
మంచు విష‍్ణు 'కన్నప్ప' సినిమా తీయడం మాటేమో గానీ ఎప్పటికప్పుడు ఏదో ఓ విషయమై వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొన్నాళ్ల క్రితం మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవల కారణంగా ఈ సినిమా కాస్త సైడ్ అయింది. కానీ మరో నెలలో రిలీజ్ పెట్టుకుని, ఇప్పుడు హార్ట్ డిస్క్ దొంగతనం జరగడంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.
దొంగతనానికి గురైన హార్డ్ డిస్క్‌లో ప్రభాస్ సీన్లు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరోవైపు సీజీ వర్క్స్‌కి సంబంధించిన దాదాపు 90 నిమిషాల కంటెంట్ ఇందులో ఉందని అంటున్నారు. అసలు ఇంత ముఖ్యమైన హార్డ్ డిస్క్‌ని ముంబై నుంచి కొరియర్ లో పంపడం, ఇక్కడికి వచ్చిన తర్వాత మాయం కావడం, దీంతో మంచు విష్ణుకి చెందిన నిర్మాణ సంస్థ.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
ఇప్పుడు ఈ విషయాలపై స్వయంగా మంచు విష్ణు స్పందించాడు. మొత్తంగా కాకుండా సింపుల్‌గా ఒక్క ఫొటో పోస్ట్ చేశాడు. అందులో..'జటాజూఠదారీ నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?' అని ట్వీట్ చేశాడు. అయితే కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటనేది ప్రస్తుతం అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఇవన్నీ చూస్తుంటే సినిమా వాయిదా పడటం గ్యారంటీ అనిపిస్తుంది.
ఈ సంగతి అలా ఉంచితే 'కన్నప్ప' ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాలేదని, అంతా చూస్తుంటే జూన్ 27న చెప్పిన తేదీకి థియేటర్ విడుదల కావడం కష్టమేమో అనిపిస్తుంది. మూవీ టీమ్ మాత్రం చెప్పిన డేట్‌కి రావడం పక్కా అని అంటున్నారు. మరి నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడాలి ఇక?
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)
#HarHarMahadevॐ #kannappa pic.twitter.com/jKNfIOTrQH
— Vishnu Manchu (@iVishnuManchu) May 27, 2025