జెట్‌తో నిర్మించిన 'కన్నప్ప'ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. మరోవైపు మనోజ్ కూడా తన సినిమాలు తాను చేసుకుంటున్నాడు. ఈ గొడవల్లో ఎక్కడా కనిపించని మంచు లక్ష్మీ.. తాజాగా ఓ ప్రెస్ మీట్లో ప్రత్యక్షమైంది. తాను కన్నప్ప చిత్రంలో నటించకపోవడానికి గల కారణాన్ని బయటపెట్టింది.'నన్ను ఎందుకు ఈ సినిమాలో తీసుకోలేదో మీరు విష్ణుని అడగాలి. నేను నటిస్తే ఈ సినిమాలో నటించిన వారు ఎవరు కనిపించరు(సరదాగా). ఇందులో నేను చేయగలిగే పాత్ర లేకపోవడంతోనే విష్ణు నాకు అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ నేను చేయగలిగే పాత్ర ఉంటే ఇచ్చి ఉండేవాడేమో. మేమంతా కలిసి అన్ని చిత్రాల్లో నటిస్తే అది ఫ్యామిలీ సినిమా అవుతుంది' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు)మీ సోదరులకి.. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవటానికి, సపోర్ట్ చేయకపోవడానికి సంబంధం లేదు. నా మద్దతు వాళ్లకు ఎప్పుడూ ఉంటుంది అని సమాధానమిచ్చింది. గత కొన్ని నెలల నుంచి మంచు కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో పెద్దగా మాట్లాడని మంచు లక్ష్మీ.. మంచు మనోజ్‌కి మాత్రం అండగా ఉంది.కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో అడపాదడపా సినిమాలు చేసిన మంచు లక్ష్మీ.. ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. బాలీవుడ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 'ద ట్రైటర్స్' అనే రియాలిటీ షోలో పాల్గొనేందుకు సిద్ధమైంది. తాజాగా హైదరాబాద్‌లో కనిపించిన ఈమె.. మీడియాతో మాట్లాడుతూ పలు విషయాల్ని పంచుకుంది. ఈ ఈవెంట్లోనే స్పందిస్తూ 'కన్నప్ప'లో నటించకపోవడానికి కారణం కూడా బయటపెట్టింది.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
నాకు ఆ ఫిగర్ నచ్చలేదు.. అందుకే 'కన్నప్ప'ని ఇంకా: మంచు విష్ణు
ప్రస్తుతం తెలుగు సినిమా వ్యవహారాలు దాదాపు ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మూవీని ఏ తేదీన థియేటర్లలో విడుదల చేయాలనేది వారే నిర్ణయిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్‌కి పర్లేదు గానీ చాలామంది చిన్న, మీడియం బడ్జెట్ పెట్టే నిర్మాతలు.. తమ చిత్రాల్ని పూర్తి చేసినా సరే రిలీజ్ చేయలేకపోతున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు 'కన్నప్ప' ఓటీటీ గురించి పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. వాటి గురించి అడగ్గా.. విష్ణు తాజా ఇంటర్వ్యూలో సమాధానమిచ్చాడు.'కన్నప్ప' ఓటీటీ డీల్ కుదిరిందా? అని అడగ్గా.. 'వాళ్లు ఓ ఫిగర్ చెప్పారు అది నాకు నచ్చలేదు. హిట్ అయ్యాక అమ్మితే ఎంత ఇస్తారని అడిగాను. అప్పుడు వాళ్లు చెప్పిన ఫిగర్ నాకు నచ్చింది. డబ్బులు రెడీ చేస్కోండి. విడుదలయ్యాక వస్తాను అని చెప్పాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఇతడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై చాలా నమ్మకంతోనే ఉన్నాడనిపిస్తుంది. చూడాలి మరి ఫలితం ఎలా వస్తుందో?(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు)మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. గత చిత్రాలు సరిగా ఆడకపోవడంతో చాన్నాళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. భారీ బడ్జెట్ పెట్టి స్వయంగా నిర్మించాడు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా చాలామంది స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. మార్కెట్ పరంగా చూసుకుంటే దక్షిణాది స్టార్స్ చాలామంది ఉన్నారు. సినిమా హిట్ అయితే ఓటీటీల నుంచి డిమాండ్ ఉండొచ్చు. ఒకవేళ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.జూన్ 27న 'కన్నప్ప' సినిమా థియేటర్లలోకి రానుంది. చాన్నాళ్ల క్రితం తొలుత ఓ టీజర్ రిలీజ్ చేయగా.. విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. కాస్త గ్యాప్ తీసుకుని మరో టీజర్ రిలీజ్ చేయగా, నెగిటివిటీ కాస్త తగ్గింది. ప్రస్తుతం ప్రమోషన్ల బాధ్యత విష్ణునే తీసుకున్నాడు. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ చేయబోతున్నాడు. దీనికి ప్రభాస్ కూడా హాజరవుతాడని టాక్.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర..' పరువు తీసిన యాంకర్!) -
'కన్నప్ప' వేడుకలో ప్రభాస్‌పై మోహన్‌బాబు వ్యాఖ్యలు
విష్ణు మంచు నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’(kannappa) ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. శివ నామస్మరణతో చాలా విజయవంతంగా కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ గురించి నటుడు మోహన్‌బాబు పలు వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్, నేనూ 'బావ.. బావ..' అనుకుంటాం. ఇప్పటికీ నేను తనకు ఫోన్ చేస్తే బావ అంటూనే మాట్లాడుతాను. తనూ అంతే.. అలా చాలా సరదాగా మా ఇద్దరి మధ్య పలకరింపులు ఉంటాయి. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఈ సినిమాలో నటించాలని నేను అడగ్గానే బావ.. దీని గురించి మీరు నా దగ్గరకు రావాలా..? మీరు వదిలేయండి. ఏదైనా ఉంటే నేనూ విష్ణు మాట్లాడుకుంటాం..' అని అన్నాడు. దటీజ్ ప్రభాస్. పెద్దల పట్ల తను చూపించే మర్యాద ఇలా ఉంటుంది.' అని ఆయన అన్నారు. కన్నప్ప సినిమాను థియేటర్స్‌లో చూసి తన బిడ్డ విష్ణును ఆశీర్వదించాలని ఆయన కోరారు. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను స్వయం కృషితోనే పైకొచ్చానని పేర్కొన్నారు. జీవితంలో భయం అనేది ఉండకూడదని ఆయన సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది..? అదే విద్యాలయాల్లో పిల్లలకు నేర్పిస్తున్నానని అన్నారు. మోహన్‌బాబు యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లు ఇప్పుడు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండమని చెబుతున్నానని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప' సినిమా తీయాలనేది నా కల. ఈ సినిమా కోసం నాకు చాలామంది సహకరించారు. మా నాన్న నాకు దేవుడు. ఆయన లేకపోతే నేను లేను. ఈ సినిమాలో ఎవరెవరు నటించాలనేది కూడా అంతా శివాజ్ఞ ప్రకారమే జరిగింది. ఈ సినిమాలో నా మిత్రుడు ప్రభాస్‌కు (Prabhas) నటించాడు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మేము అడిగిన వెంటనే నాన్నగారి మీద ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ప్రభాస్ వెంటనే ఒప్పుకొన్నాడు. ఈ కాలంలో స్నేహానికి విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఉదాహరణ అని చెబుతున్నాను. వ్యక్తిగా ఆయన్ను అందరూ ప్రేమించండి.'అని చెప్పుకొచ్చారు. -
'కన్నప్ప'కు బ్రాహ్మణ సంఘాలు హెచ్చరిక
మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం 'కన్నప్ప'కు అనేక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన హర్డ్‌డిస్క్ మాయం కావడంతో మూవీ టీమ్ తీవ్ర ఆందోళన చెందింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే, తాజాగా 'కన్నప్ప' మీద బ్రాహ్మణ సంఘాలు భగ్గుమంటున్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఈ చిత్రంలో రెండు పాత్రలు ఉన్నాయిని వారు ఆరోపిస్తున్నారు.కన్నప్ప సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల విషయంలో జోరు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీలోని పిలక, గిలక పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. అయితే, గుంటూరులో నేడు (శనివారం) జరగనున్న కన్నప్ప సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆ పేరు తొలగిస్తున్నట్లు ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ వివాదం గురించి బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు శ్రీధర్ ఓ ప్రకటన విడుదల చేశారు. 'మంచు మోహన్‌బాబు కుటుంబం బ్రాహ్మణులను కించపరుస్తుంది. గతంలోనూ ఇలాంటి పొరపాట్లు చేశారు. కన్నప్ప సినిమాలో పిలక, గిలక పాత్రలు లేవంటూ ప్రీరిలీజ్ ఈవెంట్లో అధికారికంగా ప్రకటించాలి. ఈ పాత్రలపై క్లారిటీ ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయించి సినిమాను అడ్డుకుంటాం.' అని శ్రీధర్ హెచ్చరించారు.ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించారు. -
పవన్ 'ఓజీ' కంటే కన్నప్ప బడ్జెట్ ఎక్కువ: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటించి, భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా 'కన్నప్ప'. ఈనెల 27న థియేటర్లలోకి రానుంది. కొన్నిరోజుల క్రితం ఈ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అది దొరికిందా లేదా అనేది పక్కనబెడితే విష్ణు ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టేశాడు. ఈ క్రమంలోనే తెలుగులో రౌండ్ టేబుల్ పేరుతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో కన్నప్ప బడ్జెట్ గురించి ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?)కన్నప్ప సినిమాకు బడ్జెట్ ఎంతయిందని ఇంటర్వ్యూయర్ అడగ్గా.. కచ్చితంగా మూడంకెల ఖర్చు అయిందని విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే రూ.100 కోట్లు అయిందా? రూ.200 కోట్లు అయిందా? అని మరోసారి అడగ్గా.. ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాల కంటే తమ 'కన్నప్ప' ఎక్కువని పేర్కొన్నడు. అలానే ఈ ఏడాదిలోనే విడుదలయ్యే పవన్ కల్యాణ్ 'ఓజీ' కంటే తమ మూవీ బడ్జెట్ ఎక్కువని క్లారిటీ ఇచ్చాడు. ఎంతో చెబితే ఐటీ వాళ్లు.. తన ఆఫీస్‌కి వస్తారు? ఎందుకు ఈ గొడవ? అని విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కన్నప్ప సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో చెప్పిన మంచు విష్ణు.. గత కొన్నేళ్లుగా ఈ మూవీపైనే ఉన్నాడు. ఇందులో మంచు విష్ణు హీరో కాగా.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ తదితర స్టార్స్ ఇందులో నటించారు. దీంతో మూవీపై కాస్తంత బజ్ ఉంది. కానీ చాన్నాళ్ల క్రితం టీజర్ రిలీజైనప్పుడు మాత్రం కాస్త గట్టిగానే ట్రోలింగ్ వచ్చింది. కానీ తర్వాత మరో టీజర్ విడుదల చేసినప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానున్న 'కన్నప్ప'.. విష్ణు కెరీర్‌ని ఎలా మారుస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
నా తల్లికి పుట్టుకతోనే చెవులు వినిపించవు.. బాధేసేది: మోహన్‌బాబు
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప (Kannappa Movie). శివుడి కోసం కన్నప్ప తన జీవితాన్నే త్యాగం చేశాడని.. అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరో ఒక కన్నప్ప ఉంటారని ఆ స్టోరీ చెప్పమంటూ కొత్త తరహా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు విష్ణు (Vishnu Manchu). మై కన్నప్ప స్టోరీ అంటూ ముందుగా తనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తన జీవితంలో తండ్రి మోహన్‌బాబు కన్నప్ప అని.. ఆయన కృషి, త్యాగాల ఫలితంగానే నటుడిగా అందరి ముందు నిలబడ్డానని చెప్పాడు.అమ్మకు చెవులు వినిపించవుతాజాగా మోహన్‌బాబు తన కన్నప్ప స్టోరీని షేర్ చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ఓ అమాయకుడు, ఆటవికుడైన తిన్నడు.. పరమేశ్వరుడికి కళ్లు ఇచ్చి కన్నప్పగా చరిత్రలో మిగిలిపోయాడు. మన జీవితంలో అమ్మ చెప్పకుండానే మన ఆకలి తీరుస్తుంది. లైఫ్‌లో ఏది కావాలంటే అది, శక్తికి మించినదైనా సరే అమ్మానాన్న మనకు ఇస్తుంటారు. నా దృష్టిలో మా అమ్మానాన్న నా కన్నప్పలు. మా అమ్మ పేరు లక్ష్మమ్మ. దురదృష్టవశాత్తూ అమ్మకు పుట్టుకతోనే రెండు చెవులు వినిపించవు.ఐదుమంది సంతానంఆ మహాతల్లికి పరమేశ్వరుడు ఐదు మంది సంతానాన్ని ఇచ్చాడు. బస్సు దిగి మా ఊరికి నడిచి వెళ్లాలంటే ఏడు కి.మీ. నడిచి వెళ్లాలి. ఆ దారి కూడా సరిగా ఉండేది కాదు. చెవులు వినిపించని నా తల్లి ఐదుమంది బిడ్డల్ని మోసుకుని మా ఊరికి వెళ్లేదంటే ఎంత కష్టమో ఆలోచించండి. దారిలో ఒక కాలువ, సువర్ణముఖి నది దాటి వెళ్లాలి. మాది ద్వీపంలాంటి ఊరు. అప్పుడప్పుడు ఈ విషయాలు తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.నా మాటలు తల్లికి వినిపిస్తే బాగుండునా కంఠాన్ని అందరూ మెచ్చుకుంటున్నప్పుడు... నా మాటలు తల్లికి వినిపించుంటే ఎంత బాగుండేదనిపిస్తుంది. ఈ విషయంలో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నాకు నా కన్నతల్లే కన్నప్ప అని చెప్పుకొచ్చాడు. కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Dr. Mohan Babu Garu reveals the soul and spirit behind #Kannappa🏹. We all have that one moment where we chose heart over everything else — for love, for belief, for something greater than ourselves. What’s your Kannappa moment?#MyKannappaStory #Kannappa27thJune… pic.twitter.com/m7Gy82JUrw— Kannappa The Movie (@kannappamovie) June 5, 2025చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. బతికుంటే -
నేను పెద్ద అందగాడినేం కాదు.. దేవుడిని ఒక్కటే కోరుకున్నా: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మంచు విష్ణు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనకు చిన్నప్పటి నుంచి నటుడి కావాలనేది ఆశయమని తెలిపారు.మంచు విష్ణు మాట్లాడుతూ.. 'నేను పుట్టినప్పటి నుంచి యాక్టర్ కావాలనేది నా ఆశయం. కానీ నా చిన్నప్పుడు నేనేం పెద్ద అందగాన్ని కాదు. ఇప్పుడు కూడా అందగాడినేమి కాదు. దేవుడిని ఒకటే అడిగేవాన్ని. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. దాన్ని నిలబెట్టుకుంటాను చెప్పేవాడిని. దేవుడు నాకు వరమిచ్చాడు.. ఈ జన్మ ఎత్తింతి నేను నటుడిగానే ఉండాలి. మిగతావన్నీ నాన్న ఇచ్చిన బాధ్యతలు. యూనివర్సిటీ నాకు రెస్పాన్సిబిలిటీ. నటనలో ఎలాగైతే ఉంటానో.. యూనివర్సిటీ, స్కూల్ నడపడం నాకు చాలా సులభం. నా తర్వాత కూడా మన యూనివర్సిటీ పేరు నిలిచిపోవాలి. రిలయన్స్, టాటా కంపెనీకి ఎలా బ్రాండ్ ఉందో మనందరికీ తెలుసు. రతన్ టాటా లేకపోయినా ఆ బ్రాండ్‌కు ఎప్పుడు వాల్యూ ఉంటుంది. అలా ప్రొఫెషనల్‌గా ఉండాలి' అని అన్నారు.కాగా.. కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోహన్ లా్, అక్షయ్ కుమార్, మెహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ నంచి శ్రీకాళహస్తి సాంగ్‌ను విడుదల చేయగా అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఈ పాటలో మంచు విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా నటించారు. నేను అందగాడ్ని కాదు.. కానీ నటించడానికే ఈ జన్మ ఎత్తా - #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/v49DQe5esw— Telugu FilmNagar (@telugufilmnagar) June 4, 2025 -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మరోసారి స్పందించిన విష్ణు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీనిలో పలువురు సినీ ప్రముఖులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో హార్డ్ డిస్క్ మాయంపై మంచు విష్ణు మరోసారి స్పందించారు. ఆ హార్డ్ డిస్క్ ఇంకా తనవద్దకు రాలేదని చెప్పారు.విష్ణు మాట్లాడుతూ.. 'కన్నప్ప కోసం ముంబయిలో దాదాపు 8 కంపెనీలు వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నాయి. వాటిలో ఒకటి ఆన్లైన్లో కొంత భాగం పంపించారు. అది క్లారిటీగా రాలేదు. దీంతో రెండోసారి అప్లోడ్ చేశారు. ముందు జాగ్రత్త కోసమే వాళ్లు ఓ హార్డ్‌డిస్క్ కూడా పంపారు. మా ముగ్గురికి సంబంధించి ఏ పార్సిల్ వచ్చినా ఆ ఇంటికే వస్తుంది. అక్కడ ఉండే మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. మా కంపెనీ జీఎస్టీ రిజిస్టర్ అడ్రస్ కూడా నాన్న ఇంటిదే ఉంటుంది. అక్కడికి పార్సిల్ వచ్చినప్పుడు రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళను తీసుకోమని చెప్పారట. ఆమెనే తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే.. వాళ్లిద్దరు మనోజ్ దగ్గర పని చేస్తారో.. లేదో మాకు తెలియదు. అతని వద్దే ఉంటారని మాత్రం తెలిసింది. హార్డ్‌డిస్క్ కూడా అక్కడే ఉందని తెలిసింది. ఇప్పటివరకైతే హార్డ్‌డిస్క్ నా చేతికి రాలేదు' అని అన్నారు. -
నాన్న మాకోసం ఎన్నో త్యాగాలు చేశాడు: విష్ణు
సెలబ్రిటీలకు కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అలా మంచు విష్ణుకు కన్నప్ప జీవిత కథను సినిమాగా తీయాలని ఓ ఆశ. అందుకోసం తెర వెనక ఎంతో కష్టపడ్డాడు. అందరికీ తెలిసిన కన్నప్ప గురించి ఎవరికీ తెలియని విషయాలను సైతం సేకరించాడు. చరిత్రను తవ్వి చూశాడు. కన్నప్పను నిశితంగా అర్థం చేసుకున్నాడు.ఈ నెలలోనే రిలీజ్అంతా ఆకళింపు చేసుకున్నాకే కన్నప్ప సినిమా (Kannappa Movie) ను ప్రకటించాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజైనప్పుడు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వచ్చాయి. ఎప్పుడైతే శివుడి పాట విడుదలైందో అప్పుడు ఆ నెగెటివిటీ అంతా మట్టిగొట్టుకుపోయింది. మధ్యలో సినిమా రెండుమూడు సార్లు వాయిదా కూడా పడింది. ఆ పరమేశ్వరుడిపై భారం వేస్తూ జూన్ 27న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.మా కోసం ఎన్నో త్యాగాలుతాజాగా విష్ణు మంచు (Vishnu Manchu) మై కన్నప్ప స్టోరీ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. కన్నప్ప.. మహాశివుడికి పెద్ద భక్తుడు. ఓసారి ఆ భగవంతుడు కన్నప్పను పరీక్షించగా అతడు తన రెండు కళ్లను శివయ్యకు అర్పించాడు. తన జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనకోసం సర్వం ధారపోసేవాళ్లున్నారు. అమ్మ, నాన్న, భార్య, పిల్లలు, స్నేహితులు.. ఎలా ఎవరైనా కావచ్చు. నా జీవితంలోనూ ఓ కన్నప్ప ఉన్నారు. ఆయనే మా నాన్న.ఆయనే నా హీరోఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో కష్టపడి మాకు ఏ ఇబ్బందీ లేకుండా పెంచాడు. ఈరోజు మీ ముందు నటుడిగా కూర్చుని మాట్లాడుతున్నానంటే అది ఆయన చేసిన త్యాగాల ఫలితమే! మా నాన్న నటుడిగా కష్టపడి నిలదొక్కుకోవడం వల్లే! ఆయనే నా హీరో. మీ జీవితాల్లో ఉన్న హీరో గురించి మీరు చెప్పండి. మీ కన్నప్ప స్టోరీని ప్రపంచానికి తెలియజేస్తాం అని చెప్పుకొచ్చాడు. #MyKannappaStory#kannappa #harharmahadevॐ pic.twitter.com/jHXm2Kp0xG— Vishnu Manchu (@iVishnuManchu) June 3, 2025 చదవండి: ఆ స్టార్ హీరోతో గొడవలు.. తిట్టాలన్నంత కోపం వచ్చేది: సోనాలి -
Upcoming Tollywood Movies: జూన్‌లో పెద్ద సినిమాల జాతర.. గ్యాపే లేదు!
టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత సమ్మర్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఈ ఏడాది వేసవి కాలం వృథాగా పోయింది. మే నెలలో పెద్ద సినిమాలేవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. వచ్చిన వాటిలో హిట్ 3 చిత్రం ఒక్కటే కాస్త బెటర్‌గా ఆడింది. సమంత ‘శుభం’, శ్రీ విష్ణు ‘సింగిల్’ లాంటి చిత్రాలు కొంతమేర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. ఆ తర్వాత వచ్చిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇలా సమ్మర్‌కి కీలకమైన మే నెల టాలీవుడ్‌ని పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. కానీ అనూహ్యంగా జూన్ నెల టాలీవుడ్‌కి కీలకంగా మారబోతుంది. ఈ నెలలో వారానికొక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. వాటిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’తో ఈ నెల టాలీవుడ్ బాక్సాఫీస్ ఓపెన్ కాబోతుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దశాబ్దాల తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. శింబు కీలక పాత్ర పోషించారు. కోలీవుడ్‌లో మాదిరే టాలీవుడ్‌లోనూ భారీ ప్రమోషన్స్ చేశారు. కమల్ తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దీంతో థగ్ లైఫ్‌పై తెలుగులోనూ మంచి హైప్ క్రియేట్ అయింది. జూన్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.ఇక థగ్ లైఫ్ వచ్చిన వారానికే పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూన్ 12న రిలీజ్ కాబోతుంది. చాలా రోజుల తర్వాత పవన్ నుంచి వస్తున్న చిత్రమిది. అంతేకాదు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ కాబోతున్న తొలి సినిమా.దీనిపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఎప్పుడైన ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిందంటే.. మరుసటి వారం కాస్త గ్యాప్ ఉండేది. లేదంటే చిన్న చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేవి. కానీ ఈ సారి పవన్ సినిమాకు కూడా పోటీ ఎదురైంది. హరిహర వీరమల్లు వచ్చిన మరుసటి వారమే(మే 20) ధనుష్-నాగార్జునల ‘కుబేర’ రిలీజ్ కానుంది. శేకర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై కూడా ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అదే రోజు ఆమిర్ ఖాన్ సితారే జమీర్పర్ రిలీజ్ కాబోతుంది.ఇక జూన్ చివరివారంపై ‘కన్నప్ప’ కర్ఛీఫ్ వేశాడు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీ అయ్యారు విష్ణు. చెన్నై, బెంగళూరు, ముంబై తదితర పట్టణాలలో ప్రమోషన్స్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఇలా జూన్ నెలలో ప్రతి వారం ఒక్కో పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వీటితో పాటు గ్యాంబ్లర్స్(జూన్ 6), 8 వసంతాలు (జూన్ 20), మర్గాన్ (జూన్ 27) చిత్రాలు కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి. మరి వీటిల్లో ఏ చిత్రం సూపర్ హిట్‌గా నిలుస్తుందో చూడాలి. -
అందుకే కన్నప్ప సినిమాలో నటించలేదు : శివరాజ్ కుమార్
మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్‌కు రెడీ అవుతోంది. జూన్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచారు మేకర్స్. పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా కన్నప్ప(Kannappa) టీమ్ బెంగళూరు వెళ్లింది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shiva Rajkumar )తో కలిసి మంచు మోహన్ బాబు, విష్ణు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ సినిమా శివుడి పాత్రను పోషించమని తొలుత నన్నే అడిగారు. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయాను. ఈ సారి విష్ణు ఏం అడిగినా చేస్తాను. రెమ్యునరేషన్ నాకు సమస్యే కాదు’ అని చెప్పారు. కన్నప్ప చిత్రం గుఇరంచి మాట్లాడుతూ.. నాన్నగారు(రాజ్ కుమార్) నటించిన ‘శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ చిత్రంలో కన్నప్ప పాత్ర చేశాను. ఆయనతో కలిసి ‘కన్నప్ప’ పాత్ర చేయాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై నాకు ఇష్టం ఏర్పడింది. ముఖ్యంగా ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు మరింత ఆసక్తి ఏర్పడింది. 37ఏళ్ల తర్వాత అదే కథతో విష్ణు సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది’ అన్నారు.ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండేదని అని అనిపిస్తూ ఉండేది. అప్పట్లో అంబరీష్‌ను అడిగితే, నవ్వి ఊరుకునేవాడు. రాజ్‌కుమార్‌గారిని అడగాలంటే ధైర్యం సరిపోలేదు. ఆయన తనయుడు శివరాజ్ కుమార్‌ని ఒక కోరిక కోరుతున్నాను. ఆయన నటించే చిత్రంలో విలన్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను’ అని అన్నారు. ఇదే విషయంపై రాజ్ కుమార్ స్పందిస్తూ..‘మోహన్ బాబు గొప్ప నటుడు. ఆయన నా చిత్రంలో విలన్‌గా నటిస్తానని అడిగారు కానీ.. నేను ఆ పాత్ర ఇవ్వను. ఒక అందమైన అన్నయ్య పాత్ర ఇస్తా. హై క్వాలిటీ రోల్ అది. నేను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు’అని నవ్వుతూ అన్నారు. -
కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం.. మనోజ్ టార్గెట్‌గా విష్ణు కామెంట్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడం టాలీవుడ్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ విషయం బయటికి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు కూడా నమోదు చేశారు. హార్డ్ డిస్క్ ఎవరూ మాయం చేశారన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే హార్డ్ డిస్క్ మాయంపై హీరో మంచు విష్ణు స్పందించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై మంచు విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.మనోజ్ ఇంట్లో పనిచేసే రఘు, చరిత అనే వ్యక్తులే ఈ పని చేసి ఉంటారని మంచు విష్ణు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే వాళ్లుగా తీసుకున్నారా? ఇంకెవరైనా వారితో చేయించారా? అన్నది త్వరలోనే తెలుస్తుందని అన్నారు. హార్డ్ డిస్క్ బయటకు వెళ్లిన విషయమై పోలీసుల ద్వారా రిపోర్టర్‌కు తెలియడం వల్లే బయటకొచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని బయటకు చెప్పడం తనకు ఇష్టం లేదని మంచు విష్ణు వెల్లడించారు. కలర్ గ్రేడింగ్‌కు సంబంధించి ముంబయిలో రెడీ అయితే.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉందని తెలిపారు. మొదటిసారి పంపిన కాపీ సరిగా రాకపోవడంతో ఆ కంపెనీ హార్డ్ డ్రైవ్‌లో ఆ సీన్స్‌ను పెట్టి కొరియర్ చేసిందని విష్ణు అన్నారు.మంచు విష్ణు మాట్లాడుతూ..' మేం రెండు అడ్రస్‌లు మెయింటెన్ చేస్తాం. అందులో ఆఫీస్ అడ్రస్ ఒకటి.. మరొకటి జీఎస్టీ రిజిస్ట్రార్ పేరిట ఉంటుంది. ఇది ఫిల్మ్ నగర్‌లోని నాన్న ఇంటి అడ్రస్. మా ముగ్గురికి సంబంధించిన ఏదైనా ఇక్కడికే వస్తుంది. అక్కడ ఉండే మా మేనేజర్లు ఎవరిది వాళ్లకు అందజేస్తారు. దాదాపు 15 ఏళ్లుగా ఇదే జరుగుతోంది. కానీ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే అతను అక్కడికి వచ్చాడు. ఆ ప్యాకెట్ తీసుకుని చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి దాదాపు నెల రోజులైంది. నాకు తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించలేదు. కొరియర్ తీసుకున్న వాళ్లు మనోజ్ ఇంట్లో పనిచేస్తున్నారో? లేదో నాకు తెలియదు. ఎవరైనా చెప్తే వచ్చి తీసుకెళ్లారా? వాళ్లే స్వయంగా తీసుకున్నారో తెలియాల్సి ఉంది' అని అన్నారు. కాగా.. కన్నప్ప మూవీ జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది. Actor Vishnu Manchu about the #Kannappa harddisk Missing:“The accused mentioned in FIR , Raghu & Chaithra was working under My younger brother Manoj Manchu . There is no request from production team for the harddisk to send to the VFX team; but we don't know why they sent .… pic.twitter.com/T5Kyt4aWZ8— Christopher Kanagaraj (@Chrissuccess) May 30, 2025 -
కన్నప్ప హార్డ్ డిస్క్ చోరీ.. కీలక విషయాలు వెల్లడించిన నిర్మాత!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రిలీజ్‌కు ముందు కష్టాలు తప్పేలా లేవు. ఈ మూవీకి సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ చోరీకి గురి కావడం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ వివాదంపై నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సైతం ఓ లేఖను విడుదల చేసింది. మూడు నెలల క్రితమే హార్డ్ డ్రైవ్ పోయినట్లు నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.తమ సినిమా హార్డ్ డ్రైవ్ కోసం ముంబయి కంపెనీని నిర్మాత సంప్రదించారు. అయితే తాము మార్చి మొదటి వారంలోనే హైదరాబాద్‌కు డ్రైవ్ పంపించామని కంపెనీ ప్రతినిధులు ఆయనతో అన్నారు. కొరియర్ ద్వారా హార్డ్ డ్రైవ్ పంపిస్తే రఘు డెలివరీ తీసుకున్నారని సదరు కంపెనీ తెలిపింది. అయితే తానేలాంటి డ్రైవ్ తీసుకోలేదని రఘు నిర్మాతతో అన్నారు. దీంతో వెంటనే హార్డ్ డిస్క్ మిస్సింగ్ కావడంపై నిర్మాత పోలీసులను ఆశ్రయించారు. అందులో అత్యంత కీలకమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ మొత్తం ఉన్నాయని తెలిపారు. ఆ డ్రైవ్ మిస్సయితే కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అన్నారు. సినిమా విడుదల కంటే ముందు ఏదైనా బయటికి వస్తే పెద్ద నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతతో పాటు పలువురి దగ్గర నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. -
మంచు విష్ణు కన్నప్ప.. శ్రీకాళహస్తి ఫుల్ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన భక్తి సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ మూవీ నుంచి శ్రీకాళహస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. A song filled with devotion and power! 🔥 Sri-Kala-Hasti lyrical from #Kannappa🏹 is OUT NOW! 🎶✨ Feel the rhythm, embrace the energy! Watch & enjoy!Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#SriKalaHastiLyricalSong #Kannappa #Stalapurana #OmNamahShivaya🔗Telugu:… pic.twitter.com/e4ebn1Ypoh— Kannappa The Movie (@kannappamovie) May 28, 2025 -
'కన్నప్ప మూవీపై పెద్ద కుట్ర'.. నిర్మాణ సంస్థ సంచలన లేఖ!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం కావడంపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ మూవీకి సంబంధించిన 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్లైన్లో లీక్ చేసే కుట్ర జరుగుతోందని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ (24 Frames Factory) నిర్మాణ సంస్థ ఆరోపించింది. కన్నప్ప హార్డ్‌డిస్క్ చోరీకి గురవడంపై వచ్చిన రూమర్స్‌పై కూడా సంస్థ స్పందించింది.నిర్మాణ సంస్థ తన నోట్లో రాస్తూ..' కన్నప్పలోని ఇద్దరు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ ట్రాన్సిట్ సమయంలో చోరీకి గురైంది. ఈ హార్డ్ డిస్క్ ముంబయిలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా నిర్మాణ కార్యాలయానికి డెలివరీ చేస్తుండగా చోరీ చేశారు. హార్డ్‌డిస్క్ చోరీపై నాలుగు వారాల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశాం. కన్నప్ప సినిమా ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ కాకుండా సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. ఈ చోరీకి పాల్పడిన వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు కాదు. దీని వెనుక ఎవరున్నారో తమకు తెలుసని ప్రొడక్షన్ హౌస్ తన లేఖలో పేర్కొంది. కాగా.. అంతకుముందు ఈ ఘటనపై ఆ సినిమా హీరో మంచు విష్ణు స్పందింటారు. జటాజూటధారీ.. నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ హరహరమహదేవ్ అంటూ ట్వీట్ చేశారు.OFFICIAL STATEMENT FROM 24 FRAMES FACTORYREGARDING THE THEFT OF CRUCIAL KANNAPPA FOOTAGEIn response to circulating rumours and speculation, 24 Frames Factory is issuing this official statement to bring clarity to the situation.A hard drive containing a pivotal action…— 24 Frames Factory (@24FramesFactory) May 27, 2025 -
నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్
మంచు విష్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్‌లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్‌కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్‌ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్‌గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్‌కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. ఆయన కుమార్తెల సాంగ్ ప్రోమో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.(ఇది చదవండి: కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్)ఈ మూవీ శ్రీకాళ హస్తి అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈనెల 28న ఈ పాటను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఈ భక్తి గీతాన్ని విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. My little munchkins! They are blessed by Lord Shiva to be singing the Stalapurana of SriKalaHasti temple. Cannot wait for all of you to hear the song. #HarHarMahadev https://t.co/dDPjlxixO1#kannappa— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025 -
Kannappa: హార్డ్‌డ్రైవ్‌లో ప్రభాస్ యాక్షన్ సీన్స్.. లీకైతే భారీ నష్టమే!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa)కు వరుస కష్టాలు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ.. పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి నేపథ్యంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్ మిస్ అయింది. దీనిపై చిత్రబృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది.హార్డ్ డిస్క్‌లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కంటెంట్‌ను లీక్ చేస్తే మాత్రం సినిమాకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇందులో సినిమాకు కీలకమైన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా ప్రభాస్‌కు సంబంధించిన యాక్షన్ సీన్లన్ని ఈ హార్డ్ డిస్క్లోనే ఉన్నాయట. సినిమా బృందం ముందు నుంచి ప్రభాస్ పాత్ర, లుక్ విషయంలో గోప్యత వహించాయి. ఆయన లుక్‌ని మాత్రమే రిలీజ్ చేసి..సినిమాలో ఆయన పాత్రలో ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. ఇందులో ప్రభాస్‌తో భారీ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇద్దామనే ప్లాన్‌తో ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కానీ ఇప్పుడు హార్డ్‌డ్రైవ్ మిస్ అవ్వడంతో మేకర్స్ భయానికి గురవుతున్నారు. ఒకవేళ ఆ వీడియోని ఆన్లైన్లో లీక్ చేస్తే.. ప్రభాస్ యాక్షన్స్ సీన్స్ అన్నీ వైరల్ అయిపోతాయి. దీంతో సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని మేకర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు సినిమాలో సగ భాగం వరకు ఈ హార్డ్ డ్రైవ్‌లోనే ఉందట. బ్యాకప్ ఉంటుంది కాబట్టి దొంగిలించిన వాళ్లు అది ఇవ్వకపోయినా నష్టమేమి ఉండదు. కానీ ఆన్లైన్లో లీక్ చేస్తే మాత్రం ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. మరి పోలీసుల చొరవతో ఈ హార్డ్‌డ్రైవ్ మళ్లీ మేకర్స్ చేతికి అందుతుందో లేదో చూడాలి. -
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయం
-
కన్నప్ప చిత్రం హార్డ్‌డ్రైవ్‌తో యువతి పరార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీకి సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన హార్డ్ డ్రైవ్ మాయమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన వీఎఫ్ఎక్స్ విక్రేతల్లో ఒకరు (హైవ్ స్టూడియోస్) కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలకమైన డేటాతో కూడిన హార్డ్ డ్రైవ్‌ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిలింనగర్‌లోని ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయానికి పంపించారు. డీటీడీసీ డెలివరీ రికార్డుల ప్రకారం పార్శిల్ ఈ నెల 25న కార్యాలయానికి చేరుకుంది. పార్శిల్ అందుకున్న ఆఫీస్‌బాయ్ రఘు దానిని చరిత అనే యువతికి అప్పగించాడు. కార్యాలయ సిబ్బంది క్రాంతి హార్డ్‌డ్రైవ్ విషయమై రఘును ప్రశ్నించగా తాను చరితకు ఇచ్చినట్లు చెప్పాడు. అయితే చరిత హార్డ్‌డ్రైవ్ తీసుకున్నప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది. కొందరు వ్యక్తుల మార్గదర్శకత్వంలో పని చేస్తున్న చరిత సినిమా ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే కనిపించకుండా పోయిందంటూ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రెడ్డి విజయ్‌కుమార్ ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారణంగా తమ సినిమా ప్రాజెక్టుకు తీవ్ర అంతరాయం కలిగించిందన్నారు. సదరు హార్డ్‌డ్రైవ్‌లో కన్నప్ప చిత్రానికి సంబంధించి విడుదల చేయని, గోప్యమైన, అత్యంత సున్నితమైన డేటా ఉందన్నారు. ఈ కంటెంట్‌ను లీక్ చేయడం లేదా, డిలీట్ చేయడం ద్వారా తమ సంస్థ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతింటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే హార్డ్‌డ్రైవ్‌ను రికవరీ చేసి తమకు అప్పగించాలని కోరారు. -
