
బిగ్‌బాస్ తెలుగు షో వల్ల చోటామోటా సెలబ్రిటీలు కూడా మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే పలు సీజన్లలో విజేతలుగా నిలిచిన వాళ్లు, షోలో పార్టిసిపేట్ చేసినోళ్లు ప్రమోషన్లు చేస్తూ మంచిగా సంపాదించుకుంటున్నారు. కారు, ఇల్లు లాంటివి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఆర్జే కాజల్ కూడా చేరింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ)
ఎఫ్ఎమ్‌లో రేడియో జాకీగా కొందరికి తెలిసిన కాజల్.. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఇంకాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఐదో సీజన్‌లో కొన్ని వారాల పాటు హౌస్‌లో ఉండి వచ్చింది. బయటకొచ్చిన తర్వాత అడపాదడపా షోలు చేసుకుంటూ సంపాదిస్తుంది. ఇప్పుడు తన దగ్గర దాచుకున్న డబ్బుతో ఓ ఇల్లు కొనుగోలు చేసింది.
తాజాగా గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్, సిరి హన్మంతు, సింగర్ లిప్సిక తదితరులు పాల్గొన్నారు. వీళ్లు తమ తమ ఇన్ స్టా ఖాతాల్లో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. వీటిని ఆర్జే కాజల్ తన స్టోరీలో షేర్ చేసింది. కొత్త ఇల్లు కట్టుకున్న సందర్భంగా తోటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: బ్లౌజ్ లేకుండా సినిమా మొత్తం నటించా..: సీనియర్ హీరోయిన్ అర్చన)