
గత నెలలో థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు సినిమా.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఓవర్సీస్ ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. బ్యాంక్ రాబరీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీ సంగతేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం.
డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మించిన సినిమా 'చౌర్యపాఠం'. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ సినిమా డైరెక్టర్.. బ్యాంక్ దొంగతనానికి ప్రయత్నిస్తే ఏమైందనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం.. ఏప్రిల్ 24న థియేటర్లలోకి వచ్చింది. కానీ వచ్చినంత వేగంగానే మాయమైపోయింది. ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు రిలీజ్)
చౌర్యపాఠం విషయానికొస్తే.. వేదాంత్ రామ్(ఇంద్రరామ్)కి దర్శకుడు కావాలనేది కల. నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోయేసరికి బ్యాంక్ దొంగతనం చేసి ఆ డబ్బులతో సినిమా తీయాలని ఫిక్స్ అవుతాడు. బబ్లూ, జాక్ డాన్ అనే ఇద్దరిని తన ప్లాన్ లో భాగం చేస్తాడు. అదే బ్యాంకులో పనిచేస్తున్న అంజలి(పాయల్ రాధాకృష్ణ) వీళ్లకు తోడవుతుంది. తర్వాత ఏం జరిగిందనేదే మిగతా స్టోరీ.
ఇకపోతే ఈ వారం దాదాపు 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో హిట్ 3, రెట్రో, తుడరమ్ లాంటి స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలతో పాటు 'అజ్ఞాతవాసి' అనే కన్నడ థ్రిల్లర్ మూవీ చాలా ఆసక్తి కలిగిస్తున్నాయి. మూవీ లవర్స్‌కి అయితే ఈ వీకెండ్ పండగే పండగ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లిస్టులోకే 'చౌర్యపాఠం' కూడా వచ్చి చేరింది.
(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' కాజల్)