కన్నప్పలో ప్రభాస్.. రెబల్ స్టార్ పాత్రపై మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీ ప్రొడక్షన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చేనెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఈ సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మంచు విష్ణు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్ రోల్ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.ఈ చిత్రంలో ప్రభాస్ 30 నిమిషాల పాటు అతిథి పాత్రలో కనిపిస్తారని మంచు విష్ణు తెలిపారు. కన్నప్ప 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను కలిగి ఉందని అన్నారు. కన్నప్ప పరివర్తనలో కీలక పాత్ర పోషించే దైవిక వ్యక్తిగా ప్రభాస్ నటించారని వెల్లడించారు. ఈ సినిమాను ఆధ్యాత్మిక మార్గంలో బయలుదేరే ఒక నాస్తికుడి గురించిన పౌరాణిక కథగా తెరకెక్కించినట్లు తెలిపారు. ప్రభాస్‌కు మోహన్ బాబుతో ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయని వివరించారు. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలకే పరిమితం అయినప్పటికీ.. బలమైన భావోద్వేగాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రలలో కనిపించనున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి శ్రీ-కాళహస్తి అనే పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సాంగ్ మే 28న విడుదల కానుంది. ఈ భక్తి గీతంలో విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా పాడారు. ఈ పాటకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించారు. ఆధ్యాత్మికంగా ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్‌కుమార్, అర్పిత్ రంకా, ప్రీతి ముఖుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
‘కన్నప్ప’ టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
‘కన్నప్ప’చిత్ర బృందానికి మంచు మనోజ్(Manchu Manoj) క్షమాపణలు చెప్పారు. భైరవం సినిమా ఈవెంట్లో ‘శివయ్యా..’ అనే డైలాగును వేరేలా వాడడం తప్పని ఒప్పుకున్నాడు. ఒకడు చేసిన తప్పుకు సినిమా మొత్తాన్ని నిందించడం కరెక్ట్ కాదని..ఏదో ఎమోషనల్‌గా అలా అన్నానని చెబుతూ కన్నప్ప టీమ్‌కు సారీ చెప్పాడు. ఇంతకీ ఏం జరిగిదంటే..శివయ్యా... అని పిలిస్తే రాడుమంచు మనోజ్ ప్రస్తుతం భైరవం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఏపీలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావిస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్ విజయ్ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్ ఇచ్చాడని చెబుతూ.. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్ చెప్పిన శివయ్యా డైలాగ్పై కౌంటర్ వేశాడు. అదికాస్త నెట్టింట బాగా వైరల్ అయింది.సినిమా ఒకడిది కాదు.. తాజాగా శివయ్య కామెంట్స్‌పై మంచు మనోజ్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శివయ్యా అనే డైలాగ్పై సెటైర్లు వేయడం తప్పని ఒప్పుకున్నాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఆ డైరెక్టర్,మ్యూజిక్ డైరెక్టర్..ఇలా ఎంతో మంది కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి సినిమా చేశారు.. ఒక్కరికి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్‌గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు.భైరవం విషయానికొస్తే.. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. జయంతిలాల్ గడా సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. -
రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం
మంచు విష్ణు హీరోగా నటిస్తూ భారీ బడ్జెట్ తో తీసిన సినిమా 'కన్నప్ప'. జూన్ 27న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లు మొదలుపెట్టిన విష్ణు.. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ తన కుటుంబం విషయాలు, ప్రభాస్ తో బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా)ప్రభాస్ గురించి మాట్లాడిన విష్ణు.. 'నేను, ప్రభాస్ బాగా క్లోజ్. అతడు ఎంత గొప్ప నటుడో అతడికి కూడా తెలియదు. ప్రభాస్ లా చాలా తక్కువమంది ఉంటారు. ఇంత పెద్ద స్టార్ అయ్యాక కూడా సింపుల్ గా ఉండటం అతడి గొప్పతనం. మేం ఎప్పటికీ సోదరులమే''రక్తం పంచుకుని పుట్టినవాళ్లే ఈ రోజు నా పతనాన్ని కోరేటప్పుడు.. ప్రభాస్-నేను రక్తం పంచుకుని పుట్టలే కానీ నా మంచి కోరి, నా సక్సెస్ కోరుతున్నాడు. ఎన్ని జన్మలకైనా నేను అతడికి రుణపడి ఉంటాను' అని విష్ణు చెప్పుకొచ్చాడు.తండ్రి మోహన్ బాబు గురించి మాట్లాడుతూ.. 'మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. దాని కోసం ఏదైనా చేస్తాను. ఆయన సంతోషంగా లేకపోతే నాకు ఏది అక్కర్లేదు. ఆయనకు చెడ్డ పేరు తీసుకొచ్చినరోజు నేను బతికున్నా చచ్చినట్లే. ఆ రోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను. కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయను' అని విష్ణు తన కుటుంబ సమస్యల గురించి పరోక్షంగా ప్రస్తావించాడు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్'తో బలుపు పెరిగింది.. నా ఫ్రెండ్సే నన్ను..: సొహెల్) -
‘కన్నప్ప’ కామిక్ మూడో ఎపిసోడ్ రిలీజ్!
మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’(Kannappa) జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటించగా, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటలు పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. యూఎస్‌లో విష్ణు మంచు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కన్నప్ప కథను అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి విష్ణు మంచు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్లకు అఖండ స్పందన లభించింది. ఇక ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు. -
మంచు మనోజ్.. 'కన్నప్ప'తో పోటీ పడట్లేదు
కొన్నిరోజుల క్రితం మంచు ఫ్యామిలీలో గొడవలు జరిగాయి. ప్రస్తుతం అంతా సైలెంట్ గా ఉన్నారు. అయితే వివాదం నడుస్తున్న టైంలో కన్నప్ప గురించి మనోజ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన సినిమాకు భయపడే విష్ణు 'కన్నప్ప' వాయిదా వేశాడని చెప్పుకొచ్చాడు. అసలు విషయానికొస్తే.. ఏప్రిల్ 25న వస్తుందనుకున్న కన్నప్ప సినిమాని జూన్ 27కి వాయిదా వేశారు. ఇదే టైంలో మంచు మనోజ్ 'భైరవం' కూడా చాలారోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజ్ ప్లాన్ చేశారు. మరి ఓటీటీ డీల్ కుదరకపోవడమే, మరేదైనా కారణాలు తెలియదు గానీ రిలీజ్ లేటు చేస్తూ వచ్చారు.(ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. ఓటీటీలోకి వచ్చిన 32 మూవీస్) ఫైనల్ గా ఇప్పుడు కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మే 30న థియేటర్లలోకి వస్తామని పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మనోజ్ ఆశపడ్డట్లు ఈసారి అన్న విష్ణు 'కన్నప్ప'తో పోటీ పెట్టుకోలేదు. అదే టైంలో విజయ్ దేవరకొండ 'కింగ్డమ్'కి పోటీగా బరిలో నిలిచారు.మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మినీ మల్టీస్టారర్ కి విజయ్ కనకమేడల దర్శకుడు. డైరెక్టర్ శంకర్ కూతురు అదితీ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి హీరోయిన్ గా పరిచయమవుతోంది. తమిళ హిట్ 'గరుడన్'కి రీమేక్ దీన్ని తెరకెక్కించడం విశేషం.(ఇదీ చదవండి: బడా నిర్మాత కూతురి పెళ్లి.. ఇండస్ట్రీ మొత్తం అక్కడే) This summer, get ready for a cinematic experience like no other! We are thrilled to announce that #BHAIRAVAM is hitting the big screens worldwide on May 30th! Prepare for an epic journey filled with action, emotion, and the unbreakable spirit of brotherhood. For me, this release… pic.twitter.com/sJ73HPiGIk— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 9, 2025 -
యాక్షన్ కన్నప్ప
విష్ణు మంచు హీరోగా నటించిన తాజా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటించారు. మోహన్‌బాబు, ఆర్.శరత్‌కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం ఇతర కీలకపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుంది.ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా అమెరికా ప్రమోషన్ టూర్లో బిజీగా ఉన్నారు విష్ణు మంచు. కాగా ఈ సినిమాలోని మేజర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు తాను స్టంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన విషయాన్ని విష్ణు మంచు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌లో నేను ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. లాస్ ఏంజిల్స్‌లో స్టంట్ మేన్‌గా వర్క్ చేశాను. తెలుగు స్టంట్ యూనియన్ సభ్యుడిగా కూడా నేను గర్వపడుతున్నాను.ఇదంతా నేను యాక్టర్ కాకముందే చేశాను. ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ‘కన్నప్ప’ సినిమాకు షో రన్నర్‌గా చేస్తూనే, ఈ సినిమాలోని చాలా యాక్షన్ సీక్వెన్స్‌లను నేనే డిజైన్ చేశాను. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రాణంపోసిన కెచా మాస్టర్‌కు ధన్యవాదాలు’’ అంటూ ‘ఎక్స్’లో పేర్కొన్నారు విష్ణు మంచు. అలాగే ‘కన్నప్ప’ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్స్‌ల మేకింగ్ వీడియోను కూడా షేర్ చేశారు విష్ణు మంచు. -
'శివయ్యా...' హర్టయిన కన్నప్ప టీమ్.. సారీ చెప్పిన శ్రీవిష్ణు
శ్రీ విష్ణు (Sree Vishnu).. వరుస హిట్స్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా (Single Movie)తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునే ప్లాన్‌లో ఉన్నాడు. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సింగిల్. కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా హీరోయిన్లుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వం వహించగా అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.హర్టయిన మంచు విష్ణు!ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సింగిల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అందులో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన కొన్ని వీడియో క్లిప్పింగ్స్‌ను రీక్రియేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ.. హనీరోజ్‌తో మలయాళం మాట్లాడేందుకు ప్రయత్నించినదాన్ని సినిమాలో వాడేశారు. అలాగే మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని శివయ్యా అనే డైలాగ్‌ను కూడా సింగిల్ మూవీలో రిపీట్ చేశారు. ఇది చూసిన కన్నప్ప టీమ్ హర్టరయ్యారని తెలిసి శ్రీ విష్ణు.. వారికి సారీ చెప్పాడు.మీమ్స్ వాడాం..శ్రీ విష్ణు మాట్లాడుతూ.. సింగిల్ సినిమా ట్రైలర్‌లోని కొన్ని డైలాగులకు కన్నప్ప టీమ్ (Kannappa Movie) హర్టయిందని తెలిసింది. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. మేం కావాలని చేయలేదు. కానీ, అది తప్పుగా జనాల్లోకి వెళ్లడం వల్ల ఆ డైలాగ్స్‌ను డిలీట్ చేశాం. సినిమాలో కూడా ఆ డైలాగ్స్ ఉండవు. ఎవరినీ హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. ఈ జనరేషన్లో ఎక్కువ ఫాలో అయ్యే మీమ్స్, సినిమా క్లిప్పింగ్స్ కానీ, బయట ఎక్కువ వైరల్ అయ్యేవాటిని తీసుకుని దాన్ని రీక్రియేట్ చేశాం.క్షమించండి: శ్రీ విష్ణుఆ క్రమంలోనే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్.. ఇలా అందరి డైలాగ్స్ వాడాం. ఎవరికైనా మా వల్ల ఇబ్బంది కలిగితే మమ్మల్ని క్షమించండి. ఇకపై మా టీమ్ నుంచి అలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటాం. ఇండస్ట్రీలో ఉన్న అందరం కూడా ఒక కుటుంబంలాగా ఉంటాం. ఒకరినొకరు కించపరుచుకోవాలన్న దురుద్దేశమైతే మాకు లేదు. హర్టయినవారికి క్షమాపణలు చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నా అన్నాడు శ్రీవిష్ణు. ఇకపోతే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నప్ప చిత్రంలో శివయ్యా అనే డైలాగ్పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయం తెలిసిందే! ఈ సినిమాను జూన్ 27న విడుదల చేయనున్నారు.చదవండి: HIT3 X Review: ‘హిట్ 3’ ట్విటర్ రివ్యూ -
క్యాలెండర్ మార్క్ చేస్కోండి.. దొంగప్ప వచ్చేస్తున్నాడు: మంచు మనోజ్ ట్వీట్
మంచు ఫ్యామిలీలో వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్ది నెలలు సైలెంట్‌గా ఉన్న మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ రగడ మొదలైంది. మంచు మనోజ్ మరోసారి పోలీసులను ఆశ్రయించడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తన కూతురి బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లగా.. తన కారుతో పాటు తమ వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు.మరోవైపు మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి కన్నప్ప మూవీ గురించి మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. అయితే మంచు మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. కన్నప్ప మూవీని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. తన సినిమాకు భయపడే కన్నప్ప సినిమాను వాయిదా వేసుకున్నారని ఇప్పటికే మంచు మనోజ్ ఆరోపించారు. ఇవాళ ఏకంగా కన్నప్ప మూవీని దొంగప్ప అంటూ జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోందని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు. ఇంతకీ రిలీజ్ తేదీ జూలై 17న.. లేదా జూన్ 27నా అంటూ ఎగతాళి చేశారు. వందకోట్లకు పైగా బడ్జెట్ మూవీ కదా.. మీ పీఆర్ ప్లానింగ్ కేక అంటూ మంచు మనోజ్ తన ట్విటర్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ సైతం సరదా కామెంట్స్ చేస్తున్నారు.Mark your calendars! 📅 The legend of #Dongappa hits the big screen on 27th June! 🎥Inthaki release jul 17th aa, Ledha June 27th . 100 crore plus (80% #ViSmith commission) budget movie pr planning keka. pic.twitter.com/Oi7qaNmsj6— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) April 10, 2025 -
యూపీ సీఎంను కలిసిన మంచు విష్ణు.. కన్నప్ప కొత్త డేట్ ఇదే..
హీరో మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్‌బాబు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. బుధవారం నాడు యోగిని కలిసి ఆయనకు శ్రీరాముని జ్ఞాపికను బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వీరి వెంట కన్నప్ప కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఉన్నారు.ఈ విషయాన్ని విష్ణు (Manchu Vishnu) ఎక్స్ (ట్విటర్)లో వెల్లడించాడు. నా ఫేవరెట్ హీరో యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప సినిమా కొత్త రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు రమేశ్ గొరిజాలా వేసిన పెయింటింగ్‌ను బహుమతిగా ఇచ్చాం. కన్నప్ప.. జూన్ 27న వస్తోంది అని ట్వీట్ చేశాడు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప. మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయంటూ సినిమాను వాయిదా వేశారు. ఏప్రిల్ 25న తన సినిమా భైరవం రిలీజ్ అవుతుందన్న భయంతోనే విష్ణు కన్నప్పను వాయిదా వేశాడని మనోజ్ ఆరోపించాడు. ఇంతలో విష్ణు.. కన్నప్ప జూన్‌లో రానుందని ప్రకటించాడు. Met one of my favorite Hero Sri. @myogiadityanath ji. He was gracious to launch the date announcement poster of #Kannappa. Gifted him a painting of Ramesh Gorijala. Such a Humble and powerful aura he has. Kannappa on June 27th. #HarHarMahadev pic.twitter.com/4EECXoDE9I— Vishnu Manchu (@iVishnuManchu) April 9, 2025 చదవండి: నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్ -
నా సినిమాకు భయపడి 'కన్నప్ప' వాయిదా: మంచు మనోజ్
మంచు బ్రదర్స్ మధ్య మరోసారి వార్ మొదలైంది. కూతురు పుట్టినరోజు సెలబ్రేషన్స్ కోసం రాజస్థాన్ వెళ్తే.. తన ఇంటికొచ్చి కారు, కొన్ని వస్తువులు ఎత్తుకెళ్లారని మంచు మనోజ్ (Manchu Manoj) పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. తాజాగా జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర బైఠాయించిన మనోజ్.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మా మధ్య ఎలాంటి గొడవల్లేవు. ఇక్కడ పరిస్థితులు బాగోలేకపోవడంతోనే కూతురు పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకునేందుకు జైపూర్ వెళ్లాను. మేం ఇక్కడే ఉండొచ్చని హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అయినా ఇంట్లోకి వెళ్లనివ్వట్లేదు. నా తల్లిమీద ప్రమాణం చేసి చెబుతున్నా ఏ రోజు నేను ఆస్తి కోసం గొడవపడలేదు. నేనంటే విష్ణుకి(Manchu Vishnu) కుళ్లు' 'అన్న కెరీర్ కోసం నేను సినిమాలో లేడీ గెటప్ కూడా వేశాను. ఇప్పుడు నా కారుని దొంగతనం చేశాడు. పాప నగలు ఎత్తుకెళ్లాడు. పెద్దవాళ్లని పిలిచి కూర్చుని మాట్లాడుదామని అడుగుతున్నాను. నా 'భైరవం' సినిమాకు భయపడే 'కన్నప్ప' (Kannappa Movie) వాయిదా వేసుకున్నాడు' అని మనోజ్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న గొడవ చూస్తుంటే మరికొన్నిరోజుల పాటు మంచు ఫ్యామిలీ గొడవలు జరుగుతాయా అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మనోజ్ మీడియాతో మాట్లాడాడు. మరి మోహన్ బాబు-విష్ణు వైపు నుంచి ఏం రెస్పాన్స్ వస్తుందో చూడాలి? -
పిల్లల్ని కంటాం కానీ వారి తలరాత మనం రాయలేం.. నేను ఫెయిల్యూర్ కాదు!
కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా వందలాది సినిమాలు చేశారు నటుడు మోహన్‌బాబు (Mohan Babu). వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఆయన ప్రస్తుతం కన్నప్ప సినిమా (Kannappa Movie)తో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ డైలాగ్ కింగ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.అదే నా తొలి చిత్రంమోహన్బాబు మాట్లాడుతూ.. నేను మొదట చూసిన సినిమా రాజమకుటం. దాసరి నారాయణరావు స్వర్గం- నరకం అనే సినిమాలో నాకు నటించే ఛాన్స్ ఇచ్చారు. అదే నా తొలి సినిమా. ఇది 25 వారాలు ఆడింది. నా గురువు దాసరిగారే భక్తవత్సలం నాయుడుగా ఉన్న నా పేరును మోహన్‌బాబుగా మార్చేశారు. నందమూరి తారక రామారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ప్రారంభమైంది. నా బ్యానర్లో తీసిన తొలి సినిమా ప్రతిజ్ఞ. ఎన్టీ రామారావుతో నా బ్యానర్లో మేజర్ చంద్రకాంత్ సినిమా చేశాను.అనుభవంతో చెప్తున్నా..ఆయన వద్దన్నా వినిపించుకోకుండా నా ఆస్తులు తాకట్టు పెట్టి మరీ తీశాను.. హిట్ కొట్టాను. నిర్మాతగా కొన్నిసార్లు ఫెయిలయ్యానేమోకానీ నటుడిగా మాత్రం ఎన్నడూ ఫెయిలవలేదు. అయితే సక్సెస్, ఫెయిల్యూర్ అనేవి మన చేతుల్లో ఉండవు. ఇది అనుభవంతో చెప్తున్నాను. చెత్త సినిమాలు ఆడతాయి.. కానీ బ్రహ్మాండమైన సినిమాలు ఆడవు. దానికి కారణం ఎవరూ చెప్పలేరు. మంచి పాత్ర దొరికితే సినిమా చేస్తాను. లేదంటే విద్యాలయాలు చూసుకుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తాను. అక్కినేని నాగేశ్వరరావు ఒక మాట చెప్తూ ఉండేవారు. బిడ్డల్ని కంటాం కానీ వారి తలరాత మన చేతుల్లో ఉండదు అని! కొన్నిసార్లు అది నిజమే అనిపిస్తుంది.ట్రోలింగ్స్ చూడనుజీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. కేవలం ఒక్క పూట భోజనం చేసిన రోజులున్నాయి. నేను ట్రోలింగ్స్ చూడను. అలాగే ట్రోలింగ్ చేసేవారినీ తప్పుపట్టడం లేదు. వారికి ఆ క్షణంలో అలాంటి ఆలోచనలు వచ్చాయి. మనం ఒకరిని తిడితే అది ఏదో ఒకరోజు మనకే తిరిగొస్తుంది. ఉడుకు రక్తంతో ఇలా చేస్తుంటారు. కానీ అది కుటుంబానికే నష్టం కలిగిస్తుందని ఆలోచించరు. వారి గురించి నేను విమర్శించను.. భయపడి సైలెంట్‌గా ఉండట్లేదు. ఒకర్ని తిడుతుంటే వారికి ఆనందంగా ఉందంటే సరే ఎంజాయ్ చేయండని వదిలేస్తున్నాను. గతంలో ఈ ట్రోలింగ్స్ లేవు అని చెప్పుకొచ్చారు.మా అమ్మకు చెవుడుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఇది భగవంతుడి ఆశీస్సులు. మా అమ్మకు రెండు చెవులు వినబడవు. రెండుసార్లు గర్భం నిలవకపోతే శివుడికి మొక్కుకుంది. ఆ భగవంతుడు ఐదుమంది సంతానాన్ని ఇచ్చాడు. ఆ దేవుడి ఆశీస్సులతోనే కన్నప్ప ముందుకు సాగింది. రేయింబవళ్లు చాలా కష్టపడ్డాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అని మోహన్‌బాబు ధీమా వ్యక్తం చేశారు.చదవండి: 'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..? -
ఆ వార్తల్ని నమ్మొద్దు.. 'కన్నప్ప' మూవీ టీమ్
మంచు విష్ణు హీరో, నిర్మాతగా చేసిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. లెక్క ప్రకారం ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేస్తామని చాలారోజుల క్రితమే ప్రకటించారు. కొన్నిరోజుల క్రితం వరకు ప్రచారం చేశారు. కానీ వీఎఫ్ఎక్స్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు రీసెంట్ గా ప్రకటించారు. కానీ తాజాగా మూవీ ప్రీమియర్ వేశారనే రూమర్స్ రాగా.. టీమ్ దీనిపై స్పందించింది.(ఇదీ చదవండి: హీరోయిన్ తమన్నా ఇంట్లో ప్రత్యేక పూజలు)'మార్చి 31న కన్నప్ప ప్రీమియర్ వేశారని వస్తున్న వార్తల్లో నిజం లేదు. 15 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజీ క్వాలిటీ మాత్రమే చెక్ చేశాం. మూవీ ఫస్ట్ కాపీని రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాం. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దు. త్వరలోనే ఇతర వివరాలు ప్రకటిస్తాం' అని కన్నప్ప టీమ్ చెప్పుకొచ్చింది.ప్రసాద్ ల్యాబ్ నుంచి మంచు ఫ్యామిలీ నడిచొస్తున్న విజువల్స్ కొన్ని బయటకు రావడంతోనే ఈ ప్రీమియర్ వార్తలు వచ్చాయి. ఇకపోతే కన్నప్ప మూవీలో మంచు ఫ్యామిలీకి చెందిన విష్ణు, ఇతడి కూతుళ్లు-కొడుకు నటించారు. తండ్రి మోహన్ బాబు కూడా కీలక పాత్ర పోషించారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ తదితరులు అతిథి పాత్రలు చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్'.. ఆ రోజే స్ట్రీమింగ్ కానుందా?)Official Clarification from Team KannappaContrary to rumours spreading online, there was NO premiere or screening of the full movie yesterday. The Kannappa team only reviewed a 15-minute VFX segment for quality assessment and corrections.The film’s first cut is still under…— Kannappa The Movie (@kannappamovie) April 1, 2025 -
నన్ను క్షమించండి.. తప్పట్లేదు: మంచు విష్ణు
మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా (Kannappa Movie) మరోసారి వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందని విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించాడు. చెప్పిన సమయానికి రావడం లేదని, అందుకు మన్నించాలని కోరాడు. 'అత్యున్నత విలువలతో కన్నప్ప సినిమాను మీ ముందుకు తీసుకురావాలని మేము ఎంతగానో ప్రయత్నిస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్..అయితే కొన్ని కీలక సన్నివేశాలకు ఇంకా వీఎఫ్ఎక్స్ చేయాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫలితంగా సినిమా రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుంది. మీరందరూ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. శివ భక్తుడైన కన్నప్ప సినిమా చరిత్రను మీ ముందుకు తీసుకురావడానికి చిత్రయూనిట్ విశేషంగా కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని ఓ నోట్ షేర్ చేశాడు.సినిమాకన్నప్ప విషయానికి వస్తే.. మంచు విష్ణు శివ భక్తుడు కన్నప్పగా నటించాడు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా యాక్ట్ చేశారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మించారు. నిజానికి గతేడాది డిసెంబర్లో కన్నప్ప రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ పుష్ప 2 ఆగమనంతో వెనకడుగు వేసి మార్చికి రిలీజ్ చేస్తామన్నారు. అనంతరం ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అనుకున్న సమయానికి రాలేమంటూ మరోమారు వాయిదా వేశారు. My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025 -
మంచు విష్ణు కన్నప్ప.. మరో రెండు పాత్రలు రివీల్
టాలీవుడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. ఇప్పటికే రిలీజైన కన్నప్ప పోస్టర్లు, టీజర్లు, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ప్రస్తుతం కన్నప్ప మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రెండు పాత్రలను రివీల్ చేశారు. రఘుబాబు, శివబాలాజీ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో రఘు బాబు మల్లు అనే ఓ పాత్రను పోషిస్తుండగా.. శివబాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.కాగా.. ఈ చిత్రంలో శివయ్యగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ అగర్వాల్, రుద్రుడిగా ప్రభాస్, మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు పాత్రలకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు కన్నప్ప టీం సిద్ధమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న తెలుగు, తమిళ,మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Revealing Sivabalaji's enlightened transformation as #KumaradevaShastri and Raghubabu as #Mallu in #Kannappa🏹!A journey of wisdom and unwavering devotion etched in divine history. 🔱Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/hRO4MPWFQ5— Mukesh Kumar Singh (@mukeshvachan) March 25, 2025 -
శివభక్తుడిగా మారిపోయా: విష్ణు మంచు
‘‘నేను ఆంజనేయస్వామి భక్తుడిని. కానీ ‘కన్నప్ప’ సినిమా ప్రయాణంతో శివభక్తుడిగా మారిపోయాను. మా చిత్రం అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూపొందిన సినిమా ‘కన్నప్ప’. మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ‘రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘కన్నప్ప’ యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రని ఆడియన్స్ ఎంత ఊహించుకున్నా.. అంతకుమించి ఉంటుంది’’ అని తెలిపారు.‘‘2016 జనవరిలో నేను శ్రీకాళహస్తికి వెళ్లి శివుణ్ణి దర్శించుకున్నాను. ఆ శివుడే నన్ను ‘కన్నప్ప’ప్రాజెక్ట్‌లోకి పంపించాడు. అదే శివ లీల’’ అని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. బ్రహ్మాజీ, రఘుబాబు పాల్గొన్నారు. -
'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా కన్నప్ప(Kannappa Movie). ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ మూవీపై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదివరకే విష్ణు ఈ విషయమై స్పందించగా.. ఇప్పుడు నటుడు రఘుబాబు (Raghu Babu) మాత్రం వింత కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.'ఈ సినిమా గురించి ఎవరైనా ట్రోల్ చేశారంటే చెబుతున్నా ఇప్పుడే.. శివుడి ఆగ్రహానికి, శాపానికి గురవుతారు. గుర్తు పెట్టుకోండి. ఎవరైనా 100 శాతం కరెక్ట్ ఇది. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు ఫినిష్' అని నటుడు రఘుబాబు తాజాగా జరిగిన ఈవెంట్ లో అన్నారు. ఇది విన్న నెటిజన్స్ షాకవుతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో హారర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్ట్రీమింగ్)ఎందుకంటే గతంలో ఈ చిత్ర టీజర్ రిలీజైనప్పుడు దారుణమైన ట్రోలింగ్ జరిగింది. దీంతో పలువురు యూట్యూబర్స్ పై హీరో, నిర్మాత మంచు విష్ణు (Manchu Vishnu) సీరియస్ అయ్యాడనే టాక్ వినిపించింది. ఆ తర్వాత మరో టీజర్ రిలీజ్ చేశారు. రెండు పాటలు కూడా విడుదల చేశారు. కాకపోతే ఈసారి అంత నెగిటివిటీ రాలేదు. ఎక్కడో చోట ట్రోలింగ్ జరుగుతుంది. అంతమాత్రాన దేవుడి పేరు చెప్పి శాపానికి గురవుతారని భయపెట్టడం ఏంటో అర్థం కావట్లేదు.కంటెంట్ లో దమ్ముంటే సినిమాని ఎంత ట్రోల్ చేసినా సరే హిట్ అవుతుంది. కన్నప్ప మూవీలోనూ ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. కాబట్టి హిట్ అవ్వొచ్చేమో చెప్పలేం. కానీ ఇలా శాపానికి గురవుతారని భయపెట్టడం మాత్రం కాస్త వింతగా ఉందని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఆ బాలనటి గుర్తుందా? ఇప్పుడు పెళ్లికూతురయ్యింది!) -
ఆ రూమర్స్‌తో హర్టయ్యా.. కానీ అది కిక్కిచ్చింది: కన్నప్ప హీరోయిన్
కన్నప్ప సినిమాలోని ‘సగమై – చెరి సగమై’ పాటతో అందరి దృష్టినీ ఆకర్షించింది హీరోయిన్ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). తమిళనాడుకు చెందిన ప్రీతి ముకుందన్ మలబార్ గోల్డ్, శరవణన్ స్టోర్స్, చెన్నై సిల్క్స్ వంటి సంస్థల కమర్షియల్ యాడ్స్‌లో మోడల్‌గా నటించింది. తండ్రి గోపాల్ ముకుందన్ వ్యాపారవేత్త. తల్లి చెన్నైలో డెంటిస్ట్‌గా ప్రాక్టీసు చేస్తోంది. తల్లి ప్రోత్సాహంతోనే చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి పెంచుకుంది. తల్లే దగ్గరుండి భరతనాట్యం నేర్పించి, ప్రదర్శనలు ఇప్పించింది.ప్రీతియే కాదు తల్లి కూడా నటించింది!తల్లికి యాక్టింగ్ పట్ల ఎంత ఇష్టమంటే కన్నప్ప సినిమాలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తే, తల్లి కూడా ఓ క్యారెక్టర్లో నటించింది. నటి లక్ష్మి కుమార్తె, ఒకనాటి హీరోయిన్ ఐశ్వర్య.. ప్రీతి ముకుందన్ తల్లి కాలేజీలో క్లాస్మేట్స్. న్యూజిలాండ్‌లో కలుసుకున్నప్పుడు ఇద్దరు స్నేహితురాళ్ళూ ఎంతో థ్రిల్ ఫీలయ్యారు. కాలేజీ కబుర్లు నెమరేసుకున్నారు. 2001 జులై 30 సోమవారం నాడు పుట్టింది ప్రీతి ముకుందన్. సోమవారం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు. అయితే, శివ భక్తుడు కన్నప్ప మీద తీస్తున్న సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చినట్లే వచ్చి పోయింది.ఆ హీరోయిన్ తప్పుకోవడం వల్ల..కన్నప్పలో హీరోయిన్ క్యారెక్టర్ ఆడిషన్‌కి ప్రీతి ముకుందన్ వచ్చింది. కానీ, నుపూర్ సనన్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. కన్నప్ప సినిమా ఓపెనింగ్‌లో కూడా నుపూర్ సనన్ పాల్గొంది. అప్పుడు ఎంతో బాధ పడినట్లు ప్రీతి ముకుందన్ చెప్పింది. అయితే తర్వాత నుపూర్ సినిమా మానేయడంతో– మళ్ళీ హీరోయిన్ చాన్స్ ప్రీతి ముకుందన్‌ను వెతుక్కుంటూ వచ్చింది. ఆ శివుడే తనకు ఈ అవకాశం ఇచ్చాడని ప్రీతి నమ్మకం.(చదవండి: మొదటి భార్యకు విడాకులు.. దేవదాసులా తాగుడుకు బానిసయ్యా..: హీరో)ఆ రూమర్స్‌తో హర్టయ్యామ్యూజికల్ వీడియో ఆల్బమ్స్‌తో ప్రీతి చాలా పాపులర్. ముత్తు–2, ఆశాకాండ, మోరిని మొదలైన వీడియోల్లో డ్యాన్స్ చేసింది. కన్నప్ప మొదటి తెలుగు సినిమా కాదు. అంతకు ముందు ‘ఓం భీమ్ బుష్’ అనే సినిమాలో శ్రీ విష్ణు పక్కన హీరోయిన్గా నటించింది. తమిళంలో స్టార్ అనే సినిమాలో మొదటిసారి నటించింది. ఆ సినిమా హీరో కెవిన్‌తో తన పేరు జత చేసి, రూమర్స్ వచ్చినప్పుడు కొంచెం ఫీలయ్యాను అంది. ప్రభాస్‌తో నటించడం..కన్నప్ప సినిమా కోసం హార్స్ రైడింగ్, కత్తిసాములో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంది. గ్లామరస్‌గా ఎక్స్పోజ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటో షూట్స్‌తో ప్రపంచానికి చాటి చెబుతూనే ఉంది. మలయాళంలో మైనే ప్యార్ కియా అనే సినిమా కూడా చేసింది. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్‌ను కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ ఆయనతో కలిసి యాక్ట్ చేయడం కెరీర్లోనే కిక్ ఇచ్చిన హయ్యస్ట్ మూమెంట్ అంది ప్రీతి ముకుందన్.చదవండి: నలుగురు సంతానం, ఇంకా పిల్లలు కావాలన్నా.. కుటుంబ నియంత్రణపై విష్ణు కామెంట్స్ -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మహదేవ శాస్త్రి గ్లింప్స్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీని ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పలువురు అగ్రతారల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.(ఇది చదవండి: 'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?)అయితే ఈ చిత్రంలో మోహన్ బాబు మహదేవ శాస్త్రి పాత్రలో అభిమానులను అలరించనున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు కావడంతో ప్రత్యేక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. మహదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేసే సాంగ్‌ను గ్లింప్స్ రూపంలో రిలీజ్ చేశారు. ఈ పాటను ఓకేసారి ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. -
'కన్నప్ప'కే టెండర్ వేసిన మంచు మనోజ్?
మంచు బ్రదర్స్, వీళ్ల కుటుంబంలో ఏమేం జరిగిందో తెలుగు ప్రేక్షకులకు తెలియందేమీ కాదు. దాదాపు కొన్నివారాల పాటు నడిచిన హంగామా ప్రస్తుతానికైతే సైలెంట్ అయినట్లే ఉంది. కానీ ఇప్పుడు మరోసారి విష్ణు vs మనోజ్ ఉండబోతుందా అనే సందేహం వస్తోంది. సోషల్ మీడియాలో ఇందుకు తగ్గట్లే కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.మంచు విష్ణు దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టి, చాన్నాళ్ల గ్యాప్ తర్వాత చేసిన సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రలు పోషించారు. తొలుత వచ్చిన టీజర్ పై ట్రోల్స్ వచ్చాయి కానీ ఈ మధ్య రిలీజైన టీజర్, పాటలపై మాత్రం కాస్తంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 25న రిలీజ్ కి తగ్గట్లే ప్రమోషన్స్ సాగుతున్నాయి.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్)అసలు విషయానికొస్తే.. మంచు మనోజ్ కూడా సినిమాలు చేయక చాన్నాళ్లయింది. రెండో పెళ్లి, ఫ్యామిలీలో గొడవలు వల్ల కెరీర్ మీద సరిగా దృష్టి పెట్టలేకపోయాడేమో! ఇకపోతే ఇతడు నటించిన 'భైరవం' అనే మూవీ లెక్క ప్రకారం గత డిసెంబరులోనే రిలీజైపోవాలి. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు దీన్ని కూడా ఏప్రిల్ 25నే థియేటర్లలో విడుదల చేయాలని అనుకుంటున్నారట.ఒకవేళ ఇదే జరిగితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచు బ్రదర్స్ పోటీ అన్నట్లు ఉంటుంది. తాజాగా ఓ ఉగాది ఈవెంట్ లో పాల్గొన్న మనోజ్ కూడా.. 'భైరవం' సరైన తేదీకే వస్తుందని చెప్పాడు. మరి ఈ రూమర్స్ లో నిజమెంతో చూడాలి?(ఇదీ చదవండి: బుల్లిరాజు డిమాండ్.. రోజుకి అంత రెమ్యునరేషన్?) -
పుట్టినరోజు కానుకగా...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. ప్రీతీ ముకుందన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న రిలీజ్ కానుంది. కాగా ఈ మూవీలో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు నటించారు. ఈ నెల 19న ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లోని మహదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని రిలీజ్ చేయనున్నారు మేకర్స్. -
రూ.200 కోట్లు ఇస్తా.. ఆస్కార్ తెప్పిస్తారా? : మంచు విష్ణు
మంచు విష్ణు(Manchu VIshnu ) ప్రస్తుతం కన్నప్ప(kannappa) సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లతో మంచు విష్ణు దేశం మొత్తం చుట్టేస్తున్నాడు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని యూట్యూబ్ ఛానళ్లకి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తనపై వస్తున్న ట్రోలింగ్ కూడా స్పందించాడు. కన్నప్ప టీజర్‌కు తమిళ, కన్నడ, మలయాళంలో మంచి రెస్పాన్స్ వచ్చిందని, తెలుగులో మాత్రం 15-20 శాతం మంది పని గట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారని మండి పడ్డారు.ఈ నెగటివిటీ కావాలని చేస్తున్నదే అని ఆయన ఆరోపించారు. తనపైనే కాదు రాజమౌళి లాంటి వారిపై కూడా వీళ్లు ఇలానే ట్రోలింగ్ చేస్తారని చెప్పారు.‘ఆర్ఆర్ఆర్’(RRR)కి ఆస్కార్ అవార్డు వస్తే తెలుగువారంతా గర్వంగా కాలర్ ఎగరేసి ఎంజాయ్ చేశారు. కానీ కొంతమంది మాత్రం విమర్శించారు. ఆ స్థాయిలో డబ్బులు ఖర్చు పెడితే వస్తది కదా అన్నారు. నేను 200 కోట్లు ఇస్తా.. ఆ విమర్శలు చేసినవాళ్లు ఆస్కార్ తీసుకొస్తారా? ఆర్ఆర్ఆర్`కి ఆస్కార్ రావడమనేది ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ మూమెంట్.అసలు ఎంత మందికి అక్కడ ఇన్విటేషన్ ఉంటుంది. ఇలాంటి మూమెంట్లని గర్వించాలి. కాలర్ ఎగరేసుకోవాలి. భారతదేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదు. ఇండియాలో డైరెక్ట్ గా ఏ సినిమాకి ఆస్కార్ రాలేదు. సత్యజిత్ రేకి గౌరవంగా లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ పురస్కారం అందించారు తప్పితే, సినిమాలకు ఇవ్వలేదు. ఇండియాలో ఇండియా టెక్నీషియన్లు చేసిన ఏ మూవీకి ఆస్కార్ రాలేదు. కేవలం `ఆర్ఆర్ఆర్`కి మాత్రమే సాధ్యమైంది. మన తెలుగు పాటని ఆస్కార్ స్టేజ్ పై వేశారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. దానికన్న గొప్పతనం ఏం కావాలి?అని ట్రోలర్స్‌పై మంచు విష్ణు మండిపడ్డారు.ఇక కన్నప్పలోని ‘లవ్ సాంగ్’ పై వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. ‘నేను సినిమా తీస్తున్నా.. డాక్యుమెంటరీ కాదు. అందుకే అన్ని కమర్షియల్ అంశాలు ఉంటాయి’అని అన్నారు. -
భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా: మంచు విష్ణు
సాక్షి, రాజంపేట: హీరో మంచు విష్ణు (Vishnu Manchu) అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలోని ఊటుకూరు భక్తకన్నప్ప గుడిని శనివారం సందర్శించాడు. కన్నప్ప చిత్రబృందంతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు. తమ గ్రామానికి విచ్చేసిన విష్ణుకు.. స్థానికులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.చరిత్ర తెలియజేయాలనే..ఆలయ దర్శనానంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. భక్తకన్నప్ప చరిత్రను నేటి తరానికి తెలియజేయాలనే కన్నప్ప సినిమా (Kannappa Movie) తీశాం. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఊటుకూరు భక్త కన్నప్ప గుడి అభివృద్ధికి కృషి చేస్తాను. ఆలయ పెద్దలతో మాట్లాడి గుడికి కావాల్సిన అవసరాలను తీరుస్తాను అని హామీ ఇచ్చాడు.కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. ప్రీతి ముకుందన్ కథానాయిక. కన్నప్ప పాత్రలో విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిగా కాజల్ అగర్వాల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్ కీలక పాత్రలు పోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న భారీ స్థాయిలో విడుదల కానుంది.చదవండి: నితిన్ వల్లే ఐటం సాంగ్ చేశా.. ఇప్పటికీ ఇబ్బందిగా అనిపిస్తుంది: గుత్తా జ్వాల -
'కన్నప్ప'తో మంచు విష్ణు అంత రిస్క్ చేస్తారా?
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలి టీజర్ రిలీజైనప్పుడు ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువొచ్చాయి. కానీ కొన్నాళ్ల ముందు విడుదల చేసిన మరో టీజర్ కి మాత్రం పర్లేదు బాగుందనే టాక్ వచ్చింది. దీనికి తోడు రెండు పాటలు కూడా వినసొంపుగా అనిపించాయి. ఇలా ఓ మాదిరి బజ్ ఏర్పడింది. ఇలా 'కన్నప్ప' గురించి కాస్తోకూస్తో అంచనాలు పెరుగుతున్న టైంలో మంచు విష్ణు రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ లో భారీ బడ్జెట్ సినిమాలు చాలా వాటి ఓటీటీ డీల్స్ ముందే పూర్తవుతున్నాయి. తద్వారా పెట్టిన బడ్జెట్ కొంతమేర రికవర్ చేయొచ్చనేది నిర్మాతల ప్లాన్.(ఇదీ చదవండి: దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు)కానీ 'కన్నప్ప' విషయంలో మాత్రం మంచు విష్ణు రిస్క్ తీసుకోవాలని ఫిక్సయ్యాడట. మూవీ రిలీజ్ కి ముందు డీల్ కుదుర్చుకుంటే ఓటీటీలు ఇచ్చినంత తీసుకోవాలి. అదే రిలీజ్ తర్వాత మూవీ హిట్ టాక్ తెచ్చుకుంటే మనం డిమాండ్ చేయొచ్చని విష్ణు ప్లాన్ అట. మరి ఇందులో నిజమెంతో?కన్నప్పలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారని టాక్. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుంది. మరి బిగ్ స్క్రీన్ పై ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
కన్నప్ప: నెమలితో తిన్నడి ప్రేమగీతం.. ముచ్చటగొలిపిస్తున్న జంట (ఫోటోలు)
-
'కన్నప్ప' నుంచి లవ్ సాంగ్ రిలీజ్
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి తొలుత టీజర్ రిలీజైనప్పుడు విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ కొన్నాళ్ల క్రితం శివయ్య అంటూ సాగే పాట రిలీజ్ చేసినప్పుడు మంచి స్పందనే వచ్చేసింది. ఇప్పుడు మూవీ నుంచి మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఈ సినిమాలో మంచు విష్ణు.. తిన్నడు అనే పాత్రలో కనిపిస్తాడు. ఇతడి ప్రేయసి నెమలి అనే పాత్రలో ప్రీతి ముకుందన్ నటించింది. వీళ్లిద్దరి మధ్య తీసిన ప్రేమగీతాన్నే ఇప్పుడు రిలీజ్ చేశారు. వినడానికి, చూడటానికి ఇది బాగానే ఉండటం విశేషం.ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతున్న 'కన్నప్ప'లో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్, మోహన్ బాబు తదితరులు నటించారు. (ఇదీ చదవండి: ప్రభాస్ @ 'బక'.. ఇంతకీ దీని అర్థమేంటి?) -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు అగ్రతారలు నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ఇటీవలే రెండో టీజర్ విడుదల చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియోను మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ మూవీ మేకింగ్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. ఇందులో మంచు విష్ణు పలు అంశాలపై టీమ్‌తో చర్చిస్తూ కనిపించారు. ఈ సినిమా తెర వెనుక సంగతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The making of Kannappa#kannappa pic.twitter.com/hZCBKbjjYK— Vishnu Manchu (@iVishnuManchu) March 9, 2025 -
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్
-
‘కన్నప్ప’ మూవీ HD స్టిల్స్
-
'కన్నప్ప' కొత్త టీజర్ రిలీజ్.. ఈసారి మాత్రం
మంచు విష్ణు 'కన్నప్ప' నుంచి కొత్త టీజర్ రిలీజైంది. ఎనిమిది నెలల క్రితం రిలీజైన టీజర్ తో పోలిస్తే ఈసారి ట్రోల్ చేసేంతలా ఏం లేదు. సినిమాలోని కీలక పాత్రధారుల్ని చూపిస్తూ కన్నప్ప ప్రపంచం ఎలా ఉందనేది చూచాయిగా చూపించారు.(ఇదీ చదవండి: రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాపు')1:24 నిమిషాల టీజర్ లో విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్.. ఇలా అందరిని చూపించేశారు. నాస్తికుడు అయిన తిన్నడు.. అలియాస్ మన హీరో శివయ్య భక్తుడిగా ఎలా మారాడు అనేదే స్టోరీ అని తెలుస్తోంది.ఏప్రిల్ 25న పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. రీసెంట్ గానే ముంబైలో ప్రెస్ మీట్ పెట్టారు. శ్రీకాళహస్తిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఉంటుందని మంచు విష్ణు చెప్పారు. టీజర్ అంతా ఏమో గానీ చివర్లో ప్రభాస్ ని కాసేపు అలా చూపించి అతడి అభిమానులని అయితే ఆకట్టుకున్నారు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు) -
జనరేటర్ లో పంచదార గొడవపై ప్రశ్న.. విష్ణు ఏమన్నాడంటే?
మంచు ఫ్యామిలీలో కొన్నిరోజుల ముందు వరకు గొడవలు జరిగాయి. ఈ మధ్య కాస్త శాంతించినట్లు ఉన్నారు. మరోవైపు తన కొత్త సినిమా 'కన్నప్ప' కోసం విష్ణు ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. తమ్ముడు మనోజ్ తో గొడవ గురించి స్వయంగా విష్ణునే అడిగాడు. దీనికి విష్ణు కూడా చాలా చాకచక్యంగా సమాధానం చెప్పాడు.కొన్నిరోజుల క్రితం మంచు మనోజ్ తన ఇంట్లో ఉండగా.. విష్ణు, అతడి మనుషులు వెళ్లి జనరేటర్ లో పంచదార పోశారని అంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజంగా అక్కడేం జరిగిందనేది పక్కనబెడితే అసలు జనరేటర్ లో షుగర్ ఎందుకు పోశావ్ అన్నా? అని స్వయంగా విష్ణుని ఓ నెటిజన్ అడిగేశాడు.(ఇదీ చదవండి: ముందే చెప్తున్నా.. మా సినిమాలో లాజిక్స్ వెతకొద్దు: నాగవంశీ)ఆస్క్ విష్ణు పేరుతో ట్విటర్ లో జరిగిన చాటింగ్ సందర్బంగా ఇదంతా జరిగింది. అయితే ఏం చెప్పినా సరే మళ్లీ వివాదం అయ్యే అవకాశముంది కాబట్టి.. 'ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివా' అని విష్ణు చాలా సెటైరికల్ గా సమాధానమిచ్చాడు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.భక్త కన్నప్ప స్టోరీతో తీసిన 'కన్నప్ప' మూవీలో విష్ణు ప్రధాన పాత్రధారి కాగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఏప్రిల్ 25న ఇది థియేటర్లలోకి రానుంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: నాగార్జున ఔట్.. హోస్ట్‌గా మరో స్టార్ హీరో!)Ra anna kooda intha manchiga reply ichina manasu needi , mari aaroju generator lo sugar enduk vesav bhaaii pic.twitter.com/nPj5cZRB5R— 🄳🄴🅅🄰 (@deva_cutzz) February 28, 2025 -
ముంబైలో 'కన్నప్ప' టీజర్ లాంచ్ హాజరైన అక్షయ్ కుమార్ (ఫొటోలు)
-
నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు
తెలుగులో ఇప్పుడున్న హీరోల్లో ప్రభాస్ అంత బిజీగా మరొకరు ఉండరు. ఎందుకంటే చేతిలో ప్రస్తుతం నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రెండింటి షూటింగ్ జరుగుతోంది. ఇంత బిజీగా ఉన్నా సరే మంచు విష్ణు 'కన్నప్ప'లో అతిథి పాత్ర చేశాడు. తాజాగా ప్రభాస్.. ఈ మూవీలో నటించడం గురించి హీరో మంచు విష్ణు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.'కన్నప్ప' సినిమాలో నటించమని అడిగేందుకు ప్రభాస్ కి ఫోన్ చేయగా.. మరో క్షణం ఆలోచించకుండా ఓకే చెప్పాడని మంచు విష్ణు బయటపెట్టాడు. తొలుత నాన్న (మోహన్ బాబు) ఫోన్ చేసి అడగడంతో ప్రభాస్ కాస్త భయపడ్డాడని, అదే విషయాన్ని తనకు చెప్పిన విషయాన్ని విష్ణు రివీల్ చేశాడు. ఏదైనా పనుంటే నువ్వే (విష్ణు) కాల్ చేయ్ అని తనతో ప్రభాస్ చెప్పినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: కన్నప్పలో భాగమవడం గౌరవం: అక్షయ్ కుమార్)మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'కన్నప్ప'. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్.. అలా ఇండియన్ మూవీ స్టార్స్ కూడా ఇందులో కీలకపాత్రల్లో నటించారు. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ముంబైలో ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే నాన్న ఫోన్ చేస్తే ప్రభాస్ భయపడిన విషయాన్ని మంచు విష్ణు బయటపెట్టాడు.రూ.100 కోట్ల బడ్జెట్ తో తీసిన కన్నప్ప.. ఏప్రిల్ 25న థియేటర్లలోకి రాబోతుంది. ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా.. అది అలరిస్తోంది. చిత్ర విడుదలకు ఇంకా టైముంది కాబట్టి ప్రమోషనల్ కంటెంట్ మరింత రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్)Rebel Star #Prabhas okka kshanam kooda aalochinchakunda idhi chayyadam anukunnaru ❤️🔥 #Kannappa #ManchuVishnu pic.twitter.com/ewtDFYkoZG— prabhas_garu_taluka (@varmadatla2) February 27, 2025 -
'శివ శివ శంకరా..' సాంగ్‌కు 80 మిలియన్ల వ్యూస్
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కన్నప్పపాత్రను విష్ణు మంచుపోషించగా, రుద్రుడిగా ప్రభాస్, మహా శివుడిగా అక్షయ్ కుమార్ కనిపించనున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్యపాత్రలుపోషించారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25నపాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ‘శివ శివ శంకరా...’ అనేపాట సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్‌గా నిలిచినట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ– ‘‘శివ శివ శంకరా’పాటని ఇప్పటికే 80 మిలియన్ల (8 కోట్లు) మంది వీక్షించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షలకు పైగా రీల్స్ చేశారు ప్రజలు ఈపాటని ఆదరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం ఆనందంగా ఉంది. ఇంతలా ఈపాట ట్రెండ్ అవుతుందని మేం ఊహించలేదు. శివరాత్రి సందర్భంగా ఈ సాంగ్ మరింతగా చేరువ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. -
హరోం హర అంటున్న సినీ స్టార్స్
మహా శివరాత్రి పర్వదినం (ఫిబ్రవరి 26) సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. శివుడికి ఎంతో ఇష్టమైన రోజు అయిన మహా శివరాత్రికి జాగరణ చేసేందుకు భక్తులు శివాలయాలకు పోటెత్తుతారు. ఆ రోజు శివాలయాలన్నీ హరోం హర అంటూ శివనామ స్మరణతో మార్మోగుతాయి. సినిమా ఇండస్ట్రీకి కూడా మహా శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందనే చెప్పాలి. శివుడి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చి, ప్రేక్షకులను అలరించాయి. తాజాగా పరమేశ్వరుడి నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అలాగే శివ భక్తి నేపథ్యంలో పాటలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాల విశేషాల గురించి తెలుసుకుందాం.శివుడి నేపథ్యంలో...తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి ఎస్వీసీ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివుడి నేపథ్యం ఉంటుందని తెలుస్తోంది. గత ఏడాది మహా శివరాత్రి కానుకగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. ఆహార దేవతగా భావించే అన్నపూర్ణా దేవి నుంచి శివుడు భిక్ష తీసుకుంటున్న ఫొటో పోస్టర్లో ఉంది.అంటే... ఈ కథలో శివుడి గురించి ఏదో ఒక లైన్ టచ్ చేసి ఉంటారని కచ్చితంగా ఊహించవచ్చు. పైగా మహా శివరాత్రి కానుకగా ప్రత్యేకించి ఆ పోస్టర్ విడుదల చేయడం కూడా శివుడి నేపథ్యం ఉంటుందని చెప్పకనే చెప్పింది యూనిట్. ఈ సినిమాలో మురికి వాడల్లో నివశించే వ్యక్తిగా ధనుష్ పాత్ర ఉంటుంది. అలాగే ముంబైకి చెందిన ఓ ధనవంతుడి పాత్రలో నాగార్జున కనిపించనుండగా, రష్మికా మందన్న మధ్యతరగతి యువతి పాత్ర చేస్తున్నారు. నటుడు జిమ్ సర్భ్ ఓ బిలియనీర్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తారు. శివ భక్తుడి కథమంచు విష్ణు టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై మంచు మోహన్‌బాబు పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 25న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదలకానుంది.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది ‘కన్నప్ప’ యూనిట్. పరమశివుడికి వీర భక్తుడైన కన్నప్ప నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. కన్నప్పలోని వీరత్వం, భక్తిని మేళవించి ఈ మూవీ తెరకెక్కించారు ముఖేశ్ కుమార్ సింగ్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడి పాత్ర చేయడం విశేషం. శివ తాండవం చేస్తున్న అక్షయ్ కుమార్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది.శివుడిగా ఆయన పాత్ర ఎలా ఉండబోతోందో ఆ పోస్టర్ ద్వారా చూపించింది యూనిట్. అంతేకాదు... ఈ సినిమా నుంచి విడుదలైన ‘శివ శివ శంకరా...’ పాటకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశారు. ఈ మూవీలో తిన్నడు పాత్రలో మంచు విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. మధుబాల, ప్రీతీ ముకుందన్, ఐశ్వర్య, దేవరాజ్, విష్ణు మంచు కుమార్తెలు అరియానా, వివియానా వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. శివ తాండవం పాప వినాశక సాక్షాత్ సాంబ శివ అంటూ ఆడి పాడుతున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘భైరవం’. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించారు. ఈ మూవీలో అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై కథానాయికలు. పెన్ స్టూడియోస్‌పై డా. జయంతిలాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రంలో శివుడి నేపథ్యంలో ఓ పాట తెరకెక్కించారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘భైరవం’ థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ పాటలో పరమ శివుని భయం, బలం ఈ రెండింటినీ తన హావభావాలు, నృత్యంతో అద్భుతంగా కనబరిచారు సాయి శ్రీనివాస్. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించిన ఈ పాటని శంకర్ మహదేవన్ తనదైన శైలిలో పాడారు. ఓ ఆలయం ముందు ఈ పాటను చిత్రీకరించారు.‘‘ఈ నెల 26న రానున్న మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక పాటని విడుదల చేశాం. పరమ శివుడి దైవిక సారాన్ని అందంగా ప్రజెంట్ చేసి, లోతుగా ప్రతిధ్వనించే ఎమోషన్స్‌ని ఈ పాట ఆవిష్కరిస్తుంది. సాయి శ్రీనివాస్ పాత్ర శివ తాండవం ప్రేరణ స్ఫూర్తితో మెస్మరైజ్ చేస్తుంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది. జటాధరవైవిధ్యమైన కథా నేపథ్యం ఉన్న చిత్రాలు, పాత్రలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘జటాధర’. వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్ కేఆర్ భన్సల్, ప్రేరణా అరోరా నిర్మిస్తున్నారు. సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం ‘జటాధర’. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరిగే కథ ఇది.అక్కడి సంపద, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, పురాణ చరిత్ర వీటి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా పరమ శివుడితో ముడిపడిన కథే అని సమాచారం. పైగా టైటిల్‌ని బట్టి చూస్తే ఇదే వాస్తవం అనిపిస్తుంది. జటాధరుడు అని పరమ శివుణ్ణి పిలుస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని నిధిని మాత్రమే కాకుండా ఆలయ చరిత్ర, పురాణ కథల్ని కూడా చూపించబోతున్నారు మేకర్స్. ఈ సినిమాలో సుధీర్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది.పరమ శివుని భక్తురాలుహీరోయిన్ తమన్నా లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. ‘ఓదెల రైల్వేస్టేషన్’ (2021)కి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం విశేషం. తొలి భాగాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ అశోక్ తేజ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, యువ, నాగ మహేశ్, వంశీ, గగన్ విహారి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు.సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో శివ భక్తురాలైన శివ శక్తి నాగసాధు పాత్రలో నటిస్తున్నారు తమన్నా. తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఓదెల మల్లన్న స్వామి ఎలా కాపాడారు? అనే అంశంతో ‘ఓదెల 2’ తెరకెక్కుతోంది. మల్లన్న స్వామి అంటే శివుడే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా షూటింగ్ సింహ భాగం వారణాసిలోని కాశీలో జరిగింది. శనివారం విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.ఇవే కాదు... మరికొన్ని సినిమాలు కూడా శివుడి నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి. -
ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం.. గొడవలు ఆగిపోతే బాగుండు: మంచు విష్ణు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie). ఇందులో విష్ణు (Vishnu Manchu) హీరోగా నటిస్తుండగా ప్రీతి ముకుందన్ కథానాయికగా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి టీజర్ వరకు విమర్శలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇటీవల విడుదలైన శివ శివ శంకరా.. పాటతో ట్రోలింగ్ అంతా కొట్టుకుపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విష్ణు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ఎన్ని జన్మలెత్తినా..శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబు (Mohan Babu) నాకు తండ్రిగా ఉండాలని కోరుకుంటాను. మా కుటుంబంలోని కలహాలకు త్వరగా ఫుల్స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. ట్రోలింగ్ విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రవర్తించాలి. నాకేం తెలీదుమాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని అవతలివారి స్వేచ్ఛకు, వ్యక్తిత్వానికి భంగం కలిగించకూడదు. హీరోల గురించి ఎందుకు అసభ్యంగా మాట్లాడతారు? సీనియర్ నటులు చనిపోయారని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కోట శ్రీనివాసరావు గురించి ఇలాంటి ప్రచారమే జరిగినప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి విపరీతంగా బాధపడ్డారు. ఇకపోతే ప్రభాస్ పెళ్లి గురించి, కాబోయే భార్య గురించి నాకెలాంటి విషయాలు తెలియవు.గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయికన్నప్ప సినిమా బడ్జెట్ విషయంలో ఇప్పటికీ నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి. సినిమాపై నమ్మకంగా ఉన్నా. అయినా సక్సెస్- ఫెయిల్యూర్ రెండూ మోసగాళ్లే! ఎవరూ మనతో శాశ్వతంగా ఉండరు అన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న కన్నప్ప మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్‌బాబు, శరత్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.చదవండి: ఆ ఒక్క పనితో లాభపడ్డ ఇద్దరు హీరోలు.. లేకుంటే సీన్ రివర్స్?! -
‘కన్నప్ప’కోసం ప్రభాస్, మోహన్‌లాల్ ఎంత తీసుకున్నారంటే..
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’(Kannappa). అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించిన ఈమూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌ని ముమ్మరం చేశారు మేకర్స్. ప్రతి సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ ఇస్తున్నారు. దీంతో పాటు మంచు విష్ణు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నప్ప సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సినిమా కోసం ఏడేళ్లుగా పని చేస్తున్నామని, దాదాపు రూ. 140 కోట్ల బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించామని చెప్పాడు. ఇందులో నటీనటులు పారితోషికాలతో కలిపి చూస్తే.. ఈ సినిమా బడ్జెట్ భారీగా పెరగాల్సింది. కానీ చాలా మంది నటీనటులు డబ్బులు తీసుకోకుండానే నటించారట. మోహన్ లాల్, ప్రభాస్ అయితే ఒక్క రూపాయి తీసుకోకుండానే నటించారట. ఈ విషయాన్ని మంచు విష్ణునే చెప్పారు.‘ఈ చిత్రంలో ప్రభాస్(Prabhas), మోహన్ లాల్(Mohanlal) పోషించిన పాత్రలు చాలా కీలకం. వాళ్లను కథ చెప్పగానే ఒప్పుకున్నారు.ఈ సినిమా కోసం వాళ్లిద్దరూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదు. నాన్నగారిపై(మోహన్ బాబు)పై ఉన్న అభిమానంతో వారిద్దరు నటించారు. మోహన్‌లాల్ దగ్గరకు వెళ్లి కథ చెప్పిన తర్వాత పారితోషికం గురించి మీ మేనేజర్‌తో మాట్లాడమంటారా అని అడిగితే..‘అప్పుడే అంత పెద్ద వాడివయ్యావా?’ అన్నాడు. ఇక ప్రభాస్ నాకు మంచి స్నేహితుడు. అతని వల్ల నాకు స్నేహంపై నమ్మకం పెరిగింది. నా కోసం ప్రభాస్ ఇందులో నటించాడు. అలాగే అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర కూడా కీలకమే. శివుని పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తే.. రెండు సార్లు సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత వేరే దర్శకుడితో చెప్పించి ఆయనను ఒప్పించాం. చాలా అద్భుతంగా నటించాడు’ అని విష్ణు చెప్పుకొచ్చాడు.అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
మనసు నిన్ను తెలుసుకుందయ్యా...
‘‘తెలివి కన్ను తెరుసుకుందయ్యా... శివలింగామయ్యా... మనసు నిన్ను తెలుసుకుందయ్యా...’’ అంటూ మొదలవుతుంది ‘కన్నప్ప’ సినిమాలోని ‘శివ శివ శంకరా...’పాట. మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ప్రీతీ ముకుందన్ హీరోయిన్. మోహన్‌బాబు, శరత్‌కుమార్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది.కాగా బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ ఈ చిత్రంలోని ‘శివ శివ శంకరా...’పాటను రిలీజ్ చేశారు. మోహన్ బాబు, విష్ణు మంచు, ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్‌లైన్ వెంకటేశ్, నటి సుమలత, భారతీ విష్ణువర్ధన్, సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ, రామజోగయ్య శాస్త్రి తదితరులుపాల్గొన్నారు. ‘‘రవిశంకర్ గురూజీ ఈ పవిత్ర గీతాన్ని ఆవిష్కరించడం గౌరవంగా భావిస్తున్నాను.‘కన్నప్ప’ అనేది శివునితో మమేకం చేయబడిన చిత్రం. ఇదే మా ప్రయాణానికి అ΄ారమైన ఆధ్యాత్మిక విలువను జోడిస్తుంది’’ అని తెలి΄ారు మోహన్‌బాబు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవస్సీ స్వరపరచిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, విజయ్ ప్రకాశ్ ఆలపించారు. న్యూజిల్యాండ్‌లో చిత్రీకరించిన ఈపాటకు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈపాటను హిందీలో జావేద్ అలీపాడగా, శేఖర్ అస్తిత్వ సాహిత్యాన్ని అందించారు. -
కన్నప్పలో 'రుద్ర'గా ప్రభాస్.. ఫస్ట్ లుక్ వచ్చేసింది
మంచు విష్ణు( Vishnu Manchu) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa Movie) నుంచి ప్రభాస్ (Prabhas) ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రంలో శివుడి పరమ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, 'రుద్ర' పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని తాజా పోస్టర్‌తో మేకర్స్ తెలిపారు. ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో ఏప్రిల్ 25 విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రళయ కాల రుద్రుడు..! త్రికాల మార్గదర్శకుడు..!! శివాజ్ఞ పరిపాలకుడు..!!! అంటూ కన్నప్ప టీమ్ విడుదల చేసిన ప్రభాస్ రుద్ర గెటప్ అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి.మొదట కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చేయాలని ప్రభాస్‌నే కోరారు మంచు విష్ణు.., అందుకు ప్రభాస్ నిరాకరించి మరో పాత్ర ఉంటే చెప్పు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. కన్నప్పలో ప్రభాస్ పాత్ర ఏంటి అంటూ పెద్ద చర్చే నడిచింది. వాటికి ఫుల్స్టాప్ పెడుతూ.. రుద్రగా ప్రభాస్ కనిపిస్తారని కన్నప్ప టీమ్ ప్రకటించింది. కన్నప్పలో శివుడిగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. -
ముఖ్యమంత్రిని కలిసిన మంచు మోహన్‌బాబు
టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు (Mohan Babu) తన కుమారుడు విష్ణుతో పాటుగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని (Bhupendra Patel) కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్ పేజీలో వారు షేర్ చేశారు. తెలుగు కళాకారుడు రమేశ్ గొరిజాల వేసిన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు విష్ణు కానుకగా అందించారు. వారితో పాటు శరత్ కుమార్, శ్రీ ముఖేష్ రిషి, వినయ్ మహేశ్వరి ఉన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలవడం తమకు చాలా సంతోషంగా ఉందని మోహన్‌బాబు అన్నారు. ఆయన ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అభివృద్ధిలో గుజరాత్ మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్న డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసిస్తూనే ఆయన ఎన్నో విజయాలు అందుకోవాలని మోహన్‌బాబు కోరారు. అయితే ఆయన ఏ కారణం వల్ల సీఎంను కలిశారో అనేది మాత్రం తెలుపలేదు.ప్రస్తుతం మోహన్‌బాబు, శరత్‌కుమార్ ఇద్దరూ ‘కన్నప్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌తో ఏప్రిల్ 25న ఈ చిత్రం విడుదల కానుంది.It was a pleasure meeting the Hon’ble Chief Minister of Gujarat, Shri Bhupendra Patel Ji, along with Vishnu Manchu, Mr. Sarath Kumar, Mr. Mukesh Rishi, and Mr. Vinay Maheshwari. I thank him for the warm reception and praise the Almighty for his good health and prosperity. As a… pic.twitter.com/iDdQDh9oLV— Mohan Babu M (@themohanbabu) January 29, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్ వచ్చేసింది
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ అక్షయ్‌కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి పలువురు స్టార్స్ నటిస్తున్నారు. అంతేకాదు మన రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సందర్భంగా కన్నప్ప మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను రివీల్ చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 3న తేదీన ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.టీజర్‌కు ఊహించని రెస్పాన్స్..ఇప్పటికే కన్నప్ప టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Here’s a glimpse of the Darling-Rebel Star '𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬' in #Kannappa!🌟 🎬Experience the beginning of an epic journey, and don’t miss the full reveal on 3rd February. Stay tuned for more updates! 🙌 #Prabhas #HarHarMahadevॐ@themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas… pic.twitter.com/ujJMFf93W8— Kannappa The Movie (@kannappamovie) January 27, 2025 -
ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు
విష్ణు మంచు హీరోగా నటించిన చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రీతి ముకుందన్ హీరోయిన్ . మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటివారు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.కాగా ‘కన్నప్ప’ సినిమాలో శివుడి పాత్రలో అక్షయ్ కుమార్ నటించినట్లు వెల్లడించి, ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ముల్లోకాలు ఏలే పరమేశ్వరుడు భక్తికి మాత్రం దాసుడు’ అని ఫస్ట్‌లుక్ పోస్టర్‌పై ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 25న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. -
నాన్న మనసు ముక్కలైంది.. అమ్మ నలిగిపోతోంది: మంచు విష్ణు
అన్నదమ్ముల గొడవ వల్ల మోహన్‌బాబు ఏళ్లతరబడి సంపాదించుకున్న పరువు ప్రతిష్ట అంతా బజారుకెక్కింది. పెదరాయుడిగా అందరి సమస్యలు తీర్చే మోహన్‌బాబు ఇంటి గొడవను చక్కదిద్దలేక డీలా పడిపోయాడు. రోజుకో వివాదం, ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. కానీ, ఇంతవరకు వీరి సమస్య ఓ కొలిక్కి వచ్చిందే లేదు.నాన్న మనసు విరిగిందితాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు (Vishnu Manchu) తన ఇంట్లో జరుగుతున్న కలహాలపై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. తండ్రిగా మోహన్‌బాబు (Mohanbabu).. మనోజ్‌ను, నన్ను సమానంగా ప్రేమించాడు. మా ఇంటి గొడవ రోడ్డుకెక్కడం వల్ల నాన్నగారి మనసు విరిగిపోయింది. ఆస్తుల గరించి ఒకటి చెప్పాలి. మా నాన్న మమ్మల్ని చదివించారు. తర్వాత ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి. రేప్పొద్దున నా పిల్లలు కూడా నాపై ఆధారపడకుండా వారి కాళ్లపైనే నిలబడాలి. వారే సంపాదించుకోవాలి. ఎవరైనా సరే.. తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన ఆస్తి, ఇల్లు అడగకూడదు.అమ్మ కొడుతుందేమో..కుటుంబ విషయాల గురించి ఇంకా ఎక్కువ మాట్లాడితే మా అమ్మ నన్ను కొడుతుందేమోనని భయంగా ఉంది. అమ్మతో పది నిమిషాల పైన మాట్లాడితే చాలు తిట్టడం మొదలుపెడుతుంది. తనతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. ఈ వివాదంలో ఎక్కువ నలిగిపోయింది అమ్మ. ఏదో ఒకరోజు అమ్మ మా అందర్నీ కొడుతుందేమోననిపిస్తోంది. ఇంటి గొడవ వీధిన పడ్డప్పుడు అందరం బాధపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో దగ్గరివాళ్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఇతర ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్, ప్రభుదేవా.. వంటివారు కూడా ఫోన్లు చేసి బాధపడ్డారు అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ఇంటి నుంచి మనోజ్‌ను బయటకు పంపాలంటూ మోహన్‌బాబు ఫిర్యాదు)మనోజ్‌తో కలిసిపోతా..మనోజ్ (Manchu Manoj)కు భయపడి దుబాయ్‌కు షిఫ్ట్ అవుతున్నారా? అన్న ప్రశ్నకు నేను ఎవ్వరికీ భయపడను. ఈ జన్మలో భయపడటమనేదే జరగదు. జీవితంలో ఎవరికీ జంకొద్దనుకునే టైంలో నా భార్యకు భయపడాల్సి వస్తుంది. పిల్లల్ని దుబాయ్‌లో చదివించాలనుకుంటున్నానంతే! అన్నాడు. మనోజ్‌తో కలిసిపోతారా? అన్న ప్రశ్నకు.. అది కచ్చితంగా జరుగుతుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కాలమే అన్నింటినీ మార్చేస్తుంది. చాలావరకు అన్నీ సద్దుమణిగాయి అన్నాడు. కుటుంబంజెనరేటర్ ఇష్యూ గురించి మాట్లాడుతూ.. జెనరేటర్లో చక్కెర పోస్తే ఫిల్టర్ ప్రాసెస్‌లోనే ఆగిపోతుంది తప్ప పేలదు. ఇది చాలా సిల్లీ అని నవ్వేశాడు. మోహన్‌బాబు కుటుంబ విషయానికి వస్తే.. ఈయన మొదటగా విద్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు లక్ష్మీ ప్రసన్న, విష్ణు జన్మించారు. విద్యా దేవి మరణించాక ఆమె సోదరి నిర్మలా దేవిని మోహన్‌బాబు రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి మనోజ్ పుట్టాడు. డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప విశేషాలుకన్నప్ప సినిమా (Kannappa Movie) గురించి మాట్లాడుతూ.. ఏడెనిమిది సంవత్సరాలపాటు దీనిపై అధ్యాయం చేశాను. శివుడి పాత్ర కోసం అక్షయ్ కుమార్‌ను సంప్రదించినప్పుడు ఆయన ఆఫర్ రిజెక్ట్ చేశారు. మూడుసార్లు అడిగినా ఒప్పుకోలేదు. దర్శకురాలు సుధా కొంగరతో మాట్లాడించి తనను ఒప్పించాను. ప్రభాస్ సినిమాలో భాగమవడానికి నాన్నే కారణం అని చెప్పాడు. కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కానుంది.చదవండి: సైఫ్‌ను ఆవేశంతో పొడిచాడు.. నా నగల జోలికి వెళ్లలేదు: కరీనా -
నిన్న జరిగింది మర్చిపోను.. రేపటి గురించి ఆలోచించను: మోహన్ బాబు
తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో (Mohan Babu University) బుధవారం నాడు సంక్రాంతి (Sankranthi) వేడుకలు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు ముగ్గుల పోటీలతో పాటు ఆటల పోటీలు నిర్వహించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే, ఈ సంక్రాంతి వేడుకల్లో యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు సినీ డైలాగ్స్‌తో అక్కడి విద్యార్థులను ఆనందపరిచారు. వేదికపై ఆయన మాట్లాడాతూ.. గతం గతః అనే వ్యాఖ్యలు చేశారు.యూనివర్సిటీ వేదికపై మోహన్‌బాబు (Mohan Babu) మాట్లాడుతూ.. తాను నటించిన రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో ఓ డైలాగ్ చెప్పారు. 'నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వెయ్యను, రేపటి గురించి ఆలోచించను' అని మెప్పించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రతి ఏడాది విద్యార్థులతో కలిసి బోగి, సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నామని మోహన్ బాబు అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పక్కన పెట్టి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. సంక్రాంతి అంటే రైతు అని, రైతు బాగుంటేనే మనంందరం బాగుంటామని ఆయన గుర్తుచేశారు. కాబట్టి సంక్రాంతి అనేది మనందరి పండుగ అన్నారు.ఈ క్రమంలో మోహన్‌బాబును కన్నప్ప సినిమా పనుల గురించి మీడియా వారు ప్రశ్నించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం ఉన్నట్లు ఆయన తెలిపారు. 'ఏఫ్రిల్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. సినిమాపై నమ్మకంతో మేము ముందుగా అనుకున్నదాని కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాం. శ్రీకాళహస్తీశ్వరుడిపై ఇప్పటివరకూ విడుదలైన సినిమాలన్నీ భారీ విజయాన్ని అందుకున్నాయి. పరమశివుడి వరంతో నేను జన్మించాను.(ఇదీ చదవండి: హనీరోజ్ ఫిర్యాదు.. ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్ ) అందుకే నా పేరు భక్తవత్సలం అని మా తల్లిదండ్రుల పెట్టారు. కాబట్టి ఆయనే మమ్మల్ని ఆదుకుంటాడు. సినిమా పరిశ్రమలో జయాపజయాలు సహజం. కానీ, ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని ప్రకృతిని కూడా కోరుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌పై నా బిడ్డ విష్ణు ఎన్నో కలల కన్నాడు. ఒకరకంగా ఇది అతనికి డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెబుతాను. కాబట్టి అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను.' అని ఆయన అన్నారు.మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. -
కన్నప్ప మూవీ.. కాజల్ అగర్వాల్ ఏ పాత్ర చేయనుందంటే?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ కనిపించనున్నారు.ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. టీజర్ చూస్తే ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను అలరించింది. యూట్యూబ్‌లోనూ ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో పార్వతి దేవి పాత్రలో కాజల్ కనిపించనుంది. ఈ మేరకు నాలుగు భాషల్లో కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు క్యారెక్టర్‌ను పరిచయం చేశారు. పార్వతి దేవి లుక్‌లో కాజల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా పోస్టర్‌ను చూసేయండి.కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ.. వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లతో సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇందులో కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారు. గతంలోనే ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.కన్నప్ప కథేంటంటే..పాన్ ఇండియా ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం అన్నారు మోహన్‌బాబు.విజువల్ వండర్‌గా కన్నప్ప..ఈ చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు కూడా. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని ఇస్తుందని వెల్లడించారు. ఆడియన్స్‌ను మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు. విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్‌ను పాన్ ఇండియాలో ఈ ఏడాది ఏప్రిల్ 25న విడుదల చేయనున్నారు. 🌟 Divine Grace Personified 🌟Here is the glorious full look of @MsKajalAggarwal as '𝐌𝐀𝐀 𝐏𝐚𝐫𝐯𝐚𝐭𝐢 𝐃𝐞𝐯𝐢'🪷 the divine union with '𝐋𝐨𝐫𝐝 𝐒𝐡𝐢𝐯𝐚'🔱, in #Kannappa🏹. Witness her ethereal beauty and the divine presence, she brings to life in this epic tale of… pic.twitter.com/EvEgx3GDWY— Kannappa The Movie (@kannappamovie) January 6, 2025 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరోయిన్ ఎవరో తెలుసా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ లాంటి ప్రముఖులంతా కనిపించనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు క్యారెక్టర్లను రివీల్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె నెమలి అనే రాకుమార్తెగా కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రీతి ముకుందన్ తన గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా.. అంతకుముందు ప్రీతి టాలీవుడ్ చిత్రం ఓం భీమ్ బుష్‌లో నటించింది. ఈ మూవీలో జలజ అనే పాత్రలో మెరిసింది.(ఇది చదవండి: 'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!) పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న కన్నప్ప చిత్రాన్ని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమాతో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ అరంగేట్రం చేస్తున్నాడు. ఆయన కుమార్తెలు కూడా కన్నప్పలో నటిస్తున్నారు. ఇటీవల వారిద్దరి పోస్టర్లను కూడా సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.✨ Behold the mesmerizing look of Preity Mukhundhan as Princess 𝐍𝐞𝐦𝐚𝐥𝐢 in #Kannappa 🏹✨ Sharing the screen with @iVishnuManchu, she adds grace and charm to this divine tale. 🌺Experience the magic and splendor of divinity! 🙏 #HarHarMahadevॐ@themohanbabu @Mohanlal… pic.twitter.com/UVgiPVwL4K— Kannappa The Movie (@kannappamovie) December 30, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇటీవల కన్నప్ప కామిక్ బుక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా యానిమేటెడ్ సిరీస్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్‌ను మంచు విష్ణు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోను పంచుకున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. 🌟 Unveil the saga of '𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚' 🌟Dive into the epic tale of #Kannappa🏹 in our first Animated Comic Book—devotion, bravery, and sacrifice brought to life.Episode 1 is streaming now on YouTube! 🎥✨🔗Telugu: https://t.co/iolkS7zeS3🔗Tamil: https://t.co/sQP4xKrQGG… pic.twitter.com/pqJf9ZXPSm— Vishnu Manchu (@iVishnuManchu) December 23, 2024 -
'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదం నడుస్తోంది. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. మోహన్ బాబు- మనోజ్ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం దగ్గర నుంచి తాజాగా మోహన్ బాబు భార్య నిర్మల.. మనోజ్ చేసిందని తప్పంటూ లేఖ విడుదల చేయడం వరకు వచ్చింది. దీని వల్ల మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఓ నెటిజన్‌కి ట్వీట్‌కి విష్ణు ఆసక్తికర రిప్లై ఇచ్చాడు.(ఇదీ చదవండి: ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. భర్త గురించి వరలక్ష్మి)మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు.'కన్నప్ప'లో ప్రభాస్ కూడా అతిథి పాత్ర చేస్తున్నాడు. తాజాగా ఓ నెటిజన్.. విష్ణుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 'అన్నా.. మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ లుక్స్, పాత్ర తేడా రాకుండా చూస్కో. ఐదు సార్లు వెళ్తా మూవీకి' అని రాసుకొచ్చాడు. దీనికి రిప్లై ఇచ్చిన విష్ణు.. '100 శాతం మీకు ప్రభాస్ పాత్ర నచ్చుతుంది బ్రదర్. కాస్త ఓపిగ్గా ఉండు. త్వరలో బోలెడన్ని విషయాలు చెబుతా' అని అన్నాడు. (ఇదీ చదవండి: మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు.. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల)My brother, I am 100% sure you will love my brother #prabhas character and I wish I can tell you more. Exciting to reveal more. Patience please 🙏 🤗🥰 https://t.co/956puAYJ4X— Vishnu Manchu (@iVishnuManchu) December 17, 2024 -
కన్నప్పలో 'కిరాట'గా మలయాళ స్టార్
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఇందులో ప్రీతీ ముకుందన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం ప్రధానపాత్రల్లో నటించగా, ప్రభాస్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కిరాట పాత్రలో మోహన్‌లాల్ నటిస్తున్నారని వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘కన్నప్ప’ సినిమా ఈ తరం ప్రేక్షకులకైనా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్మ్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించనున్నాం. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి ఆజ్ఞతోనే ఈ సినిమా తీస్తున్నాం’’ అన్నారు మోహన్‌బాబు. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు మనవరాళ్లను చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న చిత్రం 'కన్నప్ప'. ఈ మూవీ భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. ఇటీవలే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా మరో అప్డేట్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లు అరియానా, వివియానా కూడా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను కన్నప్ప టీమ్ రివీల్ చేసింది. ఈ మూవీ ద్వారా మోహన్ బాబు మనవరాళ్లు సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. ఇప్పటికే రిలీజైన కన్నప్ప టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, స్టన్నింగ్ విజువల్స్‌తో కన్నప్ప టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. Immerse yourself in the spirit of devotion with #Ariaana & #Viviana Manchu, and witness their full-look in #Kannappa🏹 — A perfect blend of talent and spirituality dedicated to Lord Shiva.🎬✨#HarHarMahadevॐ @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar… pic.twitter.com/vquzPB6b6s— Kannappa The Movie (@kannappamovie) December 2, 2024 -
మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటన
మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా 'కన్నప్ప'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రావొచ్చనే రూమర్స్ వచ్చాయి. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)దీంతో 'కన్నప్ప' ఎప్పుడు థియేటర్లలోకి వస్తాడా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 25న వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే శివరాత్రి కానుకగా వచ్చుంటే కంటెంట్‌కి కలిసి వచ్చేదేమో అనిపించింది.ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర చేయగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్) -
అనుకోని తప్పటడుగులు.. లేదంటే ఓ రేంజ్ హీరో అయ్యేవాడేమో! (ఫొటోలు)
-
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. మోహన్ బాబు లుక్ చూశారా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు. ఇందులో మహదేవ శాస్త్రి పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటుల పోస్టర్లను విడుదల చేశారు. కన్నప్పలో ప్రభాస్ లాంటి అగ్రహీరో కూడా కనిపించనున్నారు. అంతేకాకుండా మోహన్ లాల్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కన్నప్ప పాత్రను మంచు విష్ణు పోషిస్తున్నారు. కాగా.. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. Unveiling the divine look of @themohanbabu garu as 'Mahadeva Shastri' in #Kannappa🏹. Witness the devotion and grandeur as they come to life! 🌟✨ #HarHarMahadevॐ#MohanBabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan… pic.twitter.com/Z8XbIV3ccd— Kannappa The Movie (@kannappamovie) November 22, 2024 -
ప్రభాస్ ఫొటో లీక్.. కేసు పెట్టిన 'కన్నప్ప' టీమ్
అరడజనుకి పైగా సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటితో పాటే మంచు విష్ణు 'కన్నప్ప' మూవీలోనూ శివుడి పాత్రలో నటిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రిలీజైన టీజర్లో ప్రభాస్ కళ్లు మాత్రమే చూపించారు. తాజాగా ప్రభాస్ ఫుల్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. ఇది తెగ వైరల్ అయిపోయింది.(ఇదీ చదవండి: 'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్)ఇప్పుడు ఈ విషయం 'కన్నప్ప' మూవీ టీమ్ దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ కేసు పెట్టారు. అలానే నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా క్యాష్ రివార్డ్ కూడా ప్రకటించారు. ఈ సినిమా కోసం 2000 మందికి పైగా వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్నారని.. ఈ లీకైన ఫొటో వల్ల వాళ్ల పనిపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ఇప్పటికే ఫొటో లీక్ విషయమై కేసు పెట్టామని, అయితే ఈ పని ఎవరో చేశారో కనుగొని ఆ వివరాలు మాకు చెబితే రూ.5 లక్షల రివార్డ్ ఇస్తామని 'కన్నప్ప' టీమ్ చెప్పింది. లీకైన ఫొటోని షేర్ చేసినా చట్టపరమైన చర్యలకు గురికావాల్సి ఉంటుందనని ప్రభాస్ అభిమానులతో పాటు అందరు హీరోల అభిమానులకు 'కన్నప్ప' టీమ్ రిక్వెస్ట్ చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన 13 ఏళ్లకు ప్రెగ్నెన్సీ.. నటి పోస్ట్ వైరల్) -
అందుకే జ్యోతిర్లింగాలను సందర్శించాం: మంచు విష్ణు
‘‘పరమ శివుడి పరమ భక్తుడి కథగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కేదార్నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. మా ఎపిక్ యాక్షన్ చిత్రమైన ‘కన్నప్ప’ విడుదల కోసం యూనిట్ అంతా ఎదురుచూస్తున్నాం’’ అని హీరో మంచు విష్ణు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా రూపొందిన చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై మంచు మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సందర్భంగా ‘కన్నప్ప’ చిత్రయూనిట్ పన్నెండు జ్యోతిర్లింగాల సందర్శన యాత్రను చేపట్టింది. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. ఈ యాత్రలో మోహన్‌బాబు, విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్, నటుడు అర్పిత్ రంకా పాల్గొన్నారు. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో ‘కన్నప్ప’ రూపొందింది. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా ఈ మూవీ ఉంటుంది’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
కేదారేశ్వరుని సేవలో కన్నప్ప టీమ్.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమాను తెరకెక్కించడంలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని షూటింగ్‌ను విదేశాల్లో చిత్రీకరించారు. కన్నప్పలో ప్రభాస్‌తో పాటు పలువురు స్టార్ నటులు కనిపించనున్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్లో పాన్ ఇండియాలో విడుదల చేయడానికి కన్నప్ప టీమ్ సన్నాహాలు చేస్తోంది.తాజాగా కన్నప్ప టీమ్ ఆలయాల సందర్శనకు బయలుదేరింది. మంచువిష్ణు, మోహన్ బాబుతో సహా పలువురు చిత్రబృంద సభ్యులు బద్రినాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శివుని భక్తుడైన కన్నప్ప మూవీ సక్సెస్ కావాలని కేదారాశ్వరుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది.కాగా.. ఇప్పటికే కన్నప్ప టీజర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే అత్యధి వ్యూస్ సాధించింది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకులని అలరించింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.Seeking blessings for an epic tale! @ivishnumanchu and team #Kannappa’s sacred journey to #Kedarnathॐ and #Badrinathॐ. #HarHarMahadevॐ@themohanbabu @mukeshvachan @arpitranka_30 @24FramesFactory @avaentofficial @KannappaMovie #TeluguFilmNagar pic.twitter.com/nHwehDTfO7— Telugu FilmNagar (@telugufilmnagar) October 25, 2024 -
కేదార్‌నాథ్‌ను సందర్శించిన మంచు విష్ణు,మోహన్‌బాబు (ఫొటోలు)
-
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
కన్నప్ప: పీడించే మారెమ్మగా ఐశ్వర్య.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ఎప్పటికప్పుడు అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. విష్ణు చెప్పినట్టుగా ప్రతి సోమవారం క్యారెక్టర్లు రివీల్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ ఇలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించి లుక్ విడుదల చేశారు.గత వారం కన్నప్ప నుంచి విధేయుడు, స్నేహితుడు అంటూ తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ రోజు కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉన్నారు. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.ఇప్పటికే కన్నప్ప టీజర్‌తో సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. విష్ణు మంచు టైటిల్ రోల్లో కనిపించనున్న ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. Introducing #Aishwarya as #Maremma who is set to unleash wildness in the forests; get ready to experience the force chaos in #Kannappa🏹#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/gpkgux8s6f— Kannappa The Movie (@kannappamovie) September 23, 2024 -
అక్షయ్ కుమార్ బర్త్ డే.. కన్నప్ప టీం స్పెషల్ పోస్టర్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.అయితే ఈ రోజు కన్నప్ప నటుడు అక్షయ్ కుమార్ బర్త్ డే కావడంతో చిత్రబృందం విషెస్ తెలియజేసింది. ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. చేతికి రుద్రాక్ష మాల ధరించిన ఫోటోను అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం లాంటి స్టార్స్ సైతం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందుతోంది.A Heartfelt Birthday wish to @akshaykumar! 🎉🙏 Your portrayal of Lord Shiva in this film is a testament to your unwavering dedication. Team #Kannappa🏹 celebrates you today and always.🌟 #HappyBirthdayAkshayKumar #HarHarMahadevॐ #TeamKannappa@themohanbabu @ivishnumanchu… pic.twitter.com/d6jqUpI8Z1— Kannappa The Movie (@kannappamovie) September 9, 2024 -
మంచు విష్ణు కుమారుడి సినీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని సెట్ చేశాడు విష్ణు. సౌత్ నుంచి నార్త్ దాకా పేరుమోసిన యాక్టర్స్ అందరినీ ఈ ప్రాజెక్టులో భాగం చేశాడు. తన కుమారుడు సైతం సినిమాలో ఉన్నట్లు వెల్లడించాడు. నేడు (ఆగస్టు 26) శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి అవ్రమ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఇందులో అవ్రమ్.. తిన్నడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ తిన్నడే పెద్దయ్యాక భక్త కన్నప్పగా కీర్తి గడించాడు.మాటలు రావట్లేదుఈ సందర్భంగా విష్ణు సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యాడు.. కన్నప్పలో అవ్రమ్ లుక్ లాంచ్ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ ప్రపంచానికి తను నటుడిగా పరిచయం అవుతున్నందుకు మాటలు రావడం లేదు అని పేర్కొన్నాడు. సినిమా విషయానికి వస్తే మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. సినిమా..ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు కన్నప్పగా నటిస్తున్నాడు. ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్, మధుబాల, దేవరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నారు. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
కంపడు, గవ్వరాజు ఎవరో చెప్పిన 'కన్నప్ప'
డైనమిక్ హీరో మంచు విష్ణు అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' మూవీ ప్రమోషన్స్ అప్టేట్స్‌ను నిరంతరం అభిమానులతో పంచుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా ప్రతి సోమవారం చిత్రం నుంచి ముఖ్యమైన అప్డేట్ను ప్రకటిస్తున్నారు. సినిమాలో కీలకమైన, విభిన్నమైన పాత్రలను పోషిస్తున్న దిగ్గజ నటీనటుల లుక్స్‌కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి మధుబాల,శరత్‌కుమార్, దేవరాజ్ వంటి ప్రముఖ నటులు పోషిస్తున్న పాత్రలకు పరిచయం చేస్తూ, వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ సినిమా పట్ల అంచనాలను పెంచుతున్నారు. తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ముఖేష్ రుషి పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌తో పాటు మరో ప్రముఖ నటుడు బ్రహ్మజీ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. కంపడు పాత్రలో ముఖేష్ రిషి, గవ్వరాజుగా బ్రహ్మాజీ ఈ చిత్రంలో కనిపించనున్నారు. వారు అత్యంత పురాతన పుళిందుల జాతికి చెందిన అత్యంత భయంకరమైన తెగకు చెందినవారు. సదాశివ కొండలలో జన్మించిన వీరిని భద్రగణం అని కూడా అంటారు. వారు 'వాయులింగానికి వంశపారంపర్య సేవకులు మరియు రక్షకులు. కంపడు నాయకుడిగా ఉంటూనే భద్రగణాన్ని నడిపిస్తాడు. ఈ వంశం త్రిశూలాలను ఉపయోగించడంలో ప్రత్యేకత కలిగి వున్నవారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ముఖేష్ రిషితో పాటు బ్రహ్మాజీ కూడా కనిపించారు. పోస్టర్లో వారి లుక్ ఫెరోషియస్‌గా కనిపిస్తుంది. కన్నప్ప చిత్రంలో డా.మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, బ్రహ్మానందం, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాకు కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. "కన్నప్ప" అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చే విజువల్ వండర్‌గా రాబోతోంది. సినిమాను చూసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందే విధంగా, మరో ప్రపంచంలోకి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా మేకర్స్ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇక సినిమా పట్ల అంకితభావంతో.. ఇష్టంతో విష్ణు మంచు కన్నప్ప పాత్రను ఈ చిత్రంలో పోషిస్తున్నారు. డా. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ దర్శకుడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.. దేవరాజ్ లుక్ చూశారా?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీలో నటుడు దేవరాజ్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో ఆయన గిరిజనుల నాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు వెల్లడించారు. అతని కుమారుడిగా బాలీవుడ్ నటుడు లావి పజ్నీ నటిస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. తాజాగా రిలీజైన ఈ పోస్టర్లపై నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అద్భుతంగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. Introducing #Devaraj in the #Kannappa🏹 hailing from the Nilipala Hills, Mundadu and @iamlavipajni as his son #Bebbuli is ready to unleash a new wave of strength and fierce spirit 🔥#HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar… pic.twitter.com/viVdUCKEny— Kannappa The Movie (@kannappamovie) August 5, 2024 -
మంచు విష్ణు 'డ్రీమ్ ప్రాజెక్ట్'.. మరో క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రీలీజ్ చేయగా అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా న్యూజిలాండ్‌లోని అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు డా.మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కనిపంచనున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. కన్నప్ప సినిమా మధుబాల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రివీల్ చేశారు. చెంచుల వీరత్వాన్ని తెలిపేలా ఉన్న ఈ లుక్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా పోస్టర్‌పై రాసిన పదాలు వీరనారి తెగువను తెలుపేలా ఉన్నాయి. దీంతో కన్నప్పపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు.ఇప్పటికే పలువురు పాన్ ఇండియా స్టార్స్ ఉండటం వల్ల అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. Presenting #Madhubala as #Pannaga; The chief of clan with her fierce & dare-devil spirit she is a force to be reckoned with 🔥#Madhoo #Kannappa🏹 #HarHarMahadevॐ@themohanbabu @ivishnumanchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @mukeshvachan @MsKajalAggarwal… pic.twitter.com/1qnbiXwQEq— Kannappa The Movie (@kannappamovie) July 29, 2024 -
'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?
హీరో మంచు విష్ణుపై ఓ యూట్యూబర్ దారుణంగా విమర్శలు చేశాడు. సదరు హీరోకి చెందిన నిర్మాణ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని చెబుతూ ఫుల్ ఫైర్ అయిపోయాడు. దీనిపై క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ.. అలా వచ్చే మెయిల్స్‌తో తమకు సంబంధం లేవని, అవన్నీ ఫేక్ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన ఈ వివాదం ఏంటి? అసలేం జరుగుతోంది?(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. ఏమైందంటే?)మంచు విష్ణు ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సెలబ్రిటీలు, వాళ్ల ఫ్యామిలీపై ట్రోల్ వీడియోలు చేస్తున్న చాలా యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పటికే వందలాది ఛానెల్స్‌పై స్టైక్స్ వేసి, వాటిని తొలగించారు. ఈ విషయమై తాజాగా ఓ యూట్యూబర్ స్పందించాడు. తనలానే చాలామందికి చెందిన యూట్యూబ్ ఛానెల్స్‌పై స్ట్రైక్స్ వేసి, తొలగించారని.. వాటిని తీయమని చెబుతుంటే రాబోయే 'కన్నప్ప' మూవీ గురించి పాజిటివ్ వీడియో చేయాలని మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నుంచి మెయిల్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఫ్రూప్ కూడా చూపించాడు.దీనిపై ఇప్పుడు 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ స్పందించింది. పలువురు యూట్యూబర్స్‌కి మెయిల్స్‌కి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఫేక్ మెయిల్స్‌తో తమకు భంగం కలిగిస్తున్నారని, ఈ విషయమై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఓ నోట్ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే మంచు విష్ణుపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లోనూ తమన్నా రొమాంటిక్ డ్యాన్స్.. ఒరిజినల్ కంటే ఇదే..!) View this post on Instagram A post shared by 24 Frames Factory (@24framesfactory) -
బన్నీ పుష్ప-2 కు పోటీగా మంచు విష్ణు కన్నప్ప..
-
పుష్ప-2తో కన్నప్ప పోటీ.. మంచు విష్ణు పోస్ట్ అందుకేనా?
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం కన్నప్ప. ఈ మూవీలో ప్రభాస్ సైతం అతిథిపాత్రలో కనిపించనున్నారు. ముకేశ్ కుమార్‌సింగ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, శరత్‌కుమార్, మోహన్‌లాల్ లాంటి అగ్ర సినీతారలు నటిస్తున్నారు. ఇందులో విష్ణు.. తిన్నడు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ డేట్‌పై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 2024 అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాదిలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే రిలీజ్ తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.అయితే డిసెంబర్ 6న పుష్ప-2 విడుదల చేయనున్నట్లు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకే నెలలో కన్నప్ప, పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల ఐకాన్ స్టార్ వెకేషన్‌కు వెళ్లడం.. పుష్ప-2 షూటింగ్ పెండింగ్‌లో ఉండడంతో మరోసారి వాయిదా తప్పదనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే పుష్ప-2 మూవీ విడుదల వాయిదా పడే ప్రసక్తే లేదని బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. December 2024 #Kannappa 🙏 #HarHarMahadev— Vishnu Manchu (@iVishnuManchu) July 18, 2024 -
నాదనాథుడి ఉగ్రరూపం
మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ‘మహాభారత్’ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఆదివారం (జూలై 14) శరత్ కుమార్ పుట్టినరోజు.ఈ సందర్భంగా ఈ మూవీలో ఆయన నటిస్తున్న నాదనాథుడి పాత్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో కత్తులు పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న ఓ యోధుడిలా కనిపిస్తున్నారు శరత్ కుమార్. ‘‘శివ భక్తుడైన కన్నప్ప కథను ‘కన్నప్ప’గా తెరపైకి తీసుకొస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన టీజర్‌తో ఈ సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు న్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్.. ఆ విల్లు వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కన్నప్ప టీజర్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు. ‘కన్నప్ప’లో తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదు. ఆ ధనుస్సు ధైర్యానికి సూచిక. తండ్రీ, కొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. కన్నప్ప తండ్రి నాధనాథుడు తన చేతులతో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వంగా మారింది. ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. కేవలం ఐదేళ్ల వయసున్న కన్నప్ప అనే యువకుడు ఓసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. ఒక సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారు.విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ప్రత్యేకమైన విల్లుని తయారు చేశారు. కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా, విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించాడు. ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరించారు.విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది. ఇది విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నది అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.కాగా.. మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కన్నప్ప చిత్రంతో తెరపై మన పౌరాణిక గాథను ఆవిష్కరించబోతోన్నారు. ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి ప్రముఖలు కూడా భాగమయ్యారు. శివుని భక్తుడైన 'భక్త కన్నప్ప' ఆకర్షణీయమైన కథను అద్భుతంగా చెప్పబోతోన్నారు. త్వరలోనే కన్నప్ప థియేటర్లలో సందడి చేయనుంది. -
'కన్నప్ప' టీజర్... మూడు కోట్ల మంది చూశారు!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి ఈ మధ్యే టీజర్ రిలీజైంది. అవా ఎంటర్ టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి' ముందు పెద్ద సవాలు.. నాగ్ అశ్విన్ ఏం చేస్తాడో?)'కన్నప్ప' టీజర్ ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంది. విష్ణు మంచు యాక్షన్ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, అక్షయ్ కుమార్, ప్రభాస్ క్లోజప్ షాట్స్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్, స్టన్నింగ్ విజువల్స్, అదిరిపోయే పర్ఫార్మెన్స్ లతో కన్నప్ప టీజర్ ప్రేక్షకులని అలరిస్తోంది. యూట్యూబ్‌లో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించాయి.(ఇదీ చదవండి: 'కల్కి' టికెట్ కొంటున్నారా? ఆ విషయంలో బీ కేర్‌ఫుల్!) -
'కన్నప్ప' హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
ప్రభాస్ చేయాల్సిన సినిమా కానీ.. చిన్న క్యారెక్టర్ తో !
-
'కన్నప్ప'లో ప్రభాస్ సీన్స్ గురించి మంచు విష్ణు కామెంట్స్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీజర్ తాజాగా విడుదలైంది. అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఫాంటసీ డ్రామాగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో మంచు విష్ణు కన్నప్పగా అలరించనున్నారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో సీనియర్ నటుడు మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్-నయనతారలు శివపార్వతులుగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుండగా విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.అయితే, ప్రభాస్‌తో తనకు ఎలాంటి కాంబినేషన్ సీన్స్ లేవని మంచు విష్ణు పెద్ద బాంబ్ పేల్చారు. వీరిద్దరి మధ్య సీన్స్ ఉంటాయని ఇద్దరి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఈ సినిమాలో మంచు విష్ణు, ప్రభాస్ కాంబినేషన్ ఒక్కటంటే ఒక్క సీన్ కూడా లేదని ఇదే విషయాన్ని మంచు విష్ణు స్వయంగా బయటపెట్టారు. కానీ, మిగిలిన అందరి స్టార్స్ కాంబినేషన్లో ప్రభాస్ కనిపిస్తారని ఆయన తెలిపారు. పాన్ ఇండియా రేంజ్లో 'కన్నప్ప' చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. టీజర్లోనే ఆయన ప్రతిభ కనిపిస్తుంది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటే.. యుద్ధ సన్నివేశాల్లో ఆయన చేసిన సాహసాలు సినిమా అభిమానులను మెప్పిస్తున్నాయి. -
ప్రభాస్ కోసం రాసుకున్న కథే కన్నప్ప: మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పెద్ద ఎత్తున తెరకెక్కిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మించారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు.తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా టీజర్ ఈవెంట్లో పాల్గొన్న మోహన్ బాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు.మోహన్ బాబు మాట్లాడుతూ.. 'కన్నప్ప సినిమా ఏ తరానికి అయినా కొత్తగానే ఉంటుంది. భక్తి భావం, ధూర్జటి మహాకవి ఎలా రాశారు? శ్రీకాళహస్తి మహత్యం ఏంటి? అన్నది ఈ చిత్రంలో చూపించాం. ఎంతో వ్యయప్రయాసలతో కన్నప్పను నిర్మించాం. దేశంలోని నాలుగు మూలల ఉన్న మహా నటుల్ని ఈ చిత్రంలో తీసుకున్నాం. శరత్ కుమార్ తీసిన పెదరాయుడు సినిమాను నేను తీశాను. ఎలాంటి పాత్రనైనా అవలీలగా శరత్ కుమార్ పోషించగలరు. ఇది కేవలం భక్తి చిత్రమే కాదు. అన్ని రకాల అంశాలుంటాయి. పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే ఈ సినిమా తీశాం. ముందుగా కన్నప్ప కోసం కృష్ణంరాజుతో మాట్లాడాం. విష్ణు కోసం కన్నప్ప తీయాలని అనుకుంటున్నానని చెబితే.. ప్రభాస్ కోసం రాసుకున్న కథను కృష్ణంరాజు మాకు ఇచ్చేశారు. మేం మున్ముందు ఇంకా ఎన్నో ఈవెంట్లు నిర్వహిస్తాం. నిర్మాతగా నాకు మాత్రమే కాకుండా.. కన్నప్ప టీంకు ప్రజలందరి ఆశీస్సులు కావాలి’ అని అన్నారు. -
'కన్నప్ప' సినిమా తీయమని శివుడు చెప్పాడు: మంచు విష్ణు
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ 'కన్నప్ప'. గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప'లానే ఇది కూడా డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా. కాకపోతే విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలందరూ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కొన్నిరోజుల క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో టీజర్ స్క్రీనింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఇకపోతే టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో నింపేశారు. అలానే శివుడిగా అక్షయ్ కుమార్ దర్శనమిచ్చాడు. నుదుట అడ్డ నామాలతో ప్రభాస్ కేవలం ఒకే ఒక్కే సెకను కనిపించాడు. ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరో మంచు విష్ణు.. 'కన్నప్ప' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా తీయమని తనకు శివుడు చెప్పాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.'2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్నగారు పిలిచి.. డైరెక్టర్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏంటి? అని అడిగారు. నాన్న.. పరమేశ్వరుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలనే నేను మొత్తం హోమ్ వర్క్ అంతా చేస్తున్నానని అన్నాను. గతేడాది జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఇది మీ ముందుకు తీసుకురావడానికి శివుడు ఆశీస్సులే కారణం' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్)కన్నప్ప సినిమా తియ్యమని శివుడు చెప్పాడు - @iVishnuManchu #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/fBKY3yRSC8— Telugu FilmNagar (@telugufilmnagar) June 14, 2024